For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముప్పైలో మీరు తీసుకొనే జాగ్రత్తలే.. మిమ్మల్ని వందేళ్ళు కాపాడుతుంది!

|

సాధారణంగా స్త్రీ పురుషులు ఎవరైనా సరే ముప్పైలో తమ ఆరోగ్యం గురించి కొంత నెగ్లెట్ చేస్తుంటారు. ముఖ్యంగా ముప్పైలో వారి కెరీర్ పరంగా..మరియు కుంటుంబ బాధ్యతలు, రోజువారి జీవితంలో బిజీ షెడ్యూల్ వంటి కారణాలచేత మన ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటాం. ఇలాంటి జీవన శైలితో జీవితం కొనసాగించడానికి చాలా కష్టం.

అయితే ముందు జాగ్రత్తగా కొన్ని రక్షణ నియమాలు పాటించగలిగితే మన కెరీర్, కుటుంబ బాధ్యతలతో పాటు మన శరీరం గురించి మరియు మనస్సు, ఆత్మ వంటి వాటి మీద శ్రద్ద తీసుకుంటే మన ఆరోగ్యం 30 ఏళ్ళలోనే కాదు వందేళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ముఖ్యంగా 30ఏళ్ళలో తీసుకొనే మంచి జీవనశైలి విధానం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ప్రమాదాన్ని తగ్గించవచ్చు . అంతే కాదు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడుతుంది. కాబట్టి ముప్పై ఎళ్ళలో మనం ముఖ్యంగా తీసుకోవల్సిన ఆరోగ్య జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాం.. వీటిని పాటించడం వల్ల ఏ కొదరైనా చివర వరకూ కొనసాగితే...అంతకంటే ఆరోగ్యమేముంటుంది.!

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

మంచి ఆహారమే తీసుకోండి: ఆహారంలో ఆరోగ్యానికి మేలు చేసేవి ఎక్కువగా తీసుకుంటూ, అనారోగ్యానికి దోహదం చేసేవాటిని పరిమితంగా తీసుకుంటూ ఉండటం మంచిది. మన ప్రధాన ఆహారమైన బియ్యం విషయానికి వస్తే దంపుడుబియ్యం, ఇతర ధాన్యాల్లో పొట్టుతీయని ముడి ధాన్యాలు తీసుకోవాలి. అలాగే కూరల విషయంలో ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) మంచివి. ఇక మాంసాహారంలో చేపలు చాలా మంచి ఆహారం. అయితే మాంసాహారం తీసుకునేవారు ప్రోటీన్‌ల కోసం రెడ్ మీట్ కంటే కొవ్వు తక్కువగా ఉండే చికెన్ వంటి వైట్ మీట్ తీసుకోవడం మంచిదని గుర్తుంచుకోండి. అరటి, నారింజ వంటి అన్నిరకాల తాజా పండ్లలో అన్నిరకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాటితో పాటు పీచు ఎక్కువగా ఉండే జామ, బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లు, బాదం వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని నిర్ణయించుకోండి.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

నిద్ర విషయంలో: పార్టీలతో వచ్చే అనర్థాల్లో మరో ముఖ్యమైనది నిద్రలేమి. వేడుకలు, విందు వినోదాల్లో భాగంగా అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండటం వల్ల శరీరానికి అవసరమైన నిద్ర సమకూరదు. దాంతో అనేక సమస్యలు వస్తాయి. నిద్రలేమి వల్ల... మతిమరపు మెదడు ఎదుగుదలలో లోపం సాధారణ ఎదుగుదలలో లోపం అధిక రక్తపోటు గుండెజబ్బులు స్థూలకాయం డయాబెటిస్ జీర్ణకోశ సమస్యలు రోగనిరోధక శక్తి తగ్గడం గాయాలు మానే ప్రక్రియ ఆలస్యం కావడం వంటి అనేక అనర్థాలతో పాటు శరీరంలోని అన్ని వ్యవస్థలూ దెబ్బతింటాయి. ఇవేగాక నిద్రలేమి వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 80 శాతం పెరుగుతాయని కొన్ని అధ్యయనాలలో తేలింది.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

