For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దంతాలకు హానికలిగించి అందవిహీనంగా మార్చే వరెస్ట్ ఫుడ్స్

|

ఆరోగ్యమైన పళ్లు, మంచి ఆరోగ్యాన్ని మంచి పర్సనాలిటీని తెలియజేస్తాయి. అయితే మనం మనం మన పళ్ల ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోం అదేవిధంగా పళ్లు లేకుండా దీర్ఘకాలం పాటు బాధపడతాం. అందమైన చిరునవ్వు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. సమాజంలో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరుచుకునేందుకు తొలిసాధనం మన చిరునవ్వు. నవ్వాలంటే మన దంతాలు కూడా అందంగా ఉండాలి. మరి అటువంటి దంతాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా, దంత సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇక దురలవాట్లు ఉన్న వారికైతే ఈ సమస్య ఎక్కువ.

నిపుణుల అభిప్రాయం ప్రకారం నిమ్మరసం దంతాలకు టచ్ అయినప్పుడు ముత్యాల్లాంటి మీ దంతాలకు హాని జరుగుతుంది. అంతే కాదు వేళ్ళ యొక్క గోళ్ళు కొరకడం వల్ల అనేక అనారోగ్యాల బారీన పడాల్సి వస్తుంది . ఇక పండ్ల గురించి , ఇవి దంతాలకు హాని కలిగిస్తాయి? దంతాలకు హాని కలిగించే కొన్ని ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన ఆహారాల వల్ల దంతాల యొక్క ఎనామిల్ తగ్గిపోతుంది. కాబట్టి రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం మరియు ఫ్లాసింగ్ చేయడం వల్ల దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇలా రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం ఆరోగ్యానికి మంచిదే, అయితే అతిగా, బ్రష్ చేస్తే మాత్రం దంతాల్లో నుంచి రక్తం కారడం మరియు దంతక్షయానికి దారి తీస్తుంది.

భోజనం చేసిన ప్రతి సారి నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కలించడం వల్ల దంతాలకు సురక్షితం మరియు దంతాలను క్లీన్ గా మరియు హెల్తీగా ఉంచుకోవడానికి ఇది ఒక మార్గం. దంతమూల్లల్లో చేరిన ఆహార స్పటికల వల్ల దంతాలు పాడవుతాయి. సరిగా ఫ్లాసింగ్ చేసుకోకపోవడం, నోటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోకపోవడం వల్ల ఇది ఇలాగే కొనసాగినట్లైతే, కొంత కాలం తర్వాత పరిస్థితి మరంత తీవ్రం అవుతుంది. అలా జరిగినప్పుడు దంత సమస్యలు పెరుగుతాయి. కాబట్టి, నోటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. కాబట్టి, దంతాలకు హాని కలిగించే ఈ క్రింది ఆహారాలను మీ డైట్ నుండి తొలగించడం వల్ల మీ దంతాలను సురక్షితంగా కాపాడుకోవచ్చు...

ఐస్:

ఐస్:

ఐస్ కానీ, ఐస్ క్యూబ్స్ ను కానీ నోట్లో వేసుకోవడం వల్ల దంతాలకు చల్లగా తగలడం వల్ల దంతాలకు హాని ఎక్కువగా ఉంటుంది . ఐస్ ను చూయింగ్ చేయడం వల్ల దంతాల యొక్క ఎనామిల్ దెబ్బతింటుంది.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు:

రెగ్యులర్ గా సిట్రస్ పండ్లను తీసుకోవడం లేదా సిట్రస్ పండ్లతో తయారుచేసిన జ్యూసులను తీసుకోవడం ద్వారా ముత్యాల లాంటి దంతాలను హాని జరుగుతుంది . సిట్రస్ పండ్ల యొక్క రసాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల దంత క్షయానికి దారితీస్తుంది మరియు దంతాలను వదులుగా మార్చుతుంది.

కాఫీ :

కాఫీ :

కాఫీని రెగ్యులర్ గా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల పళ్ళ మీద మరకలు పడుతాయి. కాఫీ ఎక్కువగా త్రాగడం వల్ల దంతాల యొక్క ఎనామిల్ ను తగ్గిస్తుంది . కాబట్టి, ఎనామిల్ మీ ఏర్పడ్డ మరకలను తొలగించాలి లేదా తెల్లగా మార్చుకోవాలి . ఈ చలికాలంలో దంత సమస్యలు అధికంగా ఉంటాయి. దంతక్షయానికి మరియు దంతాలు ఊడిపోవడానికి దారితీస్తాయి.

రుచికరమైన స్టిక్కీ ఫుడ్స్ :

రుచికరమైన స్టిక్కీ ఫుడ్స్ :

పళ్ళకు అట్టుకునే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కూడా దంతాలను నాశనం చేస్తాయి. చూయింగ్ గమ్ వంటివి పళ్ళ మద్య ఇరుక్కోవడం వల్ల దంతాలను డ్యామేజ్ చేస్తాయి. ఇత ఫుడ్స్ కంటే ఈ ఫుడ్స్ మరింత తీవ్రంగా ప్రభావం చూపుతాయి.

