For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న... పెద్ద అందరిలో ఎముకల బలాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్స్

|

సాధారణంగా కొంతమంది పిల్లలు, పెద్దల్లో ఎముకలు అంతగా పటిష్టంగా ఉండవు. మన శరీరానికి ఆధారం ఎముకలు. అలాంటి ఎముకల్లో సమస్యలుంటే మాత్రం ఆరోగ్యానికి చాలా హాని జరగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. ఆరోగ్యంగా ఉన్న ఎముకలు శరీర ధారుఢ్యాన్ని పెంచుతాయి. ఇవి శరీరాన్ని గాయాల నుంచి రక్షించడమే కాకుండా, కదలికలకు ఎంతైనా ఉపయోగపడతాయి. ఎముకలు మన శరీర ఆకృతికి తోడ్పడతాయి. కీళ్ళు కదలికలకి తోడ్పడతాయి. ఈ రెండీంట్లో దేనికి అనారోగ్యం వచ్చినా అసౌకర్యంతో పాటు నొప్పి తీవ్రంగా ఉంటుంటి. గట్టి ఎముకలు కీళ్ళ సరైన కదలికలకి అసౌకర్యంతో పాటు నొప్పి తీవ్రంగా ఉంటుంటి. అంతే కాకుండాఎముకలలలో కాల్షియం వంటి ముఖ్యమైన ధాతువులు నిలవ వుంటాయి. ఈ ధాతువులు శరీరంలోని ఎన్నో అవయవాల పనితీరులో ఆధారాన్నిస్తాయి.

ఎముకలు సజీవంగా ఉండడమే కాకుండా నిరంతరం మారిపోతూ వుంటాయి. పాత ఎముకలు క్షీణించి పోతూ క్రొత్త ఎముకలు ఏర్పడుతూ వుంటాయి. యుక్త వయస్సు వారిలో ప్రతి 7 నుంచి 10 సంవత్సర కాలంలో అస్థి పంజరం మొత్తంగా మార్పిడి జరుగుతూ వుంటుంది. చిన్న తనం నుంచే యౌవ్వన దశ వరకూ మంచి పౌష్టిక ఆహారం, సరియైన వ్యాయామం చేయడం మూలంగా తదుపరి జీవితకాలంలో ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా వుండి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వుంటాయి. ఆరోగ్యకరమైన ఆహారంతోనే కీళ్ళు. ఎముకల నిర్మాణం ఉంటుంటి. ఎముకలు పెడుసవటాన్ని ఆస్టి యోపోరోసిస్‌ అంటారు. ఆస్థి తి రాకుండా ఎముకల్లో కాల్షి యం, విటమిన్‌ - డి సంవృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, ప్రొటీన్స్‌ సమంగావుండే ఆహారాన్ని తీసుకోవడం అవసరం.

ఎముకలు దృఢత్వాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్స్.. !

పాలు: ఎముకలకు విటమిన్ డి క్యాల్షియం అందాలి: ఎముకల ఆరోగ్యం కోసం గ్లాసుడు పాలు రోజూ తీసుకుంటే తగిన క్యాల్షియం లభిస్తుంది. అలాగే తాజా పండ్ల రసాలను తీసుకోవడం ద్వారా విటమిన్ 'డి' లభిస్తుంది.

ఎముకలు దృఢత్వాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్స్.. !

నట్స్ అండ్ సీడ్స్: పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాలు, నట్స్ తీసుకుంటే ఎముకలకు కావలసిన శక్తి లభిస్తుంది. ఉదాహరణకు ఒక బాదంపప్పులో 75మి.గ్రాల క్యాల్షియం ఉంటుంది. అలాగే నువ్వుల్లో 37 మి.గ్రాముల క్యాల్షియం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎముకలు దృఢత్వాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్స్.. !

గ్రీన్ టీ: గ్రీన్‌ టీలో ఉండే ఒక గ్రూపు రసాయనాలు ఎముకల నిర్మాణాన్ని ఉత్తేజితం చేస్తాయి. దీంతో ఎముకలు విరగడం నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆస్టియోపోరోసిస్‌ రావడాన్ని, చికిత్సను గ్రీన్‌టీ నివారిస్తుంది. అంతేకాక ఇతర ఎముకల సంబంధ వ్యాధులను అరికట్టే వీలుంది.

ఎముకలు దృఢత్వాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్స్.. !

తృణ ధాన్యాలు: జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్నలలో పిండి పదార్థాలు, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పదిలపరుస్తాయి. ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తాయి.

ఎముకలు దృఢత్వాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్స్.. !

విటమిన్-కె: కాలిఫ్లవర్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ 'కె' లభిస్తుంది. ఇవి ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి.

ఎముకలు దృఢత్వాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్స్.. !

టమోటో: ప్రతిరోజు రెండు గ్లాసుల టమాట జ్యూస్ తాగితే ఎముకలు దృఢంగా మారడమే కాకుండా అస్టియోపోరోసిస్ దరిచేరకుండా ఉంటుంది. టమాటలో ఉండే లైకోపీన్ అనే యాంటీఅక్సిడెంట్ ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది.

ఎముకలు దృఢత్వాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్స్.. !

