For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీర్ఘకాలిక కీళ్ళనొప్పులతో పాటు వచ్చే ఇతర సమస్యలు

|

ప్రస్తుత రోజుల్లో మానసికమైన ఒత్తిడి, డిప్రెషన్, బాధలు, భయాలు, ఆందోళన వలన శరీరంలోని రసాయనాలలో ఎన్నో మార్పులు జరిగి అనేక వ్యాధులకు గురి చేస్తాయనే విషయం అందరికి విదితమే. అయితే వీటివలస కేవలం హార్మోన్ల అసమతుల్యత, హైపర్ టెన్షన్, కొన్నిరకాల సైకో-పామాటిక్ డిజార్డర్స్ మాత్రమే కాదు సున్నితంగా ప్రతిస్పందించే వారిలో జన్యుపరమైన మార్పులకు దారి తీయవచ్చును, అందువలననే ఈ మధ్యకాలంలో ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాం. ఈ తరహా వ్యాధులలో ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్(కీళ్ళ నొప్పులు).

కీళ్ల నిర్మాణ వ్యవస్థ శరీరాన్ని బలోపేతం చేయడంతో పాటు శరీర కదలికలు, దృఢత్వం, నిలకడ, భంగిమలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వ్యవస్థలో జరుగు జీవక్రియల అసమతుల్యతలను శరీర రోగనిరోధక వ్యవస్థ సాధ్యమైనంత వరకు నిరోధించి తిరిగి సమతుల్యం చేసే ప్రక్రియ సహజంగా జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఏర్పడు ముఖ్యలక్షణమే కీళ్లనొప్పి. అయితే కీళ్లనొప్పులను నిర్లక్ష్యం చేసినపుడు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీయవచ్చు. కీళ్లనొప్పులతో అనుసంధానమైన దీర్ఘకాలిక సమస్యలు ఈ కింది విధంగా ఉండవచ్చు.

1.ఆర్థరైటిస్

1.ఆర్థరైటిస్

వయసు పెరుగుతున్న కొద్దీ శిథిలమవుతున్న కీళ్లవ్యవస్థ చిన్న వయసులో వచ్చే ఆర్థరైటిస్ సమస్యలకు, కీళ్లనొప్పి ఆరంభలక్షణంగా బయటపడవచ్చు. అలాగే దీర్ఘకాలికంగా కీళ్లనొప్పి ఉండటం, పని ఒత్తిడిలో వెన్నులో ఉన్న నొప్పి వంటివి వెన్నులో ఆర్థరైటిస్ లక్షణాలకు దారితయవచ్చు. అలాగే మెడ పరిసరాల భాగంలో నొప్పి, కండరాలు లాగడం, ఒక్కొక్క భంగిమలో నడుము పట్టేయడం, నడుం నొప్పి, స్పాండిలైటిస్, డిస్క్ సమస్యలకు సంకేతాలుగా పేర్కొనవచ్చు. సయాటిక మొదలగు నరాల సంబంధిత అనారోగ్యాలలో కూడా కీళ్లనొప్పి బయటపడవచ్చు. కీళ్లనొప్పి, జ్వరం, కండరాల నొప్పి వంటివి చిన్న వయసులో కనిపించడం రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సంకేతాలు కావచ్చు. చిన్న పిల్లల్లో గొంతునొప్పితో ప్రారంభమై కీళ్లనొప్పి, వాపు వంటివి రుమాటిక్ ఫీవర్ లక్షణాలలో కనిపించవచ్చు.

2.గ్యాస్ట్రిక్ సమస్యలు

2.గ్యాస్ట్రిక్ సమస్యలు

కడుపు నొప్పితో పాటు కీళ్లనొప్పులు, కండరాలు బిగుసుకుపోవడం, విరేచనాలు, మలబద్ధకం కనిపించడం, తేన్పులు కడుపు ఉబ్బరం వంటివి కనిపిస్తాయి. పేగుల్లో పుండ్లు, మంట, నొప్పితో పాటు విముక్తి పొందడానికి అవసరమగు పోషకాలు అందక పోవడం వల్ల అనారోగ్య లక్షణాల నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది.

3.రక్తనాళాలు, గుండె సమస్యలు

3.రక్తనాళాలు, గుండె సమస్యలు

దీర్ఘకాలంగా కీళ్లనొప్పులతో పాటు కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, మంటలు, కండరాలనొప్పి, బిగుసుకుపోవడం, రక్తనాళాలలో జరుగు నిర్మాణాత్మక మార్పులకు సంకేతాలు కావచ్చు. అలాగే రక్తంలో కొవ్వు పదార్థాలు పేరుకు పోవడం వల్ల గుండె సమస్యలకు దారితీయవచ్చు.