రుచికరంగా కరకరలాడే ఫుడ్స్:

రుచికరంగా కరకరలాడే ఫుడ్స్:

క్రిస్పీగా టేస్టీగా ఉండే పొటాటో చిప్స్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి . బంగాళదుంప యొక్క స్టార్చ్ (గంజివంటి పదార్థం)పళ్ళ మద్య ఇరుక్కుపోవడం వల్ల దంతక్షయానికి దారితీస్తుంది.

బబ్లీ షోడ:

బబ్లీ షోడ:

చాలా వరకూ కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ లో అసిడిక్ ఎక్కువగా ఉంటుంది. ఇది దంతాలకు చాలా హాని కలిగిస్తుంది. సాఫ్ట్ డ్రింక్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల దంతాల యొక్క రూట్ (కణాల)మీద ప్రభావం చూపుతుంది.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకొనే వారు దంత సమస్యలతో బాధపడుతుంటారు. ఆల్కహాల్ తో పాటు తీసుకొనే ఆహారాలు ఈ సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దంతక్షయానికి దారితీస్తుంది. ఇంకా ఓరల్ ఇన్ఫెక్షన్ కు కూడా దారితీస్తుంది . చివరకు నోటి క్యాన్సర్ ప్రమాధాన్ని చేరుకుంటుంది.

స్పోర్ట్స్ డ్రింక్స్:

స్పోర్ట్స్ డ్రింక్స్:

స్పోర్ట్స్ మరియు ఎనర్జీ డ్రింక్స్ మన బయట వర్క్ లో లేదా స్పోర్ట్స్ లేదా జర్నీలో ఉన్నప్పుడు ఇటువంటి స్పోర్ట్ డ్రింక్స్ త్రాగడానికి చాలా ట్రెండీగా ఉంటాయి. ఇష్టంగా త్రాగే ఈ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ అందమైన నవ్వును పాడుచేసుకుంటారు.

గొంతునొప్పికి తీసుకొనే మందుబిళ్ళలు:

గొంతునొప్పికి తీసుకొనే మందుబిళ్ళలు:

చెడుగా బాధిస్తున్న గొంతు నొప్పిని నివారించడం కోసం తీసుకొని లోజెన్స్ వల్ల దంతక్షయానికి గురికావల్సి వస్తుంది. గొంతనొప్పి నివారణకు రెగ్యులర్ గా తీసుకుంటే దంతక్షయానికి దారితీస్తుంది.

ఆపిల్స్:

ఆపిల్స్:

రోజూ ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ అవసరం ఉండదంటుంటారు, కానీ, ఆపిల్స్ లో ఉండే యాసిడ్స్ వల్ల త్వరగా డెంటిస్ట్ వద్దకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రోగ్యకరమైన ఫ్రూట్స్ లో యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల టీత్ ఎనామిల్ మీద చాలా చెడుగా ప్రభావం చూపుతాయి.

పికెల్స్ ఊరగాయలు

పికెల్స్ ఊరగాయలు

పికెల్స్ ఊరగాయలు దంతాలను డ్యామేజ్ చేస్తాయి. వీటిలో వెనిగర్, ఎసిడిక్ మరియు షుగర్స్ గా ఉండటం వల్ల దంతాలకు హాని ఎక్కువగా జరుగుతుంది.

బ్రెడ్:

బ్రెడ్:

ప్రొసెస్ చేసిన వైట్ బ్రెడ్ లో స్వీట్నర్స్ ను ఎక్కువగా జోడించడం వల్ల, వీటితో తయారుచేసే సాడ్విచ్, స్వీట్నర్స్ ను ఇలాంటి ఆహారాలు తిన్న వెంటనే నోటిని శుభ్రపరచుకోకపోతే, బ్యాక్టీరియా చేరే ప్రమాధం ఉంది.

జామ్ అండ్ జెల్లీ:

జామ్ అండ్ జెల్లీ:

దంతాలకు హానికలిగించే ఆహారాల్లో జామ్ అండ్ జెల్లీ ఒకటి. జామ్ మరియు జెల్లీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పాచి కట్టడం మరియు బ్యాక్టీరియా చేరడం జరుగుతుంది.

సలాడ్స్:

సలాడ్స్:

సలాడ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే, అయితే దంతాలకు కాదు. ఎందుకంటే సలాడ్స్ మీద డ్రెస్సింగ్ గా వెనిగర్ మరియు షుగర్ ఫ్లేవర్స్ జోడిస్తుంటారు. అవి దంతాలకు హాని తలపెడుతాయి.

మీట్:

మీట్:

దంతాలను పాడుచేసే ఆహారాల్లో మరో వరస్ట్ ఫుడ్ మీట్. మాంసాహారం దంతాల్లో చిక్కుకోవడం వల్ల దంతక్షయానికి దారితీస్తుంది. కొన్ని మీట్ ప్రొడక్ట్స్ లో కూడా షుగర్స్ జోడించడం వల్ల ఈ ప్రిజర్వేటివ్స్ ముత్యాల్లాంటి దంతాల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది.

English summary

15 Foods That Harm Your Teeth

Are you wrecking your teeth without even knowing it? According to experts, when you suck a lemon or your thumb, you are harming your pearly white teeth. Even when you bite your rigid fingernails, it creates havoc for your teeth.
Story first published: Monday, November 17, 2014, 16:09 [IST]
Desktop Bottom Promotion