For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ ఒక్క గ్లాసు పాలు త్రాగితే కలిగే ప్రయోజనాలెన్నో మీకు తెలుసా...!

|

మన శరీరానికి కావల్సిన న్యూట్రిషియన్స్ ఫుడ్స్ లో డైరీ ప్రొడకట్స్ లో ఒకటైన పాలు ఒకటి. మన చిన్నతం గురించి ఒక సారి ఆలోచిస్తే పాలు తాగకుండా మారం చేసి, పెద్దవారి దగ్గర తిట్లు తినకుండా ఒక్కరోజైన ఉండేదంటే ఆశ్చర్యం. ఎందుకంటే చిన్నతనంలో చాలా మంది పాలు త్రాగడం ఇష్టం ఉండదు. అందుకు కారణం పాలు వాసన లేదా రుచి నచ్చకపోవచ్చు. లేదా ఆచిన్నతనంలో మనం ఎక్కువగా చాక్లెట్స్, సాప్ట్ డ్రింక్స్ కు, ఐస్ క్రీమ్స్ కు ఆకర్షణ కలిగి ఉండటమే ప్రధాన కారణాలు. అయితే మనల్ని పాలు త్రాగమని ఎందుకు బలవంతం చేస్తారో ఒక్కరోజు కూడా మనం ఆలోచించం?

పాలు త్రాగమనడానికి కారణం అందులో ఉన్న వివిధ రకాల ఆరోగ్యప్రయోజనాలు మన శరీరానికి అందిస్తాయని వారు మనల్ని పాలు త్రాగమని ఒత్తిడి చేస్తారని తెలుసుకోలేరు. పాలను ప్రతి రోజు ఎందుకు త్రాగాలి? వాటి ప్రయోజనాలేంటి ఒక సారి తెలుసుకొన్నాక పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా త్రాగవల్సిందే.. మరి పాలలో ఉండే ప్రధాన ఆరోగ్యపు ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దాం...

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

కోలన్ క్యాన్సర్: పాలను ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కోలన్ క్యాన్సర్, ఓస్టియోపొరైసిస్ మరియు హైపర్ టెన్షన్ వంటి వాటిని నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ పాలు త్రాగడం వల్ల ఇటువంటి వ్యాధుల బారీనుండి కాపాడుకోగులుగుతాము. ప్రతి రోజూ పాలు త్రాగడం వల్ల క్యాల్షియం టాబ్లెట్స్ మరియు సప్లిమెంట్స్ తీసుకొనే అవసరం ఉండదు.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

గట్టి దంతాల కోసం: దంత క్షయాన్ని పోగొట్టి, దంతాలు పుచ్చిపోవడం వంటివాటిని నివారించడానికి, దంతాలు దడంగా ఉండేలా చేయడానకి పాలలో క్యాల్షియం బాగా సహాయపడుతుంది. పాల వాసన మరియు టేస్ట్ ను బట్టి చిన్నపిల్లలు పాలత్రాగడానికి ఇష్టపడరు.అటువంటి పరిస్థితుల్లో పాలల్లో చాక్లెట్ పౌడర్ మిక్స్ చేసి ఇవ్వడం వల్ల తాగడానికి ఇష్టపడుతారు.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

బరువు పెరగడానికి: పాలు త్రాగడం వల్ల బరువు పెరుగుతారు. అందుకు పాలలో ఉన్న నేచురల్ విటమిన్స్, మరియు మినిరల్స్ మనల్ని ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. కాబట్టి ప్రతి రోజూ పాలు త్రాగేవారిని, పాలు త్రాగని వారితో పోల్చి చూసుకుంటే తేడా మీకే తెలుస్తుంది.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

ఛాతీలో మంట: పాలలో యాంటాసిడ్స్ పుష్కలం. పాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాతీలో మంటను తగ్గిస్తుంది. అసిడిటికి కారణం అయ్యే ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఇంకా గాస్ట్రిక్ ప్రాబ్లెమ్స్ ను నివారిస్తుంది.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

ఎముకల బలానికి: పాలల్లో ఉండే క్యాల్షియం, మన శరీరంలోని ఎముకలు, దంతాలు, గోళ్ళు మరియు కేశాలను స్ట్రాంగ్ గా ఉంచడానికి సహాయపడుతాయి.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

ఆకలి పెంచుతుంది: జీర్ణక్రియను క్రమంగా ఉండేలే చేసి, ఆకలిని పెంచుతుంది.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

మంచి నిద్రకు: రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాసు గోరువెచ్చనిపాలు త్రాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. నాడీ మరియు కండర వ్యవస్థ ఉపశమనానికి బాగా సహాయం చేస్తుంది.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

