For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైనాపిల్ తినడం వల్ల కలిగే 10 తీవ్ర దుష్ప్రభావాలు

By Super
|

ప్రత్యేకమైన రూపం పైనాపిల్ కు ప్రధాన ఆకర్షణ. ప్రత్యేకమైన రంగు, పై పొర ముళ్ళులా ఉండడం, వైవిధ్యమైన ఆకారం ఇవన్నీ పైనాపిల్ ను ప్రత్యేకంగా ఉంచుతున్నాయి. పైనాపిల్ రుచి తియ్యగా ఉంటుంది. పైనాపిల్ తో జ్యూస్ ను తయారు చేస్తారు. సలాడ్స్, సైడ్ డిషెస్ కు కూడా పైనాపిల్ ను ఉపయోగిస్తారు. పైనాపిల్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పైనాపిల్ ను ఔషదంగా కూడా ఉపయోగిస్తారు. అయితే, పైనాపిల్ ను తీసుకోవడం వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అవేంటో చూద్దాం.


పైనాపిల్ సైడ్ ఎఫెక్ట్స్

పైనాపిల్ తీయగా ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనిని ఎన్నో వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అయితే, పైనాపిల్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే, ఈ సైడ్ ఎఫెక్ట్స్ మరీ అంత ప్రమాదకరమైనవి కావు. తగినంత మాత్రమే తీసుకుంటే పైనాపిల్ వల్ల ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవచ్చు. అయితే, అందుకు తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.

పైనాపిల్ తినడం వల్ల కలిగే 10 రకాల సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అలర్జిక్ రియాక్షన్స్

అలర్జిక్ రియాక్షన్స్

కొంత మంది మహిళలలో అలాగే పురుషులలో పైనాపిల్ అలర్జిక్ రియాక్షన్స్ చూపిస్తుంది. పైనాపిల్ తినడం వల్ల స్వల్ప అలర్జిక్ రియాక్షన్స్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. పెదవి వాపు, గొంతులో దురదవంటివి దీని లక్షణాలు. ఈ సమస్యను అధిగమించేందుకు పైనాపిల్ ను తినే ముందు పైనాపిల్ ముక్కలను శుభ్రమైన సాల్ట్ వాటర్ లో క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ పండులోనున్న ఎంజైమ్స్ తొలగిపోతాయి. తద్వారా రాషెస్ రాకుండా జాగ్రత్తపడవచ్చు.

గర్భస్రావం ప్రమాదం

గర్భస్రావం ప్రమాదం

పైనాపిల్ తింటే గర్భస్రావమయ్యే ప్రమాదముంది. గర్భం దాల్చిన మహిళలు పైనాపిల్ కు దూరంగా ఉండటం మంచిది. నెలలు నిండే కొద్ది ప్రమాద స్థాయి తగ్గుతుంది కాబట్టి తరువాతి నెలలలో ఎటువంటి భయం లేకుండా పైనాపిల్ ను తినవచ్చు.

ఆర్థరైటిస్ మరియు రుమాటిజం

ఆర్థరైటిస్ మరియు రుమాటిజం

పైనాపిల్ ను తిన్నతరువాత జీర్ణ వాహికకు చేరుకోగానే అది ఆల్కహాల్ గా మారిపోతుంది. అందువల్ల, ఆర్థరైటిస్ బారిన పడే అవకాశముంది. కాబట్టి, ఆర్థరైటిస్ మరియు రుమాటిజంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు పైనాపిల్ ను ఎక్కువగా తినకూడదు.

బ్లడ్ షుగర్ ను పెంచుతుంది

బ్లడ్ షుగర్ ను పెంచుతుంది

పైనాపిల్ లో సహజసిద్ధంగా షుగర్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. సుక్రోస్, ఫ్రక్టోస్ లు ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవారు పైనాపిల్ దుష్ప్రభావం ఉంటుంది. పైనాపిల్ పండుని తీసుకున్న స్థాయిని బట్టి దాని దుష్ప్రభావం ఉంటుంది. పైనాపిల్, రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను రేకెత్తిస్తుంది. రక్తంలోని షుగర్ లెవల్ ను నియంత్రించడానికి పైనాపిల్ ను మితంగా తీసుకోవాలి. రోజుకు రెండుసార్లకే పైనాపిల్ ను పరిమితం చేయాలి.

