For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాపిల్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవలసిన 10 నిజాలు

|

'ఎన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ ఎవేనన్న' నానుడి మనకందరికీ తెలిసినదే. రోజు వారి మనకు కావలసినన్ని పోషకాలు యాపిల్ పండులో సమృద్ధిగా లభిస్తాయి. రోజూ ఆపిల్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు స్టామినా పెరుగుతుంది. ఫైబర్, యాంటిఆక్సిడెంట్స్ లు పుష్కలంగా ఉన్న యాపిల్ లో సీ విటమిన్ కూడా సమృద్ధిగానుండడంతో యాపిల్ ను రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండెకు యాపిల్ చేసే మేలు ఎన్నో అధ్యయనాలలో నిరూపితమైంది. అంతే కాకుండా, అల్జీమర్ వ్యాధి, కాన్సర్ ల బారిన పడకుండా యాపిల్ కాపాడుతుంది. అలాగే, డయాబెటిస్ వ్యాధికి గురయ్యే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. చెడు కొలస్ట్రాల్ ను నిర్మూలించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

యాపిల్ తింటే డాక్టర్ అవసం ఉండదా..ఎంత వరకూ నిజమో చూడండి...

యాపిల్ ను అలాగే తినవచ్చు లేదా దానిలో మరికొన్ని ఆహారపదార్థాలను జతచేయడం ద్వారా ఆహారంలో తీసుకోవచ్చు. స్కిన్ తో సహా యాపిల్ ను తీసుకుంటే ప్రయోజనాలు ఎక్కువ. యాపిల్ స్కిన్ ను తొలగించి తీసుకుంటే బెనిఫిట్స్ నష్టపోతాము. యాపిల్ స్కిన్ లో సమృద్ధిగా యాంటిఆక్సిడెంట్స్ ఉంటాయి. అయితే, మీరు ఆర్గానిక్ యాపిల్స్ కు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి. యాపిల్ ను తినేముంది పెస్టిసైడ్స్ లేకుండా జాగ్రత్తగా కడుక్కోవాలి.

గ్రీన్ ఆపిల్ తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:క్లిక్ చేయండి

యాపిల్ ను రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆసక్తికరమైన, ముఖ్యమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. యాపిల్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటే దానిని కచ్చితంగా తీసుకుంటారు. మరి యాపిల్ ద్వారా కలిగే లాభాలేంటో తెలుసుకుందామా?

చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

యాపిల్ లో పెక్టిన్ అనే కరిగిపోగల ఫైబర్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. లో డెన్సిటీ లిపోప్రోటీన్ ను నిర్మూలించడం ద్వారా ఇది అథెరోస్క్లెరోసిస్ అలాగే గుండె సమస్యల బారిన పడే ప్రమాదాన్ని అరికడుతుంది.

అల్జీమర్ వ్యాధిని అరికడుతుంది

అల్జీమర్ వ్యాధిని అరికడుతుంది

యాపిల్ లో ఉండే మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే అల్జీమర్ వ్యాధి బారిన పడకుండా యాపిల్ కాపాడుతుంది. క్వెర్సెటిన్ అనే ప్రభావవంతమైన యాంటిఆక్సిడెంట్ యాపిల్ లో పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణం. ఇది నాడీమండలాన్ని పరిరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. తద్వారా బ్రెయిన్ సెల్స్ దెబ్బతినకుండా తోడ్పడుతుంది.

మధుమేహం వ్యాధికి గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది

మధుమేహం వ్యాధికి గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది

మధుమేహం వస్తుందనే భయంతో పళ్ళను నివారిస్తున్నప్పుడు యాపిల్ పండును మాత్రం నిర్మూలించకండి. తగిన మోతాదులో యాపిల్ పండును తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయి కంట్రోల్డ్ గా ఉంటుంది. యాపిల్ లో ఉండే ఫైటోన్యూట్రిఎంట్స్, యాంటిఆక్సిడెంట్స్ గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో తోడ్పడతాయి. యాపిల్ లో ఉండే పోలిఫెనాల్స్ గ్లూకోజ్ స్థాయిలను నిర్దేశిస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి

రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి

యాపిల్ లో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండేందుకు సీ విటమిన్ అవసరం. ఫారీన్ బాడీస్ ఎటాక్ నుంచి శరీరానికి రక్షణ అందించేందుకు రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయాలి.

శుక్లాలను నిరోధిస్తుంది

శుక్లాలను నిరోధిస్తుంది

ఆక్సిడేటివ్ లోపంవల్ల శుక్లాలు ఏర్పడతాయి. ఫ్రీ రాడికల్స్ ను తొలగించుకునేందుకు యాపిల్ తోడ్పడుతుంది. తద్వారా శుక్లాలు ఏర్పడడాన్ని యాపిల్ నిరోధిస్తుంది.

స్కిన్ కేర్

స్కిన్ కేర్

యాపిల్ కేవలం డాక్టర్ నుంచే కాకుండా కాస్మొటాలజిస్ట్ నుంచి కూడా దూరంగా ఉంచుతుంది. యాపిల్ లో ఉండే కొలాజెన్, ఎలాస్తిన్ లు చర్మాన్ని పరిరక్షిస్తూ చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి తోడ్పడతాయి. యాపిల్ లో సమృద్ధిగా ఉండే యాంటిఆక్సిడెంట్స్ వల్లే ఇది సాధ్యం.

క్లియర్ ఎయిర్ వేస్

క్లియర్ ఎయిర్ వేస్

యాపిల్స్ లో ఉండే ఫైటోకెమికల్స్, ఎయిర్ బ్లాకెజెస్ తో సంబంధమున్న అస్తమా మరియు మరికొన్ని అలర్జిక్ వ్యాధులను అరికట్టడంలో దిట్ట. ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ యాసిడ్స్ అనే పదార్థాలు ఇందుకు ఉపయోగపడతాయి.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

బరువును అదుపులో ఉంచుకోవడానికి యాపిల్ సహకరిస్తుంది. యాపిల్ పండును జ్యూస్ గా తీసుకున్నా అలాగే పండుగా తిన్నా అందులో ఉండే పదార్థాలు బరువుని అదుపులో ఉండేలా తోడ్పడతాయి. తాజా యాపిల్ లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ అలాగే పెక్టిన్ బరువుని అదుపులో ఉంచుతాయి. యాపిల్ లో ఉండే పోలిఫెనాల్స్ జీవక్రియను క్రమబద్దీకరిస్తాయి.

కాన్సర్ తో పోరాడుతుంది

కాన్సర్ తో పోరాడుతుంది

కాన్సర్ తో కూడా పోరాడే శక్తి యాపిల్ కు ఉంది. యాపిల్ లో ఉండే క్వెర్సెటిన్, ట్రిటెర్పెనాయిడ్స్ కాన్సర్ వ్యాధి వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి. ఊపిరి తిత్తుల కాన్సర్, బ్రెస్ట్ కాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ రాకుండా ఉండేందుకు యాపిల్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఎముకల సంరక్షణ

ఎముకల సంరక్షణ

యాపిల్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. యాపిల్ లో ఫ్లోరిడ్జిన్ అనే ఫ్లేవనాయిడ్ ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి నుంచి రక్షణని కలిగిస్తుంది. బోన్ డెన్సిటీని కూడా పెంపొందిస్తుంది. మెనోపాజ్ దశకి చేరుకున్న మహిళలలో ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువ.

Desktop Bottom Promotion