For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేడినీళ్ళు: అద్భుతమైన-ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

|

ప్రకృతి పరంగా మనకు లభించే నీళ్ళు పంచభూతాల్లో ఒకటి నీళ్ళు. భూమి మీద ప్రాణం ఉన్న ప్రతి జీవికీ నీళ్ళు అవసరం. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఒక రోజుకు 7-8గ్లాసుల నీరు, ప్రతి ప్రాణికీ అవసరం అవుతుంది. అందువల్ల చాలా మంది కోల్డ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే, కోల్డ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ కు బదులు వేడి నీళ్ళు లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అంధిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం.

నీళ్ళ గురించి పచ్చి నిజాలు...:క్లిక్ చేయండి

ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మం మరియు జుట్టుకు కొన్ని అశ్చర్యకరమైన ప్రయోజనాలను అంధిస్తుందని నిర్ధారించారు . మరి హాట్ వాటర్ గురించి ప్రయోజనాలను తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తోందా? హాట్ వాటర్ నేచురల్ బాడీ రెగ్యులేట్ చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు స్వచ్చమైన వేడినీళ్ళతో మీ దినచర్యను ప్రారంభిస్తే భవిష్యత్తులో కూడా ఆరోగ్యకరమైన జీవితంను పొందవచ్చు. మరి హాట్ వాటర్ లోని ఆ అమేజింగ్ హెల్త్ & బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకోండి:

నీళ్ళ వల్ల 15 ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్: క్లిక్ చేయండి

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

హాట్ లేదా వార్మ్ వాటర్ తీసుకోవడం వల్ల మీ హెయిర్ సెల్స్ కు శక్తినందివ్వడానికి ఒక గొప్ప మూలం. ఇది వాటి నిరంతర క్రియలను పెంపొందిస్తుంది. దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

మొటిమలు మచ్చలు మరియు ఇతర చర్మ సమస్యల నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది. రెగ్యులర్ గా హాట్ వాటర్ ను తీసుకోవడ వల్ల శరీరంను శుభ్రం చేస్తుంది. ఇన్ఫెక్షన్ కు కారణం అయ్యే కణాలను తొలగిస్తుంది.

బరువు తగ్గించడానికి :

బరువు తగ్గించడానికి :

మీరు అదనపు బరువును కొన్ని పౌండ్లలో తగ్గించుకోవాలనుకుంటుంటే, హాట్ వాటర్ అందుకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇది మీ జీవక్రియలను మెరుగురుస్తుంది మరియు చర్మం క్రింది భాగంలో ఉన్న కొవ్వుకణాలను విచ్చిన్న చేయడానికి సహాయపడుతుంది. మరింత ఎఫెక్టివ్ గా ఫలితం పొందాలంటే, హాట్ వాటర్ లో నిమ్మరసం మరియు తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. క్రమం తప్పకుండా తీసుకుంటే బాడీ వెయిట్ తగ్గించుకోవడంలో తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.

బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది మరియు నాడీ వ్యవస్థను క్లిక్ చేస్తుంది:

బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది మరియు నాడీ వ్యవస్థను క్లిక్ చేస్తుంది:

హాట్ వాటర్ వల్ల మరో అద్భుతమైనటువంటి ప్రయోజనం, ఇది బ్లడ్ సర్కులేషన్ ను పెంచుతుంది. ముఖ్యంగా బాడీఫ్యాట్ ను కరిగిస్తుంది. అదే సమయంలో నాడీవ్యవస్థలో కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన చర్మం:

ఆరోగ్యకరమైన చర్మం:

రెగ్యురల్ గా క్రమంతప్పకుండా వేడి నీళ్ళు తీసుకోవడం ద్వారా మీ శరీరాన్ని తేమగా మరియు వెచ్చగా ఉంచుకోవచ్చు. ఇది డ్రై మరియు ఫ్లాకీ స్కిన్ కు చాలా గొప్పగా సహాయపడుతుంది. మరియు ఆరోగ్యకరమైన చర్మం నిర్వహించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది శరీరం మొత్తంలో బ్లడ్ సర్కులేషన్ పెంచి శరీరానికి పింక్ గా చర్మఛాయను అంధిస్తుంది.

