For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మతిమరపు లక్షణాలు, నివారణ-వరల్డ్ అల్జైమర్స్ డే స్పెషల్

|

ఈ రోజు అంటే సెప్టెంబర్ 21 ప్రపంచ అల్జైమర్ డే. ఒక వయస్సు దాటాక మతిమరుపు రావడం అనేది సహజం. వృద్ధాప్యంలో వచ్చే అల్జైమర్స్ వ్యాప్తి ఇటీవల బాగా పెరిగింది. దాంతో అల్జైమర్స్ రోగుల సంఖ్యం కూడా పెరుగుతోంది. గతంలో కంటే ఇప్పుడు ఆయు:ప్రమాణాలు పెరగడంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. దాంతో అల్జైమర్స్ బారీన పడే వారి సంఖ్య ఆందోళ కలిగిస్తోంది. అల్జైమర్స్ అంటే అదేదో మతిమరపు వ్యాధి మాత్రమేనని చాలా మంది అనుకుంటారు. కానీ దీని తీవ్రత అంత కంటే ఎక్కువే. నేడు వరల్డ్ అల్జైమర్స్ యాక్షన్ డే సందర్భంగా అల్జైమర్స్ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమే ఈ కథనం.

మనందరం ఏదో ఒక విషయాన్ని మరిచిపోతుంటాం. ఇలా మరిచిపోవడం వల్ల కలిగే నష్టం తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా దాని వల్ల మన రోజువారీ పనులకు ఏ మాత్రం ఆటంకం ఉండదు. కాస్త వయస్సు పైబడ్డ తర్వాత మతిమరుపు వచ్చిందనుకోండి. దానివల్ల కొన్ని నష్టాలున్నా జీవితం పెద్దగా అస్తవ్యస్తం కాదు. కానీ అల్జైమర్స్ అలా కాదు. మరుపు, మతిమరుపునకు తారాస్థాయిగా అల్జైమర్స్ ను పేర్కొనవచ్చును.

World Alzheimer's Day

అల్జైమర్స్ కు ఒక చిన్ ఉదాహరణ చూద్దాం.. ఐదు నిముషాల క్రితం అక్కడే ఉంచిన తాళాలు ఎక్కడుంటాయో తల బాదుకున్నా ఒక్కోసారి గుర్తురావు. ఫ్రిజ్‌దాకా వెళ్లి ఎందుకోసం వచ్చామో ఎంతకీ తట్టదు. మళ్లీ పొయ్యి దగ్గరకు వెళ్లగానే గుర్తొస్తుంది. ఫలానా స్నేహితురాలు ఫోన్‌చేసినపుడు ఫలానా విషయం చెబుదామని అనుకుంటాం. ఆ విషయం ఫోన్‌ పెట్టిన తరువాత గుర్తొస్తుంది. అలాగని అన్నీ మర్చిపోతామా అంటే లేదు. చిన్ననాటి సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పమంటే రెడీ! ఫలానా పండుగరోజు ఏం చేశామన్నది టీకా, తాత్పర్యాలతో సహా గుర్తే! మరి వయసుతో వచ్చే ఈ మతిమరుపును చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే అధిగమించొచ్చు.

ఎందుకిలా జరుగుతుంది? అల్జైమర్స్ రోగుల్లో మెదడు క్రమంగా కుచించుకుపోతుంది. దాంతో మెదడుకణాలు క్రమంగా నశించిపోతాయి. అయితే ఎందుకిలా జరుగుతుందన్న అంశంపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి కారణం పర్యావవరణ అంశాలతో పాటు, జన్యుపరమైన కారణాలు కూడా ఈ వ్యాధికి దోహదపడుతున్నాయంటున్నారు నిపుణులు.