కొన్ని రకాల మందులపై దుష్ప్రభావం

కొన్ని రకాల మందులపై దుష్ప్రభావం

పైనాపిల్ లో బ్రోమేలిన్ ఉంటుంది. ఇది కొన్ని రకాల ఔషదాలతో కలవడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. మీరు ఏవైనా యాంటి బయాటిక్స్, యాంటి కన్వల్సెంట్స్ తీసుకుంటుంటే పైనాపిల్ ను తీసుకోకూడదు. ఆల్కహాల్ తో కూడా పైనాపిల్ ఇంటరాక్ట్ అవడం వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు ఉన్నాయి. అటువంటి మేడికేషన్స్ మీరు తీసుకుంటునట్లయితే పైనాపిల్ తినడానికి ముందు వైద్యుల సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి.

రా పైనాపిల్ సైడ్ ఎఫెక్ట్స్

రా పైనాపిల్ సైడ్ ఎఫెక్ట్స్

పచ్చి పైనాపిల్ ను, అలాగే పచ్చి పైనాపిల్ జ్యూస్ ను తీసుకోవడం ప్రమాదకరం కావచ్చు. ఇది తినడానికి విషపూరితమయ్యే ప్రమాదం ఉంది. విపరీతమైన వాంతులకు దారితీయవచ్చు.

నోటిలో అసౌకర్యం

నోటిలో అసౌకర్యం

పైనాపిల్ లో ఎక్కువ మోతాదులో నున్న యాసిడ్స్, నోటిలో, గొంతులో ఎక్కువగా మ్యూకస్ ను ఉత్పత్తి చేస్తాయి. దాని వల్ల నోటిలో అసౌకర్యం ఏర్పడుతుంది. కొంతమందిలో కడుపునొప్పి సమస్య కూడా ఎదురవుతుంది.

రక్తానికి సంబంధించిన మందులపై దుష్ప్రభావం

రక్తానికి సంబంధించిన మందులపై దుష్ప్రభావం

రక్తానికి సంబంధించిన మందులను వాడేటప్పుడు పైనాపిల్ ను పూర్తిగా నిర్మూలించాలి. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నందున వైద్యుల సూచనలను పాటించాలి.

బ్రొమెలైన్ ప్రతికూల ప్రభావం

బ్రొమెలైన్ ప్రతికూల ప్రభావం

పైనాపిల్ లో ఉండే ప్రధాన పదార్ధం బ్రొమెలైన్. ఇది పోషకాలను బ్రేక్ చేస్తుంది. దీనివల్ల కొంతమందిలో కొన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు తలెత్తవచ్చు. అలెర్జీలకు కూడా ఇది కారణమవుతుంది. ఇది కామన్ కాకపోయినా పైనాపిల్ ను తీసుకునే ముందు ఆలోచించడం మంచిది.

దంత పరిశుభ్రత

దంత పరిశుభ్రత

దంత క్షయానికి పూర్తిగా పైనాపిల్ నే నిందించలేకపోయినా ఎక్కువగా పైనాపిల్ ను తీసుకోవడం వల్ల దంత సమస్యలు ఏర్పడతాయి. పంటి ఎనామిల్ పైన పైనాపిల్ తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. కేవిటీస్, గింగివిటీస్ ఏర్పడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి.

పైనాపిల్ వల్ల కలిగే దుష్ప్రభావాలను పక్కన పెడితే పైనాపిల్ వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అమృతాన్ని ఎక్కువగా తీసుకుంటే విషంగా మారుతుందన్న నానుడి తెలిసినదే కదా. ఇదే అంశం పైనాపిల్ కు కూడా వర్తిస్తుంది. తగిన మోతాదులో తీసుకుంటే పైనాపిల్ వల్ల ప్రయోజనాలే ఉంటాయి.

English summary

10 Serious Side Effects Of Pineapple

Pineapple can be recognized among various other fruits because of its unique hue, shape and thorny leaves. The vibrant yellow hue of this fruit and its sweet flavour are quite enticing.
Desktop Bottom Promotion