For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తిన్నది జీర్ణం కాలేదా..మలబద్దక సమస్యా?ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చ

మీరు అస్తమానం త్రేన్పులతో, గ్యాస్ లేదా అపానవాయువు, కడుపు ఉబ్బరం మరియు ఇతర జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా!ఈ సమస్యలలో చాలాభాగం రోగనిర్ధారణ చేయతగినవి కావు ఎందుకంటే ఇవి అంత తీవ్రమైనవి కావు, కాని ఇవి దీర్ఘకాలంలో కనిపిస్

By Staff
|

మీరు అస్తమానం త్రేన్పులతో, గ్యాస్ లేదా అపానవాయువు, కడుపు ఉబ్బరం మరియు ఇతర జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా!

ఈ సమస్యలలో చాలాభాగం రోగనిర్ధారణ చేయతగినవి కావు ఎందుకంటే ఇవి అంత తీవ్రమైనవి కావు, కాని ఇవి దీర్ఘకాలంలో కనిపిస్తే ముందుముందు మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటివలన అల్సర్ సమస్యలు రావొచ్చు మరియు కొన్నిసార్లు మొత్తం స్టమక్ దెబ్బ తినవొచ్చు.

మీ జీవితంలో ఈ ప్రతికూల ప్రభావాలను దూరం చేయడానికి, మంచి జీర్ణక్రియ కోసం ఈ సాధారణ చిట్కాలు అనుసరించండి:

నులివెచ్చని నీరు త్రాగండి

మీకు ఆహారం జీర్ణం కాకపొతే, అప్పుడు నులివెచ్చని నీరు త్రాగండి. ఉదయం వేళలో వెచ్చని నీరు త్రాగుతే, కనీసం భోజనానికి 30 నిముషాల ముందు త్రాగుతే, మీ మీ జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది మరియు మీ కడుపులో జఠర రసము యొక్క ఉత్పత్తిని పెంచుతుంది.

క్రమపద్ధతిలో తినండి

భోజనాల సమయంలో, అజీర్ణం నివారించేందుకు ఆహార పిరమిడ్ ఏర్పాటు చేసుకోండి. ముందు సులభంగా జీర్ణమయ్యే పదార్థాలతో భోజనం ప్రారంభించి, నెమ్మదిగా క్లిష్టమైన ఆహారపదార్థాలతో ముందుకెళ్ళండి. మొట్టమొదట భోజనాన్ని పండ్లు లేదా రసాలతో ప్రారంభించి, మాంసం లేదా గ్రుడ్లు మొదలైనవాటితో ముగించండి. ఈ విధంగా చేస్తే అమితఆహారాన్ని మరియు జీర్నసమస్యలను నివారించవొచ్చు.

ఎప్పుడూ కూర్చుని భోజనం చేయండి

మీరు భోజనం తీసుకునే విధానం కూడా మీ జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది. అందువలన, మీరు విశ్రాంతిగా కూర్చుని భోజనం చేయండి. మనం కూర్చుని భోజనం తీసుకున్నప్పుడు మన కడుపు ఒక రిలాక్స్డ్ భంగిమను పొంది, జీర్ణక్రియ విస్తరించేందుకు సహాయపడుతుంది.

ఎక్కువ నీరు త్రాగండి

ఇది జీర్ణ సమస్యల చికిత్సకు మరొక ఉత్తమ పరిష్కారం. రోజుకు 8-10 గ్లాసుల నీరు తీసుకోవటం వలన మీకు మలం విసర్జించటం సులభమవుతుంది మరియు జీర్ణ కోశం కడిగినట్లవుతుంది.

నిమ్మరసం కొద్దిగా తీసుకోండి

మీకు ఉదయాన్నే వెచ్చని నీరు త్రాగటం ఇష్టం లేదు, అప్పుడు ఒక గ్లాసు నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని త్రాగండి. ప్రతిరోజూ ఇలా చేయతంవలన మీ జీర్ణకోశం కదిగినట్లయి, వ్యర్థపదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి మరియు ఎక్కువగా ఉన్న ఆసిడ్ కూడా తొలగింపబడుతుంది.

కొద్ది మసాజ్ చేయండి

మీ జీర్ణశక్తి పెరగాలంటే, తీరికగా ఉన్నప్పుడు మీకు మీరు మసాజ్ చేసుకోండి లేదా స్టమక్ వ్యాయామం చేయండి. ఈ రోజువారీ కార్యక్రమం దీర్ఘకాలంలో మీ జీర్ణక్రియ మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. కొన్ని సుగంధ నూనెలతో మీ కడుపు మర్దనచేసుకోవటానికి ప్రయత్నించండి.

గ్రైండ్ మరియు నమలు,ఇది మీ మంత్రం అయి ఉండాలి

మీరు ఆహారం చిన్నచిన్న ముద్దలుగా తీసుకొని, బాగా నమిలి నిదానంగా మరియు స్థిరంగా తీసుకోవాలి. ఈ టెక్నిక్ మీ నోటిలో కార్బోహైడ్రేట్ జీర్ణం అవటానికి సహాయపడుతుంది మరియు ఏమేలేస్ ఉత్పత్తికి సహాయపడుతుంది - సరైన జీర్ణక్రియ పెంచే జీర్ణ ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది.

ఫైబర్ తో స్నేహం చేయండి

చెర్రీలు, ద్రాక్ష, గంట మిరియాలు, తృణధాన్యాలు మరియు గింజలు వంటి ఫైబర్ రిచ్ ఆహారాలతో మీరు తినే ప్లేట్ ను నింపండి. ఈ ఆహారాలు తీసుకోవడం వలన మీ జీర్ణక్రియ పెరుగుతుంది మరియు వీటిని క్రమం తప్పకుండ తీసుకోండి.

