For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉత్సాహంగా..ఉల్లాసంగా ఉంచే 20 సూత్రాలు..!

By Super
|

శారీరిక కార్యకలాపాలు మన జీవన శైలిలో వచ్చే అనేక అనారోగ్యాల నుండి దూరంగా ఉంచి, ఆయుష్షును పెంచుతాయని మనలో చాల మందికి తెలుసు మీకు వ్యాయామం చేయడానికి తీరిక లేకపోతే, ఇక్కడ తెల్పిన చిన్న చిన్న శారీరిక కార్యకలాపాలను ప్రయత్నించండి, వీటి వలన పెద్దగా సమయం వృధా కాకపోవడమే కాక, అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం నుండి కాపాడతాయి.

చురుకుగా ఉండటానికి ఒక సాధారణ మార్గం:

ఏదో ఒక ఆట ఆడండి

ఏదో ఒక ఆట ఆడండి

ఆడటం కదలకుండా కూర్చునే మీ జీవనశైలిని వదిలించుకొనే ఉత్తమ మార్గాలలో ఒకటి. స్నేహితులు, పక్క వాళ్ళతో కలసి బాడ్మింటన్, టెన్నిస్ లేదా ఏదో ఒక ఆటను ఆడండి. ఈ చర్య మీ శరీరంలో కొన్ని కాలరీలను తగ్గించుకోవడానికి ఉపయోగపడటమే కాక, ఒత్తిడిని తగ్గించి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది.

సెక్స్ కు యస్ చెప్పండి

సెక్స్ కు యస్ చెప్పండి

సెక్స్ మీకు ఆనందాన్ని ఇవ్వడమే కాక, మీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని మంచి మూడ్ లో ఉంచుతుంది. సెక్స్ లో పాల్గొనడం అనేది చురుకుగా ఉండటంతో బాటు ఒత్తిడిని తగ్గించేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు, శరీరంలో కొన్ని కాలరీలను తగ్గించి మీకు చక్కటి అనుభూతిని కల్గి౦చేందుకు మంచి మార్గం.

నడవడం

నడవడం

చురుకుగా ఉండటానికి మరొక మార్గం నడవడం. ఎంత దూరం నడవగలిగితే అంత దూరం నడవండి, ఎందుకంటే ఇది మిమ్మల్ని అనేక ఆరోగ్య ప్రయోజనాలతో సన్మానిస్తుంది.

సైకిల్ నడపండి

సైకిల్ నడపండి

మీ పాత సైకిల్ ను బయటకు తీసి మీ స్నేహితులతో షికారుకు వెళ్ళండి. దీని వలన ప్రకృతితో మీకు పరిచయం ఏర్పడటమే కాక, మీ కండరాలకు బలం, నునుపు కూడా కలగుతుంది.

మెట్లు ఎక్కండి

మెట్లు ఎక్కండి

మీరు త్వరగా ఆరోగ్యాన్ని పొందాలంటే, ఎలివేటర్ కోసం ఎదురు చూడకుండా మెట్లు ఎక్కండి. మెట్లను ఉపయోగించడం ఒక అలవాటుగా మార్చుకోండి. మీ శరీరానికి సత్తువ కల్గడానికి ఇది గొప్ప మార్గం.

డాన్స్ చేయడం

డాన్స్ చేయడం

డాన్స్ చేయడం కూడా కండరాలను ధృఢపరిచి, కొవ్వును తగ్గించుకోవడానికి మంచిది.

ప్రతి రోజు ఒంటిని సాగదీయండి

ప్రతి రోజు ఒంటిని సాగదీయండి

సాగదీయడం, ఎక్కువ చురుకుగా ఉండేందుకు మరొక మార్గం. వెన్నముక వంచడం వంటి అనేక సాగదీయడాలు లేదా ఒత్తిడిని తగ్గించే ఇతర శరీరపు సాగతీతలు రోజు అంతటికి మీ శరీరానికి శక్తిని అందిస్తాయి.

బకెట్ లో నీటితో స్నానం చేయండి

బకెట్ లో నీటితో స్నానం చేయండి

ఇది మీకు ఆశ్చర్యం కల్గించవచ్చు, కాని షవర్ కింద నిలబడటం కంటే బకెట్ ను వాడటం మీ కాలరీలను తగ్గిస్తుంది. అదే పనిగా కిందికి పైకి మగ్గును లేపడం మీ చేతులకు, నడుముకు మంచిది.

ఇంట్లోని పనులు చేయండి

ఇంట్లోని పనులు చేయండి

ఇంట్లో పని చేయడం కూడా చురుకుగా ఉండటానికి మరొక మార్గం. అందుకని చీపురు తీసుకొని ఇల్లు శుభ్రం చేయండి. మీ శరీరానికి సత్తువ కల్గేందుకు ఇది ఎంతో మంచిది.

