For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లూ నివారించడానికి అత్యుత్తమ ఆహారాలు

By Mallikajuna
|

ధారణంగా ఫ్లూ వాతావరణంలోని తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఫ్లూజ్వరం వాతావరణంలో మార్పు, రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం, వర్షంలో తడవటం మరియు వైరస్‌వలన వ్యాప్తి చెందుతుంది. ఇది ఒక వైరస్ వల్ల కలిగే జబ్బు . దీనివల్ల ప్రాణ హాని కలుగదు కాని రకరకాల వ్యాధులకు ఇది దారి తీయవచ్చు. ఇది పూర్తిగా అంటువ్యాధి. ఇన్‌ఫ్లుయోంజా క్రిములు శరీరంలోకి ప్రవేశించి రెండు మూడు రోజులలోనే అపరిమితంగా వృద్ధిపొందుతాయి. ఆ క్రిములు వెలిగ్రక్కే విషం శరీరంలో హెచ్చు తుంది. అందువల్ల శరీరావయవాలన్నీ క్రుంగిపోతాయి.

వ్యాధి లక్షణాలు: వ్యాధి క్రిములు శరీరంలో ప్రవేశించిన రెండు, మూడు రోజులలో జ్వరం వస్తుంది. కాళ్ళు చేతులు, గొంతు, రొమ్ము ... శరీరం అంతటా నొప్పులు ఉంటాయి. దగ్గినప్పుడు నొప్పి ఉంటుంది. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. దగ్గినప్పుడు కళ్లె తెగిపడదు. నాలుగైదు రోజుల తర్వాత క్రమంగా వ్యాధి తగ్గుముఖం పడుతుంది.

‘జలుబు, దగ్గు, ఫ్లూ'కు తక్షణ ఉపశమనం ‘డైయట్: క్లిక్ చేయండి

జాగ్రత్తలు: పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఒళ్ళు నొప్పులూ, తల నొప్పి తగ్గడానికి వైద్యుని సలహామేరకు మందులువాడలి. శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి కాబట్టి విటమిన్ సి వాడితే మంచిది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి, ఆ ఉప్పు నీటితో పుక్కిలించవచ్చు. మరుగుతున్న నీటిలో టించర్ అయోడిన్ కలిపి ఆవిరిపట్టడం మంచిది. ఆ ఆవిరిని పీల్చడంవల్ల బాధ తగ్గుతుంది. నీలగిరి తైలం ( యూకలిప్ట్‌స్ ఆయిల్) వాడవచ్చు. జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరం, ముక్కు నుండి నీరు కారటం వంటి లక్షణాలు మూడు రోజులకు మించి ఉంటే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి. మంచినీరు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.

వ్యాధి నివారణ మార్గాలు: ఆరోగ్యంగా ఉండి, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి దరిచేరదు.ఈ వ్యాధితో బాధపడుతున్న రోగి తుమ్మినప్పుడు ఆ రోగక్రిములు గాలిలో ప్రవేశించి ఆ గాలి పీల్చినవాళ్ళందరికీ ఈ వ్యాధి సోకుతుంది. గొంతులో నుంచి, ముక్కులోనుంచి వెలువడే స్రావంలో సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి. కనుక మాట్లాడేటప్పుడు జేబు రుమాలు నోటికి అడ్డంగా పెట్టుకోవడం చాలా అవసరం. రోగస్థులు ఎక్కడపడితే అక్కడ ముక్కు చీదడం, ఉమ్మివేయడం లాంటి దురలవాట్లు మానుకోవాలి. ఫ్లూ జ్వరం సోకినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముక్కుకు, నోటికి చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి.

పురుషుల వ్యాధినిరోధకశక్తి పెంచే ఆహారాలు: క్లిక్ చేయండి

మనందరికి తెలుసు జలుబు, దగ్గు, జ్వరం ఇటువంటి సాధారణ జబ్బుల నుండి బయటపడాటానికి వ్యాధినిరోధక శక్తి పెంచుకోవడానికి, సరైన ఆహార, పానియాలు తీసుకోవాలని. ఐతే అందులో కూడా ఫ్లూ నివారణకు సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అయితే ఫ్లూ మరియు ఇతర ఇన్ఫెక్షన్ కు గురియైనప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలో చాలా మందికి తెలియదు. ఇన్‌ఫ్లూయంజా వైరస్ వలన జలుబు వస్తుంది. ఇది సాధారణ ఫ్లూ. ఈ మధ్య ‘ఫ్లూ'కి సంబంధించిన ఓ కొత్త విషయం కనిపెట్టారు శాస్తజ్ఞ్రులు. ఆహారంలో మార్పులు చేస్తే ‘ఫ్లూ'ని అరికట్టవచ్చని. భారతీయ ఆహార విధానం ‘ఫ్లూ'ని సమర్ధవంతంగా అరికడుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ ఉన్నప్పుడు మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు మీకోసం....

పండ్లు :

పండ్లు :

పండ్లు విటమిన్స్ మరియు మినిరల్స్ కు నేచురల్స్ కు ఒక సహజ వనరు. ప్లూ నివారించే ఆహారాల్లో ముఖ్యంగా పండ్లు ఇవి చాలా సులభంగా మరియు తేలికగా జీర్ణం అవుతాయి. ఆరెంజ్ ద్రాక్ష, ఆపిల్స్ మరియు ఇతర కొన్ని రకాలా పండ్లు ఫ్లూ నివారించడంలో సహాయపడుతాయి. పండ్లు ఇంకా శరీరాన్ని రీహైడ్రేషన్ చేస్తాయి. దాంతో ఫ్లూను నివారించుకోవచ్చు. పండ్ల ద్వారానే ఫ్లూ ట్రీట్మెంట్ ను చేయవచ్చు. నేచరల్ గా ఎప్పుడూ అందుబాటులో ఉండే పండ్లను తినడం ద్వారా ఫ్లూ ను నివారించవచ్చు.

