For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీగా &ఫిట్ గా జీవించడానికి మంచి ఫుడ్ హ్యాబిట్స్

|

మీరు ఆరోగ్యంగా జీవించాలనుకుంటే, మొదట మీరు చేయాల్సింది మీ జీవన శైలిని మార్చుకోవాలి. ప్రస్తుత రోజుల్లో బిజీబిజీగా ఉన్న జీవన శైలితో వారి ఆరోగ్యం గురించి సరైన జాగ్రత్తలు, ఆరోగ్యం మీద శ్రద్ద తీసుకోని వారిని చాలా మందిని చూస్తుంటాం. అందరూ గుర్తుంచుకోవల్సిన ఒక ముఖ్య విషయమేటంటే, ఆరోగ్యమే మహాభాగం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎంతటి స్థాయికైనా చేరుకోగలడు. అదే ఆరోగ్యంగా లేనప్పుడు ఏం చేసిన, ఎంత సంపాధించినా ప్రయోజనం ఉండదు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఊబకాయానికి చేరుకోవడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు. అన్ని రకాల వ్యాధుల నుండి భయటపడాలన్నా, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించాలన్నా మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి. ఎప్పుడైతే మంచి ఆహారపు అలవాట్లును అలవర్చుకుంటారో మీ జీవితంలో పాజిటివ్ మార్పులను చూడగలుగుతారు. మంచి ఆహారపు అలవాట్లును అనుసరిస్తు, ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఈ మార్పు జీవితంలో ఎన్నో మంచి మార్పులకు తోడ్పడుతుంది.

ఈ రోజు మనం మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండటానికి మూడు ఆరోగ్యకరమైన కారణాలున్నాయి. అందులో మొదటి మీ శరీరం యొక్క వ్యాధినిరోధకతను స్ట్రాంగ్ గా ఉంచడానికి మరియు మీ శక్తిసామర్థ్యాలను పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా ఎదుర్కొనే శక్తిసామర్థాలు అందివ్వడానికి. రెండవది మిమ్మల్ని ఫిట్ గా ఉంచడానికి, శరీరంలోని ఎముకలు మరియు కణజాలాలు స్ట్రాంగ్ గా ఉంచడానికి. ఇక మూడవది మంచి ఆహారపు అలవాట్ల వల్ల త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి, ఈ మూడు విషయాలను మైండ్ లో ఉంచుకుంటే, తప్పకుండా బరువు తగ్గి, మంచి ఆరోగ్యకమైన జీవితాన్ని పొందుతారు. అటువంటి మంచి ఆహారాలు 10 ఈ క్రింది విధంగా ఉన్నాయి...

గ్రీన్ లీఫ్స్:

గ్రీన్ లీఫ్స్:

రెగ్యులర్ డైట్ లో గ్రీన్ లీఫ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. ఎక్కువ మాంసాహారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా మరియు శరీరం ఫిట్ గా ఉంటుంది.

కలర్ ఫుల్ ఆహారాలు:

కలర్ ఫుల్ ఆహారాలు:

మీరు ఖచ్చితంగా కొన్ని కిలోల బరువు తగ్గాలనుకున్నప్పుడు, ఈ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా అవసరం. తప్పనిసరిగా మీ భోజనం ప్లేట్ లో హెల్తీ మరియు కలర్ ఫుల్ వెజిటేబుల్స్ మరియు పండ్లు ఉండేలా చూసుకోవాలి.

తక్కువ భోజనం:

తక్కువ భోజనం:

తక్కువ భోజనం తీసుకోవాలి. అలాగే ఆ తక్కువ భోజనంలోనే శక్తివంతమైన ప్రోట్రీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ గుడ్ ఫుడ్ హ్యాబిట్ వల్ల అదనపు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బ్రేక్ ఫాస్ట్ హ్యాబిట్:

బ్రేక్ ఫాస్ట్ హ్యాబిట్:

ఆరోగ్యంగా ఉండటానికి ఒక గుడ్ ఫుడ్ హ్యాబిట్ . రెగ్యులర్ గా క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవాలి . రాత్రి నుండి ఉదయం వరకూ 8గంటల సేపు ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల, ఉదయం కూడా అల్పాహారం తీసుకోకపోతే, ఇక ఆరోజంగా నీరసంగా ఉంటుంది. ఏపని చేయలేరు, ఏపని మీద శ్రద్ద పెట్టలేరు.

కూర్చొని తినాలి:

కూర్చొని తినాలి:

మీరు నిల్చొని తిన్నప్పుడు పొట్టలు ప్రేగులో మరింత పొడవుగా సాగుతాయి. అలా తిన్నప్పుడు మరింత ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు కూర్చొని తింటారో, అప్పుడు మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

భోజనం తర్వాత గ్రీన్ టీ :

భోజనం తర్వాత గ్రీన్ టీ :

బరువు తగ్గడానికి మరో గుడ్ ఫుడ్ హ్యాబిట్ భోజనం తర్వాత గ్రీన్ టీని తీసుకోవాలి . గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది మెటబాలిక్ రేట్ ను పెంచుతుంది.

కార్బోహైడ్రేట్స్ ను నో చెప్పకండి:

కార్బోహైడ్రేట్స్ ను నో చెప్పకండి:

ఆరోగ్యంగా జీవించడానికి ఒక మంచి ఆహారపు అలవాటు కార్పోహైడ్రేట్స్ ను చాలా తక్కువ పరిమాణంలో రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా వసరం. ఇవి శక్తిని అందివ్వడానికి బాగా సహాయపడుతాయి.

జ్యూస్ కు బదులుగా నీళ్ళు:

జ్యూస్ కు బదులుగా నీళ్ళు:

సాధ్యమైనంత వరకూ ఎక్కువ నీళ్ళు త్రాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగిపోతాయి. జ్యూస్ లు తియ్యగా ఉండటం వల్ల అదనపు బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి, జ్యూసులకు బదులు నీళ్ళు ఎక్కువగా త్రాగాలి.

ప్రోటీన్ స్నాక్స్:

ప్రోటీన్ స్నాక్స్:

ఆరోగ్యంగా ఉండటానికి మరియు బరువు తగ్గడానికి హెల్తీ ప్రోటీన్ స్నాక్స్ ను అందులోనూ ఫైబర్ అధికంగా ఉండే ప్రోటీన్ స్నాక్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

గ్రేవీలు తగ్గించాలి:

గ్రేవీలు తగ్గించాలి:

నాన్ వెజిటేరియన్ గ్రేవీలు ఎక్కువగా తినడం వల్ల అదనపు బరువు పెరుగుతారు. కాబట్టి, బెస్ట్ ఫుడ్ హ్యాబిట్ రెండూ కూడా స్మాల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు.

English summary

10 Good Food Habits To Stay Healthy

If you want to live healthy, the first thing you need to do is change your lifestyle. There are a lot of people who are so busy with their work that they find it difficult to take care of their health. You should always keep in mind that health is wealth and without the former, you cannot make your life richer!
Story first published: Thursday, May 22, 2014, 17:44 [IST]
Desktop Bottom Promotion