For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ ఇ వల్ల కలిగే టాప్ 10 ఆరోగ్య ప్రయోజనాలు..!

|

సౌందర్యానికి, ఆరోగ్యానికి కొన్ని విటమిన్లు బాగా పనిచేస్తాయి. శరీరంలో విటమిన్ల పాత్ర కీలకమైనది. శరీరానికి కావల్సిన విటమిన్లలో ఏ ఒక్క విటమిన్ లోపించినా అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. విటమిన్లలో ఆరోగ్యానికి, సౌందర్యానికి కేరాఫ్ గా విటమిన్ ‘ఇ' అని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళల్లో గర్భాధారణ విషయంలో విటమిన్ ఇ ఎంతో అవసరం అవుతుంది. అలాగే పురుషుల్లో వంధ్యత్వం నివారించడానికి విటమిన్ ఇ అవసరం అవుతుంది. హానికరమైన ఫ్రీరాడికల్ అణువును తొలగించడానికి మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఈ విటమిన్ ఇ లో అధికంగా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో చర్మసౌందర్యాన్ని ఇదే ఇనుమడింపజేస్తుంది. మరి ఇన్ని ఉపయోగాలున్న ‘విటమిన్ ఇ' వల్ల కలిగే ప్రయోజనాలు, విటమిన్ ఇ లోపం వల్ల కలిగే నష్టాలు, విటమిన్ ఇ ఎందులో పుష్కలంగా లభిస్తుందో తెలుసుకొని ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడుకుందాం...

ముఖ్యంగా విటమిన్ ఇ నిర్వహించే విధులేంటో తెలుసుకుందాం:

ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్: మనం ఆహారం తీన్న తర్వాత జీవక్రియల కోసం అది శక్తిగా మారుతుంది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు కొన్ని అణువులు ఏర్పడుతాయి వీటినే ఫ్రీరాడికల్స్ అంటారు. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. ఇవి అల్ట్రా వయొలెట్ కిరణాల్లో, సిగరెట్ పొగలో, వాయు కాలుష్యంలో కూడా ఉంటాయి. ఇటువంటి హానికరమైన ఫ్రీరాడికల్స్ అణువులను యాంటీ ఆక్సిడెంట్స్ హరిస్తాయి. కాబట్టి శరీరంలో వెలువడే హానికరమైన ఫ్రీరాడిక్లస్ ను నాశనం చేసే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు విటమిన్ ఇ లో ఉండటం వల్ల అవి జీవక్రియల్లో వెలువడి హాని చేసే పదార్థాలను తొలగిస్తాయని చెప్పవచ్చు.

శరీరంలో జీవక్రియ సక్రంమగా: మన శరీరంలో జరిగి అనేక కార్యకలాపాలను మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. ఈ జీవక్రియలు సరిగా జరగడానికి ఇ విటమిన్ దోహదపడుతుంది.

వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి: మనలో వ్యాధి నిరోధకతను పెంపొంధించుకోవడానికి విటమిన్ ఇ ఆహారాలు అధికంగా తీసుకోవాలి.

జన్యు పదార్థాల తయారీలో: జన్యు పదార్థాలు అనగా మన స్వభావాలు, పోలికలు ఒక తరం నుండి మరో తరానికి చేరడానికి విటమిన్ ఇ దోహదం చేస్తుంది.

విటమిన్ ఇ ప్రయోజనాలు:

విటమిన్ ఇ వల్ల శరీరానికి కలిగే లాభనష్టాలు

చర్మ సౌందర్యానికి: కలబందతో పాటు, ఈ విటమిన్ ఇను ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో కలపడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంలో వచ్చే అనేక మార్పులను ఇది సమర్థంగా నివారించి దీర్ఘకాలం పాటు యవ్వనంగా ఉంచుతుంది. పొడి చర్మం ఉన్న వారు విటమిన్ ఇ తీసుకుంటే చర్మం సున్నితంగా తయారవుతుంది.

విటమిన్ ఇ వల్ల శరీరానికి కలిగే లాభనష్టాలు

కంటి ఆరోగ్యానికి: కంటిలో ఏర్పడే శుక్లాలతో పాటు, కంటికి వచ్చే మాక్యూలార్ డీజనరేషన్ అనే వ్యాధిని ఈ విటమిన్ ఇ చాలా వరకూ నివారిస్తుంది. చూపు స్పష్టతకు తోడ్పడుతుంది.

