For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎముకలను బలానికి టాప్10 విటమిన్ డి ఆహారాలు

|

మన శరీరంలో ఎముకలు అనేవి ప్రధానమైనటువంటి భాగం. ఎములకల ఆరోగ్యాన్ని బట్టే మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. ఎముకలు అనేవి జీవించిన ఉన్న కణజాలాలు మరియు ఇవి కొత్త ఎముకలు ఏర్పడటంతో నిరంతరం మారుతుంటాయి. పాత ఎముకలు పాడైతే వాటి స్థానంలో కొత్త ఎముకలు ఉద్భవిస్తాయి. ఇలా జీవితకాలం మొత్తం జరుగుతుంది. నడవడం కోసం మరియు స్వతంత్రంగా ఉండటం కొరకు మరియు స్వతంత్రంగా ఉండటం కొరకు మనం మన ఎముకల్ని ఆరోగ్యవంతంగాను మరియు వ్యాధులను నుంచి సంరక్షించుకోవాలి. మనకు 35 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఎముకలు బలంగా ఎదుగుతాయి. వయస్సు పెరుగుతున్న కొలదీ, కొత్త ఎముకలు ఏర్పడే రేటుతో పోలిస్తే, పాత ఎముకలు వేగంగా నాశనం అవుతుంటాయి. మరిముఖ్యంగా ఆడవారిలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటికి ప్రత్యామ్నాయం కల్పించడం కోసం ఎముకలు ఏర్పడతాయి. ఈ ఎముకలు చాలా బలహీనంగా, పెళుసగా మరియు తేలికగా విరిగిపోయే విధంగా ఉంటాయి. కాబట్టి ఎముకలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.

విటమిన్‌ డి అందకపోతే ఎముకలు పెళుసుగా మారిపోతాయి. అంతేకాదు ఎముక కణజాలం క్షీణించే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఎముకల్ని పెళుసు చేస్తుంది. బాధా కరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎముకల పెళుసుదనం వల్ల కటి భాగం, వెన్నెముక, మణికట్టు, భుజం ఎముకలు విరిగే ప్రమాదం ఉంది. ఇది మన శరీర భంగిమలో కూడా మార్పు తీసుకొ స్తుంది. ఈ పరిస్థితికి స్త్రీ,పురుషులిద్దరూ ప్రభా వితమవుతారు. అందుకే ఎముక ఆరోగ్య ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సి ఉంది. మహిళల్లో సాధారణంగా ఎముకలు పురుషుల కన్నా సన్నగా వుంటాయి. అందులోనూ మహిళల్లో హార్మోన్ల ఉత్పత్తి జరిగినప్పుడు ఉండే ఎముకల పటి ష్ఠత ఋతుక్రమం ఆగాక క్రమంగా క్షీణిస్తుంది. దీంతో ఎముకల్లో పెళుసుతనం పెరుగు తుంది. పురుషుల్లో ప్రధానంగా వృద్ధాప్య ఛాయలు కనిపించినప్పుడు ఈ లోపం కనిపిస్తుంది. ఈ ఎముకల పెళుసుదనమే కొన్నిసార్లు ఆస్టియో ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది.

ఎముకలు ఆరోగ్యంగా ఉండటం కోసం కాల్షియం మరియు విటమిన్‌ డి ఎంతగానో అవసరం అవుతాయి. విటమిన్‌ డి మరియు కాల్షియం వీటిలో ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి ఆహారాల మీద ఎక్కువ కాన్ సన్ ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఎముకల ఆరోగ్యం విటమిన్ డి, క్యాల్షియం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. విటమిన్ డి లోపిస్తే ఎముక ఆరోగ్యం క్షీణ స్థితికి చేరుతుంది. అందువల్ల విటమిన్ డి లోపం వల్ల క్యాల్షియం ఎముకల్లోనికి విలీనం కాదు. అందుకే విటమిన్ డి పుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. పాలు మరియు పాల ఉత్పత్తులు, బీన్స్‌, స్పినాచ్‌(ఆకుకూరలు), నట్స్‌ మరియు డ్రైడ్‌ ఫూట్స్‌లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముకలను స్ట్రాంగ్ ఉంచి లైఫ్ హాపీగా ఉండేలా చేసే కొన్ని టాప్ టెన్ విటమిన్ డి ఆహారాలు మీకోసం...

మష్రుమ్(పుట్టగొడుగులు):

మష్రుమ్(పుట్టగొడుగులు):

మష్రుమ్(పుట్టగొడుగు)ల్లో విటమిన్ డి మాత్రమే కాదు విటమిన్ బి5 ను కూడా అందిస్తుంది. తెల్లని పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల విటమిన్ డితో పాటు జింక్ మరియు ప్రోటీన్స్ పుష్కలంగా శరీరానికి లభ్యం అవుతుంది.

