For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణహాని కలిగించే 10 రకాల జ్వరాలు..వాటి లక్షణాలు..!

|

జ్వరం అనేది సాధారణంగా వచ్చే ఒక వ్యాధి. ఇది సాధారణంగా జలుబు లేదా ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది . అయితే జ్వరంలో కూడా కొన్ని రకాల జ్వరాలు ప్రాణాంతకమైనవిగా ఉన్నాయి. నిజానికి అన్ని రకాల జ్వరాలను ఒక స్టేజ్ దాటిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తే అవి ప్రాణాంతకం సామర్థ్యం కలిగి ఉంటాయి. పాత రోజుల్లో, అంటే అప్పటికి పారాసెటమాల్ మాత్రను కనుగొనక ముందు జర్వంతో మరణించిన ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు.

కానీ ప్రస్తుత రోజుల్లో, జ్వరం వల్ల మరణించే వారు చాలా అరుదైనారు. అయితే ప్రత్యేకంగా చెప్పలేం. జర్వం రావడానికి కారణాలు, ప్రత్యేక లక్షణాలను గుర్తించినట్లైతే ఆ జ్వరాన్ని ఎలా నయంచేసుకోవాలనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే చాలా వరకూ అన్ని రకాల జ్వరాలు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేవే. కొన్ని నిర్ధిష్టమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉదా: డెంగ్యూ ఫీవర్ లేదా మలేరియా వంటి వ్యాధులు ప్రాణాలకు హానికలిగించవచ్చు . అయితే మీకు ఎటువంటి జ్వరం వస్తున్నదో నిర్ధారించడానికి కొన్ని నిశ్చయాత్మకమైన పరీక్షలు ఉన్నాయి. జ్వరం లక్షణాలతో పాటు, కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేసుకోవడం వల్ల మీ వైద్యుడు నిర్ధాణ చేయగలడు.

రీసెంట్ గా కొన్ని నెలల క్రితం, లెజెడ్రీ ఫిల్మ్ మేకర్ యష్ చోప్రా డెంగ్యూ జ్వరంతో మరణించారు. ఈ ప్రముఖ సెలబ్రెటీ మరణం వల్ల మనందరిక కళ్ళు తెరిపించారు. కాబట్టి జ్వరం అధికంగా ఉన్నప్పుడు దాన్ని మనం తేలికగా తీసుకోవడానికి లేదు. నిజానికి, జ్వర లక్షణాలు మన శరీరంలో ఏదో జరుగుతుందన్న విషయాన్ని సంకేతంగా భావించాలి. మీకు జ్వరం వెంటనే నయం కాలేదు అంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.

మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ లేదా 98.6 డిగ్రీల ఫారెన్‌ హీట్‌గా ఉంటుంది. దీనికంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు 'జ్వరం' వచ్చిందనవచ్చు. కొన్ని ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో (వ్యాయామం చేశాక, గర్భిణిగా ఉన్నప్పుడు, బహిష్టు సమయంలో) కూడా కొంత ఉష్ణోగ్రత పెరగొచ్చు. జ్వరం శరీరంలో జరుగుతున్న మార్పులకుఒక హెచ్చరికే కాదు. శరీరంలో చేరిన సూక్ష్మజీవులను నశింపజేసే ఒక రక్షణ ప్రక్రియ కూడా. జ్వరం రావడానికి అనేక కారణాలున్నాయి. బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగైలాంటి సూక్ష్మజీవులు వల్లే కాక గాయాలు, గుండెపోటు, క్యాన్సర్‌ లాంటి సమస్యల వల్ల కూడా జ్వరం రావొచ్చు. మందుల వల్ల కూడా జ్వరం రావొచ్చు. దీన్ని డ్రగ్‌ ఫీవర్‌ అంటారు.

మీకోసం మీకు తెలుసుండటం కోసం కొన్ని రకాల జ్వరాలను మీకు తెలియజేస్తున్నాం. వీటిలో ప్రతి ఒక్క జ్వరం డిఫరెంట్ సిమ్ టమ్స్ (వివిధ లక్షణాలు)గుర్తించే విధంగా ఉంటాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం...