కొంత తోటపని చేయండి

కొంత తోటపని చేయండి

మీకు ఆటలు ఇష్టం లేకపోతే తోటపని చేయండి. తోటపని వినోదాన్నిస్తుంది. లాగడం, దున్నడం వంటి తోటలో చేసే పనులు మీ కండరాలకు బలాన్నిస్తాయి.

మీ కుక్కను షికారుకు తీసుకొని వెళ్ళండి.

మీ కుక్కను షికారుకు తీసుకొని వెళ్ళండి.

ప్రతి రోజు మీ కుక్కను షికారుకు తీసుకొని వెళ్ళండి. ఈ మార్గం కూడా మంచి ఆరోగ్యం కోసం చక్కటి ఫలితాలను ఇస్తుంది.

ఆరోగ్యకరమైన వంటను వండండి.

ఆరోగ్యకరమైన వంటను వండండి.

మీ వంటమనిషికి బదులుగా ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన వంటను వండండి.

డాన్స్ తో కూడిన వ్యాయామం చేయండి

డాన్స్ తో కూడిన వ్యాయామం చేయండి

జిమ్ కు వెళ్ళడం ఇష్టం లేకపోతే, కొంత సృజనాత్మకతతో మీ కదలిక లేని జీవన విధానానికి స్వస్తి చెప్పండి. ఫిట్ నెస్ కు సంబంధించిన డివిడి ను కొనండి లేదా యు ట్యూబ్ లో ఆదేపనిగా వచ్చే డాన్స్ వీడియోను చూసి, అదేవిధంగా చేసి ఆరోగ్యంగా, చురుకుగా ఉండండి.

బట్టలను ఉతకండి

బట్టలను ఉతకండి

మీకు టైం ఉంటే వాషింగ్ మిషన్ బదులుగా కొన్ని బట్టలను మీరే ఉతకండి. మీ బట్టలను మీరే ఉతకడం అనేది శరీరంలో కొన్ని కాలరీలను తగ్గించుకోవడానికి ఎంతో మంచి చర్య.

పర్వతారోహణ చేయండి

పర్వతారోహణ చేయండి

విశ్రాంతిని పొంది కొంత వ్యాయామం కల్గించేందుకు పర్వతారోహణ ఒక మంచి మార్గం.

నడుస్తూ మాట్లాడండి

నడుస్తూ మాట్లాడండి

ఒక ఫోన్ కాల్ లేదా స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడటం అయితే నడుస్తూ మాట్లాడటాన్ని ప్రయత్నించండి, అందువలన కొంత వ్యాయామం కల్గుతుంది.

మీ భాగస్వామికి మసాజ్ చేయండి.

మీ భాగస్వామికి మసాజ్ చేయండి.

మీ భాగస్వామిని సంతోష పెట్టడానికి అతనికి పూర్తి శరీరం మొత్తం మసాజ్ చేయండి. మీ భాగస్వామి విశ్రాంతిని పొందటమే కాక, మీ చేతులకు కూడా సత్తువ వస్తుంది.

నీటిని ఎక్కువగా తాగండి

నీటిని ఎక్కువగా తాగండి

నీరు ఎక్కువగా తాగడం వలన మీ మూత్రాశయం చురుకుగా ఉంటుంది. తరచూ మూత్రశాలకు వెళ్ళడం వలన కూడా సోఫా నుండి మీకు కొంత కదలిక కల్గుతుంది.

కారును కొంత దూరంగా పార్కు చేయండి

కారును కొంత దూరంగా పార్కు చేయండి

మీ గమ్యస్థానానికి చేరడం రవాణా సౌకర్యం లేకుండా అసాధ్యమైతే, మీ గమ్యస్థానానికి కొంత దూరంలో కారును పార్కు చేసి నడవండి.

:ఫిట్ నెస్ క్లాసుకు వెళ్ళండి

:ఫిట్ నెస్ క్లాసుకు వెళ్ళండి

శరీరంతో బాటు మనస్సుకు కూడా ప్రయోజనాన్ని కల్గించేవిధంగా ఏదైనా కొత్త విషయాన్ని ప్రయత్నించండి. ఖాళీగా ఉన్నప్పుడు, జుంబా, యోగా లేదా ఏదైనా ఇతర డాన్స్ క్లాసులకు వెళ్ళండి.

కిరాణా షాపుకు వెళ్ళండి

కిరాణా షాపుకు వెళ్ళండి

హోం డెలివరీ కోసం ఎదురు చూడకుండా మార్కెట్ కు వెళ్లి మీకు కావలసిన వస్తువులను మీరే కొనుగోలు చేయండి. దీనివలన మీరు కొంత దూరం నడుస్తారు. శరీరానికి కొంత వ్యాయామం కల్గుతుంది.

English summary

Top 20 simple ways to be active

If you are finding it difficult to make time to exercise, then try these simple physical activities, which are not time-consuming and can minimise the risk of several life-threatening diseases.
Desktop Bottom Promotion