For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గరం...గరం ఛాయ్ తాగండి.. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి..

|

సాధారణంగా చాలా మంది నిద్రలేవగానే(బెడ్ కాఫీ లేదా టీ) కాఫీ, టీ త్రాగందే...ఆ రోజు వారికి మొదలకాదు. టీ అంటే అంత పిచ్చ ప్రేమికులు కూడా ఉంటారు. మరికొందరైతే కాలక్షేపానికో, తలనొప్పిగా ఉందనో స్నేహితులకు కంపెనీ ఇవ్వడానికో టీ తాగడం మామూలే. ఎవరూ తోడులేకున్నా ఒంటరిగానే రోజుకు ఐదారు లేదా అంతకుమించి ఎక్కువ కప్పుల టీ తాగేవారున్నారు. ఇన్నిసార్లు తాగకపోయినా రోజుకు రెండు మూడు సార్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. టీ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, అనేక ఉపయోగాలున్నాయని వారంటున్నారు.

ఇతర కార్బొనేటెడ్ పానియాలకంటే టీ ఆరోగ్యకరం. మీకు కావల్సిన రుచులలో , వివిధ రకాల ఫ్లేవర్స్ లో టీ తయారు చేసుకొని త్రాగవచ్చు . ఉదా: హెర్బల్ టీ, లెమన్ టీ, హనీ టీ, ఆరంజ్ టీ, యాపిల్, హనీ టీ, ఐస్డ్ టీ, అల్లం టీ ఇలా అనేక రకాల టీలను తయారుచేసుకోవచ్చు. టీలో పాలు, చక్కెరకు బదులుగా తేనె, నిమ్మకాయ రసం వేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. టీ త్రాగడం వల్ల కలిగే కొన్ని ఉత్తమ ఆరోగ్యప్రయోజనాలేంటో పరిశీలించి చూద్దామా...

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది: ఒక కప్ప టీ త్రాగడం వల్ల మీ శరీరం ఉత్తేజం పరుస్తుంది. ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అందుకు కారణం ఇందులో ఉండే కెఫిన్. అయితే కెఫిన్ కాఫీలో కంటే టీలో తక్కువ. అయితే కూడా ఇది మన శరీరం మీద సున్నిత ప్రభావాన్ని చూపెడుతుంది.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

ఎముకలను బలంగా ఉంచుతుంది: కాఫీ కాకుండా, టీ త్రాగడం వల్ల మీ బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. కాఫీలోని కెఫిన్ మీ ఎముకల్లోని క్యాల్షియం బయటకు పంపించేస్తుంది. దాంతో బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. అయితే కొన్ని పరిశోధన ప్రకారం చాలా సంవత్సరాల నుండి రెగ్యులర్ గా టీ త్రాగడం వల్ల వారికి ఎముకలు చాలా బలంగా ఉంటాయని కనుగొనబడింది.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: టీ త్రాగడం వల్ల స్ట్రోక్ కలిగించే ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. టీ త్రాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు సాగే గుణం కలిగి ఉంటుంది మరియు రక్త కణాల్లో క్రొవ్వు కణాలు లేకుండా చేస్తుంది. టీ త్రాగడం వల్ల గుండె మరియు రక్తనాళాల సమస్యల ప్రమాదాలను తగ్గిస్తుంది.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

క్యాన్సర్ నిరోధిస్తుంది: టీ, ముఖ్యంగా గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ ను నివారిస్తుందని కొన్ని పరిశోధనలు రుజువు చేశాయి.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది: టీ, లోని టానిన్లు మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది . దంత సమస్యలను నిరోధించుకోవాలంటే..జస్ట్ మీరు త్రాగే టీలో ఎక్కువగా పంచదార కలుపుకోకండి. మీరు తీసుకొనే టీలో ఒక్క స్పూన్ కంటే ఎక్కువ పంచదార లేకుండా చూసుకోవాలి. నోటి దుర్వాసనతో బాధపడేవారు రోజుకు రెండు, మూడుసార్లు హెర్బల్ టీ తాగడంవల్ల ఆ రుగ్మత నుంచి బయటపడగలుగుతారు.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

హైడ్రేషన్ : టీ, చాలా మందికి ఇష్టమైన పానీయం . అంతే కాదు టీ రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో నీరు(తేమ)సమతౌల్యానికి కొనసాగించడానికి సహాయపడుతుంది. మీకు కావల్సిన హైడ్రేషన్ ను అంధిస్తుంది.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

