For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాగి బాల్/రాగి ముద్దలోని ఆశ్చర్యకర ప్రయోజనాలు

|

రాగులు మంచి పోషకాహారం అని తెలిసిందే.. ఇతర తృణధాన్యాలతో పోలిస్తే వీటి వాడకం నిన్న మొన్నటి వరకూ తక్కువనే చెప్పాలి. కానీ ఆరోగ్య రిత్యా ఐరన్, కాల్షియం నిల్వలు అధికంగా ఉన్న రాగుల్ని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవడం ఇటీవలి కాలంలో ఎక్కువయింది. మిల్లెట్ లేదా రాగులు అని సాధారణంగా రెగ్యులర్ గా పిలుస్తుంటారు. వీటిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. రాగులు దక్షిణ భారతదేశం అంతటా అనేక గ్రామాలలో ఒక ప్రధానమైన ఆహారం. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.

రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది మరియు ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉంటుంది . ఇది చాలా సులభంగా జీర్ణమైవుతుంది మరియు బంక అనిపించదు. ఎవరైతే గ్లూటెన్ లోపంతో బాధపడుతున్నారో వారు ఈ ధాన్యాహారాన్ని తీసుకోవచ్చు.

రాగుల్లోని కాల్షియం, ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంచడానికి ఎక్కువగా సహాయపడుతుంది. ఈ ఆహారం సమ్మర్ లో కొంచెం పాపులర్. ఎందుకంటే హాట్ సమ్మర్ లో మీ శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది. అంతే కాదు, ఎవరైతే బరువు కంట్రోల్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారికోసం కూడా రాగులతో తయారుచేసే ఆహారాలు అద్భుతంగా సహాయపడుతాయి. ఇది ఎటువంటి రిమార్క్ లేని ఫర్ ఫెక్ట్ వెజిటేరియన్ ఫుడ్

రాగి బాల్ లేదా రాగి ముద్ద, లేదా రాగి సంగటి సౌత్ ఇండియాలో చాలా పాపులర్ డిష్. ముఖ్యంగా కర్ణాటక, ఆంద్రరాష్ట్రాల్లో రాగిముద్దను రెగ్యులర్ గా తింటుంటారు.

బరువు తగ్గుటకు సహాయపడుతుంది:

బరువు తగ్గుటకు సహాయపడుతుంది:

రాగుల్లో అమినోయాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ జీర్ణక్రియను నిదానం చేస్తుంది . అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. మరియు రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.

ఎముకల బలానికి:

ఎముకల బలానికి:

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. అలాగే వయస్సు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది. ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.

మధుమేహగ్రస్తులకు:

మధుమేహగ్రస్తులకు:

మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఫింగర్ మిల్లెట్ యొక్క ఫైటోకెమికల్స్ జీర్ణప్రక్రియ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో మధుమేహగ్రస్తుల్లో చక్కరస్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.

హై కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి :

హై కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి :

రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ కలిగి ఉండి, కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది.

అనీమియా(రక్తహీనత):

అనీమియా(రక్తహీనత):

రాగుల్లో నేచురల్ ఐరన్ పుష్కలంగా ఉన్నటువంటి ఒక మూలకం. రాగిని తీసుకోవడం వల్ల అనిమియాను నివారించడానికి సహాయపడుతుంది.

విశ్రాంతి కోసం:

విశ్రాంతి కోసం:

సాధారణంగా రాగులతో తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని నేచురల్ గానే సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఆందోళన, వ్యాకులత మరియు నిద్రలేమి పరిస్థితులు ప్రయోజనకరంగా ఉంటుంది. రాగి మైగ్రేన్ సమస్యను నివారించడం కోసం కూడాఉపయోగపడుతుంది.

శరీరంను కూల్ చేస్తుంది:

శరీరంను కూల్ చేస్తుంది:

రాగి ముద్ద వల్ల మీ శరీరాన్ని చల్లగా ఉంచతుంది. మరియు వేసవిలో వేడికి వచ్చే వ్యాధులను ధూరంగా ఉంచుతుంది. రాగుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సాధారణ కార్యాచరణకు కీలకం మరియు శరీర కణజాలముల బాగు కోసం ఇవి చాలా అవసరం. ఇది శరీరంలో నైట్రోజన్ సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

బలాన్ని అంధిస్తుంది:

బలాన్ని అంధిస్తుంది:

మీలో బలన్ని పెంచుతుంది మరియు వ్యాధినిరోధకతను కూడా పెంచుతుంది. రాగిముద్దను రెగ్యులర్ గా తినడం వల్ల ఇందులో అనే ప్రోటీనులు మరియు మినిరల్స్ మిమ్మల్ని శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.

మలబద్దకం:

మలబద్దకం:

రాగి ముద్దలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది మలబద్దకం నివారించడానికి సహాయపడుతుంది. అయితే, పైల్స్, హెమరాయిడ్స్ కలిగిన వారు రాగి ముద్దను ఎక్కువగా తీసుకోకూడదు.

 థైరాయిడ్ సమస్యలు:

థైరాయిడ్ సమస్యలు:

రాగిముద్దలోని మరో హెల్త్ బెనిఫిట్, మీ థైరాయిడ్ ను తరచూ స్థితిగతులను తెలియజేస్తుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారి రాగిముద్ద తినడం ఉత్తమం.

కొత్తగా తల్లైన వారికి:

కొత్తగా తల్లైన వారికి:

బాలింతల్లో పాలఉత్పత్తి. మహిళల్లో పాల ఉత్పత్తి లేకపోవడం ఈ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల కోసం శరీరానికి తగినంత బలాన్ని మరియు ఆరోగ్యాన్నంధించే టానిక్ వంటింది.

English summary

12 Health Benefits Of Ragi Ball/Mudde

You may have heard about millet or ragi. The ragi ball/mudde is not liked by many because of its bland taste. Moreover, this ball needs to be swallowed and not chewed on, therefore making it a lot more tough to eat. However, this ragi ball comes with a lot of health benefits.
Story first published: Saturday, March 8, 2014, 15:29 [IST]
Desktop Bottom Promotion