For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాన్సిలైటీస్‌ ను నివారించే బెస్ట్ హోం రెమడీస్

|

టాన్సిలైటీస్‌(టాన్సిల్స్ )అనేది గొంతులో ఇన్ఫెక్షన్ కలగడం. టాన్సిల్స్‌ గొంతులో రెండు వైపులా ఉండి, శరీరానికి రక్షక కవచంలా పనిచేస్తాయి. బయట నుండి వచ్చే దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిములను, కాలుష్యకారక పదార్థాలను శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ టాన్సిల్స్ సమస్య పెద్దల్లో కంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో చాలా మంది చిన్న పిల్లలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఈ టాన్సిల్స్ శోషరస కణజాలానికి ఇరువైపులా చిన్న గడ్డల్లా ఉంటాయి. టాన్సిల్స్‌ సైజు పెరిగి వాపు రావడం వల్ల గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్షన్‌ కారక క్రిములు ఎక్కువ కావడం వల్ల టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌ కు గురై గొంతునొప్పి మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపోకపోవడం వల్ల కూడా టాన్సిల్స్‌ సమస్య మొదలవుతుంది.
టాన్సిల్స్ ఉన్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి? గొంతు భాగంలో టాన్సిల్స్‌ వాపు ఎర్రగా కనిపిస్తుంది. దాంతో గొంతు నొప్పి, చెవినొప్పి, తలనొప్పి, జలుబుతో కూడిన జ్వరం, ఆహారం మింగడం, నీళ్ళు త్రాగడానికి, గాలిపీల్చడానికి, బాగా మాట్లాడటానికి కష్టమౌతుంది. ఒక్కో సందర్భంలో నోరు బొంగురుపోతుంది. గొంతు తడిఆరిపోతుంది. గొంతు ఎర్రబారుతుంది. నోరు దుర్వాసన వస్తుంది. నీరసం, చికాకు వంటి లక్షణలు ఎక్కువగా కనిపిస్తాయి.

టాన్సిల్ ఉన్నప్పడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా నయం అవుతుంది. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు కొన్ని మృదువైన ఆహారాలను ఉదాహరణకు పాస్తా, అన్నం, పెరుగు, పుడ్డింగ్ వంటివి నోట్లో మ్రింగడానికి చాలా సులభం అవుతుంది. కొన్ని రకాల సిట్రస్ పండ్లు, కొన్ని చల్లని లేదా పుల్లని పండ్లు మరియు స్నాక్స్ తినడం వల్ల గొంతు నొప్పి మరింత తీవ్రం కావడమే కాక, గొంతులోపల దురదగా అనిపిస్తుంది. కాబట్టి, మీరుటాన్సిల్స్ సమస్యతో బాధపడుతున్నట్లైతే, మీరు ఖచ్చితంగా సరైనటువంటి న్యూట్రిషియన్ ఆహారం తీసుకోవడం వల్ల మ్రింగడానికి మాత్రమే కాకుండా థ్రోట్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.

Tips To Prevent Tonsillitis

టాన్సిలైటీస్‌ కు మరో ప్రధాన కారణం, ఓరల్ యాక్టివిటీ క్లీన్ గా లేకపోవడం. మీరు ఏదైనా ఆహారం తిన్న తర్వాత బ్రెష్ చేసుకోకపోవడం మరియు గార్గిల్ చేయకపోవడం కూడా టాన్సిలైటీస్‌ కారణం అవుతుంది. నోటి శుభ్రత వల్ల దంత సంరక్షణ మరియు దంతాలు శుభ్రంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్ చెకప్ లతో, జబ్బుల భారీన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. టాన్సిలైటీస్‌ నివారించడం చాలా సులభం మరియు నొప్పి లేకుండా నివారించుకోవచ్చు. మీరు ఆరోగ్యంగా, హాపీగా ఉండటానికి మీరు కొన్ని సూచనలను పాటిస్తే సరిపోతుంది . టాన్సిలైటీస్‌ నివారించడానికి ఒక్కడ కొన్ని సులభ చిట్కాలున్నాయి...

