For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్రేనుపు రాకుండా ఉండాలంటే ఉత్తమ చిట్కాలు

By Super
|

త్రేనుపు అనేది కొన్నిసార్లు ఒక విచిత్ర ధ్వని,వాసన మరియు నోటి నుండి వాయువు విడుదల వలన కలుగుతుంది. ఇది ఒక వైద్య పరిస్థితి కాదు. ఇంకా, దీనిని సాంస్కృతికంగా ఒప్పుకోలేము. భారతీయ మరియు చైనీస్ సంస్కృతిలో,కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో అంగీకరించటం లేదు. జపాన్ లో దీనిని ఖచ్చితంగా చెడు అలవాటుగా భావిస్తారు. త్రేనుపును నార్త్ అమెరికన్, ఫ్రెంచ్ మరియు జర్మన్ వంటి పాశ్చాత్య సంస్కృతులు అనుచితమైనదిగా భావిస్తారు. త్రేనుపు పోరాటానికి ప్రయత్నించండి. అలాగే ఆమె లేదా అతన్ని మన్నించండి.

గాలి మింగడం ద్వారా త్రేనుపు కలుగుతుంది. కడుపు అన్నవాహిక మరియు నోటి ద్వారా పైకి మోపడం ద్వారా గ్యాస్ ను తొలగిస్తుంది.

పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..!: క్లిక్ చేయండి

త్రేనుపుకు 15 హోం రెమిడీస్

ఇక్కడ త్రేనుపు ఉపశమనానికి 15 ఇంటి నివారణలు ఉన్నాయి. మీ వంటగదిలో ఈ పదార్దాలు సులభంగా అందుబాటులో ఉంటాయి.

అల్లం

అల్లం

అల్లం అనేది త్రేనుపుకు అత్యంత ప్రసిద్ధ మరియు సమర్థవంతమైన నివారణగా పనిచేస్తుంది. అంతేకాక ఇది తక్షణ ఉపశమనంను అందిస్తుంది. ఇది జీర్ణ పరిస్థితులు మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. భోజనం ముందు ఒక తాజా అల్లంను కొరికి తినటం లేదా పొడి అల్లం గుళికలు లేదా ద్రవం తీసుకుంటే త్రేనుపును నయం చేయవచ్చు.మీరు అల్లం రుచిని అసలు తట్టుకోలేకపోతే,దానికి ప్రత్యామ్నాయంగా అల్లం మరియు తేనెతో టీ తయారుచేసుకొని త్రాగవచ్చు. మరిగే నీటిలో తురిమిన అల్లాన్ని వేసి, దానికి తేనే లేదా నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు.

నిమ్మకాయ రసం

నిమ్మకాయ రసం

ఒక గ్లాస్ లో బేకింగ్ సోడా మరియు నిమ్మకాయ రసం కలిపి తీసుకుంటే త్రేనుపు నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఈ పానీయం జీర్ణం కావటానికి కూడా సహాయపడుతుంది. ఇది ఒక సహజ Eno వంటిది.

బొప్పాయి

బొప్పాయి

మంచి పోషకాలు కలిగిన బొప్పాయి సలాడ్ తీసుకుంటే త్రేనుపు నుండి ఉపశమనం కలుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు త్రేనుపుపై పోరాటం చేయటానికి బొప్పాయిలో పపైన్ అనే ఎంజైము ఉంటుంది. మీరు ప్రతి రోజు ఒక పండు తీసుకోవటానికి ప్రయత్నించండి.

పెరుగు

పెరుగు

భోజనం తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవటం అనేది సాధారణ మరియు సాంప్రదాయ భారతీయ అలవాటుగా ఉంది. పెరుగు జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. దీనిలో బ్రతికి ఉన్న బాక్టీరియా వలన మొత్తం కడుపు మరియు ప్రేగు సమస్యలు నయం చేస్తుంది. మీకు లాక్టోస్ పడకపోతే, మీరు మజ్జిగకు ప్రత్యామ్నాయంగా లస్సీని ఎంచుకోవచ్చు.

సోపు గింజలు

సోపు గింజలు

సోపు గింజలు జీర్ణ వాహిక ఉధృతికి సహాయం మరియు సహజంగా త్రేనుపును తగ్గిస్తుంది. ఈ గింజలను నేరుగా తీసుకోవచ్చు లేదా సలాడ్లలో జోడించవచ్చు.