ఆకుకూరలు: వీటిలో కెలొరీలు తక్కువ. పాలకూర లాంటి వాటిల్లో సి, కె, ఇ, బి విటమిన్లే కాదు ఇనును, క్యాల్షియం, పీచు లాంటి పోషకాలు పుష్కలమే. వీటిల్లో ఎక్కువుగా మెగ్నీషియం ఎముకలు, కండరాలు, నాడీ వ్యవస్థ దృఢంగా ఉంచేలా చేస్తుంది. క్యాల్షియం దంతాలు, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పొటాషియం కణాల పనితీరుని మెరుగుపరుస్తుంది. గోంగూర నుంచి ఇనుము, సి విటమిన్, ఫోలేట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఎముకలు దృఢత్వాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్స్.. !

కూరగాయలు: ముఖ్యంగా పసుపు, ఆకుపచ్చ కాషాయ రంగు కూరగాయలను తినాలి. జీర్ణక్రియకు మేలు చేసే పీచు పదార్థాలను తీసుకోవాలి. చిక్కుడు కాయల్ని తీసుకోవటం మంచిది. పైగా చిక్కడు కొద్దిగా తిన్నా పొట్టనిండినట్లు భావన కలుగుతుంది.బీట్‌రూట్, క్యారెట్, బీన్స్, స్వీట్ పొటాటోస్, దోసకాయ వంటివి తీసుకుంటే ఎముకలకు కావాల్సిన 'ఎ' విటమిన్ లభిస్తుంది.

ఎముకలు దృఢత్వాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్స్.. !

సిట్రస్ పండ్లు: కమలాఫలం, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, ద్రాక్షలలో ఉండే సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. . గ్రీన్‌ టీలో ఉండే ఒక గ్రూపు రసాయనాలు ఎముకల నిర్మాణాన్ని ఉత్తేజితం చేస్తాయి. దీంతో ఎముకలు విరగడం నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆస్టియోపోరోసిస్‌ రావడాన్ని, చికిత్సను గ్రీన్‌టీ నివారిస్తుంది. అంతేకాక ఇతర ఎముకల సంబంధ వ్యాధులను అరికట్టే వీలుంది.

రెగ్యులర్ వ్యాయామం తప్పనిసరి.. !

వ్యాయామం : వాకింగ్, ఎరోబిక్స్, బాస్కెట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్ వంటివి ఎముకలను పటిష్టం చేస్తాయి. వెయిట్‌ బేరింగ్‌ ఎక్సర్‌సైజ్‌ ఎముకలకు మంచిది. వీటి వల్ల కండరాలమీద, ఎముకలమీద ఒత్తిడి ఎక్కువై ఎముకల సాంద్రత పెరుగుతుంది. వెయిట్‌ బేరింగ్‌ ఎక్సర్‌సైజ్‌ ఎముకలకు మంచిది. వీటి వల్ల కండరాలమీద, ఎముకలమీద ఒత్తిడి ఎక్కువై ఎముకల సాంద్రత పెరుగుతుంది.

మీ శరీర బరువును గమనిస్తుండండి.. !

బరువు: మీ బరువు ఉండాల్సిన దానికన్నా ఒక్కొపాన్‌ పెరిగేకొద్ది మీ కీళ్ళమీద పడే ఒత్తిడి నాలుగు రెట్లు అధికమవుతుంది. కాబట్టి అధిక బరువు లేక ఊబకాయం వల్ల ఆస్టి యోఆర్థరైటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి. కీళ్ళు దెబ్బతింటాయి.

స్మోకింగ్ కు బ్రేక్ వేయండి..

అనారోగ్య అలవాట్లను వదిలి పెట్టండి: ధూమపానాన్ని వెంటనే మానేయండి. వల్ల ఎముకలకి రక్తసరఫరా తగ్గుతుంది. కాల్షి యంను రక్తంలోంచి పీల్చుకునే గుణం తగ్గుతుంది. అంతేకాదు ఎముకల కణాలకి ఇబ్బంది కలిగిస్తుంది. ధూమపానం చేసే వాళ్ళల్లో 30 -40 సంవత్సరాల మధ్య వయస్సులోతుంటి ఎముక విరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ధూమపానం చేయకండి.

కూల్ డ్రింక్స్...సాఫ్ట్ డ్రింక్స్ కు ఫుల్ స్టాప్.. !

సాఫ్ట్‌ డ్రిక్స్‌ని దూరంగా ఉంచండి: సాఫ్ట్‌ డ్రింక్స్‌ ప్రభావం యవ్వనంలో వున్న వాళ్ళ ఎముకలమీద ఎక్కువగా కనిసిస్తుంది. కెఫిన్‌, పాస్పాలిక్‌ యాసిడ్‌, కాల్షి యం విసర్జించటంలో అడ్డంపడతాయి. ఎముకల సాంద్రత తగ్గడంలోనూ సాప్ట్‌ డ్రింక్స్‌ ప్రభావం ఉంది.

English summary

Top Foods for healthy and Strong Bones | ఎముకలు దృఢత్వాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్స్.. !

You are your best ally when it comes to building and maintaining strong, healthy bones. What you eat plays an important role in determining your bone health. Specifically, consuming adequate amounts of calcium (1000 mg for adults ages 19-50) and vitamin D (200 IU for adults ages 19-50) is essential for strong bones. Magnesium and vitamin K are also important for bone health. Here are 10 tasty sources.
Desktop Bottom Promotion