కోడ్ లివర్ ఆయిల్:

కోడ్ లివర్ ఆయిల్:

కోడ్ లివర్ ఆయిల్ వాసన మరియు రుచి అంత బాగుండవు. అయితే ఇందులో విటమిన్ డి అధిక శాతంలో ఉంటుంది. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. ఒక చెంచా కోడ్ ఆయిల్ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత విటమిన్ డి లభ్యం అవుతుంది. ఇది క్యాప్స్యుల్ రూపంలో దొరుకుతుంది.

తున ఫిష్:

తున ఫిష్:

చాలా చల్లగా ఉండే సముద్ర చేపల్లో కొంత మొత్తంలో విటమిన్ డి ఉంటుంది. తున అనే ఈ సముద్ర చేపలో విటమిన్ డి అత్యధిక శాతంలో ఉంటుంది మరియు శరీరానికి కావల్సినంత క్యాల్షియం కూడా పుష్కలంగా ఇందులో లభిస్తుంది.

గుడ్లు:

గుడ్లు:

అత్యధిక శాతం న్యూట్రిషియన్స్ కలిగినటువంటి గుడ్లలో విటమిన్ డి మరియు విటమిన్ బి12 మరియు ప్రోటీనులు అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ ఆహారంతో తీసుకోవడం చాలా ముఖ్యం.

కావియర్(caviar):

కావియర్(caviar):

ఈ కావియర్ అనే ఆహరం ప్రపంచంలో చాలా ఖరీదైనటువంటి ఆహారం. ఇది ఒక గొప్పరుచికరమైన ఫిష్ ఎగ్స్ ను ప్రాసెస్ చేస్తుంది. కావియార్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది మరియు ఇందులో విటమిన్ డి పుష్కలం. కాబట్టి మీకు ఇది అందుబాటులో ఉంటే ప్రతి రోజూ ఒక స్పూన్ ఫుల్ గా తీసుకోండి.

ఫోర్టిఫైడ్ సెరల్స్:

ఫోర్టిఫైడ్ సెరల్స్:

సాధారణ బ్రేక్ ఫాస్ట్ సెరల్స్ లో విటమిన్ డి అంత ఎక్కువగా ఉండదు. అయితే, స్పెషల్ సెరల్స్ ఫోర్టిఫైడ్ సెరల్స్ లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇవి ఇంకా విటమిన్ డి తో పాటు అధికంగా ఫైబర్ అధిస్తుంది. లోకొలెస్ట్రాల్ లెవల్స్ ను కలిగి ఉంటుంది.

సోయా ప్రొడక్ట్స్:

సోయా ప్రొడక్ట్స్:

సోయా ప్రొడక్ట్స్ సంబంధించిన ఉత్పత్తులు టోపు, సోయా మిల్క్ వంటి వాటిలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం చాలా ఆరోగ్యకరం.

సాల్మన్ చేపలు:

సాల్మన్ చేపలు:

సీ ఫిష్ లో సాల్మన్, తున మరియు క్యాట్ ఫిష్ వీటిలో విటమిన్ డి మాత్రమే కాదు ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా లభ్యం అవుతాయి. ఈ చేపలను ఫ్రై చేయడం కంటే గ్రిల్ చేసి తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో న్యూట్రీషియన్స్ శరీరానికి అందుతాయి.

ఓస్ట్రెస్:

ఓస్ట్రెస్:

సీఫుడ్స్ లో చేపలు, రొయ్యలు, పీతలే కాకుండా ఇది కూడా ఒక సీ ఫుడ్. ఇందులో అధిక శాతంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు వీటిలో జింక్, విటమిన్ బి12, సెలీనియం, మ్యాంగనీస్, మరియు కాపర్ అధిక శాతంలో ఉంటుంది.

సలామీ అండ్ సాసజస్:

సలామీ అండ్ సాసజస్:

సలామీ, హామ్, సాసేజులు వంటివి మాంసాహారులు ఇష్టంగా తింటారు. ఇవి చాలా పాపులర్ అయినటువంటి ప్రొసెస్డ్ మీట్. వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అయితే మాంసాహారాలు తీసుకొనేటప్పుడు తాజావి మాత్రమే ఆరోగ్యానికి మంచిది. ప్యాక్ చేసినవాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే వీటిలో అధిక శాతంలో సోడియం ఉంటుంది.

English summary

Vitamin D Rich Foods For Strong Bones

You will not hear people talking about Vitamin D rich foods very often. This is because there are very few dietary sources of Vitamin D available to us. Vitamin D should be ideally produced in the body when you go out in the sunlight.
Desktop Bottom Promotion