For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొలెస్ట్రాల్ ను నేచురల్ గా తగ్గించే14 సమ్మర్ ఫ్రెండ్లీ వెజిటేబుల్స్

|

కొలెస్ట్రాల్ అనేది మీఫ్రెండ్ మరియు మీ ఎనీమీ కూడా. ఎప్పుడైతే మన శరీరంలో కొనలెస్ట్రాల్ నార్మల్ గా ఉంటుందో, అప్పుడు, ఆ కొలొస్ట్రాల్ మన శరీరంలో వివిధ రకాలుగా వినియోగించుకోబడుతుంది. జీవక్రియలకు కూడా నార్మల్ గా పనిచేస్తాయి. అయితే, కొలెస్ట్రాల్ పెరిగితే సమస్య పెరుగుతుంది. మన శరీరంలో ఏదైనా సరే మోతాదుకు మించి ఉన్నప్పుడు, అది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, మన శరీరం బలహీనంగా మారుతుంది మరియు వ్యాధనిరోధక తగ్గిపోతుంది.

మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో జీవించడం వల్ల అది మన గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అది మీరు తెలుసుకోకపోయినట్లైతే ఆరోగ్యానికి మరింత హాని కలిగిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఆయిల్ బేస్డ్ వంటిది. ఇది రక్తంలో కలవకుండా జాగ్రత్తపడాలి. రక్తం ఎప్పుడు నీరులా పల్చగా ఉండాలి. అలా ఉన్నప్పుడే, రక్తం శరీరం మొత్తం చాలా తేలికగా ప్రసరణ జరుగుతుంది.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం..సమ్మర్ వెయిట్ లాస్ టిప్స్:క్లిక్ చేయండి

ప్రస్తుతం, కొన్ని పరిశోధనల ప్రకారం నేచులర్ గా కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడం కోసం, ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవాలని సలహా. ఈ వేసవి కాలంలో, మార్కెట్లో వివిధ రకాలా కూరగాల కలర్ ఫుల్ గా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ సమ్మర్ వెజిటేబుల్స్ కొలెస్ట్రాల్ ను నేచురల్ గా తగ్గిస్తాయి. అంతే కాదు వీటిని రెగ్యులర్ గా ప్రతి రోజూ తీసుకోవడం వల్ ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఫిట్ గా కూడా ఉంచుతుంది.

వేసవిలో ఇవి తినకపోతే మీ పని అంతే.!వేసవి తాపానికి గురికాక తప్పదు:క్లిక్ చేయండి

శరీరంలో అధిక కొలెస్ట్రాలె చేరడానికి ప్రధాన కారణం ఒకటి డైట్ మరియు అధిక బరువు. కొలెస్ట్రాల్ ఎవరిలో నైనా అధికం కావచ్చు. అందుకు వయస్సు తో పనిలేదు. చిన్న పెద్ద అందరిలోనూ కొలెస్ట్రాల ఉంటుంది. అది మోతాదుకు మించితే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. కాబట్టి. ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉండాలన్నా, అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలన్నా ఈక్రింది ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి...

బీన్స్:

బీన్స్:

బీన్స్ లో కరిగే ఫైబర్ కలిగి ఉంది. ఇది జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను మరియు బరువును తగ్గిస్తుంది. బీన్స్ లో ఉండే హై ఫైబర్ కంటెంట్ శరీరంలో షోషింపబడుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

కొలెస్ట్రాల్ ను నేచురల్ గా కరిగించే ఒక ముఖ్య ఆహారపదార్థం వెల్లుల్లి. వెల్లుల్లిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఇది ఎడిఎల్ లెవల్స్ ను తగ్గిస్తుంది మరియు బ్యాడ్ కొలెస్ట్రాలన్ కూడా తగ్గించి, హెచ్ డిఎల్ (మంచి కొలెస్ట్రాల్ ను) పెంచుతుంది. గార్లిక్ లో యాక్టివ్ సబ్ స్టాన్ గా పిలువబడే అల్లిసిన్ అనే కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను నేచురల్ గా తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

గ్రీన్ లీఫ్స్ లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఉండే ల్యూటిన్ అనే పదార్థం రక్తం గడ్డకట్టి హార్ట్ అటాక్ కు కారణం అయ్యే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో ఆకుకూరలను తప్పని సరిగా చేర్చుకోవాలి.

