For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరీసన్నగా ఉంటే, మీబరువును పెంచే టాప్ 25 ఫుడ్స్!

By Super
|

ప్రపంచంలో ఎక్కువ మంది లావుగా ఉండి, అదనం గా ఉన్న బరువును ఎలా తగ్గించు కోవాలో అర్ధం కాక తలలు బాదుకుంటుంటే అందుకు భిన్నంగా మేము లావు కాలేక పోతున్నాము అని బావురు మనే వారికి కూడా కొదవ లేదు . సన్నగా ఉన్నాము అనుకొనేవారు ముందుగా అసలు తాము సన్నగా ఉన్నామా? లేదా? ఉంటే ఎంత సన్నగా ఉన్నారు? అన్న సంగతి తెలుసుకోవాలి.

మీరు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఆ సంగతి 'ఒంటి కట్టుబడి తీరు' ను (బాడి మాసు ఇండెక్సు లేదా బి.ఎం.ఐ) అంచనా వేయటం ద్వారా కనుక్కోవచ్చును. దీన్ని తెలుసుకోవటానికి ముందుగా మీరు ఎన్ని కేజీలు బరువు ఉన్నారో చూసుకోండి. తరువాత మీ ఎత్తును మీటర్లలో కొలవండి. మీటర్లలో ఉన్న ఎత్తు విలువని అదే విలువతో పెంచి (స్కొయర్) ఆ విలువ ఎంతో కనుక్కోవాలి. ఇపుడు కేజీలలో ఉన్న మీ బరువును ఎత్తుకు కనుగొన్న స్కొయరు విలువతో భాగిస్తే వచ్చే విలువే మీ ఒంటి కట్టుబడి తీరు లేదా బి.ఎం.ఐ.

తినే కేలరీలు (తిండి) ఖర్చు పెట్టే కేలరీలు (పని) సమానం అయినప్పుడు బరువులో మార్పు ఉండదు. తినే కాలరీలకన్నా ఖర్చుపెట్టే కాలరీలు ఎక్కువ అయితే బరువు తగ్గుతారు. ఖర్చుపెట్టే కేలరీల కన్నా ఎక్కువ తింటే లావు అవుతారు. జీరో సైజ్ రోజులు మారుతున్నాయి కనుక, మనం శరీరాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలన్నదాని మీద ధ్యాస ఉంచాలి. కొత్త వారికి కూడా ఈ జాబితా 30 సహజ ఆహారాలు ఉపయోగించి బరువు ఎలా పెరగాలో తెలియచేస్తుంది.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

సాల్మన్:

రోజుకు రెండు సాల్మన్ చేపలు తింటుంటే మాంసకృత్తులు సరిగ్గా వంట పట్టి క్రమంగా బరువు పెరుగుతారు. అత్యవసర తైలాలు శారీరిక తరుగుదల నుంచి కాపాడి కొవ్వు పదార్ధాలు వంట పట్టేలా చేస్తాయి.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

తున ఫిష్:

ట్యూనా చేపలో వుండే అత్యవసర తైలాలు చాలా ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు కలిగి వుంటాయి, అవి బరువు పెరగడానికేకాక ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉపయోగపడతాయి. లంచ్ కి ట్యూనా సలాడ్ నిత్యం తీసుకుంటే మీకు కావాల్సిన అదనపు కిలోలు పెరగగలరు.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

చిన్నరొయ్యలు:

మీకు సముద్రపుటాహారం ఇష్టమైతే కనీసం రోజుకు రెండు మోతాదుల చిన్న రొయ్యలు తినండి. ఈ చిన్న రొయ్యలలో వున్న పుష్కలమైన పోషకాలు, అత్యవసరమైన ఆమ్ల౦ మీ శరీరాన్ని ఆరోగ్యకరమైన కాలరీలతో నింపి మీరు త్వరగా బరువు పెరిగేలా చేస్తుంది.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

కోడిరొమ్ము(చికెన్ బ్రెస్ట్):