1. వ్యాధినిరోధకతను పెంచుకోండి: మీలో వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నప్పుడు, టాన్సిలైటీస్‌ గురి అయ్యే అవకాశాలు ఎక్కువ. అందువల్ల మీరు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు:-మామిడి పండ్లు, ఆరెంజ్ మరియు ఇతర సిట్రస్ పండ్లు మరియు సి విటమిన్ కలిగి వెజిటేబుల్స్ తీసుకొని ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి.
2. బ్యాడ్ ఓరల్ హ్యాబిట్: మీరు ధూమపానం మరియు పాన్ , ఆల్కహాల్ మరియు ఇతర అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవాలి. ప్రస్తుతానికి అవి మీకు ఆనందం కలిగించినా తర్వాత భవిష్యత్తులో అనేక వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.
3. యాంటీబయోటిక్ ను ఉపయోగించడం: డాక్టర్ సూచించిన కొన్ని యాంటీబయోటిక్స్ తీసుకోవడం వల్ల టాన్సిలైటీస్‌ నివారించుకోవచ్చు . టాన్సిలైటీస్‌ తో మీకు ఎక్కువ జ్వరం వస్తుంటే యాంటీబయాటిక్స్ అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ఇంకా ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో వేసి గార్గిల్(పుక్కిలించడం)వల్ల గొంతు నొప్పి, మంట నుండి ఉపశమనం పొందవచ్చు.
4. తరచూ గార్గిల్(పుక్కలిస్తుండాలి)చేస్తుండాలి: టాన్సిలైటీస్‌ లక్షణాలు మీరు గుర్తించిన వెంటనే మీరు మౌత్ వాష్ తో పాటు, గార్గిలింగ్ చేయడం చాలా అవసరం. అందుకు గోరువెచ్చని నీటిలో ఉప్పు మిక్స్ చేసి , నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేసినప్పుడు బ్యాక్టీరియా నాశనం చేయబడి, టాన్సిలైటీస్‌ నివారించుకోవచ్చు.
5. డెంటల్ మైజీన్: ఇది ఒక ప్రధానమైన వాస్తవం. మీరు డెంటల్ హైజీన్ అనుసరించినట్లైతే టాన్సిలైటీస్‌ను నివారించుకోవచ్చు. కాబట్టి, మీరు రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలవమని సూచన. ఆరోగ్యకరమైన ఆహారం తింటూ మరియు హైజీన్ గా పాటించినట్లైతే ఆరోగ్యకరంగా ఉంటూ అనేక వ్యాధుల నుండి మరియు బ్యాక్టీరియా, వైరస్ నుండి రక్షణ పొందవచ్చు.
6. శస్త్ర చికిత్స: ఇది మరో ప్రధానమైనటువంటి విషయం. మీరు ఈ సూచనలన్నింటిని పాటించిన తర్వాత కూడా తరచూ ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతూ, టాన్సిలైటీస్‌ కారణం అయినప్పుడు, శస్త్రచికిత్స ద్వారా టాన్సిలైటీస్‌ తొలగించడం మంచిది. మీకు టాన్సిలైటీస్‌ తీవ్రంగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స చేయించుకోండి. తక్కువగా ఉన్నప్పుడు హోం రెమెడీస్ ను అనుసరించండి.
7. ఆక్సిజనేటెడ్ టూత్ పేస్ట్: టాన్సిలైటీస్‌ నివారించడానికి ఆక్సిజనేటెడ్ టూత్ పేస్ట్ ను ఉపయోగించడం ఉత్తమ పద్దతి. ఇది మీ నోటిని శుభ్రంగా ఉంచడమే కాదు, మీ నాలుక, చిగుళ్ళు మరియు నోటి కప్పు మీద తిష్టవేసిన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది

English summary

Tips To Prevent Tonsillitis

Tonsillitis is the inflammation of tonsil because of a bacteria or a virus. Children are most affected by tonsillitis. The common symptoms are fever, headache, pain in the throat and difficulty to swallow. You need not be really worried about this as it can be cured and prevented.
Story first published: Tuesday, November 12, 2013, 18:02 [IST]
Desktop Bottom Promotion