For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువైతే? ఆరోగ్య సమస్యలు

|

సహజంగా మన శరీరంలో అనేక జీవక్రియలు సక్రమంగా పనిచేయాలంటే అనేక హార్మోనులు అవసరం అవుతాయి. మన జీవక్రియల సామర్థ్యం పెంచడానికి హార్మోనులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. మన జీవితంలో స్త్రీ మరియు పురుషులిద్దరిలోనూ హార్మోను ప్రధాన పాత్రను పోషిస్తాయి. మహిళలలో ప్రొజిస్టెరాన్ హార్మోను ముఖ్య పాత్రను పోషించి మహిళ యొక్క జీవన రేటును తెలుపుతుంది. ఈ హార్మోన్ వల్ల స్త్రీలో రుతుక్రమం,గర్భధారన మరియు సంతానం మీద ముఖ్య పాత్రను పోషిస్తుంది. మహిళల శరీరంలో ప్రొజెస్టెరాన్ స్థాయిలు పనిచేయడానికి వివిధ రకాల కారణాలున్నాయి.

అదే విధంగా, పురుషుల్లో కూడా టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ముఖ్యమైనది. పురుషులు యుక్తవయస్సు నుండి యవ్వనస్తులుగా మార్పు చెండంలో ఈ హార్మోన్ చాలా ప్రభావం చూపుతుంది.

ఇంకా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ పురుషుల్లో సెక్స్ డ్రైవ్ కు సహాయం చేస్తుంది. అయితే ఈ టెస్టోస్టెరాన్ పురుషుల్లో తక్కువగా ఉండటానికి వివిధ రకాల కారణాలున్నాయి. కానీ, ఈ సమస్యను గుర్తించినట్లైతే చాలా సులభంగా మందులతో నయం చేసుకోవచ్చు. ఈ విషయంలో వైద్య పురోగమనానికి కృతజ్ఞతలు చెప్పవర్చు. మహిళల్లో వలే, పురుషుల్లో కూడా ఎమోషనల్ మరియు ఫిజికల్ హెల్త్ లో మార్పుల వల్ల టెస్టోస్టెరాన్ లెవల్స్ లో మార్పులు వస్తాయి. టెస్టోస్టెరాన్ లో మార్పులు వచ్చిన వెంటనే లక్షణాలను వెంటనే గుర్గించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం.

మరి పురుషుల్లో టెస్టోస్టెరాన్ లెవల్స్ తక్కువ స్థాయిలో ఉన్నదని తెలిపే కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

కామేచ్ఛను తగ్గిస్తుంది:

కామేచ్ఛను తగ్గిస్తుంది:

పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గినప్పుడు, పురుషుల్లో కామేచ్ఛ(లిబిడో)తగ్గుతుంది. ఇది స్త్రీ, పురుషుల ఇద్దరిలోనూ ఉంటుంది. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ తగ్గుతుందో, సెక్స్ మీద కోరికలు చాలా వరకూ తగ్గించేస్తుంది. టెస్టోస్టెరాన్ తగ్గదల వల్ల , గుర్తించాల్సిన లక్షణాల్లో ఒక ప్రధానమైన లక్షణం.

డిప్రెషన్:

డిప్రెషన్:

లో టెస్టోస్టెరాన్ లక్షణాల్లో మరొక్కటి డిప్రెషన్. అంతే కాదు, కొన్ని అద్యయనాల ప్రకారం లో టెస్టొస్టెరాన్ లెవల్స్ క్లీనికల్ డిప్రెషన్ కు గురిచేస్తుంది. లక్షణాలను గుర్తించి, వెంటనే సరైన మందులు వాడితే సమస్యను నివారించవచ్చు.

తక్కువ శక్తిసామర్థ్యాలు:

తక్కువ శక్తిసామర్థ్యాలు:

లోటెస్టోస్టెరాన్ వల్ల మరో వార్నింగ్ లక్షణం శక్తి సార్థ్యాలు తగ్గిపోవడం. కానీ దీన్ని చాలా తేలిక అపార్థం చేసుకొని వర్క్ లోడ్ వల్ల ఎనర్జీ తగ్గిపోయిందనుకుంటుంటారు చాలా మంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, టెస్టోస్టెరాన్ లెవల్స్ ను పరీక్షించుకోవడం ఉత్తమం.

నిద్రకు అంతరాయం:

నిద్రకు అంతరాయం:

లో టెస్టోస్టెరాన్ వల్ల మరో లక్షణం నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఇది తిరిగి ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది . కాబట్టి, టెస్టోస్టెరాన్ లెవల్స్ ను పెంచుకోవడానికి కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగించడం ఉత్తమం.

బలాన్ని తగ్గిస్తుంది:

బలాన్ని తగ్గిస్తుంది:

టెస్టోస్టెరాన్ సరైన స్థాయిలో ఉండగలిగినప్పుడే పురుషుల్లో ఎనర్జీ మరియు బలం పుష్కలంగా ఉంటుంది. లేదంటే రెండూ తగ్గుముఖం పడుతాయి. అలాగే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కండరాల మీద కూడా పనిచేస్తుంది. శక్తి తగ్గడం వల్ల సాధరణ పనిమీద కూడా ఒత్తిడి పెరిగి టెస్టోస్టెరాన్ తక్కువ చేస్తుంది.

ఇతర ఆరోగ్య సమస్యలు:

ఇతర ఆరోగ్య సమస్యలు:

పురుషుల్లో టెస్టోస్టెరాన్ తక్కువ అవ్వడం వల్ల ఇతర ఆరోగ్య సమస్య మీద కూడా ప్రభావం చూపుతుంది. అందులో ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ మరియు థైరాయిడ్. ఈ రెండూ కానీ, ఈ రెండింటిలో ఏ ఒక్కటి కానీ ఉన్నప్పుడు, అది లోటెస్టోస్టెరాన్ కు సూచికగా గుర్తించాలి.

స్ఖలనం తగ్గిస్తుంది:

స్ఖలనం తగ్గిస్తుంది:

సాధారణ సమయంతో పోల్చితే, టెస్టోస్టెరాన్ తగ్గినప్పుడు పురుషుల్లో స్ఖలనం తగ్గిస్తుంది . అయితే ఈ సమస్యను మందులతో నివారించుకోవచ్చు.

అంగస్తంభనలు తక్కువ చేస్తుంది:

అంగస్తంభనలు తక్కువ చేస్తుంది:

పునపటితో పోల్చితే, టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గినప్పుడు, సెక్స్ స్పందన తక్కువగా ఉంటుంది.

టెస్టికల్స్ (వృషణాలు) ష్రింక్ అవ్వడం జరుగుతుంది:

టెస్టికల్స్ (వృషణాలు) ష్రింక్ అవ్వడం జరుగుతుంది:

లో లెవల్ టెస్టోస్టెరాన్ టెస్టికల్స్ చిన్నగా మార్చడం లేదా సైజును తగ్గిచడం జరుగుతుంది.

అంగస్తంభన:

అంగస్తంభన:

లో టెస్టోస్టెరాన్ లక్షణాల్లో అంగస్తంభన కూడా ఒకటి. కాబట్టి డాక్టర్ ను సంప్రదించి హార్మోన్ లెవల్స్ ను కనుక్కొని సరైన చికిత్స చేయించుకోవాలి.

English summary

10 Warning Signs Of Low Testosterone

The human body requires adequate amount of hormones to work properly. Hormones play a big role in the life of both men and women. Progesterone plays an important role in the life of the women during her menstrual cycle, pregnancy and child birth.
Story first published: Monday, August 4, 2014, 12:50 [IST]
Desktop Bottom Promotion