ఆరుబయట సూర్యకాంతిలో: మన లేట్‌నైట్ పార్టీ వేడుకల వల్ల జరిగే అనర్థాలలో మరో ముఖ్యమైనది ఉదయం త్వరగా నిద్రలేవలేకపోవడం. దాంతో మనం అందమైన సూర్యోదయాలను మిస్ అవుతాం. శరీరానికి సూర్యరశ్మి తగలకపోవడం వల్ల ఎంతో విలువైన విటమిన్-డిని కోల్పోతాం. దాంతో ఎముకల వ్యాధులైన... రికెట్స్, ఆస్టోమలేసియా వంటివి రావచ్చు. ఈ వైటమిన్ లోపం పారాథైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే ఒక్కోసారి ఫిట్స్/కన్వల్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఉదయాన్నే నిద్రలేచి ఆరుబయట సూర్యకాంతిలో నడవాలనే అంశానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వండి.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

ఐరన్‌పాళ్లు పెంచుకోండి: మన దేశంలో 85 శాతం మహిళలకు రక్తహీనత ఉంటుందని అంచనా. అందువల్ల మన ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ఈ ఏడాది నిర్ణయాలలో ఉండాల్సిందే. మీరు మహిళ అయితే ఈ తీర్మానం తప్పనిసరి. మనలో ఐరన్‌పాళ్లు పెరగాలంటే మాంసాహారులైతే చికెన్, వేటమాంసం, చేపలు, మాంసాహారంలోని లివర్ తీసుకోవాలి. శాకాహారులైతే తాజా ఆకుపచ్చటి ఆకుకూరలు(గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), ఎండుఖర్జూరం, గసగసాలు, అటుకులు వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ దొరుకుతుందని గుర్తుంచుకోండి.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

గుండె పదిలంగా ఉండాలంటే: మన గుండె ఆరోగ్యం పదిలంగా ఉంచుకోడానికి చేసే ప్రయత్నాలన్నీ మన సాధారణ ఆరోగ్యం (జనరల్ హెల్త్) కోసం కూడా ఉపయోగపడతాయి. అవి.. రోజూ ఆటలాడటం... దీనివల్ల మనలో సంతోషం కలిగించే ఎండార్ఫిన్స్ వంటి రసాయనాలు స్రవించి అవి ఆరోగ్యంగా ఉంచుతాయి రక్తదానం... మీకు రక్తదానం చేసే అలవాటు ఉంటే... ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోమారు ఆ మంచిపని చేస్తే అది గుండెకు ఎంతో మంచిది.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

వ్యాయామం గుండెకు మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. వ్యాయామాలన్నింటిలోనూ నడక మంచిది. మొదటి రోజున 20 నిమిషాలతో మొదలు పెట్టి, ఆ వ్యవధిని క్రమంగా పెంచుకుంటూపోతూ రోజూ కనీసం 45 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేసే స్థాయికి చేరుకోవాలి. ఇలా వారంలో కనీసం 5 రోజులైనా వాకింగ్ చేయడం గుండెకు మేలు చేస్తుందనే విషయాన్ని మరచిపోకండి. కాబట్టి కొత్త ఏడాది నిర్ణయంగా ఈ రోజే వాకింగ్ మొదలుపెట్టండి.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

హైపర్ టెన్షన్‌తో జాగ్రత్త: ప్రవహించాల్సిన వేగం కంటే ఎక్కువ ఒత్తిడితో రక్తం ప్రవహించడాన్ని రక్తపోటు /హైబీపీ/ హైపర్‌టెన్షన్ అని చెప్పవచ్చు. సాధారణ రక్తపోటు 120-130 / 70-90 ఎంఎం హెచ్‌జిగా ఉండాలి. ఇంతకు మించి ఉంటే ప్రమాదం అని గుర్తించాలి. రక్తపోటు కారణంగా కళ్లు, మెదడు, గుండె, మూత్రపిండాలు... ఇలా శరీరంలోని ఏ భాగమైనా దెబ్బతినవచ్చు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడం కోసం ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండు వంటివి తినడం లాంటి మంచి అలవాట్లు చేసుకోండి.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

డయాబెటిస్ ఉంటే పరాకు వద్దు: శరీరంలోని ఏ అవయవాన్నైనా దెబ్బతీసి ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టే జబ్బు డయాబెటిస్. ఒక్క డయాబెటిస్ ఉందంటే అది పది రోగాల పెట్టు అని గుర్తెరిగి జాగ్రత్త వహించండి. గతంలో ఎలా ఉన్నా... ఈ ఏడాదిలో ముందు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ, వ్యాయామం చేస్తూ, చక్కెరను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకుంటూ ఉండటం మరవకండి. చక్కెరవ్యాధి ఉన్నవారు ప్రతి మూడు నెలలకు కనీసం ఒకసారి హెచ్‌బీ1 ఏసీ అనే పరీక్ష చేయించుకుంటూ చక్కెరపాళ్లు ఎప్పుడైనా పెరుగుతున్నాయా లేక ఒకేలా ఉంటున్నాయా అన్నది పరీక్షించుకుంటూ ఉండండి.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

