For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ డీహైడ్రేషన్ నుండి తప్పించుకోవడం ఎలా...?

|

వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం చాలా సాధారణం. సూర్యని తాపానికి, అధిక వేడితో శరీంలోని నీరంత చెమట రూపంలో బయట విసర్జించబడి శరీరం నీటిశాతాన్ని కోల్పోతుంది. కాబట్టి మీ శరీరం వేసవి వేడి నుండి ఉపశమనం పొందాలి. వేసవికాలంలో చెమట వల్ల ఒంట్లో నీటిని కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురికావల్సి ఉంటుంది. అధిక చెమట, శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మన శరీరంలో సాల్ట్ కంటెంట్ తగ్గి అది మనల్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది.

డీహైడ్రేషన్ లక్షణాలు: నాలుక ఎండిపోవడం, కళ్లు పీక్కుపోయి లోతుకు లాగినట్లుండడం, చర్మం సాగే గుణం కోల్పోవడం, జ్వరం వచ్చినట్లు శరీరం వేడెక్కడం, అధిక దాహం, నీరసం, స్పృహ తప్పి పడిపోవడం జరగవచ్చు. చర్మం పొడిగా ఉండటం, మూత్రం తగ్గడం లేదా రాకపోవడం, చెమట, కన్నీరు తగ్గడం లేదా రాకపోవడం. ఊపిరి అందక ఎక్కువసార్లు తీసుకోవాల్సి రావడం. నాడి ఎక్కువసార్లు తక్కువ వాల్యుమ్‌తో కొట్టుకోవడం. బిపి పడిపోవడం, చివరకు అపస్మారక స్థితిలోకి వెళ్లడం.ఇలాంటి పరిస్థితుల్లో శరీరం నీటిని కోల్పోకుండా అధికంగా నీళ్లు, కొబ్బరి నీరు, గ్లూకోజ్‌, ఎలక్ట్రాల్‌, పల్చని మజ్జిగ, పళ్లరసం తాగించాలి. ఇవి అందుబాటులో లేకుంటే ఒక గ్లాసు నీళ్లలో స్పూను చక్కెర, చిటికెడు ఉప్పు వేసి తాగించాలి. తక్షణం వైద్య సహాయం తీసుకోవడం అవసరం.

అందువల్లే, వేసవి కాలంలో ఎక్కువ నీరు తీసుకోవాలని చెబుతుంటారు. నీరు శరీరానికి హైడ్రేషన్ కలిగించడం మాత్రమే కాదు, శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ మరియు ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపివేయడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. అయితే నీటిమాత్రమే త్రాగడం వల్ల శరీరానికి తగినంత హైడ్రేషన్ కల్పించలేము. వేసవికాలంలో మీ డైట్ ప్లాన్స్ మీ ఆరోగ్య విషయంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. వేసవిలో డీహైడ్రేషన్ కు గురిచేసే ఆహారాలను తినడం లేదా ఏదైనా పానీయాలను త్రాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురియైటటువంటి ఆహారాలను మీ డైట్ లిస్ట్ నుండి తొలగించాలి. ముఖ్యంగా వేసవి కాలంలో కాఫీ త్రాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. కాబట్టి ఇటువంటి బాడీకి వేడి కలిగించేటటువంటి పదార్థాలను తినడం, త్రాగడం మానుకోవాలి. ఇటువంటివి మరికొన్ని సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల ఈ వేసవిలో డీహైడ్రేషన్ నుండి బయటపడవచ్చు.

ఈ హాట్ సమ్మర్ లో మీరు డీహైడ్రేషన్ కు గురిఅవుతున్నారో లేదో తెలుసుకోవడానికి తరచూ మీ చర్మాన్ని పరిక్షీస్తుండాలి. చర్మ పొడిబారినట్లు, నల్లగా కమిలినట్లు అగుపిస్తుంటే మీరు డీహైడ్రేషన్ కు గురైనట్లు తెలుసుకోవాలి. అలాగే మీ యూరిన్ కలర్ కూడా పరిశీలించాలి. యూరిన్ పసుపు లేదా ఎరుపు వర్ణంలో ఉంటే మీరు డీహైడ్రేషన్ కు గురిఅవుతున్నట్లు గుర్తించాలి. ఈ సమస్యలన్నింటి నుండి బయట పడాలంటే నీరు ఎక్కువగా త్రాగాలి...

సమ్మర్ డీహైడ్రేషన్ నుండి రక్షణ పొందాలంటే..?

నీరు ఎక్కువగా త్రాగాలి: డీ హైడ్రేషన్ శాతం తక్కువగా ఉన్నా సరే మీ మూడ్ పై దాని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుంది. అందులోనూ ఇది మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని సరిపడా మంచి నీళ్లని తాగితే మంచి మూడ్‌లో ఉండడమే కాక స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం కూడా వస్తుంది. ఏపని మొదలపట్టాలన్నా ముందుగా కొన్ని నీళ్ళు త్రాగాలి. వేసవిలో వాటర్ బాటిల్ మీ చెంత తీసుకెళ్ళాలి. ఎప్పడైతే కాలి అవుతుందో వెంటనే నీళ్ళు నింపుకొని అవసరం, దప్పికైనప్పుడు నీటిని తీసుకోవాలి. జ్యూసులు, పండ్ల రసాలు కాకుండా నీరు మాత్రమే రెండు మూడు లీటర్లు త్రాగాల్సి ఉంటుంది.

సమ్మర్ డీహైడ్రేషన్ నుండి రక్షణ పొందాలంటే..?