కొన్ని కోడిరోమ్ముల(చికెన్ బ్రస్ట్)ను గ్రిల్ చేసి దాని పైన మయోన్నేస్ వేసి లంచ్ లో తినండి. ఇది రుచిగా ఉండడమే కాకుండా మీ శరీరానికి అదనపు బరువును ఇస్తుంది.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

సన్నగా తురిమిన మాంసం :

సాండ్ విచ్ లలో, ఎంట్రీలలో కొంచెం మాంసం తురుము వాడితే మీరు త్వరగా బరువు పెరుగుతారు, ఎందుకంటే దాంట్లో అత్యధిక౦గా నిల్వ వుండే లక్షణం, తేలిగ్గా కొవ్వు అరిగే లక్షణం వుంటాయి.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

కోడిగుడ్లు :

ఆహరంలో మాంసకృత్తులు అధికంగా దొరికే వనరు, అత్యధిక అమినో ఆమ్లాలు వుండే ఆహరం అయిన కోడిగుడ్లు, బరువు పెరగాలంటే తప్పని సరిగా తినాల్సిందే. గుడ్డు సొనల్లో మంచి కొలెస్టరాల్ చాలా ఎక్కువగా వుంటుంది, కాలరీలు పుష్కలంగా వుంటాయి. రోజుకు రెండు గుడ్లు తింటే త్వరగా బరువు పెరుగుతారు.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

కాటేజ్ వెన్న :

కాటేజ్ వెన్నలో పూర్తిగా పాల మీగడ వుండి, శాకాహారుల కోసం తేలిగ్గా కరిగిపోయే ఆహారపు మాంసకృత్తులు వుంటాయి. ఇందులోనివే ప్రోటీన్లు, కేసీన్ పరిమాణం మీ శరీరానికి అధిక కాలరీలు అందించి మీరు త్వరగా బరువు పెరిగేలా చేస్తాయి.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

ఎర్రమాంసం(రెడ్ మీట్):

ఎర్ర మామాసం కొద్ది మోతాదులో మీ భోజనంలో కలుపుకుంటే మీకు ఆహార మాంసకృత్తులు మరింత మెరుగ్గా వంట పడతాయి. వీటిని చాలా రకాలుగా వండవచ్చు, సాస్ లలో, డ్రెస్సింగ్ లలో కూడా వాడి ఆరోగ్యకరమైన భోజనం తయారుచేయవచ్చు. ఎర్ర మాంసం తింటే కడుపు చాలా సేపు నిండుగా ఉండడమే కాక బరువు పెరగడానికి కూడా ఉపయోగ పడుతుంది.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

ఓట్ మీల్ :

ఒక గిన్నెడు ఓట్ మీల్ సరైన ఉదయం హెల్తీ అల్పాహారం. పీచు పదార్ధ౦ ఎక్కువగా వుండడం వలన, ఇది శరీరానికి కావలసిన అత్యవసర పోషకాలను సహజసిద్ధంగా అందిస్తుంది. దీని పైన మీగడ, గింజ ధాన్యాలు, అరటిపళ్ళ ముక్కలు వేసి అందించండి, ఆరోగ్యకరమైన జీవనానికి వంటకం సిద్ధం.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

ముడి బియ్యం :

ఆరోగ్యకరమైన పరిమాణంలో పీచు పదార్ధం కలిగిన ముడి బియ్యం ఆహారపు పిండి పదార్ధాలకు మంచి వనరు. నిత్యం ముడిబియ్యం వాడితే పిండి పదార్ధాల నిల్వలు పెరిగి మీరు మరింత వేగంగా బరువు పెరుగుతారు.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

పాస్తా :

ఒక చిన్న గిన్నెడు మీగడ కలిసిన పాస్తా చాలా సౌకర్యవంతమైన ఆహారం. ఇది కడుపు నిండుగా అనిపించడమే కాకుండా అధిక పిండిపదార్ధాల పరిమాణం వల్ల పోషకాలు త్వరగా శరీరంలో కలిసి బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