వైరల్ ఫీవర్:

నార్మల్ గా వచ్చే వైరల్ ఫీవర్ 9 రోజుల వరకూ మీ మీద ప్రభావం చూపుతుంది . చల్లని వాతావరణం మనసుకు ఆహ్లాదాన్నయితే ఇస్తుంది. కానీ, ఈ చల్లదనానికి సూక్ష్మక్రిముల బారినుండి కాపాడే శరీర భాగాలు కొన్ని శక్తి హీనంగా మారిపోతాయి. ఫలితంగా సూక్ష్మక్రిములు చాలా సులువుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే శీతాకాలంలో, వర్షాకాలంలో ఎక్కువ మంది వైరల్ జ్వరాలకు గురవుతుంటారు. ఈ రకమైన జ్వరం గొంతు నొప్పితో మొదలవుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను అడ్డుకోవడం సాధ్యమే.

డెంగ్యూ:

దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఇది ఇంకొకరి వ్యాప్తి చెందేలా చేస్తుంది. మనిషి నుంచి మనిషికి నేరుగా వచ్చేవి కావు. వ్యాధిగ్రస్తులను కరిచిన దోమలు ఇతరులను కరవడం ద్వారానే ఈ సమస్యలు వ్యాపిస్తాయి. అందువల్ల దోమల నిర్మూలనకు కుటుంబపరంగానూ, సామూహికంగానూ చ ర్యలు తీసుకోవలసి ఉంటుంది. విపరీతమైన ఒళ్లు నొప్పులు, కంటి వెనుక భాగంలో నొప్పి, మితిమీరిన నీరసం ఉంటుంది. రెండు, మూడు రోజుల్లో తగ్గి మళ్లీ జ్వరం కనిపించడం అనేది డెంగ్యూ ప్రత్యేకత. ఎముక విరిగినప్పుడు ఎలాంటి నొప్పి ఉంటుందో అలాంటి నొప్పులు ఉండ డం వల్ల ఈ వ్యాధికి ఎముకలు విరిచే జ్వరం అనిపేరొచ్చింది. డెం గ్యూ వ్యాధిలో మూడు దశలున్నాయి. మొద టిది సాధారణ డెంగ్యూ జ్వరం. రెండోది డెం గ్యూ హెమరేజిక్‌ జ్వరం. మూడోది డెంగ్యూ షాక్‌ సిండ్రోం. చాలా మందిలో మొదటి దశ నుండే కోలుకుని సాధారణ స్థితికి వచ్చేస్తారు. కొద్ది మంది రెండో దశకు, మరి కొద్ది మంది మూడో దశకు కూడా చేరుకుంటారు. రెండు, మూడో దశలు ప్రమాదకరమైన దశలు. డెం గ్యూ మరణాలు ఎక్కువగా మూడో దశలో జరుగుతాయి.

మలేరియా:

మలేరియా (Malaria), దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. మలేరియా సోకిన 10 నుండి 30 రోజులలో జ్వరం రావచ్చు (అంటే ప్లాస్మోడియం రక్తంలోకి చేరిందన్నమాట). ఆ తరువాత ఇంకో వారం రోజులకుగానీ వ్యాధి లక్షణాలు కనిపించవు. కొంతమందికి మలేరియా సోకిన సంవత్సరానికిగానీ వ్యాధి లక్షణాలు కనిపించవు. ఎక్కువ మందికి 10 నుండి 30 రోజులలో జ్వరం వస్తుంది. మలేరియా సోకినప్పుడు జ్వరం హటాత్తుగా వస్తుంది. జలుబు చేసిందేమోనన్న అపోహను కలుగజేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. చలి, జ్వరం, రక్తహీనత వంటి లక్షణాలతో తీవ్రంగా వేధించే ఈ మలేరియా బారినపడటం కన్నా రాకుండా చూసుకోవటమే ఉత్తమం.