డీహైడ్రేషన్: సరైన మోతాదులో నీళ్ళను త్రాగడం వల్ల శరీరాన్ని తేమగా ఉంచుతుందన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో శరీరం డీహైడ్రేషన్ పొందడానికి గోరువెచ్చని పాలు త్రాగమని సలహా ఇస్తుంటారు. ఇంకా శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి కూడా పాలు త్రాగడం మంచిది. అలాగే శరీర సౌష్టవాన్ని మెయింటైన్ చేయడానికి కూడా పాలు బాగా సహాయపడుతాయి. కొన్ని సందర్భాలు వ్యాయామాలు చేసిన తర్వాత తిరిగి శక్తి పొందడానికి పాలు త్రాగడం మంచిది.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

శక్తినిస్తుంది: మనశరీరంలో ఎనర్జీలెవల్స్ ను పెంచుతుంది. మరియు ఒత్తిడి శాతాన్ని తగ్గిస్తుంది. ఇంకామహిళల్లో PMS లక్షణాలను తగ్గించటానికి ఉపయోగపడతాయి.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

పూర్తి న్యూట్రిషియన్స్: పాలలో వివిధ రకాల న్యూట్రిషియన్స్ ఉంటాయి. అందులో కొన్ని మేజర్ న్యూట్సిషియన్స్ కూడా కనుగొనబడింది. విటమిన్స్(ఎర్రరక్తకణాల కోసం), కాల్షియం(బలమైన ఎముకల తయారీకి), మెగ్నీషియం(మంచి నాడీవ్యవస్థ కోసం), ఫాస్ఫరస్(శక్తిని పొందటానికి), పొటాషియం(మంచి నాడీ వ్యవస్థకోసం), ప్రోటీన్స్(అభివృద్ధి మరియు వైద్యం ప్రక్రియ కోసం), రెబోఫ్లెవిన్(ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మం కోసం) మరియు జింక్ (రోగనిరోధక వ్యవస్థ పెంచడానికి). వంటి పోషకాంశాలను పాలలో కనుగొనబడింది.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

మెరిసే చర్మం కోసం: క్లియోపాత్ర పాలతో స్నానం చేయడం వల్లే ఆమె శరీరం సున్నితంగా మెరిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా పాలతో స్నానం చేయడం లేదా ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు త్రాగడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. పాలలో ఉండే న్యూట్రీషియన్స్ అందుకు బాగా సహాయపడుతాయి. పాలలో ఉండే అమినో యాసిడ్స్ చర్మానికి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సెల్ డ్యామేజ్ ను అరిటకట్టి టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

కండర పుష్టికి: పాలల్లో ఉండే ప్రోటీనులు, కండర పుష్టికి బాగా సహాయపడుతుంది. కాబట్టి వ్యాయామం చేసిన తర్వాత మీ శరీరం తిరిగి శక్తిని పొంది యధాస్థితికి చేరుకోవడానికి వ్యాయమం తర్వాత ఒక గ్లాసు పాలు త్రాగాలి.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

బరువు తగ్గడానికి: చాలా అధ్యయనాల ప్రకారం లోఫ్యాట్ మిల్క్ మరియు బాగా కాచీ వెన్న తీసిన పాలు త్రాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇది ఆకలిని పెంచే ఒక ఆరోగ్యకరమైన స్నాక్.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

ఒత్తిడి తగ్గించడానికి: రోజంత పనిచేయడం వల్ల కలిగే ఒత్తిడి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది పాలు. ఒక గ్లాసు గోరువెచ్చని పాలు త్రాగడం వల్ల కండరాలు రిలాక్స్ అవ్వడమే కాక, నరాల ఉపశమనానికి సహాయం చేస్తుంది.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

బ్లడ్ ప్రెజర్: కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో మూడు రకాల డైరీ ప్రొడక్ట్స్ తప్పనిసరిచగా తీసుకొన్నట్లైతే, వీటితో పాటు పండ్లు ,కూరగాయలు, లోసాల్ట్, తీసుకొంటే అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

టైప్ 2 డయాబెటిస్: కొన్ని అధ్యయనాల ప్రకారం లోఫాట్ పాల ఉత్పత్తులను సాధారణంగా తీసుకోవడం వల్ల పెద్దలలో దీర్ఘకాలంగా ఉన్న టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయం చేస్తుంది.

ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

గుండె: అనేక అధ్యయనాలు పాలు మరియు పాల ఉత్పత్తులు వినియోగించడం వల్ల హృదయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది నిర్దారించారు.

English summary

The Health Benefits of drinking Milk | ఒక్క గ్లాసు‘పాల’తో ఆరోగ్యమే మహా భాగ్యం...!

Milk is a complete food which is best way of getting most of the nutrients necessary for our body.This article is all about the various health benefits we can get by drinking milk on regular basis.If we look back into our childhood days, we will find that there is no single day when we were not scolded by our parents for not drinking the milk. At that time, we hate drinking the milk because of its smell and taste, and the only thing we wanted at that time is chocolates, soft drinks ice cream etc.
Story first published: Friday, February 22, 2013, 16:06 [IST]
Desktop Bottom Promotion