సోపు, సొంపు మరియు సెలెరీ విత్తనాలు

సోపు, సొంపు మరియు సెలెరీ విత్తనాలు

ఈ విత్తనాలు అన్ని కిరాణా దుకాణాలు మరియు సూపర్ మార్కెట్స్ లలో సులభంగా అందుబాటులో ఉంటాయి.మీరు కేవలం త్రేనుపు నుండి ఉపశమనం పొందడానికి మీ భోజనం తర్వాత కొన్ని గింజలను నమలాలి. ఈ విత్తనాలు ప్రేగుల నుండి వాయువు తొలగించడానికి సహాయం చేసే ఉబ్బరం తగ్గించే ఏజెంట్లను కలిగి ఉంటాయి.

సీమ చామంతి టీ

సీమ చామంతి టీ

సంప్రదాయబద్ధంగా కడుపు నొప్పులను నయం చేయడంలో ఉపయోగిస్తారు. అంతేకాక సీమ చామంతి టీ త్రేనుపుకు నివారణగా పనిచేస్తుంది. ఈ టీని పడుకోవటానికి ముందు తీసుకోవాలి.

యాలకులు టీ

యాలకులు టీ

ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఇది గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారాలను జీర్ణం చేయుట వలన త్రేనుపును తగ్గిస్తుంది. ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ యాలకుల పొడి కలిపి 10 నిముషాలు మరిగించాలి. దీనిని భోజనం ముందు తీసుకుంటే త్రేనుపు తగ్గుతుంది.

జీలకర్ర

జీలకర్ర

భోజనం తర్వాత వేగించిన జీలకర్ర గింజలను నమిలితే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుట మరియు త్రేనుపు ఉపశమనానికి సహాయపడుతుంది.

పిప్పరమింట్

పిప్పరమింట్

ఇది త్రేనుపును తగ్గించటానికి ఉత్తమ ఇంటి నివారణలలో ఒకటి. ఒక కప్పు వేడి నీటిలో కొన్ని

పిప్పరమెంటు ఆకులను వేసి 5 నిమిషాలు కదిలించకుండా ఉంచాలి. ఈ పానీయంను పడుకోవటానికి ముందు త్రాగాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి

ఒక వెల్లుల్లి మొగ్గను మింగి మరియు ఆ తర్వాత ఒక గ్లాస్ నీటిని త్రాగాలి.దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుంది.వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అలాగే సహజంగా త్రేనుపును కూడా తగ్గిస్తుంది.

ఇంగువ

ఇంగువ

ఒక గ్లాస్ వేడి నీటిలో చిటికెడు ఇంగువను కలిపి భోజనం ముందు తాగాలి.ఇది కడుపు రద్దీని తగ్గించటానికి సహాయపడుతుంది.ఇది త్రేనుపు కోసం ఒక సహజ నివారణగా ఉంది.

మెంతులు

మెంతులు

మెంతులను 2-3 గంటలు నీటిలోనానబెట్టి, ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది త్రేనుపుకు ఉత్తమ సహజ నివారణగా పనిచేస్తుంది. అంతేకాక నోటిని తాజాగా ఉంచుతుంది.

సోయా ఆయిల్

సోయా ఆయిల్

ఒక స్పూన్ తేనెలో ఒక చుక్క సోయా ఆయిల్ ని కలపాలి. దీనిని భోజనం తర్వాత తీసుకుంటే త్రేనుపు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

లవంగం ఆకులు

లవంగం ఆకులు

తాజా లవంగం ఆకులు జీర్ణ వ్యవస్థకు ఉపశమనం కలిగించడం ద్వారా త్రేనుపులను నయం చేస్తాయి. త్రేనుపు నుండి ఉపశమనం పొందటానికి భోజనం తర్వాత లవంగం ఆకులను నమలాలి.

English summary

15 Simple Home Remedies To Prevent Burping

Burping or belching, is releasing gas from the mouth, sometimes with a peculiar sound and odour. Burping is not a medical condition, most of the time. Yet, it is culturally unacceptable.
Desktop Bottom Promotion