క్యాలరీలను జోడించదు: టీ వల్ల శరీరానికి ఎటువంటి క్యాలరీలను అందించదు. మీరు తీసుకొనే టీలో అధికంగా పాలు కానీ, పంచదార కానీ కలుపుకోకూడదు. దాంతో మీ శరీరానికి క్యాలరీలు అందించదు. అదే సమయంలో, మీకు కావల్సిన విటమిన్స్ మరియు మైక్రో ఎలిమెంట్స్ ను అందిస్తుంది.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

జీవక్రియలకు బూస్ట్ వంటింది: టీ కూడీ మీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీతీసుకోవడం వల్ల కేలరీలను(అధిక క్రొవ్వు) కరిగించడానికి సహాపడుతుంది. కాబట్టి మీరు తీసుకొనే గ్రీన్ టీలో తక్కువ పంచదార వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

వృద్ధాప్యం నిరోధిస్తుంది: ముందుగా చెప్పుకొన్నట్లు, టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది . ఇది శరీరంలోని ఆక్సీకరణ ప్రక్రియ నియంత్రణ మరియు ప్రారంభ వృద్ధాప్యం నిరోధించడానికి సహాయపడుతుంది.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

బరువు తగ్గిస్తుంది: స్థూలకాయులు, బరువు ఎక్కువ ఉన్నవారు పాలు, చక్కెర లేని బ్లాక్‌ టీ కాని, లెమన్‌ టీ కాని తాగడం వల్ల బరువు తగ్గుతారు. టీవల్ల శారీరక అందం కూడా ఇనుమడిస్తుంది. చర్మానికి, జుట్టుకుకూడా టీ రక్షణనిస్తుంది.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

జీర్ణాశయం : అన్నవాహిక సంబంధ వ్యాధులు, గ్యాస్టిక్ సమస్యలు, అండాశయ వ్యాధులు, చర్మవ్యాధులు, చర్మ క్యాన్సర్ లాంటి రుగ్మతలు టీ వల్ల తగ్గుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం, మెదడును చురుకుగా చేయడం లాంటి లక్షణాలుకూడా టీకి ఉన్నాయి.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

అలసటను తగ్గిస్తుంది: శారీరకంగా, మానసికంగా అలసిపోయినపుడు దాని ప్రభావం ముఖంపై ఉంటుంది. రెండు, మూడు గ్రీన్ టీ బ్యాగులను అర లీటరు నీటిలో మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లటి టీ ద్రవాన్ని ముఖంపై చల్లుకుంటే అలసట తగ్గుతుంది.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

అందానికి : మూడు కప్పుల నీటిలో రెండు టీ బ్యాగ్స్ వేసి మరిగించి చల్లారిన తర్వాత సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత ఆ ద్రవాన్ని కళ్ళకు, ముఖానికి, మెడకు రాసుకోవాలి. అయిదు పది నిముషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడగాలి. ఇలా వారం రోజులు చేస్తే ముఖంపై ఉన్న మడతలు, మచ్చలు పోతాయి.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

కేశాలకు : షాంపుతో స్నానం చేశాక టీ డికాక్షన్‌ను తలకు పట్టిస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. టీ డికాక్షన్‌లో వెనిగర్ కలిపి జట్టుకు రాస్తే కండిషనర్‌లా పనిచేస్తుంది.

గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

విరేచనాలు: విరేచనాలు అయినపుడు వచ్చే నీరసానికి, ఉదరానికి సంబంధించిన బాధలు ఒత్తిడి, ఆందోళన, జలుబు, తలనొప్పులను అల్లం టీ తగ్గిస్తుంది. అంతేకాక ఊపిరి పీల్చుకోవడం కష్టమైనపుడు, నోరు పిడక కట్టుకుపోయినపుడు ఒక స్పూన్ అల్లం ముద్దను ఒక కప్పు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.

English summary

Top 15 Health Benefits Of Tea | గరం...గరం ఛాయ్ తాగితే పొందవచ్చు 15 హెల్త్ బెనిఫిట్స్

One of the best benefits of drinking tea is that this beverage combines your favorite flavors with health benefits. Different teas offer people different flavors and health benefits. Let us take a look at some of the best benefits of drinking tea.
Desktop Bottom Promotion