For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజూ ఉదయం చేసే సూర్య నమస్కారం వల్ల 12 ప్రయోజనాలు

|

సూర్య నమస్కారం ఒక వర్సిటైల్ యోగా పోజ్. సూర్య నమస్కారం చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. సూర్యనమస్యారంను ఈ మద్య చాలా మంది సెలబ్రెటీలు కూడా చేస్తున్నారు. చాలా మంది సెలబ్రెటీలు వారి దినచర్యను సూర్య నమస్కారం, యోగాతో ప్రారంభిస్తున్నారు. సూర్య నమస్కారంను ప్రతి రోజూ ఉదయాన్నే చేస్తారు. బాలీవుడ్ సెలబ్రెటీ కరీనా కపూర్ మాటల్లో..సూర్య నమస్కారం, ఇది యోగా భంగిమల్లో అత్యంత ముక్యమైన ప్రధానమైన యోగా భంగిమ, ఈ యోగా భంగిమను రెగ్యులర్ గా చేయడం వల్ల బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది . ప్రతి రోజూ ఉదయం సూర్య నమస్కారం యోగా వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు కొన్ని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలు కూడా చాలా ఉన్నాయి.

ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేవగానే రెగ్యులర్ గా క్రమం తప్పకుండా సూర్య నమస్కారంతో ప్రారంభించడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అలాగే సూర్య నమస్కారంను ప్రతి రోజూ ఉదయం వచ్చే ఎండలో అవుట్ డోర్ లో చేస్తే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, శరీరంలోని జీవక్రియల రేటు పెరగడంతో పాటు, ఇది నిద్రావస్థలో ఉన్న హార్మోనులను ఉత్తేజపరుస్తుంది.

కాబట్టి, సూర్య నమస్కారంతో ఒక్క బరువు తగ్గడం మాత్రమే కాదు, వివిధ రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సూర్య నమస్కారంను 12 భంగిమలుగా విడివిడిగా చేయడం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలను బర్న్ చేస్తుంది. సూర్య నమస్కారం ఎందుకు చేయాలి ప్రయోజనాలేంటనే అనుమానం మీకిప్పటికీ ఉంటే కనుక అందుకు పరిష్కారమార్గంగా ఈ క్రింది స్లైడ్ ద్వారా కొన్ని విలువైన సమాచారంను తెలుసుకోండి.

స్ట్రెచ్చింగ్:

స్ట్రెచ్చింగ్:

ప్రతి యోగా భంగిమ ప్రారంభించడానికి ముందు స్ట్రెచ్చింగ్ చేయడం చాలా అవసరం. శరీరాన్ని సాగతీయడం వల్ల కండరాలు ఫ్రీ అవుతాయి. సూర్య నమస్కారం ఒక అద్భుతమైన స్ట్రెచ్చింగ్ ఎక్స్ సైజ్ గా మిగిలన యోగా భంగిమలు ప్రారంభించడానికి ముందు ఇది భాగా సహాయపడుతుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

యోగా సూర్య నమస్కారం వల్ల శరీరంలోని ప్రతి ఒక్క కండరంలో కదలికలుంటాయి . సూర్య నమస్కారం వల్ల థైరాయిడ్ గ్లాండ్స్ కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. థైరాయిడ్ గ్రంథులు సక్రమంగా పనిచేస్తుంటే, బరువులో ఎటువంటి మార్పు ఉండదు.

భంగిమ మరియు బ్యాలెన్స్:

భంగిమ మరియు బ్యాలెన్స్:

కూర్చినే భంగిమలో సమస్యలున్నాఅటువంటి సమస్యలను నయం చేయడంలో మరియు ఇంటర్నల్ గా బాడీని బ్యాలెన్స్ చేస్తుంది . రెగ్యులర్ గా సూర్యనమస్కారం చేయడం వల్ల పోచ్చర్ సమస్యలు, నొప్పులు, బాధలు తొలగింపబడుతాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది:

జీర్ణక్రియ మెరుగుపడుతుంది:

చాలా సాధారంగా వచ్చే జీర్ణ సమస్యల్లో క్రోనిక్ జీర్ణ సమస్య ఒకటి. కాబట్టి రెగ్యులర్ గా సూర్య నమస్కారం చేయడం వల్ల జీర్ణక్రియ పవర్ పెరుగుతుంది. ఇది పొట్టలో నిల్వ ఉండే గ్యాస్ ను తేలికగా విడుదల చేయడానికి మరియు జీర్ణక్రియకు అవసరం అయ్యే ఎంజైమ్స్ ను విడుదల చేయడానికి సహాయపడుతుంది.

