For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెష్ క్యాబేజ్ లోని టాప్ 20 హెల్త్ బెనిఫిట్స్

|

క్యాబేజీ బ్రాసికా జాతికి సంబంధించినది. ఇందులో బ్రొకోలీ, కాలీఫ్లవర్ బ్రసల్ స్ప్రార్ట్ కూడా చేర్చబడింది . ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు.

క్యాబేజిలో వివి ధ రకాలున్నాయి. వాటిలో ముఖ్యంగా రెడ్ మరియు గ్రీన్ క్యాబేజీ . వీటిని అలాగే పచ్చిగా తినవచ్చు లేదా ఉడికించి తినవచ్చు. దీని రుచి మాత్రం కొద్దిగా తీపిగా ఉంటుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది. రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములొ కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది . రక్తములో చెక్కెర స్థాయిని అదుపు చేసేందుకు గ్లూకోజ్ టోలరెన్స్ (glucose tolarence) లో భాగమైన ' క్రోమియం ' ఈ లెట్యూస్ లో పుష్కలముగా ఉంటుంది . నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది . ఇంకా క్యాబేజీలో విటమిన్స్ , ఐరన్ మరియు పొటాషియం మరియు తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల క్యాబేజ్ ను ఇటు సౌత్ అటు నార్త్ రెండు ప్రదేశాలలోనూ దీని వినియోగం ఎక్కువ. మరి ఇన్ని పోషక విలువలున్న క్యాబేజ్ నుండి ప్రయోజనాలు తెలుసుకోండి...

క్లెన్సర్:

క్లెన్సర్:

బౌల్ క్లీనింగ్ కు క్యాబేజ్ మరియు క్యాబేజ్ రసం చాలా మంచిది.క్యాబేజ్ లో ఉండే క్లోరిన్ మరియు సల్ఫర్ వంటివి చాలా ఎఫెక్టివ్ మినిరల్స్ . ఇవి కడుపులో ఇన్ఫ్లమేషన్ మరియు దీర్ఘకాలి సమస్యలను మరియు కోలన్ సమస్యలను నివారిస్తుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

క్యాబేజ్ లో పుష్కలంగా నీరు ఉండటం వల్ల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బరువు తగ్గడానికిబాగా సహాయపడుతాయి. ఊబకాయ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా బరువు తగ్గించుకోవడానికి ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ క్యాబేజ్ జ్యూస్ లేదా సలాడ్ రూపంలో తీసుకోవడం మంచిది. క్యాబేజ్ లో ఉండే తార్ట్రోనిక్ యాసిడి అదనపు షుగర్ గా మార్పు చెందుతుంది మరియు మానవ శరీరంలోని ఫ్యాట్ ను కరిగించడంలో సహాయపడుతుంది. దాంతో బరువు తగ్గడానికి తేలికవుతుంది.

ప్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది:

ప్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది:

క్యాబేజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. క్యాబేజ్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . కాబట్టి, క్యాబేజ్ ఆరోగ్యంతో పాటు వృద్ధాప్య గుర్తులకు దారితీసే ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. అంటే క్యాబేజ్ వృద్ధాప్యంతో పోరాడుతుంది.

అల్సర్ కు చికిత్సవంటింది:

అల్సర్ కు చికిత్సవంటింది:

క్యాబేజ్ లో విటమిన్ సి మరియు విటమిన్ యు పుష్కలంగా ఉన్నాయి. ఈ వింటర్ వెజిటేబుల్ కడుపు అల్సర్ తగ్గించడంలో గొప్పగా సహాయపడతుంది. కడుపులో లేదా కడుపు పూతలను క్యాబేజీ వినియోగం ద్వారా నయం చేయబడుతాయి. క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్ లో యాంటీ అల్సర్ గుణాలు కలిగి ఉన్నాయి.

శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది:

శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది:

క్యాబేజ్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మరియు ఈ నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంను ఎల్లప్పుడు తేమగా ఉంచుంతుంది.

డిటాక్స్:

డిటాక్స్:

చాలా మంది క్యాబేజ్ ను వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి ఇష్టపడుతారు . క్యాబేజ్ రెగ్యులర్ గా తినడం వల్ల శరీరాన్ని శుభ్రం చేయడంతో పాటు మీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. కాబట్టి ఈ హెల్తీ వెజిటేబుల్ ను డిటాక్స్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదనీ ముఖ్యంగా క్యాన్సర్‌ను నిరోధించటంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా "పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్" ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ రావటం అరుదుగా సంభవిస్తుందనీ, అయితే క్యాబేజీతో దానికి చెక్ పెట్టవచ్చు.

