For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గొప్ప ఔషధగుణాలున్న పెప్పర్ మింట్ ఆయిల్ గురించి మీకు తెలుసా..?

By Super
|

పెప్పర్ మింట్ నూనె అన్ని ముఖ్యమైన నూనెలన్నింటిలో ఎంతో వైవిధ్యమున్న, అత్యంత ఉపయోగకరమైన ఒక నూనె. దీనిలో విటమిన్ ఏ, సి; మాంగనీసు, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, పొటాషియం, రాగి వంటి ఖనిజాలు ఉన్నాయి. దీనిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి.

ఈ తాజా, పెప్పర్ మింట్ నూనెలో అద్భుతమైన ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు, ఉపయోగాలు ఉన్నాయి. అనేక వ్యాధులను నయం చేయడానికి, పరిష్కరించడానికి, రుగ్మతలు, పరిస్థితులను నయం చేయడానికి ఈ నూనెను మీరు ఎలా వాడవచ్చో ఈ వ్యాసం వివరిస్తుంది.

పెప్పర్ మింట్ నూనెతో గల ప్రయోజనాలు:

పెప్పర్ మింట్ ఆయిల్ వల్ల కలిగే 10 అద్భుతమైన ఉపయోగాలు

అజీర్తిని నివారిస్తుంది: పెప్పర్ మింట్ నూనె అజీర్తిని తగ్గిస్తుందని తెలుపుతారు. పెప్పర్ మింట్ నూనెను ఆహారంలో సువాసన కోసం వాడవచ్చు లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల కలిపి భోజనం తర్వాత తీసుకోండి. సహజంగా కడుపుబ్బరం తగ్గించే గుణం ఉన్నందున గ్యాసును తగ్గిస్తుంది. కడుపు, పేగులలో ఆకస్మిక బాధను తగ్గించి, అస్తవ్యస్థ కడుపుకు ఉత్తమ విరుగుడుగా పనిచేస్తుంది.

పెప్పర్ మింట్ ఆయిల్ వల్ల కలిగే 10 అద్భుతమైన ఉపయోగాలు

శ్వాస వ్యవస్థ: పెప్పర్ మింట్ నూనెలో ఉన్న మెంథాల్ శ్వాస మార్గాన్ని అడ్డు లేకుండా చేయడ౦లో సాయపడుతుంది. ఒక కఫహరిణిగా పనిచేస్తుంది. కఫంతో కూడిన జలుబుకు, మరింత తీవ్రమైన సైనసైటిస్, అస్తమా, బ్రాంకైటిస్ ల నుండి ఉపశమనం కల్గిస్తుంది. పెప్పర్ మింట్ నూనెను ఛాతీ పై నెమ్మదిగా మర్దన చేయడానికి వాడండి లేదా ఒక వెపోరైసర్ ద్వారా లోపలికి పీల్చండి. మీ నాసికలో సమస్య తగ్గడాన్ని మీరు గమనిస్తారు.

పెప్పర్ మింట్ ఆయిల్ వల్ల కలిగే 10 అద్భుతమైన ఉపయోగాలు

తలనొప్పికి ఉపశమనం కలిగిస్తుంది: పెప్పర్ మింట్ నూనెను తలనొప్పుల నుండి ఉపశమనం పొందటానికి కూడా ఉపయోగిస్తారు. ఒక చేతిరుమాలు పై చల్లిన లేదా మీ మణికట్టు పై పూసిన కొన్ని చుక్కల పెప్పర్ మింట్ నూనెను పీల్చడం వలన బాధాకరమైన తలనొప్పి తగ్గుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

పెప్పర్ మింట్ ఆయిల్ వల్ల కలిగే 10 అద్భుతమైన ఉపయోగాలు

ఒత్తిడిని, బాధను తగ్గిస్తుంది: పెప్పర్ మింట్ నూనెను ఒత్తిడిని, బాధను తగ్గించడానికి ఉపయోగిస్తారు. బాగా అలసిపోయిన సుదీర్ఘమైన రోజు తర్వాత మీ శరీరం పై పెప్పర్ మింట్ నూనెను పూసి నీటి తొట్టెలో నానండి లేదా స్నానం చేయండి ఉపశమనం ఇచ్చే ఈ నూనెలోని లక్షణాలు తిరిగి మీరు శక్తి పొందేట్టుగా చేస్తాయి. పెప్పర్ మింట్ నూనె లోని లక్షణాలు బాధను తగ్గించడం ద్వారా ప్రయోజనాలను కల్గిస్తాయి. దీనిని సమయోచితంగా పూయవచ్చు.