అల్జైమర్స్ తో నష్టాలు : ఈ రోజు ఏ వారం..అన్నది మరిచిపోవడం అందరి విషయంలోనూ సాధారణంగా జరిగే పరిణామమే. కానీ అసలు తేదీలు, వారాలు, నెలలు అన్న భావననే మరిచిపోతే..? అల్జైమర్స్ రోగుల్లో జరిగేదిదే. అయితే కొన్ని సార్లు అకస్మాత్తుగా మరచిన విషయాలు గుర్తుకు రావచ్చు కూడా. ఇలా మనం చూసే వృద్ధులే ఒక్కోసారి మామూలుగా మరికొన్నిసార్లు అన్ని విషయాలనూ మరిచిపోయినట్లుగా కనిపిస్తుంటారు. తమలో కలుగుతున్న మార్పులతో ఒక్కోసారి వారు చికాకు లోనవుతుంటారు. కొందరు భ్రాంతులకూ లోనవుతుంటారు.

అల్జైమర్స్ ఎలా గుర్తించాలి? చాలా కారణాలు మతిమరపుకు దోహదం చేస్తాయి. ఉదాహరణకు పక్షవాతం, మెదడులో గడ్డలు(ట్యూమర్స్), మెదడులో రక్తస్రావం(హ్యామరేజ్)వంటివి. అయితే రోగికి వచ్చిన మతిమరుపు అన్నది అల్జైమర్స్ కారణంగానే అని నిర్ధారణ చేయడం ఒకింత కష్టమైన ప్రక్రియ. దీనికి సిటీ స్కాన్, ఎమ్మారై (బ్రెయిన్)వంటి పరీక్షలు దోహదపడతాయి. ఇందులో మెదడు కుంచించుకుపోయినట్లుగా కనిపించడాన్ని బట్టి అల్జైమర్స్ ను గుర్తించవచ్చు. అలాగే రోగి చెప్పే లక్షణాలతో, వైద్యపరీక్షల ఫలితాలను సరిపోల్చి దీన్ని నిర్ధారణ చేయవచ్చు.

నివారణ: పక్షవాతాన్ని, డయాబెటిస్ ను నివారించడానికి అనుసరించే సాధారణ జీవనశైలి సూచనలే అల్జైమర్స్ ను నివారిస్తాయి. అదెలా అంటే...
1. వ్యాయామం: వ్యాయామంతో మానసికంగా ఉత్సాహంగా ఉండొచ్చు. అది 70- 80యేళ్ల వయసొచ్చినా సరే!
2. బద్ధకంగా ఉండేవారికంటే వ్యాయామం చేసేవాళ్లు చాలా చురుకుగా ఉంటారు. వ్యాయామం వారానికి 5 సార్లు 20- 40 నిముషాలు నడిచేవాళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు. తోటపని కూడా మనసు చురుకుగా ఉండటానికి సహాయంచేస్తుంది.
3. పొగతాగడం మానేయాలి.
4. తాగుడు మానేయాలి.

ఆటలు:
1. మెదడుకు పనిచెప్పే ఆటలు ఆడాలి. ఉదాహరణకు చెస్‌, బ్రిడ్జ్‌ వంటివి.
2. స్క్రాబుల్‌ గేమ్‌, కార్డ్స్‌, కంప్యూటర్‌ గేమ్స్‌
3. ఏదైనా సందర్భాన్ని గురించి రాయడం, పుస్తకాలు చదవడం, అనుభవాలు రాయడం మెదడు చురుగ్గా మారడానికి సాయపడతాయి.
4. సంగీత సాధన
5. పజిల్స్‌ చేయడం

ఆహారం:
పోషకాహారం అంటే ఎక్కువగా కాయగూరలు, పండ్లు తినడం, ఆరోగ్యకరమైన కొవ్వు, చేప, గింజధాన్యాలు, ముడిబియ్యం ఇవన్నీ మెదడుకు మంచివి. కొవ్వు ఎక్కువలేని మాంసం, మీగడతీసిన పాలు తీసుకోవాలి. బరువు తగ్గించుకోవడం అవసరం.చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు. మధ్యవయసువారిలో సాధారణంగా కలిగే ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటం కూడా అల్జైమర్స్ వ్యాధికి మంచి నివారణ.

English summary

World Alzheimer's Day Spcl: See Risks

September 21st is observed as the World Alzheimer's day for focusing on raising the awareness about Alzheimer's and dementia. Alzheimer's organisations give special attention on this day to keep people around the globe alert about Alzheimer's disease, which is the most common form of dementia.
Story first published: Saturday, September 21, 2013, 13:05 [IST]
Desktop Bottom Promotion