ఎముకల బలానికి:

ఎముకల బలానికి:

క్యాబేజ్ లోని విటమిన్ కె మరియు ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి ఎముక బలానికి అద్భుతంగా సహాయపడుతుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

క్యాబేజిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల, శరీరంలో వ్యాధినిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని వ్యవస్థను బలోపేతంలో సహాయపడటమే కాదు ఫ్రీరాడికల్స్ ను నుండి సహాయపడతుంది.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

క్యాబేజ్ లోని బీటా కెరోటిన్ కంటెంట్ కళ్ళులోపల మచ్చల క్షీణత నివారణకు సహాయపడుతుంది మరియు కంటి శుక్లాలు రాకుండా దూరంగా ఉంచతుంది.

మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది:

మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది:

క్యాబేజ్ లో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉన్నందువల్లే సరైన జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. అందువల్లే ఇది మలబద్దకం నుండి ఉపశమనం అంధించడంలో సహాయపడుతుంది.

హై బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:

హై బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:

క్యాబేజ్ బెనిఫిట్ అనేకం ఉన్నాయి. ఈ వింటర్ వెజిటేబుల్ హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. వీటిలో పొటాషియం అధికంగా ఉండి సహాయపడుతుంది.

తలనొప్పిని నయం చేస్తుంది:

తలనొప్పిని నయం చేస్తుంది:

క్యాబేజ్ రసంలో ల్యాక్టిక్ ఉండి, ఇది డిస్ ఇన్ఫెక్ట్ గా పనిచేసి, తలనొప్పిని నయం చేస్తుంది.

చర్మ సంరక్షణకు:

చర్మ సంరక్షణకు:

క్యాబేజ్ చర్మంలోని ఫ్రీరాడికల్స్ ను నిరోధించి, శరీరం నుండి టాక్సిన్స్ ను తొలగించి చర్మాన్ని క్లియర్ గా ఉంచుతుంది. అంతే కాదు, చర్మానికి అనే హెల్త్ బెనిఫిట్స్ ను ప్రోత్సహిస్తుంది.

స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

క్యాబేజ్ లో అవసరం అయ్యే అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండి స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

అల్జీమర్స్ వ్యాధి సంభావ్యత తగ్గిస్తుంది:

అల్జీమర్స్ వ్యాధి సంభావ్యత తగ్గిస్తుంది:

తాజా పరిశోధన ప్రకారం క్యాబేజీలో ముఖ్యంగా రెడ్ క్యాబేజీలో అల్జీమర్స్ నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు కనుగొనబడింది. ముక్యంగా ఈ సమస్యను నివారించే విటమిన్ కె ను రెడ్ క్యాబేజిలో విస్తృతంగా కనుగొనబడింది.

పాలు బాగా పడుతాయి:

పాలు బాగా పడుతాయి:

పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి.

పొగతాగే వారికి :

పొగతాగే వారికి :

అదే విధంగా అతిగా పొగతాగే పొగరాయుళ్లను ఆ అలవాటునుంచి మాన్పించేందుకు నానా కష్టాలు పడేవారికి క్యాబేజీ సాయపడుతుంది. అయితే వారిని పూర్తిగా పొగతాగటం మాన్పించటం కాదుగానీ.. పొగ తాగినప్పుడు శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా క్యాబేజీ తినాల్సిందే.

జుట్టు పెరుగుదలకు:

జుట్టు పెరుగుదలకు:

ఇతర గ్రీన్ వెజిటేబుల్స్ లాగే, ఈ గ్రీన్ లీఫీ క్యాబేజ్ లో విటమిన్ ఎ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది . విటమిన్ ఎ ఒక యాంటీఆక్సిడెంట్ ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉడికించిన క్యాబేజ్ రసానికి తాజా నిమ్మరసం జోడించి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదల క్రమంగా పెరుగుతుంది. అలాగే ఉడికించిన క్యాబేజ్ మరియు నిమ్మరసంను బ్లెడ్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల అద్భుతమ ప్రయోజనం ఉంటుంది.

కండరాల నొప్పిని నివారిస్తుంది:

కండరాల నొప్పిని నివారిస్తుంది:

తాజా క్యాబేజ్ లోని ల్యాక్టిక్ యాసిడ్ సోర్ మజిల్స్ నుండి చాలా ఎఫెక్టివ్ గా ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Top 20 Health Benefits Of Fresh Cabbage


 Cabbage is a green winter vegetable that is making its presence felt in the market. A lot of supermarkets and vegetable markets are filled with the round green leafy vegetable. Cabbage is grown as an annual vegetable crop which is very much enjoyed during the winter season.
Story first published: Thursday, November 14, 2013, 13:09 [IST]
Desktop Bottom Promotion