For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే ఈ యోగసనాలు చేయండి

|

సాధారణంగా యోగలో కొన్ని భంగిమలున్నాయి. వీటినే ‘ఆసనాలు' అని అంటుంటారు. ఈ ప్రత్యేక స్థానాలు(పొజిషన్స్) లేదా ప్రత్యేక ఆసనాలతో మీ శరీరంలో వివిధ భాగాలకు రక్త ప్రసరణ అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఈ ఆసనాలు మానవ శరీరంలో ప్రభావితం అయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలను నిరోధించడానికి సహాయపడుతాయి.

యోగసనాలలో ఒక ముఖ్యమైన వాస్తవాల్లో ఒకటి ధ్యానం మరియు బ్రీతింగ్ ను కంట్రోల్ చేయడం. ఇది మొదడు యొక్క పనితీరును మెరుగుపరచడానికి గొప్పగా సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి రోజు కనీసం 20 నిముషాలు యోగ చేయడం వల్ల మీ పనితనం మెరుగుపడుతుంది మరియు మీ వర్కింగ్ మెమరీకూడా మెరుగ్గా ఉంటుంది.

మెదడు చురుకుగా ఉండటం కోసం వివిధ రకాల యోగాసనాలున్నాయి. వీటిని మీరు రెగ్యులర్ గా ప్రతి రోజూ సాధన చేసినట్లైతే మీరు ఒక ఖచ్చితత్వం స్థాయి చేరుకోవడంతో పాటు, మొదడు యొక్క సామర్థ్యం పెరుగుతుంది. మెదడు మీద యోగసనాల యొక్క ప్రయోజనాలు అపారంగా ఉన్నాయి. ఈ యోగసనాల్లో కొన్ని మీ మెదడు యొక్క పనితీరు సరైన కార్యాచరణకు సహాయపడుతుంది.

ఈ క్రింది స్లైడ్ లో ఇచ్చిన కొన్ని యోగసనాలను రెగ్యులర్ గా మీరు ప్రతి రోజూ అనుసరించాలి. ఈ యోగాసనాలను మీరు రెగ్యులర్ గా చేయడం వల్ల మీ బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి మరియు శరీరం మరింత చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది. మరి మెదడను మరియు శరీరాన్ని చురకుగా ఉంచే ఆ యోగాసనాలేంటో ఒకసారి చూద్దాం...

ఉత్తనాసన

ఉత్తనాసన

ఈ యోగసాన మెదడు చురుకుగా పనిచేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. నిటారుగా నిలబడి తర్వాత ముందుకు వంగి, మీ రెండు చేతులతో మీ రెండు పాదానలు వెనుక వైపునుండి పట్టుకోవాలి. ఈ ఆసనం చేసేప్పుడు, మీ వెన్ను మరియు మోకాలు నిటారుగా ఉండాలి.

ట్రీ ఫోజ్(వృక్షాసన)

ట్రీ ఫోజ్(వృక్షాసన)

ఈ భంగిమ మెదడుకు చాలా బాగా సహాయపడుతుంది. అందుకు మీరు మొదట నిటారుగా నిలబడి, మీ కుడికాలను ఎడమకాలు తొడమీద ఆనిస్తూ ఫోటోలో చూపినవిధంగా ట్రీ ఫోజ్ లో నిలబడాలి. తర్వాత రెండు చేతులను తలమీదగా చెవులకు ఆన్చి పైకి ఎత్తి నమస్కరించే భంగిమలో నిలబడాలి.

ట్రయాంగిల్ భంగిమ

ట్రయాంగిల్ భంగిమ

నిటారుగా నిలబడి, మీ కాళ్ళను సాధ్యమైనంత దూరం దూరంగా జరపాలి. తర్వాత కుడి కాళు మీద కుడిచేయిని ఆనించి కుడిప్రక్కకు బెండ్ అవ్వాలి. అలాగే ప్యార్లల్ ల్లో ఎడమ చేయిని పైకి నిటారుగా ఎత్తాలి. అదే సమయంలో మీ కుడికాలు, మరియు వెన్న భూమికి ఫ్యార్లల్లో ఉండాలి.

రివాల్వ్డ్ ట్రయాంగులర్ ఫోజ్(పరివర్త త్రికోనాసన)

రివాల్వ్డ్ ట్రయాంగులర్ ఫోజ్(పరివర్త త్రికోనాసన)

ఇది ట్రైయాంగులర్ ఫోజ్ కు వ్యతిరేకంగా ఉంటుంది మీ పాదలు మరియు చేతులు ఫ్లోర్ కు వైపు ఉండాలి. తర్వాత మీ ఎడమ చేతిని పైకి ఎత్తి, మీ చేతి బొటన వేలును చూడాలి.

