For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అజీర్తీ నుండి బరువు తగ్గించే అన్ని సమస్యలకు: కీరదోస

|

కీరదోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఆరోగ్యానికి సహాయపడే న్యూట్రీషియన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్న ఒక వెర్సిటైల్ డ్రిక్. కీరదోసకాయలో అధిక శాతంలో నీరు, విటమిన్ కె, సిలికా, విటమిన్ ఎ, సి మరియు క్లోరోఫిల్ ఉంటుంది. చాలా మంది వారి రెగ్యులర్ డైట్ లో కీరదోసకాయను తప్పనిసరిగా తీసుకుంటారు. ఇది ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, స్కిన్, హెయిర్ మరియు నెయిల్స్ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

కీరదోసకాయను లేదా జ్యూస్ ను రెగ్యులర్ తీసుకోవడం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను కూడా నివారించవచ్చు. కీరదోసకాయను మంచి రుచి, స్వీట్, ఫ్లేవర్ కోసం ఇతర పండ్లతో చేర్చి కూడా తీసుకోవచ్చు. మరి ఈ పవర్ ఫుల్ కీరదోసకాయ యొక్క ఆరోగ్యప్రయోజనాల మ్యాజిక్ ను ఒక సారి చూద్దాం...

జుట్టు సంరక్షణకు:

జుట్టు సంరక్షణకు:

కీరదోసకాయలో అధికంగా నీటికంటెంట్ తో పాటు సల్ఫర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు ఉద్దీపన కలిగిస్తుంది .

చర్మం సంరక్షణకు:

చర్మం సంరక్షణకు:

బాగా ఉబ్బిన కళ్ళకు కీరదోసకాయ ముక్కలను చక్రాలుగా కట్ చేసి కళ్ళ మీద కొద్దిసేపు పెట్టుకోవాడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కీరోదసకాయను స్కిన్ హీలింగ్, స్కిన్ టానింగ్ వదిలించుకోవడంలో చక్కగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని అనేక ఫేస్ ప్యాక్ లలో ఉపయోగిస్తారు.

హ్యాంగోవర్:

హ్యాంగోవర్:

ఉదయం హ్యాంగోవర్ లేదా తలనొప్పి, వివకారం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మీరు రాత్రి నిద్రించే ముందు కీరదోసకాయ ముక్కలను తినాలి. ఇందులో షుగర్, విటమిన్ బి మరియు ఎలక్ట్రోలైట్స్ మరియు అవసరం అయ్యే న్యూట్రీషియంట్స్ ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

విటమిన్స్ ను అధికంగా అంధిస్తుంది:

విటమిన్స్ ను అధికంగా అంధిస్తుంది:

మన శరీర ఆరోగ్యానికి అవసరం య్యే విటమిన్ బి ను పుష్కలంగా అందిస్తుంది.

కీళ్ళనొప్పుల మరియు ఆర్థరైటిస్ నివారిస్తుంది:

కీళ్ళనొప్పుల మరియు ఆర్థరైటిస్ నివారిస్తుంది:

కీరదోసకాయలో సిలికాన్ డయాక్సైడ్ పుష్కలంగా ఉండి. ఇది కీళ్ళనొప్పులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది ఇందులో అదనంగా విటమిన్ ఎ, బి1, బి6, సి, డి, కె, ఫొల్లేట్, క్యాల్షియం, మరియు మెగ్నీషియం వంటి ఆర్ధరైటిస్ పెయిన్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

బ్యాడ్ బ్రీత్(చెడుశ్వాసను)నివారిస్తుంది:

బ్యాడ్ బ్రీత్(చెడుశ్వాసను)నివారిస్తుంది:

కీరదోసకాయను చక్రాలుగా కట్ చేసి, నోటి పై భాగంలో అతికించి 30సెకెండ్స్ అలాగే ఉండి తర్వాత తీసివేయాలి. ఇది నోట్లోని మైక్రో ఆర్గానిజమ్ ను నాశనం చేస్తుంది. చెడు శ్వాస నుండి ఉపశమనం కలిగిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

కీరదోసకాలయో అధిక శాతం నీరు మరియు అధికంగా ఫైబర్ కలిగి ఉండి ఇది శరీరంలో టాక్సిన్స్ ను తొలగించి,జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రెగ్యులర్ డైట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల క్రోనిక్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

రీ హైడ్రేషన్:

రీ హైడ్రేషన్:

కీరదోసకాయలో 95%నీటిని కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేష్ లో ఉంచుతుంది మరియు ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఒక రోజుకు అవసరం అయ్యే విటమిన్స్ ను కీరదోసకాయ పుష్కలంగా కలిగి ఉంది.

క్యాన్సర్ తో పోరాడుతుంది:

క్యాన్సర్ తో పోరాడుతుంది:

దోసకాయలు lariciresinol, pinoresinol మరియు secoisolariciresinol కలిగి ఉన్నాయి. ఈ మూడు కూడా ఎటువంటి క్యాన్సర్ లక్షణాలున్నా, వాటితో పోరాడి క్యాన్సర్ బారీనపడకుండా కాపాడుతుంది

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

కీరదోసకాయలో అతి తక్కువ క్యాలరీలో మరియు ఎక్కువ నీటిశాతం ఉండటం వల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఫర్ ఫెక్ట్ డైట్ ఫుడ్.

English summary

10 Best Benefits Of Cucumber Juice

Cucumber juice is a healthy, nutritious and versatile drink. Cucumbers have a high content of water and contain vitamin K, silica, vitamin A, vitamin C and chlorophyll. Many folks add cucumber juice to their diets to boost the standard of their skin, nails, and hair.
Story first published: Saturday, February 15, 2014, 12:02 [IST]
Desktop Bottom Promotion