For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేప నూనె యొక్క 12 ఆరోగ్య ప్రయోజనాలు

|

చేప నూనె యొక్క 12 ఆరోగ్య ప్రయోజనాలు

తైల చేపల కణజాలం చేప నూనెయొక్క మూలం. చేప నూనెల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అనేక రకాలు. ఇది అందరికి తెలిసిన విషయమే. చేప నూనెలో ఒమేగా -3, కొవ్వు ఆమ్లాలు, ఇకోసాపెంటాయెనోయిక్ యాసిడ్ (EPA) మరియు డొకోసాహెక్సానాయిక్ యాసిడ్ (DHA) పుష్కలంగా ఉండటం వలన దీనివలన అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇవి సాధారణంగా గుండె ఆరోగ్యానికి, శక్తివంతమైన ఎముకలకు, యాంటీ ఏజింగ్ మరియు ఇంకా అనేకరకాల వాటితో సంబంధం కలిగి ఉంటాయి. రోజువారీ ఒక చేప నూనె గుళిక తీసుకోవటం వంటి ఒక చిన్న చర్య, మీ మొత్తం ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది అంటే! యెంత అద్భుతమైన విషయం!

నిరంతరం చేప నూనె యొక్క ఆరోగ్య ప్రయోజనాలు కనుగొనేందుకు అనేక అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అధ్యయనాలలో మీ ఆరోగ్యంపట్ల కలిగే ప్రయోజనాల్లో, ఏదో ఒకటి, చేప నూనె పాత్ర వహిస్తున్నదని బహిర్గతం అవుతున్నది. మార్కెటింగ్ పద్ధతులలో భాగంగా, మీరు అంతులేని చేప నూనె ప్రయోజనాల గురించి నకిలీవి, తప్పుడు సమాచారం తెలుసుకుంటుండొచ్చు. కాని వాటిని నమ్మే ముందు నిజమేమిటో తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఇక్కడ మేము మీ జీవితంలోని మార్పుకు సహాయపడే చేప నూనె వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల జాబితాను ఇస్తున్నాము.

ఆస్టియో ఆర్థరైటిస్ ఉపశమనానికి

ఆస్టియో ఆర్థరైటిస్ ఉపశమనానికి

ఒమేగా -3 చేప నూనె, ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క వివిధ రకాలు మరియు లక్షణాలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది. ఇది చేప నూనె వలన కలిగే ప్రయోజనాలలో ముఖ్యమైనది.

శోథ చికిత్స

శోథ చికిత్స

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఇకోసాపెంటాయెనోయిక్ యాసిడ్ (EPA) మరియు చేప నూనె లో డొకోసాహెక్సానాయిక్ యాసిడ్ (DHA), శోథ నిరోధకాలుగా పిలుస్తారు. ఇది కూడా చేప నూనె వలన కలిగే ప్రయోజనాలలో ఒకటి.

యాంటి ఏజింగ్

యాంటి ఏజింగ్

దీనిని నమ్మండి లేదా నమ్మకపోండి! చేప నూనె యాంటి ఏజింగ్ ఔషధంగా అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉన్నది. మీరు చేప నూనెను తీసుకోవటంవలన,టెలోమేర్ తగ్గించే ప్రక్రియ ద్వారా మిమ్మలిని వయసులో చిన్నవారిగా ఉంచుతుంది.

ఫ్యాట్ బర్నింగ్

ఫ్యాట్ బర్నింగ్

చేపనూనె మరియు వ్యాయామం - సమర్థవంతమైన బరువు తగ్గటం కోసం పరిపూర్ణమైనటువంటి సమ్మేళనం!! చేప నూనెలో ఇకోసాపెంటాయెనోయిక్ యాసిడ్ (EPA) మరియు డొకోసాహెక్సానాయిక్ యాసిడ్ (DHA) ఉండటంవలన కొవ్వును తగ్గించటంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నది.

