For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మౌత్ అలర్స్ నుండి తక్షణ ఉపశమనం కలిగించే సులభ చిట్కాలు

|

మౌత్ అల్సర్లు ను నోటిపుండ్లు లేదా ఆఫ్తస్ అల్సర్స్ అంటారు. ఇవి చాలా చిన్నవిగా నోటి లోపల వైపు వస్తుంటాయి. ఇది వంశపారంపర్యమైనదీ కాదు, అలా అని ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే సమస్య కాదు. ఈ మౌత్ అల్సర్ పిల్లల్లోనూ.. పెద్దల్లోనూ ఇద్దరిలోనూ కనిపిస్తుంటాయి. ఇవి ముఖ్యంగా పెదాల లోపల చర్మానికి అంటిపెట్టుకొని పుండులా ఏర్పడుతూ భయంకరమైన నొప్పి లేదా మంటాను కలిగిస్తాయి. అంతే కాదు ఏదైనా ఆహారాన్ని మ్రింగాలన్నా లేదా త్రాగాలన్నా, చాల పెయిన్ ఫుల్ గా ఉంటుంది. ఈ రకమైన మౌత్ అల్సర్లు రావడం చాలా సాధారణం. కొన్నిసార్లు దంతాలు నోటి లోపల చర్మానికి గుచ్చుకోవడం, బ్రష్ చేసేటప్పుడు టూత్‌బ్రష్ తగిలి గాయం కావడం, నాలుకను లేదా చెంప లోపలి వైపున పొరపాటున కొరుక్కోవడం, లేదా శరీరం బాగా వేడి చేసినప్పుడు, నోటిని శుభ్రం ఉంచుకోకపోవడం, విటిమిన్స్ లోపం, ఒత్తిడి, నిద్రలోపం, డీహైడ్రేషన్ వంటి కారణంగా ఈ రకమైన అల్సర్లు వస్తుంటాయి. వీటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు.

మౌత్ అల్సర్... నోరు తెరవనివ్వడం లేదా?

పండ్లు: మౌత్ అల్సర్ ఉన్నప్పుడు విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు(ఆరెంజ్, జామకాయ, స్ట్రాబెర్రీ మరియు పపాయ)ను ఎక్కువగా తీసుకోవాలి. వీటిని మెత్తగా గుజ్జులా చేసుకొని స్పూన్ తో తినవచ్చు లేదా ఫ్రూట్ జ్యూస్ తయారు చేసుకొని త్రాగవచ్చు.

మౌత్ అల్సర్... నోరు తెరవనివ్వడం లేదా?

పెరుగు/మజ్జిగ: ప్రతి రోజూ పెరుగు తినడం లేదా మజ్జిగను రెండు మూడు గ్లాసులు తీసుకోవడం వల్ల చెడు బ్యాక్టీరియాను నాశనం చేసే శక్తి ఈ వీటిలో పుష్కలంగా ఉంటుంది.

మౌత్ అల్సర్... నోరు తెరవనివ్వడం లేదా?

పెరుగు/మజ్జిగ: ప్రతి రోజూ పెరుగు తినడం లేదా మజ్జిగను రెండు మూడు గ్లాసులు తీసుకోవడం వల్ల చెడు బ్యాక్టీరియాను నాశనం చేసే శక్తి ఈ వీటిలో పుష్కలంగా ఉంటుంది.

మౌత్ అల్సర్... నోరు తెరవనివ్వడం లేదా?

విటమిన్ సి సప్లిమెంట్: విటమిన్ సి సప్లిమెంట్స్ టాబ్లెట్స్ రూపంలో, పిల్స్ రూపంలో చిన్న బాటిల్స్ లో 30 నుండి 60 వరకూ ఉంటాయి. ఇవి బయట మెడికల్ షాప్స్ లో దొరుకుతాయి.

మౌత్ అల్సర్... నోరు తెరవనివ్వడం లేదా?

టమోటో: పచ్చిటమోటోలు ముక్కలు ఒకటి తినాలి లేదా 5 బేబీ టమోటోలను తింటుండాలి. వీటిని తినేటప్పుడు నిదానంగా మౌత్ అలర్స్ ఉన్న ప్రక్క కాకుండా రెండో పక్క బాగా నమిలి ఆ జ్యూసును నోట్లో ఉండేలా తినాలి.

మౌత్ అల్సర్... నోరు తెరవనివ్వడం లేదా?

టూత్ బ్రెష్: పాత బడిన టూత్ బ్రెష్ ను మార్చండి. ఎందుకంటే అందులో బ్యాక్టీరియా ఉండవచ్చు.

మౌత్ అల్సర్... నోరు తెరవనివ్వడం లేదా?

