For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేగంగా బరువు తగ్గడానికి 15 మార్గాలు

|

ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గాలనే ఆకాంశ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఎందుకంటే ఆ ఫాస్ట్ జనరేషన్ లో జీవనశైలిలో ఎన్నో మార్పులు, వాటికి తోడు, వాతావరణంలో మార్పులు కూడా మన శరీర ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. దాంతో మనకు తెలియకుండానే మన శరీరంలో అదనపు కొవ్వు చేరడం దాంతో అదనపు బరువు పెరగడం వంటివి జరుగుతుంటుంది.

ఇలా సెడన్ గా బరువు పెరగడం వల్ల వెంటనే బరువు తగ్గించుకోవడం కష్టం అవుతుంది. బరువు తగ్గించుకోవాలని అనుకోవడం కంటే, వెంటనే బరువు తగ్గాలనే విషయాన్ని ఆచరణలో పెట్టడం వల్ల సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. కొన్ని వెయిట్ మ్యానేజ్ మెంట్ క్లీనిక్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల త్వరగా బరువు తగ్గిస్తామని విషయం మనకు చాలా ఎక్సైట్మెంట్ కు గురిచేస్తుంది. కానీ వెళ్ళిన తర్వాత వెయిట్ మ్యానేజ్ మెంట్ ప్రోగ్రామ్స్ తో పాటు , వ్యక్తిగతంగా కేర్ తీసుకొన్నట్లైతే తప్పనిసరిగా బరువు తగ్గించుకోవచ్చు.

కొన్ని రోజుల జిమ్ కు వెళ్ళి బరువు తగ్గించుకొని, తర్వాత నిలిపేయడం వల్ల తిరిగి మునుపటి కంటే ఎక్కువ బరువు పెరుగుతారు. కాబట్టి, నార్మల్ డైలీ లైఫ్ పొందడానికి, మీ దినచర్యను బ్యాలెన్స్ చేస్తూ, ఆహారం, వ్యాయామం వంటివి మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేయగలిగినప్పుడు మీరు తప్పనిసరిగా బరువును కంట్రోల్లో ఉంచుకొంటారు. కాబట్టి, వ్యాయామం, క్లీనికల్ ప్రోగ్రామ్స్ తర్వాత వెంటనే బరువు పెరగకూడదునుకొనే వారికి కొన్నిఎఫెక్టివ్ మార్గాలు....

వ్యాయామం:

వ్యాయామం:

వ్యాయామ నిపుణుల ద్వారా తీసుకొనే బరువు తగ్గించుకొనే ఎక్సర్ సైజ్ లు రెగ్యులర్ గా చేయడం వల్ల తప్పనిసరిగా బరువును కంట్రోల్ చేయగలుగుతారు.

విశ్రాంతి:

విశ్రాంతి:

జీవన శైలిలో ఒడిదుడుతకు, ఒత్తిడితో ఉండకూడదు. మనస్సుకు ప్రశాతంత చాలా అవసరం. కాబట్టి, మీశరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, విశ్రాంతి కూడా అంతే అవసరం. త్వరగా నిద్రపోవడం, అలసట, ఆందోళన ఉన్నప్పుడు, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

రాత్రి సమయంలో త్వరగా భోజనం చేయడం:

రాత్రి సమయంలో త్వరగా భోజనం చేయడం:

చాలా మంది లేట్ నైట్ డిన్నర్లు చేస్తుంటారు. అది ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు, అధిక బరువుకు దారి తీస్తుంది. కాబట్టి, సాధ్యం అయినంత వరకూ రాత్రి సమయంలో త్వరగా భోజనం ముగించడం ఆరోగ్యకరం.