కొవ్వు పాళ్లు సరిగా ఉన్నాయేమో చూసుకోండి: కొవ్వు వల్ల ఎప్పుడూ హానే జరుగుతుందని మనలో చాలామందికి ఒక అపోహ. కానీ అది వాస్తవం కాదు. నిజానికి మనలోని అనేక జీవక్రియల నిర్వహణకు కొవ్వు కావాల్సిందే. ఎందుకంటే కొన్నిరకాల విటమిన్లు కేవలం కొవ్వులోనే కరుగుతాయి. అందుకే కొవ్వులు తగినంతగా లేకపోవడం కూడా అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఆరోగ్యస్పృహ ఎక్కువైన కొందరు నూనెలను / కొవ్వులను అదేపనిగా పరిహరిస్తుంటారు. దాంతో కొవ్వు తగ్గడం వల్ల వచ్చే అనర్థాలు ఎదురవుతాయి. ఇలాంటి కండిషన్‌ను ‘డిస్‌లిపిడేమియా' అంటారు. డిస్ లిపిడేమియా అంటే శరీరంలో కొవ్వు పాళ్లు ఉండాల్సినంత లేకపోవడం అన్నమాట. కొవ్వులను ఆరోగ్యకరమైన పాళ్లలో తీసుకుంటూనే గుండెపోటును నివారించడానికి తమ రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పాళ్లు 40కి పైన, చెడు కొలెస్ట్రాల్ పాళ్లు 80లోపు, ట్రైగ్లిజరైడ్స్ పాళ్లు (టిజిఎల్) 150లోపు ఉండేలా చూసుకోవాలి.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

ఒత్తిడి అనర్థాలను అధిగమించండి: మన దైనందిన జీవితంలో ఒత్తిడిని అనుభవించనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్నిసార్లు పరిమితమైన ఒత్తిడి వల్ల కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో మితిమీరిన ఒత్తిడి వల్ల అనర్థాలే ఎక్కువ. ఆందోళన నుంచి ఉపశమనానికి పొగతాగడం, మద్యం తీసుకోవటం వంటివి చేస్తుంటారు. ఇది మరింత అనర్థదాయకం. ఒత్తిడిని అధిగమించడం కోసం రోజూ యోగా, ఆటలు, ధ్యానం, ఇష్టమైన వ్యాపకాలు, హాబీలను పెంపొందించుకోవడం... వంటివి చేయాలనే నిర్ణయం తీసుకోండి.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

పొగాకును వదిలేయండి: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మరణాలు పొగతాగడం వల్లనే సంభవిస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. పొగాకులో ఉండే విషపదార్థాలు రక్తంలో కలవటమే హార్ట్ ఫెయిల్‌కు ప్రధాన కారణం. పొగతాగేవారు తమకు చేటు చేసుకోవడంతో పాటు పక్కవారి అనారోగ్యానికీ కారణమవుతున్నారు. అందుకే అనేక అనర్థాలకు మూలమైన ఈ అలవాటును ఈ ఏడాది తక్షణం వదిలేయండి. మళ్లీ ఎప్పుడూ మొదలుపెట్టకండి.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

మద్యంతో ముప్పే!: చాలా కొద్దిమోతాదుల్లో తీసుకునే ఆల్కహాల్ గుండెకు మంచిదని, అది కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుందని చాలామంది అపోహ పడుతుంటారు. కొద్ది మోతాదులో రెడ్ వైన్‌లాంటి డ్రింక్ వల్ల కొంచెం మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరగవచ్చు. కానీ ఆల్కహాల్‌లో ఉండే పదార్థాలు దానికి బానిసయ్యేలా చేస్తాయి. ఈ కారణంగా మద్యం తాగటం మొదలు పెట్టిన కొన్నాళ్ల తరువాత ఆల్కహాలు మోతాదును పెంచుకుంటూపోతారు. దాంతో అనేక సామాజిక, మానసిక, అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆల్కహాల్ అన్నివేళలా ఆరోగ్యానికి అనర్థదాయకమే అని గుర్తుంచుకుని ఈ ఏడాది ఆ అలవాటుకు స్వస్తి చెప్పండి.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