గోధుమ రొట్టె:

బాగా కాల్చిన గోధుమ రొట్టేలో 13 కాలరీల శక్తి ఉంటు౦ది. దాని పైన మీకిష్టమైన జామ్ లేక వెన్న లేదా మయోన్నేస్ రాయండి, రుచిగా వుండే కడుపునిండే ఆహారం సిద్ధం. మెల్లిగా అరగడం వల్ల గోధుమ రొట్టె త్వరగా బరువు పెరిగేలా చేస్తుంది.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

బీన్స్ :

జంతువులలో వుండే మాంసకృత్తుల లాభాలు పొందాలంటే శాకాహారులకు బీన్స్ మంచి ప్రత్యామ్నాయం. సాస్ లలో వండితే ఒక గిన్నెడు బీన్స్ లో300 కాలరీలదాకా అందుతాయి. దాంతో పాటు కొంచెం బ్రౌన్ బ్రెడ్ కూడా కలిపితే రుచిగా వుండే భోజనమేకాక పోషకాలతో కూడి బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

బంగాళా దుంపలు :

బంగాళా దు౦పల్లాంటి దుంప కూరలలో పిండి పదార్ధాలు, చక్కర సముదాయాలు పుష్కలంగా వుంటాయి. ఎక్కువగా తింటే వాటి వల్ల కొవ్వు పేరుకుపోతుంది. సలాడ్, సాండ్ విచ్, లేదా ఇతర ఆహారాలలో చెప్పుకోదగ్గ పరిమాణంలో కాల్చిన లేదా గ్రిల్ చేసిన బంగాళాదుంపలు వాడితే బరువు త్వరగా పెరుగుతారు.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

కంద :

ఆహారపు పిండి పదార్ధాలు పుష్కలంగా వుండే మరో వనరు, కందగడ్డల్లో ఆరోగ్యకరమైన 150 కాలరీల శక్తి వుంటుంది. మంచి పదార్ధాలతో వండితే కండలు నిత్యం వాడుతుంటే చెప్పుకోదగ్గ రీతిలో బరువు పెరగవచ్చు.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

అవోకాడోలు :

వెన్న పండుగా పిలువబడే వీటిలో వుండే పుష్కలమైన మోనో-అన్ సాచురేటేడ్ కొవ్వు ఆమ్లాల పరిమాణం సూప్ లు, సలాడ్ లు, డిప్ లకు మంచి పదార్ధం. ఇవి శరీరాన్ని ఆరోగ్యకరమైన పోషకాలను, అత్యవసరమైన కొవ్వులను అందించి మీరు ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి సాయం చేస్తుంది.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

సహజ పీనట్ వెన్న :

మోనో-అన్ సాచురేటేడ్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా వున్న సహజ పీనట్ వెన్న అన్ని శరీర ధర్మాలు, ఆరోగ్య౦ బాగుండేలా చూసే చక్కటి పదార్ధం. టోస్ట్ ల మీద, బిస్కట్ల మీద వీటిని బాగా వాడితే బరువు పెరగవచ్చు.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

బాదం వెన్న :

పప్పు దినుసుల మా౦స కృత్తులకు, అత్యవసర కొవ్వు అమ్లాలకు ఆరోగ్యకరమైన వనరు అయిన ఈ బాదం వెన్నను సలాడ్, టోస్ట్, డిస్సర్ట్ ల మీద చక్కగా వాడుకోవచ్చు. నిత్యం వాడుతుంటే మంచి చర్మ సౌందర్యం, కేశ వృద్ది తో పాటు బరువు కూడా పెరగవచ్చు.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

ఆలివ్ ఆయిల్ :

సలాడ్ లలో ఒక చుక్క ఆలివ్ ఆయిల్ వేస్తె అది చాలా ఆరోగ్యకరమైన డ్రెస్సింగ్. ఇందులో అత్యవసర కాలరీలు ఉండడమేకాక, లినోలిక్ ఆమ్లం కూడా పుష్కలంగా వుంటుంది. ఆలివ్ ఆయిల్ కు మారితే ఆరోగ్యకరమైన బరువు పెరుగుదలకే కాక గుండె జబ్బుల అవకాశాలను తగ్గిస్తుంది.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

