For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో ఇవి తినకపోతే మీ పని అంతే.!వేసవి తాపానికి గురికాక తప్పదు.

|

వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం చాలా సాధారణం. సూర్యని తాపానికి, అధిక వేడితో శరీంలోని నీరంత చెమట రూపంలో బయట విసర్జించబడి శరీరం నీటిశాతాన్ని కోల్పోతుంది. కాబట్టి మీ శరీరం వేసవి వేడి నుండి ఉపశమనం పొందాలి. వేసవికాలంలో చెమట వల్ల ఒంట్లో నీటిని కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురికావల్సి ఉంటుంది. అధిక చెమట, శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మన శరీరంలో సాల్ట్ కంటెంట్ తగ్గి అది మనల్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది.

అందువల్లే, వేసవి కాలంలో ఎక్కువ నీరు తీసుకోవాలని చెబుతుంటారు. నీరు శరీరానికి హైడ్రేషన్ కలిగించడం మాత్రమే కాదు, శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ మరియు ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపివేయడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. అయితే నీటిమాత్రమే త్రాగడం వల్ల శరీరానికి తగినంత హైడ్రేషన్ కల్పించలేము. వేసవికాలంలో మీ డైట్ ప్లాన్స్ మీ ఆరోగ్య విషయంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. వేసవిలో డీహైడ్రేషన్ కు గురిచేసే ఆహారాలను తినడం లేదా ఏదైనా పానీయాలను త్రాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురియైటటువంటి ఆహారాలను మీ డైట్ లిస్ట్ నుండి తొలగించాలి. ముఖ్యంగా వేసవి కాలంలో కాఫీ త్రాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. కాబట్టి ఇటువంటి బాడీకి వేడి కలిగించేటటువంటి పదార్థాలను తినడం, త్రాగడం మానుకోవాలి.

మరి కొన్ని వాటర్ రిచ్ సమ్మర్ ఫుడ్స్ ను మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈ వేసవికి మీ శరీరానికి హైడ్రేషన్(తగినంత తేమను) అందించవ్చు. అటువంటి కొన్ని ఆహారాలు మేం మీకోసం కొన్ని లిస్ట్ ఇస్తున్నాం. ఇవి అధిక నీటిశాతాన్ని కలిగి మరియు లోక్యాలరీస్ ఉంటాయి. ఉదా: వాటర్ మెలోన్, కీరదోస, కొత్తిమీర మొదలగు వాటిలో నీటిశాతాన్ని అధికంగా కలిగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి మరికొన్ని వాటర్ రిచ్ ఫుడ్స్ క్రింది లిస్ట్ లో ఉన్నాయి. వీటిని కనుక మీ డైలీ డైట్ లిస్ట్ లో చేర్చుకొన్నట్లైతే మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచవచ్చు.

ఇవి తినకపోతే, ఎండ-వేడికి గురికాక తప్పదు..!

బెల్ పెప్పర్: బెల్ పెప్పర్ లో 90%వాటర్ కలిగి ఉండటం వల్ల మీ సమ్మర్ డైట్ లిస్ట్ లో చేర్చుకోవడం మంచిది. అంతే కాదు వీటిలో విటమిన్ సి, ఎ, కె మరియు లుటిన్, జియాక్సిథిన్, పొటాషియం వంటి మరికొన్ని పోషకాంశాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి తినకపోతే, ఎండ-వేడికి గురికాక తప్పదు..!

కీరదోస: సమ్మర్ సీజన్ లో ఎక్కువ ఉత్పత్తి అయ్యేటటువంటి వాటర్ రిచ్ ఫుడ్ ఇది. ఇది గార్డ్(బిట్టర్ గార్డ్, రింగ్ గార్డ్, స్నెక్ గార్డ్) ఫామిలికి చెందినది. కాబట్టి ఈ సమ్మర్ లో వీటిని ఎక్కువగా తిని శరీరానికి కావల్సినంత హైడ్రేషన్ ను పొందండి.

ఇవి తినకపోతే, ఎండ-వేడికి గురికాక తప్పదు..!

బ్రొకోలీ: గ్రీన్ బెజిటేబుల్స్ ఎప్పటీ ఎవర్ గ్రీన్ హెల్త్ బెనిఫిట్స్ ను మరియు న్యూట్రిషినల్ బెనిఫిట్స్ ను కలిగి ఉంటుంది. సమ్మర్ సీజన్ లో తీసుకోవల్సినటువంటి వాటర్ రిచ్ వెజిటేబుల్ ఇది.