చికెన్ గునియా:

చికెన్‌ గునియా వ్యాధిని చికెన్‌ గునియా జ్వరము అని అంటారు. ఈవ్యాధి వైరస్‌ అనే అతిసూక్ష్మక్రిముల ద్వారా వస్తుంది. చికెన్‌ గునియా ఎలా వ్యాపిస్తుంది: చికెన్‌ గునియా వ్యాధి 'ఏడిస్‌' అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధితో బాధ పడుతున్న వ్యక్తి నుండి ఆరోగ్యవంతమైన వ్యక్తికీ ఈ దోమద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. లక్షణాలు: చలిజ్వరము, తలనొప్పి, వాంతులు వచ్చినట్లు ఉండడం, వాంతులు, కీళ్లనొప్పులు, కొన్ని సందర్భాలలో చర్మముపై దద్దుర్లు కూడా రావచ్చు, విపరీతమైన కీళ్ళ నొప్పులు ఈ వ్యాధికి ప్రధాన లక్షణము, జ్వరతీవ్రత తగ్గినా, ఈ కీళ్ల నొప్పులు కొంతకాలము వ్యక్తికి ఉంటాయి.

టైఫాయిడ్:

టైఫాయిడ్‌ జ్వరం లేదా టైఫాయిడ్‌ అనేది ఈ వ్యవధిలో తీవ్ర ఆందోళనకు గురిచేసే అలాంటి ఒక వ్యాధి.ఒక్క మాటలో చెప్పాలంటే, టైఫాయిడ్‌ అనేది అతిసారం మరియు దద్దుర్లు కలుగజేసే ఒక అంటువ్యాధి. రొంపతో మొదలై జ్వరం రోజు రోజుకు పెరుగుతుంది. నాడి నెమ్మదిగా కొట్టుకుంటుంది. ఒక్కోసారి విరేచనాలవుతాయి. శరీరంలో నీరెక్కువగా బయటకు పోతుంది. వణుకు, సంధి ఉంటాయి. రోగి చాలా జబ్బుగా ఉన్నట్లు కనిపిస్తాడు. అన్ని జ్వరాల్లో కన్నా టైఫాయిడ్‌ జ్వరం ప్రమాదకరమైందని చెప్పుకోవాలి. ఇది ఏడాది పొడవునా ఎప్పుడైనా రావొచ్చు. ముఖ్యంగా వరదల సమయంలో. కలుషితమైన నీరు, ఆహారం తీసుకున్నప్పుడు టైఫాయిడ్‌ వస్తుంది.

మెనిన్‌జైటిస్‌:

మెదడునీ, వెన్నెముకనీ అంటి, చుట్టూరా వున్న, 'మెసిన్‌జెస్‌' అనే పొరల వాపు (ఇన్‌ఫ్లమేషన్‌) నే మెనిన్‌ జైటిస్‌ అంటారు. మెనిక్‌గైటిస్‌కి మరోపేరే ఎన్‌సెఫలాటిస్‌. మామూలుగా, వ్యవహార భాషలో ఈ రోగాన్ని 'బ్రెయిన్‌ ఫీవర్‌' అంటారు. ఇది ఎలా వస్తుందంటే రకరకాల వైరస్‌వల్ల, బాక్టీరియా వల్ల మెనిన్‌ జైటిస్‌ వస్తుంది. ఎలాంటి అంటువ్యాధి సోకకపోయినా, శరీరంలోని 'టిష్యూ'లని 'వాపు'కి గురిచేసే వ్యాధులవల్ల కూడా, 'మెనిన్‌గైటిస్‌' వస్తుంది. 'మెనిన్‌జో కోకల్‌ మెనిన్‌జైటిస్‌'నే సెరెబ్రో స్పైనల్‌ ఫీవర్‌ అనిగాని, స్పాటెడ్‌ ఫీవర్‌ అనిగాని అంటారు. అకస్మాత్తుగా బయటపడే ఈ రోగలక్షణాలు పసిగట్టేలోగానే, ఇన్‌ఫెక్షన్‌ శరీరంమంతా వ్యాపించడం, రక్తం విషపూరితం కావడం (సెప్టికేమియా) జరిగిపోయి, ప్రాణాంతకంగా పరిణమిస్తాయి.

హెచ్1ఎన్1 లేదా స్వైన్ ఫ్లూ:

స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రధానంగా హెచ్-1 ఎన్-1 వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి శ్వాసక్రియ ద్వారా, దగ్గు, తుమ్ములు, చేతులు కలపడంతోనే వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వ్యాపిస్తే చాలా రోజుల వరకు తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల నొప్పులు, అలసట తదితర లక్షణాలుంటాయి.