 గుండె ఆరోగ్యము

గుండె ఆరోగ్యము

చేప నూనె గుండెజబ్బులను నివారించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అని కనుగొన్నారు. జీవక్రియలో ఇబ్బందులు ఉన్న జబ్బులు మరియు గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా చేప నూనె తీసుకోవటం వలన చాలా లాభం పొందుతారు.

మెదడు చురుగ్గా పనిచేయటం

మెదడు చురుగ్గా పనిచేయటం

విద్యార్థులు చేప నూనెను తీసుకోవటంవలన ఎక్కువ జ్ఞాపకశక్తి మరియు మెదడు చురుగ్గా పనిచేయటంలో చాలా దోహదపడుతుంది చేప నూనె తీసుకోవడం వలన జ్ఞాన నైపుణ్యాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటారని నిరూపించబడింది.

క్యాన్సర్ మద్దతు

క్యాన్సర్ మద్దతు

కీమోథెరపీ వలన క్యాన్సర్ రోగుల్లో కండరాల నష్టానికి ఎక్కువ అవకాశం ఉంది. చేప నూనె తీసుకోవటం వలన క్యాన్సర్ రోగుల్లో బలహీనపడిన కండరాలు కాపాడబడతాయి తద్వారా బరువు నష్టాన్ని తప్పించుకోగలుగుతారు.

ఎముకలు బలపడటం

ఎముకలు బలపడటం

ఎముకలు బలపడటం చేప నూనె యొక్క అత్యంత ప్రముఖ ఆరోగ్య ప్రయోజనం ఎముకలు బలోపేతంగా చేయటం . ఒమేగా -3 కొవ్వు మరియు డొకోసాహెక్సానాయిక్ యాసిడ్ (DHA) ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

అధిక రక్తపోటు తగ్గించడం

అధిక రక్తపోటు తగ్గించడం

చేప నూనె ప్రయోజనాలలో ముఖ్యమైనది, క్రమం తప్పకుండా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు తీసుకోవడం వలన నిర్దిష్టంగా అధిక రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది. చేప నూనెలో ఉండే డిహెచ్ఏలో కూడా ఈ లక్షణం ఉన్నది.

ఒత్తిడికి ఉపశమనం

ఒత్తిడికి ఉపశమనం

మీ మానసిక ఆరోగ్యము సరిగా ఉంచడానికి ఒక సప్లిమెంట్ కావాలనుకుంటే మీ ప్రధాన ఎంపిక చేప నూనె అయి ఉండాలి. చేప నూనె వినియోగించే వారిలో ఆత్మహత్య ఆలోచనలు మరియు నిరాశ ఉండవని స్పష్టంగా అధ్యయనాలు చెపుతున్నాయి.

సోరియాసిస్

సోరియాసిస్

సోరియాసిస్ రోగులకు సంతోషకరమైన వార్త! చేప నూనె వాడటంలో కలిగే ప్రయోజనాలలో ఆసక్తికరమైనది ఏమిటంటే సోరియాసిస్ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండ రోజూ చేప నూనె తీసుకుంటే ఆ వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు.

 మధుమేహ వ్యాధి

మధుమేహ వ్యాధి

మీరు ఇన్సులిన్ ఇన్సెన్సిటివిటీ కారణంగా మధుమేహం కలిగి ఉంటే క్రమం తప్పకుండా చేప నూనె తీసుకోవటం వలన ప్రయోజనం పొందవొచ్చు. ఈ విధంగా చేయటం వలన రక్త చక్కెర స్థాయిని సరిగా ఉంచుతుంది మరియు కండరాలలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మరియు కొవ్వు కణజాలాన్ని సరిగా ఉంచుతుంది.

English summary

12 Health Benefits Of Fish Oil

The tissues of oily fish are the source of fish oil. It is a well known fact among those who care for their body that fish oils are rich sources of omega-3 fatty acids eicosapentaenoic acid (EPA) and docosahexaenoic acid (DHA) that offer a wide variety of health benefits.
Desktop Bottom Promotion