For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చిట్కాలు

|

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఎండల తాకిడికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేసవిలో శరీరంలోని నీరంత చెమట రూపంలో బయటకు వచ్చేయడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. దాంతో నీరం, వడదెబ్బ, డయేరియా, వేసవికాలంలో వచ్చే వ్యాధులలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం ఉంది. శరీరంలోని నీటి శాతాన్నిబ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ నీటిశాతాన్ని పెంచుకోవడానికి చాలా మంది చల్లటి పానియాలు తీసుకుంటారు. కానీ ఈ చల్లని ద్రవాలు త్రాగడం వల్ల ఆరోగ్యానికి ముప్పతిప్పలు పెడుతుంది. రక్తనాళాలు నిర్మాణాన్ని అడ్డుకొని, అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే, వేసవివేడితో పోరాడటానికి మరియు మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి.

వేసవి కాలంలో మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేమైన బాడీ కూలింగ్ ఫుడ్స్ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణుల సలహా.

వేసవి కాలంలో శరీరాన్ని కూల్ గా ఉంచే అటువంటి ఆహారాల లిస్ట్ ను మరియు కొన్ని హెల్త్ టిప్స్ ను బోల్డ్ స్కై.కామ్ మీ కోసం అందిస్తోంది. ఈ క్రింది స్లైడ్ ద్వారా వాటిని మీరు తెలుసుకొని, మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మర్చిపోకండి..

వెజిటేబుల్స్

వెజిటేబుల్స్

తాజాగా ఉండే సీజనల్ వెజిటేబుల్స్ , గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో 80-95 శాతం నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

నీరు ఎక్కువగా త్రాగాలి

నీరు ఎక్కువగా త్రాగాలి

వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి మీరు ఖచ్ఛితంగా తగినన్ని నీరు త్రాగాలి. ఈ హాట్ సీజన్ లో మీ శరీరంను కూల్ గా ఉంచుకోవడానికి ప్రతి రోజూ 2 లీటర్ల నీరైనా ఖచ్చితంగా త్రాగాలి.

పండ్ల రసం

పండ్ల రసం

సమ్మర్ సీజన్ లో శరీరం కూల్ గా ఉండాలంటే ఉత్తమంగా ఫ్రూట్ జ్యూసులను తీసుకోవాలి. ఆరెంజ్, పైనాపిల్ మరియు నిమ్మరసం మరియు మరికొన్ని సీజనల్ ఫ్రూట్ తో తయారు చేసే తాజా పండ్లరసాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్ లో ముఖ్యంగా మజ్జిగ మరియు లస్సీ వంటి రెండు రకాల బెవరేజ్ లు సమ్మర్ సీజన్ లో తప్పనిసరిగా తీసుకోవడం సమ్మర్ సీజన్ లో చాలా అవసరం.

టీ

టీ

చలికాలంలో చలితో పోరాడాలంటే కాఫీని ఎంపిక చేసుకుంటాము, అయితే సమ్మర్ లో టీని ఎంపిక చేసుకోవడం వల్ల ఇది శరీరానికి కావల్సిన చల్లదనాన్ని అందిస్తుంది.

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్

వేసవిలో స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలోని వేడి నోటి ద్వారా, శ్వాస ద్వారా వేడి బయటకు నెట్టి, శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది.

చిన్న మోతాదులో భోజనం

చిన్న మోతాదులో భోజనం

ఒక్కే సారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా, తీసుకొనే ఆహారం చాలా తక్కువ తక్కువగా మద్యమద్యలో గ్యాప్ ఇస్తూ ఎక్కువ సార్లు తినాలి. ఎక్కువ ఆహారాన్ని ఒక్కే సారి తీసుకోవడం వల్ల శరీరంలో వాటిని విచ్చిన్నం చేయడానికి ఎక్కువ సమయం తీసుకొని, శరీరంలో వేడి పుడుతుంది. కాబట్టి, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి మీరు తీసుకొనే ఆహారం చిన్నచిన్న మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవడానికి ప్రయత్నించండి.

ఫ్లోర్స్ మీ శరీరాన్ని కూల్ చేస్తుంది

ఫ్లోర్స్ మీ శరీరాన్ని కూల్ చేస్తుంది

వేసవి కాలంలో మీ పడక గదిలో ఫ్లోర్ మీద పడుకోవడం వల్ల మీ శరీరాన్ని చాలా చల్లగా ఉంచుతుంది. మరియు మీరు హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

కోల్డ్ షవర్

కోల్డ్ షవర్

వేసవిలో అప్పుడప్పుడు చల్లటి నీటితో స్నానం చేసుకోవడం వల్ల మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మీరు చల్లని నీటితో స్నానం చేయలేకపోతే, గోరువెచ్చని నీటిని ఎంపిక చేసుకోవాలి.

యోగా

యోగా

వేసవిలో యోగా ద్వారా మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? ప్రాణాయమం అంటే అనులోమ్ విలోమ్, బ్రార్మారి మరియు ఉజ్జయి ప్రధాన శ్వాస సంబంధిత ప్రయోగాలు. ఇవి మన శరీరాన్ని చాలా ప్రశాంతంగా మరియు కూల్ గా ఉంచుతుంది .

కాటన్ దుస్తులు

కాటన్ దుస్తులు

వేసవి కాలంలో మీ శరీరాన్ని కూల్ గా ఉంచుకోవాలంటే, వేసవిలో కాటన్ దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

English summary

12 Tips To Keep The Body Cool In Summer

Summer is here and the most important tip you should follow is to keep your body cool. According to experts, most people opt for cool beverages to fight the rise of the mercury level. But drinking cold liquids may lead to constriction of the blood vessels that could pose problems for your health.
Desktop Bottom Promotion