హెచ్ ఐ వి:

జ్వరం, విరేచనాలతో నెలకంటే ఎక్కువ బాధపడటం, బరువు తగ్గిపోవడం, నోటిలో పుండ్లు త్వరగా మానకపోవడం, హెర్పస్ సింప్లెక్స్, నోటిలో, అన్నవాహికలో, శ్వాసనాళాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, స్ర్తీలలో మర్మాంగావయవాల ఇన్ఫెక్షన్లు (క్యాండిడా) వంటివి మందులు వాడినా తగ్గకపోవడం, టి.బి., హెపటైటిస్-బి, సి ఉన్నా హెచ్.ఐ.వి ఏమో అని అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి.‘హ్యూమన్ ఇమ్యునో డెఫిసియన్సీ వైరస్'ని సంక్షిప్తంగా ‘హెచ్‌ఐవీ' అంటారు. అంటే ఈ వైరస్ సోకినప్పుడు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుంది. అప్పుడు సాధారణ వ్యాధికి కారణమయ్యే అంశాలు కూడా ప్రమాదకరం కావచ్చు. వాటి వల్ల ప్రాణాలకే ముప్పు వాటివల్లవచ్చు. అందుకే ‘హెచ్‌ఐవీ' అంటే అందరికీ భయం.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్:

ఇది జ్వరం వల్ల కూడా ఏర్పడవచ్చు. మహిళలు జీవితంలో ఒక్కసారన్నా ఈ యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ (యుటిఐ) బాధకు గురవుతుంటారు. మామూలుగా యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ చాలా సుళువుగా తగ్గిపోతుంది. సుగర్‌ లాంటి ఇతర అనారోగ్యాల కారణం లేకపోతే యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ చికిత్స గోటితే పోయే సమస్యే అని చెప్పుకోవచ్చు. ఈ వ్యాధి బారిన పడ్డవారిలో మొదట్లో మూత్రవిసర్జన బాధాకరంగా పరిణమిస్తుంది. తరువాత ఇంకా నిర్లశ్య్రం చేస్తే... తీవ్రమై ... కడుపును చేరి చాలా బాధపెడుతుంది. మూత్రవిసర్జన అంటేనే భయపడిపోయే పరిస్థితి దాపురిస్తుంది. జ్వరం, నీరసం, నిస్సత్తువ అన్నీ దాని తోబుట్టువలమంటూ తయారవుతాయి. పుళ్లు పడటం ఇక నరకమే.

బ్లడ్ క్యాన్సర్:

రక్త కణాల ఉత్పత్తి, ధర్మాలను రక్త క్యాన్సర్‌ ప్రభావితం చేస్తుంది. ఇది ప్రధానంగా బోన్‌ మారో (ఎముకల మజ్జ / మూలగ) లో ప్రారంభమవుతుంది. ఇక్కడే రక్తం, రక్తకణా లు ఉత్పత్తవుతాయి. మామూలుగా మజ్జలో వున్న మూల కణాలు అభివృద్ధి అయి, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు తయారవుతాయి. ఎక్కువ రక్తక్యాన్సర్‌ల్లో తెల్లరక్త క ణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దీనితో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇలా అడ్డగోలుగా పెరిగే కణాల్ని క్యాన్సర్‌ కణాలంటారు. ఇవి మిగతాకణాల్ని సరిగా పనిచేయ నియ్యవు. ఫలితంగా, రోగ నిరోధకశక్తిని కోల్పోయేలా చేస్తుం ది. రక్తాన్ని గడ్డకట్టనీయదు. రక్త క్యాన్సర్‌కు ప్రధానంగా మందులతో (కీమోథెరిపీ పద్ధతిలో) చికిత్స చేస్తారు.

English summary

Types Of Fever You Must Be Aware Of

Fever is a very common illness. Most often we tend to brush if off as a casual cold or infection. But certain types fever can be lethal. In fact all types of fevers have the capacity to be fatal if they are ignored beyond a point.
Story first published: Monday, June 3, 2013, 17:04 [IST]
Desktop Bottom Promotion