విటమిన్ ఇ వల్ల శరీరానికి కలిగే లాభనష్టాలు

మెదడుకు: వయస్సు పెరిగే కొద్ది మెదడుపై ప్రభావం అల్జైమర్స్ డిసీజ్, మతిమరపు వంటి వ్యాధులను నివారిస్తుంది.

విటమిన్ ఇ వల్ల శరీరానికి కలిగే లాభనష్టాలు

కిడ్నీ: పొగత్రాగే వారికి క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ అనే ఊపిరితిత్తుల వ్యాధి రిస్క్ ను ఇది తగ్గిస్తుంది.

విటమిన్ ఇ వల్ల శరీరానికి కలిగే లాభనష్టాలు

ఊబకాయం: అధిక బరువుతో ఉన్న వారిలో కొవ్వును కరిగించే శక్తి ఈ విటమిన్ ఇ'లో అధికంగా ఉంది. అధిక బరువుతో బాధపడేవారు విటమిన్ ఇ ఉన్న పోషకాలను తీసుకుంటే అధిక బరువును నియంత్రించవచ్చు.

విటమిన్ ఇ వల్ల శరీరానికి కలిగే లాభనష్టాలు

కీళ్ళనొప్పులకు: విటమిన్ ఇ కండరాలను దృఢంగా ఉంచి, అవి తేలికగా కదలడానికి తోడ్పడుతుంది.

విటమిన్ ఇ వల్ల శరీరానికి కలిగే లాభనష్టాలు

గుండెకు: విటమిన్ ఇలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అంతే కాదు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను దూరం చేస్తాయి. క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.

విటమిన్ ఇ వల్ల శరీరానికి కలిగే లాభనష్టాలు

మధుమేహం: మధుమేహగ్రస్తులకు విటమిన్ ఇ చాలా ఉపయోగకరం. మధుమేహ నివారణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తుంది.

విటమిన్ ఇ వల్ల శరీరానికి కలిగే లాభనష్టాలు

మోనోపాజ్: మహిళలు ఓ యస్సుకు చేరాక రుతుస్రావం ఆగిపోతుంది. రుతుస్రావం ఆగిపోవడానికి ముందు మహిళల్లో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఉదా: శరీరంలో వేడిగా ఆవిర్లు, స్వభావంలో మార్పులు, భావోద్వేగాలకు గురికావడం, అలసట ఇలాంటి లక్షణాలను విటమిన్ ఇ నివారిస్తుంది.

విటమిన్ ఇ వల్ల శరీరానికి కలిగే లాభనష్టాలు

పండ్లు, కూరగాయలు: విటమిన్ ఇ అధికంగా ఉండే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నట్స్, పొద్దతిరుగుడు నూనె, ఆలివ్ ఆయిల్, బ్రొకోలి, మాంసాహారం, గుడ్లు, చేపలు, మామిడి పండ్లు వంటి వాటిని అధికంగా తీసుకోవాలి. కాబట్టి ఇ విటమిన్ అధికంగా ఉండే ఆహారాలు తరచూ తీసుకొనే డైయట్ లిస్ట్ లో చేర్చడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవచ్చు.

నష్టాలు: విటమిన్ ఇ లోపం ఏర్పడం చాలా అరుదు. విటమిన్ ఇ కొవ్వులలో కరుగుతుంది. కొవ్వులు సరిగా జీర్ణం కానప్పుడు వారికిలో విటమిన్ ఇలోపాలు రావచ్చు. దాంతో గర్భస్రావం, ప్రసవం ముందుగానే కావడం, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, నరాల సమస్యలు ఏర్పడుతాయి.

English summary

Top 10 Health Benefits Of Vitamin E | విటమిన్ ఇ వల్ల శరీరానికి కలిగే లాభనష్టాలు

Vitamin E is an essential nutrient, which means the body needs it but cannot produce it on its own. However, vitamin E deficiency is rare because it is fat-soluble - it is stored in the fat tissues for up to six months before getting depleted. The health benefits of vitamin E range include skin enhancement, wound healing, immune function, and protection against various diseases. Also called alpha-tocopherol, vitamin E is believed to reduce cholesterol and plaque buildup, reducing the risk of stroke and coronary artery disease (CAD).
Story first published: Tuesday, January 8, 2013, 12:07 [IST]
Desktop Bottom Promotion