అకాల వృద్ధాప్యంను నివారిస్తుంది:

అకాల వృద్ధాప్యంను నివారిస్తుంది:

ప్రతి రోజూ రెగ్యులర్ గా వేడీనీళ్ళు త్రాగడం వల్ల అకాల వృద్ధాప్యంను నివారించి యవ్వనంగా మరియు మెరిసేటా చర్మకాంతిని పొందవచ్చు. ఇది శరీరం నుండి టాక్సిన్స్ ను బయటకు నెట్టడం వల్ల చర్మకణాలను రిపేర్ చేస్తుంది. అది హానికరమైన ఫ్రీరాడిక్స్ మీద ఎఫెక్టివిగ్ గా పనిచేస్తుంది. హాట్ వాటర్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది.

బౌల్ మూమెంట్ సులభతరం చేస్తుంది:

బౌల్ మూమెంట్ సులభతరం చేస్తుంది:

వేడి నీళ్ళను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా క్రోనిక్ సమస్యలతో పోరాడి, మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. తిన్న ఆహారం ప్రేగుల్లో స్మూత్ గా ముందుకు జరిగి జీర్ణం అవ్వడానికి హాట్ వాటర్ లేదా గోరువెచ్చని నీళ్ళు అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, ప్రతి రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే, గోరువెచ్చని నీటిని కాలీ కడుపున తీసుకోవాలి.

చుండ్రుతో పోరాడుతుంది:

చుండ్రుతో పోరాడుతుంది:

ఇది మీ తలలో చర్మంను హైడ్రేషన్ లో ఉంచి డ్రై స్లాప్ నివారిస్తుంది. దాంతో చుండ్రు సమస్యను నివారించవచ్చు.

మెనుష్ట్రువల్ క్రాంప్స్:

మెనుష్ట్రువల్ క్రాంప్స్:

హాట్ వాటర్ మెనుష్ట్రువల్ క్రాంప్స్ ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వేడినీటిలో కారమ్ విత్తనాలు వేసి తీసుకోవడం వల్ల పీరియడ్స్ లో పొట్ట తిమ్మర్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమయం వేడీ నీళ్ళు తీసుకోవడం ద్వారా పొట్ట ఉదర భాగంలోని కండరాలు మరింత తేలిక పరిచి క్రాంప్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది:

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది:

హాట్ వాటర్ ను తీసుకోవడం వల్ల శరీరంను డిటాక్సిఫై చేస్తుంది మీరు అజీర్తి సమస్యలను తగ్గించుకోవాలన్నా లేదా శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేయాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఉదయం మరియు రాత్రి పడుకొనే ముందు వేడి నీళ్ళు త్రాగడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వేడి నీళ్ళు త్రాగడం వల్ల శరీరంలో వేడి పుట్టి, చెమట పట్టడం ప్రారంభం అవుతుంది దాంతో శరీరంలోని టాక్సిన్స్ చెమట రూపంలో బయటకు నెట్టివేస్తుంది. మరింత మంచి ఫలితాల కోసం నిమ్మరసం మరియు తేనెను మిక్స్ చేసుకోవచ్చు.

గొంతు మరియు శ్వాససంబంధిత సమస్యలకు మంచి విరుగుడు:

గొంతు మరియు శ్వాససంబంధిత సమస్యలకు మంచి విరుగుడు:

దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పి సమస్యలున్నప్పుడు వేడినీళ్ళు త్రాగడం ఒక గొప్ప నేచురల్ హోం రెమడీ. ఇది నిరంతర వేధించి పొడి దగ్గును తగ్గించి, శ్వాసనాళాన్ని తేలికచేసి, సరైన శ్వాస పీల్చుకొనేందుకు సహాయపడుతుంది. అలాగే గొంతునిప్పిని నివారిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

వేడి నీళ్ళు ముఖ్యంగా జీర్ణక్రియకు మరింత ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, మనం తీసుకొన్న ఆహారంలోని నూనె పదార్థాలు జీర్ణం చేయడానికి చల్లటి నీళ్ళు మరింత కష్టతరం చేస్తుంది. జీర్ణక్రియ వేగాన్ని తగ్గించి కొవ్వు ఏర్పడేలా చేస్తుంది. ప్రేగుగోడలమీ అధికొవ్వు చేరడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రేగు క్యాన్సర్ కు కారణం అవుతుంది. కాబట్టి, చల్లటి నీటికి బదులు, వేడి నీళ్ళు తీసుకోవడ వల్ల జీర్ణక్రియను వేగవంత చేసుకొని, మరింత తేలికగా జీర్ణం అయ్యేలా చేసుకోవచ్చు.

English summary

12 Amazing Benefits Of Hot Water For Skin, Hair And Health

Water is one of the most imperative substances that we need to sustain on this earth. According to experts, 7 to 8 glasses of water is essential for each and every human being.
Desktop Bottom Promotion