బాదం పప్పు :

బాదం పప్పులు నాడీ వ్యవస్థ అభివృద్ధికి మంచి ఆహారం, అంతే కాక బరువు పెరగడానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా కూడా వాడవచ్చు. రోజూ ఒక గుప్పెడు బాదం పప్పులు తింటుంటే శరీర ధర్మాలు సజావుగా ఉండడమే కాక నరాల పుష్టిగా కూడా ఉంటుంది

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

అవిశ గింజలు :

అవిశ గింజల్లో అధిక పరిమాణాల్లో అత్యవసర మోనో-అన్ సాచురేటేడ్ కొవ్వులు వుంటాయి, ఇవి శరీర౦ ఆరోగ్యంగా ఉంచడానికే కాక, శరీర ధర్మాలు నియంత్రించడానికి పనికి వస్తాయి. వీటిని చెప్పుకోదగ్గ పరిమాణంలో తీసుకుంటుంటే, ఆరోగ్యం గురించి రాజీ లేకుండా బరువు పెరగడానికి పనికి వస్తాయి.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

జీడి పప్పు :

మంచి శరీరాకృతి కావాలంటే ఒక గుప్పెడు జీడిపప్పు తినండి. వీటిలో వుండే అత్యవసర తైలాలు బరువు పెరగడానికేకాక, కణాల మధ్య పొరలను తడిగా ఉంచడానికి, దాని వల్ల చర్మం మృదువుగా, జుట్టు వత్తుగా ఉండడానికి పనికి వస్తుంది.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

అరటిపళ్ళు :

త్వరగా బరువు పెరగడానికి మంచి పళ్ళ తంత్రం ఏమిటంటే రోజూ రెండు అరటి పళ్ళను గుటుక్కుమనిపించడమే. అరటిపళ్ళు సరళ, సంక్లిష్ట పళ్ళ చక్కరల మిశ్రమంగా ఉండడమే కాక కరిగిపోయే పిండి పదార్ధాలు పుష్కలంగా కలిగి వుంటాయి. వాటి వల్ల తక్షణ శక్తి రావడమే కాక ఆరోగ్యకరంగా తింటే శరీరం బరువు కూడా పెరుగుతుంది.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

కొబ్బరి పాలు :

కొబ్బరి పాలల్లో ఆహారపు తైలాలు పుష్కలంగా వుంటాయి, వీటి వల్ల వంటలకు మంచి రుచి కూడా వస్తుంది. కొబ్బరి పాలతో వండి, నిత్యం వాడితే కాలరీల పరిమాణం పెరిగి సరైన బరువు పెరుగుదలకు తోడ్పడుతుంది.

బరువు పెరగడానికి 25 అత్యుత్తమ ఆహారాలు !!

కిస్మిస్ పళ్ళు :

ఒక కిస్మిస్ పండులో 99 కాలరీలు ఉంటాయంటారు. అదే ఒక గుప్పెడు తింటే మీ శరీరానికి ఆరోగ్యకరమైన కాలరీలు అందించడమే కాక పీచు పదార్ధాల నిల్వలను పూరిస్తుంది. అవి శరీరంలోని కొవ్వును కరిగించి దాన్ని ఆరోగ్యకరమైన కాలరీలతో నింపుతుంది, అందువల్ల మీరు వేగంగా బరువు పెరుగుతారు. డ్రై ఫ్రూట్ లతో చిరుతిళ్ళు తింటే ఆరోగ్యకరంగా బరువు పెరగవచ్చు.

English summary

Top 25 Foods to Gain Weight

With the era of size zero behind us, one needs to concentrate on how to maintain a healthy physique. This list shall guide the uninitiated on how to gain weight, using the following 30 natural food items.
Desktop Bottom Promotion