కాలీఫ్లవర్ :

కాలీఫ్లవర్ :

గ్రీన్ వెజిటేబుల్స్ లో కాలీఫ్లవర్ కనబడగానే వెంటనే వాటని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చేసుకోవాల్సిందే. ఈ వెజిటేబుల్లో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంచే స్టెరోల్స్ కలిగి ఉంటుంది.

టమోటో:

టమోటో:

టమోటోలో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ శరీరంలో వ్యాప్తి చెందకుండా నిరోధించే లైకోపిన్ టమోటోలో అధికంగా ఉన్నాయి. టమోటోలను వండినప్పుడు మరింత ఎక్కువ లైకోపిన్ అందుతుంది.

వంకాయల:

వంకాయల:

కొలెస్ట్రాల్ ను సహజంగా తగ్గించడానికి సహాయపడే మరో వెజిటేబుల్స్ వంకాయ. ఇందులో సోలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

క్యారెట్స్:

క్యారెట్స్:

బీటా కెరోటిన్, క్యారెట్ లో పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను సహజంగా ట్రాక్ లో ఉంచుకోవడానికి ఇది ఒక ఉత్తమమైనటువంటి వెజిటేబుల్.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు పచ్చివి లేదా ఉడికించి తీసుకుంటే, మీ శరీరానికి అనేక ప్రోటీనుల అందిస్తున్నారు. ఇవి హైలెవల్ కొలెస్ట్రాల్ తో పోరడటానికి చాలా బాగా సహాయపడుతాయి.

కొల్లార్డ్ గ్రీన్స్:

కొల్లార్డ్ గ్రీన్స్:

ఇది ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. కొల్లార్డ్ గ్రీన్స్ ను వారంలో ఒకటి రెండు సార్లు తీసుకుంటే ఖచ్చితంగా మీరు హెల్తీ లైఫ్ ను పొందవచ్చు.

రెడ్ బెల్ పెప్పర్:

రెడ్ బెల్ పెప్పర్:

విటమిన్ సి అధికంగా ఉన్న ఏ ఆహారమైనా కొలెస్ట్రాల్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. కలర్ ఫుల్ రెడ్ పెప్పర్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచడం వల్ల సరైన సమయంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎక్కువగా సహాయపడుతుంది.

మష్రుమ్:

మష్రుమ్:

మష్రుమ్ లో ఎరిటేడినైన్ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా ఇందులో లెటినిన్ అనే పోషకాంశం కొలెస్ట్రాల్ మాత్రమే తగ్గించడం మాత్రమే కాదు ఇది క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

మీరు కనుక ఊబకాయం లేదా అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నట్లైతే, రెగ్యులర్ డైట్ లో ఆస్పరాగస్ ను చేర్చుకోవడం వల్ల ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

బెండకాయ:

బెండకాయ:

కొలెస్ట్రాల్ ను నేచురల్ గా తగ్గించే వాటిలో మరో వెజిటేబుల్ బెండకాయ. ఇంకా బెండకాయ హార్డ్ డిసీజ్ రిస్క్ లను తగ్గిస్తుంది. బెండకాయలో ఉండే ఫైబర్ శరీరం ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

వేసవి కాలంలో, మీ రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవల్సి మరో వెజిటేబుల్ కీరదోసకాయ. ఇది శరీరంను చల్లగా చేస్తుంది. మరియ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

English summary

14 Vegetables That Lower Cholesterol Naturally

Cholesterol can be both your friend and foe. When the cholesterol is at a normal level, it becomes a vital substance for the body's normal functioning. But when it increases, you welcome trouble. They say too much of anything can be bad for health. When there is an increase in cholesterol, your body becomes weak and so does the immune system.
Desktop Bottom Promotion