సలాడ్స్ : -

సలాడ్స్ : -

ఫ్లూ పేషంట్స్ కు సలాడ్స్ ఒక ఉత్తమ ఆహారం. సలాడ్స్ లో ప్రోటీనుల మరియు కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీనులు ఫ్లూని నివారించే శక్తిని పునరుద్దరించడానికి అద్భుతంగా సహాయపడుతాయి. లైట్ వెజిటేబుల్ కీరదోసకాయ, క్యారెట్, మొదలగునవి రెగ్యులర్ గా క్రమం తప్పకుండా తింటుంటాడాలి.

జ్యూస్ లు:

జ్యూస్ లు:

వెజిటేబుల్ మరియు పండ్ల రసాలు ఫ్లూ ట్రీట్మెంట్ కు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్లూ ఫుడ్స్ ఖచ్చితంగా అధిక ప్రోటీన్స్ మరయు న్యూట్రీషియన్స్ కలిగినటువంటి జ్యూసులు క్యారెట్, టమోటో, బెర్రీ ఫ్రూట్ జ్యూస్ లు మరియు సిట్రస్ ఫుడ్స్ తీసుకోవడం ఫ్లూ నివారణకు ఉత్తమం.

బ్రౌన్ బ్రెడ్ మరియు వెల్లుల్లి:

బ్రౌన్ బ్రెడ్ మరియు వెల్లుల్లి:

వెల్లుల్లి యాంటీ మైక్రోబల్ లక్షణాలున్నాయి. ఇవి ఫ్లూకు కారణం అయ్యే వైరన్ తో వ్యతిరేకంగా పోరాడటానికి సహాయం పడుతాయి. బ్రౌన్ బ్రెడ్ లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి . ఇవి శరీరానికి అవసరం అయ్యే శక్తిని పెంచుతంది. అందువల్ల, వెల్లుల్లి మరియు బ్రౌన్ బ్రెడ్ కాంబినేషన్ శరీరానికి అవసరం అయ్యే శక్తిని అంధిస్తుంది, వ్యాధినిరోధకత పెంచుతుంది మరియు ఫ్లూ వైరస్సులతో సహజంగా పోరాడటానికి సహాయం చేస్తుంది.

అల్లం టీ :

అల్లం టీ :

ఫ్లూ నివారణకు అల్లం టీ ఒక నేచురల్ రెమెడీ. చాలా కాలం నుండి ఫ్లూ చికిత్స కోసం ఫ్లూ ఫుడ్ గా దీన్ని ఉపయోగిస్తున్నారు. అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఫ్లూ లక్షణాలను తగ్గిస్తాయి. మరియు ఫ్లూకు కారణం అయ్యే వైరస్ తో పోరాడుతాయి.

అరటిపండ్లు :

అరటిపండ్లు :

అరటిపండ్లు చాలా సులభంగా జీర్ణమై మరియు తేలికగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. అరటిపండ్ల మిల్క్ షేక్ లేదా బనానాతో పాటు పంచదారా మిక్స్ చేసి తీసుకోవడం వల్ల ఫ్లూ ట్రీట్మెంట్ కు ఒక మంచి ఎంపిక. అరపండ్లు మీరు వికారానికి గురిఅయినప్పుడు, అలసట చెందినప్పుడు మరియు వాంతి వచ్చేట్లు ఉన్నప్పుడు అరటిపండ్లు చాలా మంచిది. స్టొమక్ ఫ్లూతో బాధపడుతున్నప్పడు అరటిపండ్లు తినమని డాక్టర్లు సలహాలిస్తుంటారు.

పుదీనా:

పుదీనా:

మింట్ క్యాండీస్. పుదానీ మీ పొడిబారిన మరియు త్రోట్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. పుదీనాశరీరంలో వాటర్ కంటెంట్ ను నిర్వహించడానికి నాలుక మీద రుచిని తెలుపడానికి సహాయపడుతుంది. ఫ్లూ సమయంలో మింట్ క్యాండీస్ రిఫ్రెష్ చేస్తుంది.

టర్కీ -

టర్కీ -

టర్కీ మాంసంలో మరింత ప్రోటీన్లు మరియు తక్కువ కొవ్వులు కలిగి ఉంది . అందువలన , ఒక ఘన పోషణ టర్కీ ద్వారా అందించబడుతుంది . అందువలన , టర్కీ సహజ ఫ్లూ చికిత్స కోసం ఉపయోగించే ఒక మంచి ఫ్లూ ఆహారం.

సూపులు:

సూపులు:

హెల్తీ వెజిటేబుల్స్ మరియు చికెన్ సూపులుఫ్లూ సమయంలో శరీరానికి శక్తి అందివ్వడానికి బాగా సహాయపడుతాయి. సూపులు శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తాయి.

బ్లాక్ టీ-

బ్లాక్ టీ-

బ్లాక్ టీలో యాంటీయాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్లూ చికిత్సకు సహాయపడుతాయి మరియు గొంతు నొప్పిని నివారిస్తాయి

English summary

10 foods to treat flu

Flu is an irritating disease which makes a person nauseated and bed ridden for days. It is really annoying to sleep on the couch all day with high fever. Flu can annoy you especially because of the fatigue and nausea.
Desktop Bottom Promotion