4.సైనస్ ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలు

4.సైనస్ ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలు

దీర్ఘకాలంగా కీళ్లనొప్పులతో సతమతమవడం, రోగనిరోధక శక్తి తగ్గడం తద్వారా సైనస్ ఇన్‌ఫెక్షన్లకు దారితీయవచ్చు. సైనస్ ఇన్‌ఫెక్షన్లలో జ్వరం, తలనొప్పి, జలుబు, ముక్కుదిబ్బడ, ముక్కు కారడం, కండరాల నొప్పులు వంటివి గమనించవచ్చు. రకరకాల సూక్ష్మక్రిముల వల్ల కలుగు ఇన్‌ఫెక్షన్లలో కీళ్ల వాపు, నొప్పి సహజం. ఆహారానికి సంబంధించిన అలర్జీల వల్ల కండరాలు బిగుసుకుపోవడం, నొప్పి, విరోచనాలు,వాంతులు, చర్మంపై దురద వంటివి కనిపించవచ్చు.

5.మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు

5.మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు

జీవక్రియలలో తయారైన వ్యర్థాలను బయటకు పంపించే వ్యవస్థలలో యూరినరీ ట్రాక్ అంటే కిడ్నీలు, మూత్రనరాలు, మూత్రాశయం, యురెత్రాల పాత్ర ఎంతో ముఖ్యం. సాధారణంగా యూరినరీ ట్రాక్‌లో రకరకాల కారణాల వల్ల ప్రవేశించే సూక్ష్మక్రిములను రోగనిరోధక వ్యవస్థ ద్వారా శరీరంలో నుంచి బయటకు పంపడం జరుగుతుంది. అయితే దీర్ఘకాలిక కీళ్లనొప్పుల వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్లు ప్రారంభం కావచ్చు. మూత్రంలో మంట, చీము వచ్చినపుడు యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్లు అంటారు.

6.రక్తహీనత

6.రక్తహీనత

జీవక్రియ అసమతుల్యత వల్ల ఎముకలకు, కీళ్ల వ్యవస్థకు అందవలసిన పోషకాలు అందకపోవడం వల్ల కీళ్ల నిర్మాణ వ్యవస్థ బలహీనపడి కీళ్లనొప్పిగా ఆరంభమై రక్తహీనత సమస్యకు దారితీయవచ్చు.

7.జుట్టు రాలుట

7.జుట్టు రాలుట

జీవక్రియ అసమతుల్యత వల్ల ఎముకలకు, కీళ్ల వ్యవస్థకు అందవలసిన పోషకాలు అందకపోవడం వల్ల కీళ్ల నిర్మాణ వ్యవస్థ బలహీనపడి కీళ్లనొప్పిగా ఆరంభమై జుట్టు సమస్యకు దారితీయవచ్చు.

8.డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు

8.డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు

శరీర కణాలకు అవసరమగు పోషకాలు అందకపోవడం వల్ల చిన్న చిన్న ఒత్తిడికి కూడా కీళ్లనొప్పులు, వాపు వంటివి ఏర్పడి డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలకు నాంది కావచ్చు. అంటే సరిపడా ఆహారం తీసుకున్నప్పటికీ హార్మోన్ల అసమతుల్యత వల్ల కీళ్లలో నిర్మాణాత్మక మార్పులు జరగవచ్చు. పైగా జీవక్రియ, జీవరసాయన ప్రతిక్రియల వల్ల రోగనిరోధక వ్యవస్థపై భారంపడి రకరకాల ఇన్‌ఫెక్షన్లకు, దీర్ఘకాలిక వ్యాధులకు దారితీయవచ్చు.

9.సొరియాసిస్

9.సొరియాసిస్

చర్మంపై పొట్టు రాలుట, తలలో చుండ్రు, చర్మం పొలుసులుగా రాలడం, చర్మంపై పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. దీర్ఘకాలం కొనసాగినపుడు కీళ్లనొప్పి తద్వారా సొరియాటిక్ ఆర్థరైటిస్ ఆరంభం కావడం జరగవచ్చు. క్రమంగా కీళ్లవాతానికి కూడా దారితీయవచ్చు.

10.స్త్రీలలో నెలసరి సమస్యలు

10.స్త్రీలలో నెలసరి సమస్యలు

జన్యుపరంగా, త్వరగా ఒత్తిడికి గురై కీళ్లనొప్పులకు లోనయ్యే అవకాశం గల స్త్రీలలో నెలసరి సమయంలో నడుం నొప్పి, కడుపు నొప్పిలాంటివి హార్మోన్ల అసమతుల్యతలకు సంకేతాలుగా పరిగణించవచ్చు. పీసీఓడీ, ఫైబ్రాయిడ్స్‌తోపాటు సంతానలేమికి దారితీయవచ్చు.

11.రోగనిరోధక వ్యవస్థలు

11.రోగనిరోధక వ్యవస్థలు

రోగనిరోధక వ్యవస్థ ఏదో ఒక కారణం వల్ల బలహీనపడుతున్నప్పుడు కనిపించే మొదటి సంకేతాలలో కీళ్లనొప్పి, వాపు, అలసట, తెలియన ఆందోళన, బరువు తగ్గడం వంటివి ఆరంభ లక్షణాలుగా గుర్తించవచ్చు.

English summary

10 Health Risks Linked to Rheumatoid Arthritis

If you have rheumatoid arthritis (RA), be on the lookout for other health problems associated with the autoimmune disorder. They may be caused by RA-related inflammation or RA treatments, or they may occur at higher rates for unknown reasons.
Story first published: Monday, February 10, 2014, 13:29 [IST]
Desktop Bottom Promotion