అధోముఖాసన(డౌన్ వార్డ్ ఫేసింగ్ డాగ్)

అధోముఖాసన(డౌన్ వార్డ్ ఫేసింగ్ డాగ్)

బ్రెయిన్ మెరుగ్గా పనిచేయడానికి ఈ యోగసనా చాలా అద్భుతంగా సహాయపడుతుంది . అందుకోసం డాగ్ పోజ్ లో స్లైడ్ లో చూపిన విధంగా నిల్చోవాలి. ఉదరంను క్రిందికి వంచి, తలను పైకి ఎతి ముందుకు చూడాలి.

క్యామెల్ ఫోజ్

క్యామెల్ ఫోజ్

ముందుగా నిటారుగా కూర్చిని, కాలును ముందుకు చాపాలి. మోకాలు నిటారుగా ఉండాలి. కాలు మొత్తం ఫ్లోర్ కు ఆనించాలి. ఈ యోగా భంగిమ బ్రెయిన్ ఫంక్షన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

హరే ఫోజ్(షషంకాసన)

హరే ఫోజ్(షషంకాసన)

ముందుగా కాలి యొక్క మిడిమల మీద కూర్చోవాలి. బ్యాక్ మరియు నెక్ స్ట్రెయిట్ గా ఉండాలి. తర్వాత మీ శరీరాన్ని మొత్తం మీ తొడమీదనుండి ముందుకు బెండ్ చేయాలి. మీ నుదురు భాగం ఫ్లోర్ ను టచ్ చేస్తుంది. మెదడు చురుకు దనానికి ఇది ఒక ఉత్తమ యోగసనా.

సూర్య నమస్కార

సూర్య నమస్కార

బ్రెయిన్ పవర్ ను పెంచే ఆసనాలలో మనకు బాగా తెలిసిన మరియు అంగీకరించిన యోగసనం సూర్యనమస్కారం. రెగ్యులర్ గా ప్రతి రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల బ్రెయిన్ పవర్ మెరుగు పరుస్తుంది.

పశ్చిమోత్తాసన

పశ్చిమోత్తాసన

కూర్చొని ముందుకు బెండ్ అవ్వడం. ఈ పశ్చిమోత్తాసన స్లైడ్ లో చూపిన విధంగా కూర్చోవాలి. మీ వెన్నును పూర్తిగా వంచి మీ చేతులను పాదలను తాకి పట్టుకోవాలి.

ప్లో ఫోజ్(హలాసన)

ప్లో ఫోజ్(హలాసన)

బిగినర్స్ కు ఇది కొంచె డిఫికల్ట్ గా ఉండవచ్చు, కానీ రెగ్యులర్ గా ప్రాక్టిస్ చేస్తే ఇది ప్రొపర్ బ్రెయిన్ ఫంక్షన్ కు సహాయపడుతుంది . అందుకు నిటారుగా పడుకొని, తర్వాత స్లైడ్ లో చూపిన విధంగా కాళ్ళ తల వద్ద ఫ్లోర్ కు టచ్ చేసే విధంగా ఉంచాలి.

థండర్ బోల్ట్ ఫోజ్ (వజ్రాసన)

థండర్ బోల్ట్ ఫోజ్ (వజ్రాసన)

బ్రెయిన్ ఫంక్షన్స్ లో ఇది ఒక ఎఫెక్టివ్ యోగఆసనం. మోకాలు మీద ఇలా కూర్చొని చేతులను ఇలా తొడమీద ఉంచాలి. తర్వాత మీరు నేరుగా మీకు కనబడేంత దూరం చూడాలి.

లోటస్ ఫోజ్(పద్మాసన)

లోటస్ ఫోజ్(పద్మాసన)

పద్మాసనంలో ఇలా స్లైడ్ లో చూపిన విధంగా కూర్చోవాలి. తర్వాత రెండు చేతులను మీ రెండు కాళ్ళమీద పెట్టాలి. తర్వాత కళ్ళను మూసుకొని, ఉశ్చ్వాస మరియు నిశ్చ్వాసలు చేయాలి.

English summary

12 Yoga Asanas For Your Brain

Poses in yoga are referred to as ‘asanas’. These particular positions or asanas help in improving the blood circulation to various parts of the body. It prevents various types of illness from affecting the human body.
Story first published: Tuesday, August 12, 2014, 16:32 [IST]
Desktop Bottom Promotion