For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంచి రొమాంటిక్ మూడ్ ను పొందాలంటే... ఇవి తినండి..!?

|

ప్రపంచంలో మనుషులంతా ఒకే తీరులో ఉండరు. ఇందుకు వారి స్వభావాలే కారణమైనా, మారే మానసిక స్థితిని ప్రతి బింబించే ‘మూడ్స్‌' కూడా హేతువులే. నిన్నటి దాకా నవ్వుతూ మాట్లాడిన పక్కింటావిడ ఇవాళ ముఖం ముడుచుకుందన్నా, ఆఫీసులో బాస్‌ అకారణంగా తిట్టారన్నా, అత్తగారు అలిగిందన్నా, ఆడపడుచు మూతి ముడుచుకున్నా అంతా ‘మూడ్‌'మహత్యమే! ఇలా రకరకాలుగా ఎదుటివారిని వేధించి బాధించే ‘మూడ్‌' సదరు వ్యక్తులు సరిగా ఉంచుకోవడం కొన్ని పద్ధతుల ద్వారా సాధ్యమే. వీటిని చదివి వదిలేయకుండా ‘మూడ్‌' తెచ్చుకుని ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది సుమా!

మూడ్ బాగోలేనప్పుడు మరేదో మార్పును మనసు కోరుకుంటుంది. పాడైపోయిన ఆ మూడు నుంచి బయటకు రావాలంటే వెంటనే మనసుకు మార్పు కావాలి. తద్వారా కొత్త ఉత్సాహం కలుగుతుంది. తరచుగా మూడ్ స్వింగ్ లా? మారుతుంటుంది. కొన్ని సందర్భాల్లో వాతావరణాన్ని బట్టి కూడా మారుతుంటుంది. పరిస్థితులను బట్టి మారుతుంటుంది. కారణం ఏదైనప్పటికి, మీ మూడ్ ఆనందంగా మార్చేటందుకు కొన్ని ఆహారాలు పరిశీలించండి. మంచి ‘మూడ్‌'కు మంచి ఆహారం కూడా అవసరమే. ఇంటికి అతిథులొస్తే రుచికరమైన పదార్థాలు ఎలా వండి వడ్డిస్తారో అలాగే మీకూ చేసుకోడి (ఒక్క రే ఉన్నా సరే) ఇష్టమైన వంటకాలతో హాయిగా భోం చేసేయండి. ఇవి తక్షణం మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. సాధారణంగా తినే ఆహారమే కాకుండా, అదనంగా కూడా వీటిని తినవచ్చు. దాంతో మనసునూ, శరీరాన్ని ఉల్లాసకరమైన ‘మూడ్‌'లోకి తెచ్చేందుకిది ఎంతో తోడ్పడుతుంది. మరి మంచి మూడ్ కు తీసుకోవల్సిన ఆహారాలేంటో చూద్దాం...

మంచి రొమాంటిక్ మూడ్ ను పెంచే టాప్ ఫుడ్స్..!

సాల్మన్: కేవలం 90గ్రాముల కేన్డ్ సాల్మన్ ఫిష్ తినడం ద్వారా మీ శరీరానికి రోజంతా అవసరమయ్యే దానికంటే ఎక్కువగా డి విటమిన్, 180మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తాయి. శరీరానికి సరిపడా విటమిన్ డి గనుక లభించకుంటే ఆకలిని కలిగించే లెప్టిన్ హార్మోన్ తన విధులు సరిగా నిర్వర్తించదట. చేపలు కొవ్వును కరిగించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే చేపలు ట్యూనా, సాల్‌మన్, స్వార్డ్‌ఫిష్, ప్లాడర్. డిప్రెషన్ ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎటుంటి మూడ్ లో ఉన్నా సరే సంతోకరంగా మారేందుకు ఉపయోగపడే సప్లిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

మంచి రొమాంటిక్ మూడ్ ను పెంచే టాప్ ఫుడ్స్..!

గ్రీన్ టీ: గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, అనేక ప్రయోజనాలున్నాయని చెపుతారు. గ్రీన్ టీ బరువు తగ్గిస్తుంది, చర్మం మెరుపు పెరుగుతుంది, జుట్టు రాలుడు తగ్గుతుంది. మంచి మూడ్ ను అందిస్తుంది. తలనొప్పి నుంచి ఒత్తిడి వరకూ ఆజీర్తి నుంచి అల్జీమర్స్ వరకు ఏ వ్యాధికైనా ఇది అద్భుతమైన మందు అంటారు చైనీయులు. ఊబకాయం నియంత్రణకు గ్రీన్ టీను మించిన ఔషుధం లేదు. కెఫీన్ కాంబినేషన్‌తో కలిసిన గ్రీన్ టీని తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయట. గ్రీన్ టీ తాగేవాళ్లలో చెడు కొలెస్ట్ర్రాల్ తగ్గి మంచి కొలెస్ట్ర్రాల్ పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మహిళల్లో గ్రీన్ టీ ఎఫెక్ట్ చాలా బాగా ఉంటుంది. మెదడు మీద మంచి ప్రభావాన్ని చూపి మనసు ప్రశాంత పరుస్తుంది.

మంచి రొమాంటిక్ మూడ్ ను పెంచే టాప్ ఫుడ్స్..!

విటమిన్ డి: డిప్రెషన్ తో బాధపడేవారికి విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అయితే విటమిన్ డి ఆహారాలు దొరకడం చాలా కష్టం. విటమిన్ డి ఆహారాలు చాలా అరుదు. విటిమన్ డి ని సూర్య రశ్మినుండి పొందవచ్చు. లేదా డాక్టర్ల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ ను తీసుకోవచ్చు. విటమిన్ డీ వల్ల చెడు మూడ్ ను తొలగించి మంచి మూడ్ లోకి తీసుకొస్తుంది.

