For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక రక్తపోటును దూరంగా ఉంచడానికి మార్గాలు

By Super
|

ప్రజలు నేటి ఆహారపు అలవాట్లు, పని గంటల మార్పులకు గురవడం వల్ల, చిన్న వయసులోనే వివిధ రకాల జబ్బులకు గురికావలసి వస్తుంది. నేటి అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు ఒకటి, దీనిని గమనించవలసిన, ఉపశమనం పొందవలసిన అవసరం ఉంది. అధిక రక్త పోటు లేదా హైపర్టెన్షన్ అనేది ఒక అంటు వ్యాధిలా ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. మారుతున్న జీవన విధానం, ఫాస్ట్ ఫుడ్ పై ఆధారపడటం, సోడా మరియు ఒత్తిడి వంటివి భారత దేశం లో ని అధిక రక్తపోటుకి కారణాలు. దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు మూత్ర పిండాల సమస్యలు వస్తాయి.

ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు అధిక రక్త పోటు సమస్య తో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, శారీరకశ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, స్థూలకాయం...అధికరక్తపోటుకు కారణమవుతున్నాయి. కారణం ఏదైనా బి.పి పెరిగిపోయి ప్రమాదకర పరిస్థితి వచ్చే వరకు గుర్తించలేకపోతున్నారు. బి.పి ఉందని తెలిసిన తరువాత దాన్ని తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతుంటారు. అయితే మందుల వరకు వెళ్లకుండా జీవనశైలిలో మరియు ఆహారంలో మార్పు చేసుకోవడం ద్వారా బి.పిని కంట్రోల్ చేసుకోవచ్చు.

మీ బరువును గమనించండి

మీ బరువును గమనించండి

నేడు ప్రజలు అధిక రక్తపోటు వంటి జబ్బులకు గురవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి బరువు ఎక్కువగా ఉండడం. భవిష్యత్తులో మీరు ఆరోగ్యంగా, హృదయపూర్వకంగా, వ్యాధుల నుండి దూరంగా ఉండడానికి, మీ రోజువారీ కార్యక్రమాలలో వ్యాయామాలు, ఫిట్నెస్ విధానం ఉండేట్టు చూసుకోండి. ఈ విషయంలో రాజీపడితే మీ మొత్తం ఆరోగ్యం తీవ్రమైన పర్యవసానాలను కలిగి ఉంటుంది.

ఒత్తిడిని తగ్గించడం

ఒత్తిడిని తగ్గించడం

ఒత్తిడి, మీ రక్తపోటును అధికంచేసే దోషులలో బాగా ప్రసిద్ది చెందింది. ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఒత్తిడిని నియంత్రించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలి. యోగా, ధ్యానం, సంగీతం దీనికి సమర్ధవంతమైన మార్గాలు.

ఉప్పును తక్కువగా తీసుకోవడం

ఉప్పును తక్కువగా తీసుకోవడం

ఒక వయసు తరువాత తక్కువ ఉప్పును తీసుకోవడం అనేది ముఖ్యమైన అడుగు, దీనిని విస్మరించకూడదు. ఉప్పు, సోడియం రక్తపోటును అధికం చేస్తుంది; అందువల్ల దీనిని తక్కువగా తీసుకోవడం వల్ల సమస్య రాకుండా సహాయపడుతుంది.

మద్యపానం తీసుకోవడం తగ్గించాలి

మద్యపానం తీసుకోవడం తగ్గించాలి

మద్యపానాన్ని తక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుందని చెప్పవచ్చు. అయితే, దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అధిక రక్తపోటు, లివర్ దెబ్బతినడం, మెదడుకి ప్రమాదం వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన జీవితం కోసం మీ జీవితం నుండి మద్యపానాన్ని నిషేధించండి.

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయలు

మీ దైనందిన ఆహారంలో కూరగాయలు, తాజా పండ్లు తీసుకుంటే రక్తపోటును అదుపులో ఉంచే అవసరమైన పొటాషియం ఏర్పడుతుంది. మీరు తాజా కూరగాయలు, పండ్లతో ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహరం తీసుకునేటట్లు నిర్ధారించుకోండి.

రక్తపోటును

రక్తపోటును

ఉత్సాహంగా ఉండండి మీ శరీరానికి శారీరిక కార్యక్రమాలను అభివృద్ది పరుచుకుంటే మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. కారుకు బదులుగా నడవడం, మీ కార్యక్రమాలను పూర్తి చేయడానికి సహాయపడే సాధనాలను నిషేధించడం చురుకైన జీవన విధానానికి తేలికైన మార్గాలు, ఇవి అధిక రక్తపోటును నివారించడానికి కీలకమైన సహాయ కారకాలు.

ధూమపానం ఆపేయడం

ధూమపానం ఆపేయడం

మద్యపానం లాగా, సిగరెట్ తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో హానికరం. పొగత్రాగడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు, కాన్సర్ వంటి అనేక ప్రమాదకర జబ్బుల సంఖ్య పెరుగుతుంది.

క్రమబద్ధమైన చెకప్ లు

క్రమబద్ధమైన చెకప్ లు

క్రమబద్ధమైన ఆరోగ్యకర చెకప్ లకోసం మీ కుటుంబ వైద్యుడిని సంప్రదించడం వల్ల ప్రమాదకర రోగాల నుండి, అనారోగ్యాల నుండి దూరంగా ఉండవచ్చు. ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఆరోగ్యకరమైన జీవితానికి ఖచ్చితమైన మూలం. మీ ఆహారం, జీవనశైలిలో చిన్న మార్పులు తీసుకురావడం వల్ల మీ మొత్తం శ్రేయస్సు కు విపరీత౦గా సహాయపడగలదు. చిన్న వయసులోనే ఈ విషయాలపట్ల శ్రద్ధ పెడితే, భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలను౦డైనా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

English summary

Ways to Keep High Blood Pressure at Bay

Food habits and working hours of people, today, have undergone tremendous changes owing to which, diseases of various kinds strike at an early age. High blood pressure is one of the most common health problems today and needs to be watched and prevented.
Desktop Bottom Promotion