For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేతి బీరకాయలోని గొప్ప ఆరోగ్య ఔషధగుణాలు

|

మనకు ఆహారమంటే శక్తి! పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, నూనెలు, విటమిన్లు, ఖనిజాలు... వీటి గురించే ఎక్కువగా మాట్లాడతాం.. వీటి గురించే ఎక్కువగా వింటుంటాం. కానీ ఇంతే ప్రాధాన్యం ఉన్న 'పీచు' గురించి మాత్రం పెద్దగా పట్టించుకోం! మన ఆరోగ్యానికి ప్రాణంలాంటిది పీచు. వైద్యరంగం ఈ విషయాన్ని నానాటికీ బలంగా చెబుతోంది. వైద్య పరిశోధనలన్నీ... ఇప్పుడు పీచు పరమావశ్యకతనే చాటిచెబుతున్నాయి. క్యాన్సర్లు రాకుండా.. గుండె జబ్బులు రాకుండా.. కొలెస్ట్రాల్‌ పెరక్కుండా.. మధుమేహం రాకుండా.. వూబకాయం రాకుండా... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పీచు ప్రయోజనాల జాబితాకు అంతుండదు. మన అన్నం పళ్లాన్ని నానా రకాల 'జంక్‌ ఫుడ్‌' ఆక్రమించేస్తున్న ఈ ఆధునిక కాలంలో పనిగట్టుకుని మరీ 'పీచు'ను ఎంచుకోవాల్సిన అవసరం పెరిగిపోతోంది.

పీచు శాకాహారంలోనే ఉంటుంది. మాంసాహారంలో ఉండదు. పీచుపదార్ధాలు తీసుకున్న ప్రతిసారీ తగినంతగా నీరు కూడా తాగాలి. బీరకాయలో పీచు అధికంగా ఉంటుంది కాబట్టి, దీన్ని మన రెగ్యులర్ ఆహారంలో చేర్చుకోవాలి. బీరకాయలో పందిర బీర, పొట్టి బీర, నేతిబీర, గుత్తిబీర అని వివిధ రకాలున్నాయి. అయితే ఈ బీరలో ఏఒక్కటి తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ బీరకాలయో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో నిజంగా డైటరీ ఫైబర్, విటమిన్ సి, రిబోఫ్లోవిన్, జింక్, థయమిన్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇన్ని సుగుణాలున్న ఈ బీరకాయలోని వైద్యపరమైన గుణాలు తెలుసుకుందాం...

రక్తాన్ని శుధ్ది చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది:

రక్తాన్ని శుధ్ది చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది:

రక్తం శుధ్ది చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది మరియు కాలేయ ఆరోగ్యంను మెరుగుపరుస్తుంది. మరియు మధ్యం మత్తు వైపు వెళ్ళకుండా తగ్గించడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరచే గుణాలు అధికం:

జీర్ణక్రియను మెరుగుపరచే గుణాలు అధికం:

బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. విరేచన కారి లక్షణాలను ఇందులో ఎక్కువగా కనుగొనడం జరిగింది. అందువల్లనే పథ్యంగా బీరకాయ చాలామంచిది. మలబద్దం నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. పైల్స్ తో బాధపడే వారు దీన్ని తీసుకోవడం చాలా మంచిది. అంతే కాదు, పొట్ట యొక్క పనిసామర్థ్యం మీద అద్భుతంగా ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

కామెర్లను నివారిస్తుంది:

కామెర్లను నివారిస్తుంది:

కామెర్లను నివారించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కామెర్లతో బాధపడేవారు, జీరకాయలోని తెల్లటి గూడే, గింజలతో సహా తీసుకోవడం వల్ల కామెర్లను నివారించవచ్చు.

డయాబెటిస్ అరికడుతుంది:

డయాబెటిస్ అరికడుతుంది:

బీరకాయలోని కొన్ని ముఖ్యమైన లక్షణాలు మధుమేహాన్ని నిరోధించడంలో అద్భుతంగా సహాయపడుతుంది . బీరకాయలోని పెప్టైడ్స్ బ్లడ్ మరియు యూరిన్ లోని షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరియు బ్లడ్ ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది:

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది:

బరువు తగ్గించుకోవాలనుకొనే వారు, బరువు తగ్గించే డైట్ లిస్ట్ లో దీన్ని చేర్చుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ, మరియు చాలా తక్కువ కొలెస్ట్రాల్ తీసుకొనేందుకు సహాయపడుతుంది. చాలా తక్కువ ఫ్యాట్ క్యాలరీలను కలిగి ఉండి, ఎక్కువ నీటిశాతం కలిగి ఉంటుంది. కాబట్టి, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలిఅవ్వనివ్వదు మరియు ఇందులోని డైటరీ ఫైబర్ , విటమిన్స్ మరియు మినిరల్స్ బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

రోగనిధోక శక్తిని పెంచుతుంది:

రోగనిధోక శక్తిని పెంచుతుంది:

ఎటువంటి అనారోగ్యానికైనా గురైనప్పుడు చాలా త్వరగా కోలుకొనేలా చేస్తుంది. అంతటి శక్తికలిగిన బీరకాయను జ్యూస్ రూపంలో తీసుకవడం వల్ల శరీరంలో జీవక్రియలు చురుకు పనిచేసేలా, త్వరగా తేరుకొనేందుకు సహాయపడుతుంది. ఏ ఇన్ఫెక్షనస్ అయినా, ఏ వైరస్ లు శరీరానికి సోకుండా సహాయపడుతుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు బీరకాయ రసం త్రాగితే రోగనిరోధక శక్తిని పెంపొంధించుకోవచ్చు.

చర్మ సంరక్షణకు:

చర్మ సంరక్షణకు:

బీరకాయను పేస్ట్ చేసి లేదా చక్రాల్లా నేరుగా అలాగే పొడి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని చాలా కాంతివంతంగా మరియు మెటిమలు మచ్చలులేని చర్మంగా తయారుచేస్తుంది. మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించడంలో సహాయపడే అద్భుతమైన మూలకం ఇందులో ఉంది. అంతే కాదు ఇది శరీర నిర్వహణకు మరియు పాదాల దుర్వాసన నివారించడానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది.

కడుపుకు చాలా మంచిది:

కడుపుకు చాలా మంచిది:

బీరకాయలోని సెల్యులోజ్ కడుపు, ఉదర సంబంధిత సమస్యలు నివారించడంలో మరియు పైల్స్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

కళ్ళకు చాలా మేలు చేస్తుంది:

కళ్ళకు చాలా మేలు చేస్తుంది:

బీరకాయలో డైటరీ ఫైబర్ తో పాటు, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాల మేలు చేస్తుంది

యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలం:

యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలం:

బీరకాయలో యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర మొత్తం శుధ్ది చేసే, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగి, శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది . ఇది చర్మం సంరక్షణలో హోం ట్రీట్మెంట్ పరిష్కారంగా ఉపయోగించవచ్చు.

English summary

Top 10 Health benefits of Ridge Gourd

Ridge Gourd is dark green in colour, with ridges on the length of its body and in shape it tapers on both its ends. Has white pulp with white seeds embedded in its spongy flesh.
Desktop Bottom Promotion