ఇవి తినకపోతే, ఎండ-వేడికి గురికాక తప్పదు..!

క్యారెట్స్: క్యారెట్స్ శరీరం మొత్తం అరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్స్ శరీరాన్ని చల్లాగా, తేమగా ఉంచుతుంది. క్యారెట్స్ ను లేదా క్యారెట్ జ్యూసులను తీసుకోవడం వల్ల చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండి చర్మం మెరిసేలా చేస్తుంది. కాబట్టి ఈ వేసవి తాపాన్ని పోగొట్టుకొని, అందంగా మెరిసిపోవాలంటే క్యారెట్ జ్యూసును త్రాగండి.

ఇవి తినకపోతే, ఎండ-వేడికి గురికాక తప్పదు..!

గుమ్మడికాయ: వాటర్ కంటెంట్ అధికంగా ఉండే మరో గ్రీన్ వెజిటేబుల్ ఇది. ఈ గ్రీన్ వెజిటేబుల్ కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో దీన్ని ఖచ్చితంగా చేర్చుకోండి.

ఇవి తినకపోతే, ఎండ-వేడికి గురికాక తప్పదు..!

గ్రీన్ క్యాబేజ్: ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఖచ్చితంగా న్యూట్రీషియన్ ఫుడ్ మరియు ఆరోగ్యం కూడా. ఇందులో క్యాలరీస్ తక్కువ మరియు నీటి శాతం ఎక్కువ. కాబట్టి దీన్ని సమ్మర్ డైట్ లిస్ట్ లో చేర్చుకోండి.

ఇవి తినకపోతే, ఎండ-వేడికి గురికాక తప్పదు..!

సెలరే(ఆకు కూర): సెలరే ఇది బ్లడ్ ప్రెజర్ లెవల్స్ తగ్గించడమే కాదు, ఇది వాటర్ రిచ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్. ఇది మిమ్మల్ని హైడ్రేషన్ లో ఉంచడంతో పాటు హాట్ సమ్మర్ లో కూల్ గా ఉంచుతుంది.

ఇవి తినకపోతే, ఎండ-వేడికి గురికాక తప్పదు..!

టమోటోలు: టమోటోలో 93% వాటర్ ఉంది, మరియు ఇందులో యాంటీఆక్సిడెంట్స్, లైకొపిన్ పుష్కలంగా ఉండి శరీరం నుండి టాక్సిన్స్ ను శుభ్రపరచడానికి వయస్సు మీదపడకుండా కాపాడుతుంది. మీరు డైట్ ఫాలో చేస్తున్నట్లైతే ప్రతి రోజూ పచ్చిగా ఉన్న ఒక టమోటోను తినడం వల్ల మీకు ఆకలిగి కలిగించదు.

ఇవి తినకపోతే, ఎండ-వేడికి గురికాక తప్పదు..!

రెడ్ రాడిష్: రెడ్ రాడిష్ తినడం వల్ల మీ శరీరంలో తగినంత చేరుతుంది. అంతే కాదు, ఈ రెడ్ రాడిష్ అతి తేలికగా జీర్ణం అవుతుంది. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా కాపాడుతుంది.

ఇవి తినకపోతే, ఎండ-వేడికి గురికాక తప్పదు..!

లెట్యూస్(పాలకూర):తాజా పాలకూరను సలాడ్స్ లో చేర్చి తినడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు శరీరంలోని హైడ్రేషన్ స్థాయి నిలకడగా ఉంటుంది. తాజా పాలకూరలో విటమిన్ ఎ, కె మరియు బీటా కెరోటిన్స్, పుష్కలంగా ఉండటం వల్ల ఈ న్యూట్రీషియన్ గ్రీన్ లీఫీనీ మీ సమ్మర్ డైట్ లో చేర్చుకోండి.

English summary

Vegetables To Stay Hydrated In Summer | ఇవి తినకపోతే, ఎండ-వేడికి గురికాక తప్పదు..!


 As the days start to heat up again, we need to care for our body to fight the scorching summer heat. During summers, we often suffer from dehydration due to sweating. Excessive sweating reduces water and salt content in the body thus making us feel dehydrated.
Story first published: Thursday, March 21, 2013, 14:01 [IST]
Desktop Bottom Promotion