For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గాలంటే, సమ్మర్ లో తినకూడని 10 ఫ్యాట్ ఫుడ్స్!

|

వేసవి కాలం అంటే, సెలవులు, పార్టీలు, ఒకరి ఇంటికి మరొకరు సాయంత్రం వేళ వెళ్ళి గడపటాలు వంటివాటితో ఆనందం అద్భుతంగా వుంటుంది. చిప్స్, ఇతర వేపుడు పదార్ధాలు, కూల్ డ్రింకులు వంటివి తింటూ అందరూ కలసి ఆనందిస్తారు. అయితే, మీరు తీసుకునే ఈ ఆహారాలు, మీ బరువు అధికం చేయకుండా చూసుకోండి. వేసవిలో మనం తినే ఆహారంలో కొన్ని ఆహారాలు ఎలా బరువు పెంచేస్తాయో చూడండి. మీరు కనుక మీ శారీరక రూప లావణ్యాలపట్ల జాగ్రత్త పడేవారైతే, ఈ వేసవి ఆహారాలు తప్పక వదలండి.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం....సమ్మర్ వెయిట్ లాస్ టిప్స్:క్లిక్ చేయండి

ఐస్ క్రీమ్

ఐస్ క్రీమ్

వేడిగా వుండే ఈ రోజుల్లో ప్రతి ఇంటిలోను ఐస్ క్రీమ్ వుంటుంది. మనం వారింటికి వెళ్ళినా, వారు మన ఇంటికి వచ్చినా, లేదా ఏదైనా పార్టీ వంటివి జరిగినా, లేదా సాయంత్రం షికారులో ఐస్ క్రీమ్ తినటం తప్పనిసరి అయిపోతుంది. ఐస్ క్రీమ్ లో కేలరీలు అధికం. శరీరంలో కొవ్వు నిల్వలు ఏర్పడతాయి.

స్నాక్స్

స్నాక్స్

మీరు తినే చిరుతిండి, తీపి లేదా ఉప్పు ఏదైనప్పటికి అది కొవ్వు చేర్చేదే. వేసవిలో సాయంత్రం వేళ ప్రతి ఒక్కరూ స్నాక్స్ అంటూ చిరుతిండి తింటూనేవుంటారు. మీరు తినే ఈ చిరుతిండి నూనెలో వేయించినది అయితే, బరువెక్కటం మరింత తేలిక. చికెన్ వేపుడు, ఫ్రెంచి ఫ్రైలు, ఏదైనప్పటికి అది కొలెస్టరాల్, కేలరీలు కలిగిస్తుంది. గుండెకు అనారోగ్యం కలిగిస్తుంది. వేపుడులుకు బదులు, ఉడికించిన పదార్ధాలు తినండి.

కూల్ డ్రింకులు

కూల్ డ్రింకులు

వీటికి ఏ రకమైన పోషక విలువలు వుండవు. కాని చల్లగా వుండటం చేత తాగేస్తాము. ఇవి బరువు పెంచుతాయి. తీపి డ్రింక్, షర్బత్, వంటివాటిలో షుగర్ అధికంగా వుండి కేలరీలు వుంటాయి. అవి బరువెక్కిస్తాయి. కనుక కూల్ డ్రింక్ లకు బదులు, తాజా పండ్ల రసాలు తాగి శరీరానికి ఆరోగ్యం చేకూర్చండి.

చాక్లెట్ లు

చాక్లెట్ లు

చాక్లెట్ లు ఎప్పటికి ఇష్టమైనవే. కాలం ఏదైనా వీటిని తినటానికి అందరూ ఇష్టపడతారు. అయితే సమ్మర్ అంటూ కోల్డ్ చాక్లెట్ తింటే అది ఆరోగ్యానికి హాని కలిగించేదే. ఇవి అధికంగా తింటే, బరువు పెరగటం గ్యారంటీ.

కొబ్బరి నీరు

కొబ్బరి నీరు

కొబ్బరి నీరు తగుమాత్రంగా ఎపుడూ మంచిదే. కాని కొబ్బరి నూనెలతో చేసిన ఆహారాలు, కొబ్బరి బొండాం లోని లేత కొబ్బరి వంటివి తగుమాత్రంగా మాత్రమే తినండి.

టాపింగ్స్

టాపింగ్స్

తినే ఆహారాలలో జున్ను, వెన్న, నెయ్యి లేదా ఇతర తీపి చేరుస్తున్నారా? వెంటనే మానేయండి. ఆహారాలను ఈ రకమైన టాపింగ్స్ లేకుండా తిని ఆరోగ్యంగా వుండండి.

మామిడి పండ్లు -

మామిడి పండ్లు -

తింటే ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే, ఆఫ్రికన్ మేంగో వంటివి బరువుకూడా తగ్గిస్తాయి. అయితీ వీటిని షుగర్, స్వీటెనర్ వంటి వాటితో చేర్చి లేదా ఇతర డ్రింకులతో చేర్చి తాగితే, లేదా తింటే, బరువు పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు శరీర బరువు తప్పక పెంచుతాయి. కనుక వేసవిలో ఆహారాలు తీసుకునే విషయంలో తగు జాగ్రత్తలు పాటించి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మిల్క్ షేక్స్:

మిల్క్ షేక్స్:

మీరు ఇంట్లో కాకుండా బయట ఎట్టిపరిస్థితుల్లోనూ మిల్క్ షేక్ ను తీసుకోకూడదు. బయట తయారుచేసే మిల్క్ షేక్స్ లో 1000క్యాలరీలు ఉంటాయి. కాబట్టి, మీకు సమ్మర్ లో మిక్క్ షేక్స్ త్రాగాలనిపించినప్పుడు, బయట వాటి కంటే, హోం మేడ్ వాటికి ప్రాధాన్య ఇవ్వండి.

ఆల్కహాల్ డ్రింక్స్:

ఆల్కహాల్ డ్రింక్స్:

సమ్మర్ లో వేడిని తట్టుకోవడానికి ప్రత్యేకంగా తయారుచేసే కాక్ టైల్స్ లో క్యాలరీలు అధికంగా ఉంటాయి మైతైస్, మడ్ స్లైడ్స్, లాంగ్ ఐస్ ల్యాండ్ ఐస్ టీలు మరియు మర్గరైటాస్ మరికొన్ని వాటిలో అధిక క్యాలరీలు ఉంటాయి. కాబట్టి, సమ్మర్ లో వీటికి దూరంగా ఉండాలి.

డైట్ సోడాలు:

డైట్ సోడాలు:

డైట్ సోడాలో కూడా క్యాలరీలు కలిగి ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం సోడాలు బరువు పెరగడానికి ప్రధాన కారణం అవుతుంది. పరిశోధనల ప్రకారం డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ను వాడటం వల్ల ఇవి మరంత ఆకలిని పెంచుతాయి. కాబట్టి, సోడా బరువు పెంచే క్యాలరీలను కలిగి ఉంది.

English summary

10 Most Fattening Summer Foods to Avoid..!

Summers, the season to enjoy barbeques, pool parties and get together. A season to have fried foods and chilled soft drinks. You can have summer foods like a glutton but make sure they are healthy and doesn't add to your weight.
Desktop Bottom Promotion