చిరుతిండ్లు ఎంపికలో జాగ్రత్తలు: చిరుతిండ్లు తినే సమయంలో ఆయిల్ ఫుడ్స్, ఫ్రై చేసినవి, పిజ్జా, బర్గర్స్, స్వీట్స్ బదులు తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీనడం వల్ల వాటిలో తగుమోతాదులో నీటి శాతం ఉండి మీ శరీరానికి మేలు చేస్తుంది. ఉదా: ఆపిల్ లో 84శాతం నీరు కలిగి ఉంది. అదేవిధంగా వెజిటేబుల్స్ లో కీరదోసకాయ, క్యాప్సికమ్ వంటి వాటిలో 96-92 శాతం నీరు ఉంటుంది.

సమ్మర్ డీహైడ్రేషన్ నుండి రక్షణ పొందాలంటే..?

ఇతర పానీయాలు: అధిక వేడి ఉన్న పరిస్థితుల్లో శరీరం నీటిని కోల్పోకుండా అధికంగా నీళ్లు, కొబ్బరి నీరు, గ్లూకోజ్‌, ఎలక్ట్రాల్‌, పల్చని మజ్జిగ, ఆమ్ పన్నా, నిమ్మరసం, లస్సీ, పళ్లరసం తాగించాలి. ఇవి అందుబాటులో లేకుంటే ఒక గ్లాసు నీళ్లలో స్పూను చక్కెర, చిటికెడు ఉప్పు వేసి తాగించాలి. తక్షణం వైద్య సహాయం తీసుకోవడం అవసరం. వీటిని బయట వెళ్ళేటప్పుడు మీ వెంట తీసుకెళ్ళడం కూడా బెస్ట్.

సమ్మర్ డీహైడ్రేషన్ నుండి రక్షణ పొందాలంటే..?

నీరు తాడానికి కూడా టైమ్ ను సెట్ చేసుకోవాలి: నీరు తాడానికి కూడా టైమ్ ను సెట్ చేసుకోవాలి. లేదంటే నీరు తాగడం మర్చిపోతారు. మీరు అధిక దాహానికి గురైనప్పుడు ఇతర పానీయాల మీద కూడా మనస్సు మళ్ళుతుంది కాబట్టి. ఒక గంటకు ఒకసారి అలారం పెట్టుకొని మరీ నీరు త్రాగడం మంచిది.

సమ్మర్ డీహైడ్రేషన్ నుండి రక్షణ పొందాలంటే..?

కెఫిన్ పానియాలు తాగడం మానుకోవాలి: కేఫినేటెడ్ పానియాలకు దూరంగా ఉండాలి. కెఫిన్ కాఫీ లేదా కోలా మరియు ఇతర డ్రింక్స్ లో ఉంటుంది. డీహైడ్రేషన్ కు కెఫిన్ కూడా ప్రధాన కారణం. కాబట్టి కాఫీ తాగాలనిపించినప్పుడు ఒక గ్లాసు షుగర్ కేన్(చెరకు రసం)తాగడం ఉత్తమం.

సమ్మర్ డీహైడ్రేషన్ నుండి రక్షణ పొందాలంటే..?

ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి: ఆల్కహాల్ ప్రియులు స్నేహితులతో, పార్టీలు, పబ్ లు అంటూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. సడెన్ గా ఆల్కహాల్ ను మానుకోవడం అంటే కొంచెం కష్టంగా ఫీలవుతారు కాబట్టి, కనీసం ఆల్కహాల్ తాగడం కొంతవరకైనా తగ్గించాలి బీర్ మరియు వైన్ లు కూడా డీహైడ్రేషన్ కు గురిఅవుతాయి. కాబట్టి ఇటువంటి వాటికి సమ్మర్ లో చెక్ పెట్టాలి.

సమ్మర్ డీహైడ్రేషన్ నుండి రక్షణ పొందాలంటే..?

బయట పనులు మానుకోవాలి: బయటి వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండటం మంచిది. అంతకూ చాలా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు వాటిని ఉదయాన్నే 10గంటలోపు లేదా సాయంత్రం 5గంటలపైన పూర్తి చేసుకోవాలి. దాని వల్ల మీరు సేఫ్ గా ఉండగలుగుతారు.

సమ్మర్ డీహైడ్రేషన్ నుండి రక్షణ పొందాలంటే..?

లైట్ కలర్ దుస్తులు: సమ్మర్ లో సౌకర్యవంతంగా మరియు లైట్ కలర్ దుస్తులు ధరించడం మేలు. లైట్ కలర్ ఫ్యాబ్రిక్ అంటే కాటన్ (డీహైడ్రేషన్ నుండి రక్షణ కల్పించే)దుస్తులను ఎంపిక చేసుకోవాలి.

సమ్మర్ డీహైడ్రేషన్ నుండి రక్షణ పొందాలంటే..?

మీఅంతకు మీరు కేర్ తీసుకోవడం చాలా అవసరం: మీరు బయటకు వెళ్ళినప్పుడు లేదా వెళ్ళాలనుకొన్నప్పుడు తప్పనిసరిగా గొడుగు మీ వెంట తీసుకెళ్ళాలి. దాంతో పాటు తలకు స్కార్ఫ్ మరియు లైట్ కలర్ దుస్తులు మరియు హాట్ వంటివి వాటితో మిమ్మల్ని కవర్ చేసుకోవాలి. దాంతో డైరెక్ట్ సన్ లైట్ నుండి రక్షణ పొంది సన్ టాన్ తప్పించుకోగలుగుతారు.

English summary

Tips To Avoid Summer Dehydration | సమ్మర్ డీహైడ్రేషన్ నుండి తప్పించుకోవడం ఎలా...?

Summer has arrived and the sun is all set to suck out all the water from your body. It is high time when you be ready to escape the tantrums of scorching sun. The biggest health problem we face during summer is dehydration.
Desktop Bottom Promotion