పాజిటివ్ దృక్పథంతో ఉండండి: మన రోజువారీ వ్యవహారాల్లో సానుకూల దృక్పథం (పాజిటివ్ ఆటిట్యూడ్)తో ఉండటం వల్ల ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం ఉంటుందన్న విషయం అనేక సందర్భాల్లో తేలిన సత్యం. యువరాజ్‌సింగ్‌కు క్యాన్సర్ నయం కావడానికి సానుకూల దృక్పథం ఎంతగా తోడ్పడిందో మనందరికీ తెలిసిన విషయమేకదా! అందుకే పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ ఫలితాలు పొందండి.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

బరువు పెరుగుతున్నారా... అప్రమత్తంగా ఉండండి: కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా ఈ నెలంతా పార్టీలు జరుగుతూనే ఉంటాయి. దీనికితోడు ఇటీవల మన ఆహారపు అలవాట్లలోనూ, జీవనశైలిలోనూ పాశ్చాత్యధోరణులు కనిపిస్తున్నాయి. దాంతో బరువు పెరగడం అన్నది చాలా రొటీన్ సమస్యగా మారింది. ఇలా పెరిగే బరువు ఎన్నో అనర్థాలను తెచ్చిపెడుతుంది. అవి... డయాబెటిస్ పీసీఓడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) హైబీపీ ఆర్థరైటిస్ గుండెజబ్బులు సంతానలోపం, అంగస్తంభన లోపాలు హైకొలెస్ట్రాల్ మహిళల్లో హార్మోనల్ మార్పులు రుతుక్రమంలో మార్పులు, ముఖంపై అవాంఛిత రోమాలు, మొటిమలు రావడం జీర్ణక్రియ మందగించడం మానసిక సమస్యలు మూత్ర సంబంధమైన (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ మలబద్దకం గ్యాస్ట్రయిటిస్, అసిడిటీ ఛాతీలో మంటగా ఉండటం వాంతులు కావడం డయేరియా నడుము నొప్పి రావడం.

మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

మనలోని ఒబెసిటీనీ గుర్తించడం ఎలా: మన బరువు మామూలుగానే ఉందా లేక అనారోగ్యాన్ని తెచ్చిపెట్టేంతగా పెరిగిందా అని తెలుసుకునేందుకు ఒక సూచిక అందుబాటులో ఉంది. అదే బాడీ మాస్ ఇండెక్స్. బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) పద్ధతితో కిలోగ్రాముల్లో మీ బరువును తీసుకుని, దాన్ని మీటర్లలో మీ ఎత్తు స్క్వేర్‌తో భాగించండి. వచ్చిన ఆ విలువను బట్టి మీరు ఉండాల్సినంత బరువు ఉన్నారా లేక ఎక్కువగా ఉన్నారా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఆ విలువ 18.5 కంటే తక్కువ ఉంటే మీరు తక్కువ బరువు ఉన్నట్లు 18.5 నుంచి 24.99 ఉంటే మీ ఎత్తుకు తగిన బరువు ఉన్నట్లు. 25 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు లావుగా ఉన్నట్లే! 25 నుంచి 29 ఉంటే మీరు స్థూలకాయులు (ఒబేస్). 30 నుంచి 34.99 వరకు చాలా స్థూలకాయులు. 35 నుంచి 39.99 వరకు అయితే మీలో ఒబేసిటీ పాళ్లు విపరీతమన్నమాట. మీ బీఎంఐ 33 దాటితే సాధారణ వ్యాయామం, ఆహార మార్పుల వంటి జీవనశైలిలో మార్పులతోనే సన్నబడటం కష్టమై, సర్జరీ వరకు వెళ్లాల్సి రావచ్చు. కాబట్టి బీఎంఐ ఆ స్థాయికి చేరకుండా ముందునుంచే జాగ్రత్త వహించాలి.

English summary

Tips for Staying Healthy in Your 30s | మీ వయస్సు ముప్పైనా?మరి ఈ నియమాలు పాటిస్తున్నారా?

However, many of us get so involved with our careers and our families in our 30s, that we neglect our own health. The responsibilities and busy schedules of everyday life can make it difficult for us to maintain a healthy balance, but taking good care of ourselves—€”body, mind and spirit—€”becomes more and more important as we age. By making good lifestyle choices in our 30s, we can help reduce our risk for chronic health problems and improve our chances for a long, healthy life.
Desktop Bottom Promotion