కొవ్వు పదార్ధాలు తీసుకోవటం మానుకోండి

కొవ్వు పదార్ధాలు జీర్ణం అవటానికి చాలా సమయం పడుతుంది, అందువలన ఈ పదార్థాలను తీసుకోవటం వలన మలబద్ధకం మరియు ఇతర జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. వీటిని తీసుకోవటం పూర్తిగా మానవొద్దు, ఈ కొవ్వు పదార్థాలు మీ శరీరం యొక్క సరైన కార్యాచరణకు అవసరం. ఏదిఏమైనా నియంత్రణ అనేది తప్పకూడదు. వీటిని ఇతర ఆరోగ్యకరమైన ఆహారపదార్తాలతో తీసుకోవటం మీ కడుపుకు మంచిది.

విటమిన్ 'C' ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి

బ్రోకలీ, టొమాటోలు, కివి పండ్లు మరియు స్ట్రాబెర్రీస్ వంటి విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోండి. మీ మలబద్ధకం పోవాలంటే రంగురంగుల పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి.

మీ ఆహారంలో మసాలా దినుసులను జోడించండి

అల్లం, నల్ల మిరియాలు, సైంధవ లవణం లేదా కొత్తిమీర వంటి పలు సుగంధ ద్రవ్యాలను జోడించడం ద్వారా మీ ఆహారం రుచిగా ఉంటుంది. ఇవి మీకు రుచిని ఒక్కటే ఇవ్వవు, మీ జీర్ణక్రియకు కూడా తోడ్పడతాయి.

భోజన సమయం పాటించండి

మీకు జీర్ణక్రియ సరిగా ఉండాలంటే, మీరు ప్రతిరోజూ సమయం తప్పకుండా భోజనం చేయండి. మీరు సమయసంయమనం పాటించటం వలన మీకు జీర్ణశక్తి పెరుగుతుంది.

ఆరోగ్యకరమైన బరువును పాటించండి

ఊబకాయం లేదా అధిక బరువు కూడా గుండెమంట మరియు వాయువు జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అందువలన, మీ వైద్యుడి చేత పరీక్షలు జరిపించుకోండి మరియు ఆరోగ్యకరమైన బరువును కొనసాగించండి.

తేలికపాటి మాంసాహారాన్ని ఎంచుకోండి

మీరు మాంసాహార ప్రియులైతే, అప్పుడు మాంసం కొవ్వు కట్స్ నుండి దూరంగా ఉండండి ఎందుకంటే అవి అంత శుభంగా జీర్ణం కావు. మీరు మాంసాహారం ఇష్టపడుతున్నట్లయితే అప్పుడు సన్నని కట్స్ ఉన్న మాంసాన్ని ఎన్నుకోండి మరియు స్కిన్లేస్స్ కోడి మాంసాన్ని ఎంచుకోండి.

లూ తరచూ దర్శించండి

మీకు టాయిలెట్ కు వెళ్లవలసిన అవసరం ఉంటే, తప్పనిసరిగా అదే సమయంలో వెళ్ళండి. మలమూత్రాలను విసర్జించటంలో ఆలస్యం చేయటం వలన మీ రెక్టం మీద ఒత్తిడి ఏర్పడి, విసర్జించటం కష్టమవుతుంది. అందువలన ప్రకృతి మిమ్మలిని పిలిచినపుడల్లా, వెళ్ళండి.

వ్యాయామం క్రమం తప్పకుండ చేయండి

ప్రతిరోజూ వ్యాయామసాధన చేయటం జీర్ణం కోసం చాలా మంచిది. రోజువారీ వ్యాయామం మీ జీవక్రియ ప్రేరేపించటంలో సహాయపడుతుంది మరియు మీ రక్తం సరఫరాను మెరుగుపరుస్తుంది.

మీరు తీసుకునే ఆహార పరిమితిని గమనించండి

కావలిసినంత ఆహారంకన్నా ఎక్కువగా తీసుకోవటం అజీర్ణానికి దారితీస్తుంది. అందువలన, ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకుండా పరిమితిని పాటించండి.

ఒత్తిడిని తగ్గించుకోండి

మీ స్థిరమైన జీర్ణ సమస్యలకు ఒత్తిడి కూడా కారణం అవవొచ్చు. మీయొక్క జీర్ణకోశం మీద ఒత్తిడి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి, మీరు యోగా లేదా శ్వాస వ్యాయామం చేసి ఒత్తిడిని నియంత్రించండి.

ప్రోబయోటిక్స్ జోడించండి

ప్రతిరోజూ కొవ్వు తక్కువగా ఉన్న పెరుగును ఒక చిన్న గిన్నె తినండి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉన్నాయి-ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తుంది, లాక్టోజ్ విచ్ఛిన్నం చేస్తుంది, చికాకుపెట్టే పేగు వ్యాధిని నయం చేస్తుంది మరియు సరైన పోషక శోషణను పెంచుతుంది.

అర్థరాత్రి భోజనం మానండి

మన జీర్ణవ్యవస్థ సాయంకాల వేళల్లో నెమ్మదిగా ఉంటుంది. అందువలన అర్థరాత్రి భోజనం తీసుకోవటం మానేయండి, ఇందువలన మన కడుపులో తగినంత జీర్నరసాలు ఊరి ఆహారం సరిగా జీర్ణమవుతుంది.

English summary

Top 20 tips for good digestion

Are you troubled with constant belch, gas or flatulence, stomach bloating and all other digestive problems?
Desktop Bottom Promotion