ఎములను బలోపేతం చేస్తుంది:

ఎములను బలోపేతం చేస్తుంది:

సూర్య నమస్కారంకు ఒక అథ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ సూర్య నమస్కారంను ప్రతి రోజూ ఉదయం మాత్రమే చేస్తుంటారు. ఉదయం చేయడం వల్ల ఉదయం వచ్చే సూర్య రశ్మి వల్ల మన శరీరంలోని విటమిన్ డి షోషింపబడుతుంది. దాంతో ఎముకలకు అవసరం అయ్యే క్యాల్షియంను డి విటమిన్ మార్పు చేసుకుంటుంది.

ఒత్తిడి తగ్గిస్తుంది:

ఒత్తిడి తగ్గిస్తుంది:

ఒత్తిడి అనేది మన శరీరంలో ప్రతి కండరం మీద పడుతుంది. అదే సూర్య నమస్యారం చేయడం వల్ల లోతుగా శ్వాసతీసుకోవడం మరియు వదలడం (ఉశ్చ్వాస మరియు నిశ్చ్వాసలు)వల్ల చాలా వరకూ ఒత్తిడి తగ్గించుకోవచ్చు. మరియు ఇది మనస్సును ప్రశాంత పరుస్తుంది.

బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది:

బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది:

ఫోటో ఫీచర్ లో చూపించిన విధంగా ముందుకు బెండ్ అవ్వడం వల్ల మలబద్దక సమస్యలు మరియు పైల్స్ వంటి సమస్యను నివారించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బౌల్ మూమెంట్ రెగ్యులర్ గా ఉంటుంది.

నిద్రలేమిని నివారిస్తుంది:

నిద్రలేమిని నివారిస్తుంది:

ప్రస్తుత రోజుల్లో పెద్దవారిలోనే కాదు యవ్వనంలో ఉండే వారు కూడా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు . ఈ భంగిమలో సూర్య నమస్కారం వల్ల రాత్రుల్లో హాయిగా నిద్రపడుతుంది.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది:

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది:

సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరంలో ప్రతి భాగం కదలికలు ఉంటాయి . దాంతో మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది . దాంతో రోజంతా మీరు ఎక్కువ ఎనర్జీతో ఉండేందుకు సహాయపడుతుంది.

రుతుచక్రాన్ని రెగ్యులేట్ చేస్తుంది:

రుతుచక్రాన్ని రెగ్యులేట్ చేస్తుంది:

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి వారికి సూర్య నమస్కారం గొప్పగా సహాయపడుతుంది. సూర్య నమస్కారం సహజంగా శ్వాస తీసుకొనేలా చేసి ఫీమేల్ హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది.

రేడియంట్ స్కిన్:

రేడియంట్ స్కిన్:

శరీరంలో మంచి రక్త ప్రసరణ ఉన్నప్పుడు హెల్తీ బౌల్ మూమెంట్, మరియు గ్రేట్ స్కిన్ పొందవచ్చు. రెగ్యులర్ సూర్య నమస్కారం వల్ల ముడతలు తొలగిపోయి మెరిసే చర్మం సొంతం అవుతుంది.

ఆథ్యాత్మిక ప్రత్యేకత:

ఆథ్యాత్మిక ప్రత్యేకత:

యోగా మన ఆత్మ ప్రశాతంతకు మరియు శరీరం ప్రశాంతతకు కూడా సూర్య నమస్కారం బాగా సాహాయపడుతుంది. ముఖ్యంగా శరీరంలో వాతం, పిత్తం, ఖఫంకు సహాయపడుతుంది.

English summary

Eleven Benefits Of Doing Surya Namaskar Every Morning

Surya Namaskar or sun salutation is a very versatile yoga pose. There are several benefits of doing Surya Namaskar and even celebrities swear by it. Many celebrities begin their day by doing Surya Namaskar early in the morning.
Desktop Bottom Promotion