తినకూడని ఆహారాలు: స్పైసీ మరియు ఫ్రై చేసిన ఆహారాలు తీనకూడదు. మాంసం, చేపలు వంటి వాటిని తినకపోవడమే మంచిది.

మౌత్ అల్సర్... నోరు తెరవనివ్వడం లేదా?

డ్రింక్స్: కార్బొనేటెడ్ లేదా ఆల్కహాల్ లేదా హాట్ డ్రింక్ జోలి పోకూడదు.

మౌత్ అల్సర్... నోరు తెరవనివ్వడం లేదా?

కొబ్బరి నీళ్ళు: ప్రతి రోజూ 3-4సార్లు కొబ్బరి నీళ్ళతో నోటిని గార్గిల్ చేయాలి.

మౌత్ అల్సర్... నోరు తెరవనివ్వడం లేదా?

ఉల్లిపాయ: మౌత్ అలర్స్ కు ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మౌత్ అల్సర్ ను తగ్గిస్తుంది. కాబట్టి ఆనియన్ ఉన్న సలాడ్స్ కు ఎక్కువ ఫ్రిఫరెన్స్ ఇవ్వండి.

మౌత్ అల్సర్... నోరు తెరవనివ్వడం లేదా?

తేనె : కొద్దిగా కోకొనట్ మిల్స్ లో తేనె కలిపి మౌత్ అల్సర్ ఉన్న ప్రదేశంలో మర్థన చేసుకోవాలి.

మౌత్ అల్సర్... నోరు తెరవనివ్వడం లేదా?

కొబ్బరి నూనె: ఎండు కొబ్బరి నమిలి కొద్దిసేపు అలాగే నోట్లో పెట్టుకోవాలి. లేదా కొబ్బరి నూనె ను 5-10నిముషాలు పుక్కలించాలి.

లక్షణాలు:
1. నోటి పుండు రావడానికి ఒకటి - రెండు రోజులకు ముందుగానే కొద్దిగా మంటలాగా అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు అల్సర్ మొదలయ్యేటప్పుడు కొద్దిగా జ్వరం రావడాన్ని గమనిస్తుంటాం.

2. నోటి లోపల వచ్చే అల్సర్ వలయాకారంగా కాని ఓవల్ షేప్‌లో కాని వస్తుంటాయి. చుట్టూ ఎరగ్రా మధ్యలో తెల్లగా కాని పసుపు రంగులో కాని ఉంటుంది.

3. ముఖ్యంగా అంగిలి దగ్గర, నాలుక చివర్లలో, నాలుక కింద, పెదవుల లోపలి అంచులకు, చెంపల లోపల, చిగుళ్ల మీద వస్తుంటాయి.

4. ఇవి నొప్పి, గుచ్చుకుంటున్నట్లు ఎక్కువ బాధను కలిగిస్తాయి. ముఖ్యంగా ఆహారాన్ని తినేటప్పుడు, ద్రవాలు తాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఎక్కువ బాధిస్తుంటాయి.

5. నోటి అల్సర్లు రావడానికి కారణాలను పరిశీలిస్తే అవి ఒక వ్యక్తికీ, ఒక వ్యక్తికీ మారుతుంటాయి. కచ్చితంగా ఇది మాత్రమే కారణమని చెప్పడం కష్టం.

ట్రీట్‌మెంట్: నోటి పుండ్లు లేదా మౌత్ అల్సర్ కు ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. ఇవి వచ్చి వాటంతట అవే వారం - పదిరోజుల్లో తగ్గిపోతుంటాయి. కాబట్టి దీని గురించి ఆలోచించాల్సి అవసరం ఉండదు.

విటమిన్ల లోపం లేకుండా చూసుకోవాలి. అందుకు వైద్యుల సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్‌లను వాడవచ్చు.

భరించలేనంత నొప్పితో ఆహారం తీసుకోవడానికి నోరు తెరవడం కష్టంగా అనిపించినప్పుడు లోకల్ అనెస్థిటిక్ జెల్‌ను అల్సర్ మీద రాస్తే ఉపశమనం ఉంటుంది. వీటితో పాటు కొన్ని ఇంటి చిట్కాలను పాటించి కూడా మౌత్ అలర్స్ ను తగ్గించుకోవచ్చు. మరి అవేంటో చూద్దాం...

English summary

Tips and Home Remedies to Cure Mouth Ulcers | మౌత్ అల్సర్... నోరు తెరవనివ్వడం లేదా?

Are you finding difficulty in eating and drinking due to painful mouth ulcers?? But the question arises: What exactly mouth ulcers are?? Mouth ulcers can be defined as painful white sore on the tongue, gums, inner side of cheek and lips. Mouth ulcers are also known as Canker Sores. Best think about mouth ulcers is that they can be easily cured with easy home remedies.
Story first published: Friday, February 15, 2013, 12:11 [IST]
Desktop Bottom Promotion