పెప్పర్ మింట్ ఆయిల్ వల్ల కలిగే 10 అద్భుతమైన ఉపయోగాలు

జుట్టు: జుట్టు సంరక్షణకు పెప్పర్ మింట్ నూనెను వాడతారు. పెప్పర్ మింట్ నూనె సహజ యాంటిసెప్టిక్. మాడు పై దీనిని మర్దన చేసినప్పుడు దాని సహజసిద్ధమైన చల్లటి ప్రభావంతో పాటుగా చుండ్రును, పేలను కూడా తగ్గిస్తుంది.

పెప్పర్ మింట్ ఆయిల్ వల్ల కలిగే 10 అద్భుతమైన ఉపయోగాలు

చర్మం: చర్మం పై పూసినప్పుడు, పెప్పర్ మింట్ నూనె మొటిమలను తగ్గించి, మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మచ్చలు లేకుండా చేస్తుంది. ఒకటి లేదా రెండు చుక్కల పెప్పర్ మింట్ నూనెను మీ టూత్ పేస్ట్ లో కలపండి. చెడు శ్వాసకు, పంటి నొప్పులకు వీడ్కోలు పలకండి.

పెప్పర్ మింట్ ఆయిల్ వల్ల కలిగే 10 అద్భుతమైన ఉపయోగాలు

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్: యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యు టి ఐ) ను తగ్గించడానికి పెప్పర్ మింట్ నూనెను ఉపయోగించవచ్చు. అయితే, ఈ విషయాన్నీ నిర్ధారించడానికి పూర్తిస్థాయి శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహి౦చవలసి ఉంది.

పెప్పర్ మింట్ ఆయిల్ వల్ల కలిగే 10 అద్భుతమైన ఉపయోగాలు

రక్తప్రసరణ: రక్తప్రసరణను ఇది మెరుగుపరుస్తుంది.

పెప్పర్ మింట్ ఆయిల్ వల్ల కలిగే 10 అద్భుతమైన ఉపయోగాలు

దంత సంరక్షణ: యాంటిసెప్టిక్ లక్షణాలు ఉన్నందున పెప్పర్ మింట్ నూనె దంత సంరక్షణకు ఉపయోగపడుతుంది. చెడు శ్వాసను తొలగించి, పళ్ళు, చిగుళ్ళు క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది. దీనిని చాలా టూత్ పేస్టులలో కలపడం ఆశ్చర్యపోవలసిన విషయమేమి కాదు. పంటి నొప్పుల చికిత్సలో కూడా దీనిని ఉపయోగిస్తారు.

పెప్పర్ మింట్ ఆయిల్ వల్ల కలిగే 10 అద్భుతమైన ఉపయోగాలు

చికాకుపెట్టే పేగు వ్యాధి: పెప్పర్ మింట్ లోని కండరాలకు ఉపశమనం కలిగించే లక్షణం చికాకు పెట్టే పేగు వ్యాధిని తగ్గిస్తుందని కనుగొన్నారు. ఖచ్చితమైన విధానం ఇప్పటికీ తెలియక పోయినప్పటికీ ప్రాథమిక శాస్త్రీయ పరిశోధనలు ద్వారా ఈ విషయం ధృవీకరించబడింది.

English summary

Top 10 Magical Uses Of Peppermint Oil | పెప్పర్ మింట్ నూనె వల్ల కలిగే 10 అద్భుతమైన ఉపయోగాలు

Peppermint oil is one of the most versatile, and most useful, of all the essential oils. It is loaded with vitamins – such as A and C; and minerals, namely manganese, iron, magnesium, calcium, folate, potassium and copper.
Desktop Bottom Promotion