మంచి రొమాంటిక్ మూడ్ ను పెంచే టాప్ ఫుడ్స్..!

బెర్రీస్: మనకు తెలిసినంత వరకూ బెర్రీస్ అత్యధిక న్యూట్రిషన్ కలిగినటువంటి ఆహారం. బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి తక్షణమే భావాలను మార్చేస్తాయి. బ్లాక్ బెర్రీస్ విటమిన్ సి మరియు ఇ వల్ల పవర్ ఫుల్ యాంటీయాక్సిడెంట్ వల్ల ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. ఇందులో మూడ్ ను మార్చే యాంథోసియనిడ్స్ పుష్కలంగా ఉండి, బ్రెయిన్ ఫంక్షన్స్ కు సహాయపడుతుంది. ఇది బరువును తగ్గించుటలో సూపర్ గా పనిచేస్తుంది. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి.

మంచి రొమాంటిక్ మూడ్ ను పెంచే టాప్ ఫుడ్స్..!

రా పెప్పర్(క్యాప్సికమ్): ఎర్రని లేదా గ్రీన్ క్యాప్సికమ్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి స్ట్రెస్ హార్మోనులను తగ్గించడానికి బాగా సహాయపడుతాయి. ఈ విటమిన్ సి మరికొన్ని పచ్చి తాజా పండ్లు(ఆరెంజ్, దోసకాయ, బొప్పాయి మరియు కివి)లో కూడా లభ్యం అవుతాయి.

మంచి రొమాంటిక్ మూడ్ ను పెంచే టాప్ ఫుడ్స్..!

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కు ఉంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపివేయబడుతుంది. వారంలో కనీసం రెండు సార్లైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్స్ డిప్రెషన్ కు లోనుకాకుండా కాపాడీ మంచి మూడ్ లో ఉండేందుకు సహాయపడుతాయి.

మంచి రొమాంటిక్ మూడ్ ను పెంచే టాప్ ఫుడ్స్..!

నీళ్ళ: నీళ్ళు బాగా తాగడం వల్ల డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. నీళ్ళను సరైన మోతాదులో తీసుకోవడం వల్ల వ్యక్తుల యొక్క మూడ్ మారుతుంది. ఎనర్జీలెవల్స్ పెరుగుతాయి. మెంటల్ ఫంక్షన్స్ కు ఉపయోగపడుతుంది.

మంచి రొమాంటిక్ మూడ్ ను పెంచే టాప్ ఫుడ్స్..!

ఖర్జూరం: ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. కర్జూరాలు మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే ధర చాలా తక్కువ. ఈ కర్జూరాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఎండు ఖర్జూరం: ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.

మంచి రొమాంటిక్ మూడ్ ను పెంచే టాప్ ఫుడ్స్..!

ఓస్ట్రెస్: సీఫుడ్స్ లో చేపలు, రొయ్యలు, పీతలే కాకుండా ఇది కూడా ఒక సీ ఫుడ్. ఇందులో అధిక శాతంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఫెర్టిలిటి స్థాయి పెరుగుతుంది. అంతే కాదు వీటిలో జింక్, సెలీనియం, మ్యాంగనీస్, మరియు కాపర్ అధిక శాతంలో ఉంటుంది.

మంచి రొమాంటిక్ మూడ్ ను పెంచే టాప్ ఫుడ్స్..!

ఆలివ్ ఆయిల్: చాలా పరిశోధన ప్రకారం ప్రస్తుత కాలంలో చాల మంది పండ్లు, నట్స్, చేపలు, వెజిటేబుల్స్ మరియు ఆలివ్ ఆయిల్ కంటే ఫాస్ట్ ఫుడ్స్ కు, కమర్షియల్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవన్నీ కూడా డిప్రెషన్ కు దారితీస్తాయి. కాబట్టి కనీసం ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరి డిప్రెసివ్ డిస్ ఆడర్ ను తగ్గిస్తుంది.

మంచి రొమాంటిక్ మూడ్ ను పెంచే టాప్ ఫుడ్స్..!

డార్క్ చాక్లెట్: తలనొప్పి తగ్గాలని సాధారణంగా ఒక చాక్లెట్ తింటారు. ప్రత్యేకించి మహిళలు డార్క్ చాక్లెట్ తింటారు. డార్క్ చాక్లెట్ లో వున్న కోకో పౌడర్ రిలీఫ్ ఇస్తుంది. డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీలను కరిగిస్తుంది. శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలలను కరిగిపోయేలా చేస్తుంది. డార్క్ చాక్లెట్స్ లో కోక అధికంగా ఉండటం వల్ల కళ్ళ చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి అన్ స్వీటెడ్ డార్క్ చాక్లెట్ ను రెగ్యులర్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. మూడ్ ను కూడా హేపీగా మార్చేస్తాయని తాజాగా పోషకాహార నిపుణులు చెపుతున్నారు. కనుక మీ శరీరంలోని రసాయనాలను ఉత్తేజపరచాలంటే ఒక డార్క్ చాక్లెట్ తినండి.

English summary

Top 11 Foods that can Improve Your Moods | మంచి రొమాంటిక్ మూడ్ ను పెంచే టాప్ ఫుడ్స్..!

We all have guilty pleasures; foods that make us feel good for a moment—but very ba-aaaa-d after we’re done. And while it’s fine to have those occasionally, most of the time your goal should be to take in foods that are not only good for you, but also that keep you happier and more alert –in the short- and long-term. The key?
Story first published: Wednesday, February 13, 2013, 13:55 [IST]
Desktop Bottom Promotion