For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరడానికి గల టాప్ టెన్ కారణాలు..!?

By Super
|

శరీరంలోని జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే అందుకు ప్రోటీనులు, విటమిన్స్, పోషకాంశాలు ఎంత ముఖ్యమో కొలెస్ట్రాల్ కూడా అంతే ముఖ్యం. శరీరంలోని జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి కొలెస్ట్రాల్ కూడా కావాల్సిన స్థాయిలో ఉండాలి. అదే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అవసరానికి మించి పెరుగుతే అది ఆరోగ్యం మీద తీవ్రంగా చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. శరీరంలో అధనంగా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల స్ట్రోక్ (మూర్చవ్యాధికి)కారణం అయ్యే బ్లాకేజ్ లు రక్తం ఏర్పడుతాయి. ఇంకా గుండె సంబంధిత సమస్యలు కూడా అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం హై కొలెస్ట్రాలే.

ప్రస్తుత రోజుల్లో, ఎక్కువగా పెద్దల్లో వివిధ కారణాల వలన, అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. అలా అధిక కొలెస్ట్రాల్ కు అత్యధికంగా కారణం అయ్యే సాధారణ లిస్ట్ ను ఇక్కడు మీకోసం అంధిస్తున్నాం పరిశీలించండి.

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరడానికి ఈ10 కారణాలే.!?

అనారోగ్యకరమైన ఆహారం: సంతృప్త కొవ్వు వినియోగం అధిక కొలెస్ట్రాల్ కారణం కావచ్చు. సంతృప్త కొవ్వులను అధిక కొలెస్ట్రాల్ మరియు కొవ్వు ఉన్న ఆహారంలో కనుగొనబడింది. అటువంటి ఆహారాలు రెడ్ ఫ్యాటీ మీట్(ఎర్రగా ఉండే కొవ్వు మాంసం), వెన్న, జున్ను, కేకులు, నెయ్యి మొదలైనవి . ఇటువంటి ఆహారాలను సాధ్యమైనంత వరకూ మానుకోడం లేదా పరిమితంగా తీసుకోవడం మంచిది.

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరడానికి ఈ10 కారణాలే.!?

వంశానుగత కారణాలు: కుటుంబంలో అధిక కొలెస్ట్రాల్ పెద్దల కాలం నుండి వంశానుగతంగా ఉంటే, అప్పుడు మీరు అధికకొలెస్ట్రాల్ తో బాధపడటానికి ఇది ఒక కారణం కావచ్చు. ఇలా వంశానుగతంగా వచ్చే అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తంలో అడ్డంకులు ఏర్పడి అది స్ట్రోక్ కు దారితీస్తుంది .

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరడానికి ఈ10 కారణాలే.!?

అధిక బరువు కలిగి ఉండటం: ఊబకాయం లేదా సాధరణంగానే అధిక బరువును కలిగి ఉన్నట్లైతే అది హై కొలెస్ట్రాల్ కు మరో కారణం అవుతుంది. ఇది కాకుండా, మీ సామాజిక జీవితంలో మార్పులు, అది మరింత అడ్డంకులు కలిగించే ట్రైగ్లిజరైడ్స్ పెంచుతుంది. అందువల్ల, అధిక కొలెస్ట్రాల్ కు ప్రమాదకరమైన అధిక బరువును పారద్రోలి, మీ బరువును క్రమంగా ఉండేలా చూసుకోవాలి.

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరడానికి ఈ10 కారణాలే.!?

సోమరితనం: ఎవరైతే రోజు మొత్తం కూర్చొని లేదా రోజులో ఎక్కువగా నిద్రపోయేవారు లేదా బద్దకంగా గడిపే వారు అధిక కొలెస్ట్రాల్ భారీన పడే అవకాశాలు ఉన్నాయి. సంతోషకరమైన చురుకైన జీవనశైలి కలిగి ఉండటం వల్ల లో ట్రైగ్లిజరైడ్స్ పొందడంతో పాటు మీరు సరైన మీ బరువు నిర్వహించడానికి సహాయపడుతుంది.

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరడానికి ఈ10 కారణాలే.!?

ధూమపానం: ధూమపానం మీ కొలెస్ట్రాల్ స్థాయిల హెచ్చుతగ్గులలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది. అలాగే జీవితకాలాన్ని కూడా తగ్గిస్తుంది.అందువలన, మీ కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి మరియు ఆరోగ్యకరంగా నివసించడానికి ధూమపానం విడిచిపెట్టండి.

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరడానికి ఈ10 కారణాలే.!?

వయస్సు మరియు లింగం మీద ప్రభావం: ఎవరైనా సరై వారి వయస్సు 20 సంవత్సరాలు దాటగానే వారి సాధారణంగానే కొలెస్ట్రాల్ స్థాయి సహజంగా పెరుగడం ప్రారంభమవుతుంది. స్త్రీ -పురుషుల ఇద్దరిలోనూ కొలెస్ట్రాల్ స్థాయి సాధారణంగా 60-65 సంవత్సరాల వయస్సు వరకు పెరుగుతుంది. ఆడవారిలో వారి మోనోపాజ్ దశ ముందు తక్కువ కొలెస్ట్రాల్ స్థాయి కలిగి ఉంటారు. కానీ, మోనోపాజ్ దశ తర్వాత, మహిళలు పురుషుల కంటే కొలెస్ట్రాల్ అధిక స్థాయి కలిగి ఉంటారు. అందువల్ల, మీరు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారం నిర్వహించడానికి ప్రయత్నించండి.

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరడానికి ఈ10 కారణాలే.!?

మందులు: కొన్ని మందులు ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెంచుతుంది. అందువలన, ఒక మాత్ర మింగడానికి ముందు, మీ వైద్యుడుని సంప్రదించండి.

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరడానికి ఈ10 కారణాలే.!?

మద్యం: క్రమం తప్పకుండా మద్యం సేవించడం వల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అధిక రక్తపోటు మరియు లివర్ డ్యామేజ్ కు దారితీస్తుంది.

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరడానికి ఈ10 కారణాలే.!?

ఒత్తిడి: ఎప్పుడైతే ప్రజలు ఒత్తిడికి గురిఅవుతారు అప్పుడు స్మోకింగ్ చేయడం మరియు ఆల్కహాల్ తీసుకోవడం మరియు ఫ్యాటీ ఫుడ్స్ తినడం వల్ల దీర్ఘకాలం ఒత్తిడి పెరగడంతో శరీరంలో హై కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం కావచ్చు.

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరడానికి ఈ10 కారణాలే.!?

వ్యాధులు:మధుమేహం మరియు థైరాయిడ్ వంటి కొన్ని వ్యాధులు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెంచడానికి కారణం అవుతాయి.

ఈ కారణం చేత, మీ కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంచుకోవడానికి, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి.

English summary

Top 10 causes of high cholesterol | శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరడానికి ఈ10 కారణాలే.!?

A desirable level of cholesterol is essential for the body to function properly. When the level of cholesterol within the body increases, it causes blockage, stokes and other cardiovascular problems. 
Desktop Bottom Promotion