పంచదార తక్కువగా :

పంచదార తక్కువగా :

పంచదారను ఎక్కువగా ఉపయోగించడం ఎక్కువ క్యాలరీలను మన శరీరం గ్రహిస్తుంది . కాబట్టి అదనపు క్యాలరీలు మన శరీరం గ్రహించకూడదనుకుంటే, పంచదార తీసుకోవడం కంట్రోల్ చేసుకోవాలి. పంచదారకు బదులుగా తేనెను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

డిన్నర్ కు ముందు డిజర్ట్స్ ను నివారించండి:

డిన్నర్ కు ముందు డిజర్ట్స్ ను నివారించండి:

రాత్రి తీసుకొనే భోజనానికి ముందు డిజర్ట్స్ వంటి వాటిని తినకుండా నివారించాలి. ఇవి శరీరంలో క్యాలరీలను ఎక్కువగా పెంచుతాయి.

బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా తిసుకోవాలి:

బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా తిసుకోవాలి:

మన శరీరంలో రోజంతా జీవక్రియలు చురుకుగా పనిచేయాలంటే తప్పనిసరిగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.

రాత్రి భోజనం పరిమితంగా:

రాత్రి భోజనం పరిమితంగా:

ఎక్కువ ఆహారం తీసుకొని నిద్రపోవడం వల్ల ఉన్నఫలంగా బరువు అమాంతంగా పెరిగిపోతారు. కాబట్టి ఎల్లప్పుడు రాత్రి భోజనం మితంగా తీసుకోవడం ఆరోగ్యకరం.

ఎక్కువ ప్రోటీనులు :

ఎక్కువ ప్రోటీనులు :

మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో స్టార్చ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి క్యాలరీలుగా మార్పు చెందే అవకాశం ఎక్కవు. కాబట్టి మంచి ప్రోటీనులున్న ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నించండి.

ఆరోగ్యకరమైన స్నాక్స్ :

ఆరోగ్యకరమైన స్నాక్స్ :

స్నాక్స్ అనగానే డీప్ ఫ్రై చేసిన వాటి మీదన మనస్సు మళ్ళుతుంది. కాబట్టి, రాత్రి భోజనానికి ముందు లేదా ఈవెనింగ్ సమయంలో మీరు ఇటువంటి ఫ్రైడ్ స్నాక్స్ కు చెక్ పెట్టి గుప్పెడు నట్స్ ను తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

పండ్లను జ్యూస్ లుగా త్రాగడం కంటే తినడం ఉత్తమం:

పండ్లను జ్యూస్ లుగా త్రాగడం కంటే తినడం ఉత్తమం:

తాజా పండ్లను జ్యూస్ ల రూపంలో తీసుకోకుండా త్రాగడం ఉత్తమం. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి అధిక ఫైబర్ అందుతుంది.

తాజావి తినాలి:

తాజావి తినాలి:

ఏం తిన్నా ఫ్రెష్ గా ఉన్నవాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అందులోనూ ఎప్పుడు హోం మేడ్ ఫుడ్స్ కు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

బయట మితంగా తినడాలి:

బయట మితంగా తినడాలి:

రెస్టారెంట్స్ లో భోజనం చేయాల్సి వస్తే మితంగా తీసుకోవాలి.

లేబుల్ చదవాలి:

లేబుల్ చదవాలి:

ప్యాక్డ్ మరియు క్యాండ్ ఫుడ్స్ తీసుకొనే ముందు వాటి మీద లేబుల్స్ ను ఖచ్చితంగా చదివి ఎక్స్ పైర్ డేట్ ను చూసి కొనాలి.

ఫుడ్ జర్నల్:

ఫుడ్ జర్నల్:

ఫుడ్ జర్నల్ మెయింటైన్ చేయడం వల్ల మీరు ఎంత మోతాదులో ఆహారంను తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

కడుపు నిండిందనే భావన వచ్చే వరకూ తినకూడదు:

కడుపు నిండిందనే భావన వచ్చే వరకూ తినకూడదు:

తినడానికి రుచికరంగా ఉన్నాయి కదా అని, దొరికినవన్నీ తినకూడదు. మీ ఆకలి తిరిన వెంటనే తినడం నిలిపేయండి.

English summary

15 Ways To Lose Weight Fast

The desire to get instant results leads everyone into taking shortcuts. Such aspirations can also be seen in the case of personal care. We tend to neglect our body and do not realise the consequences. Suddenly, the alarm bells sound and then efforts are made to reverse years of neglect within a very short span of time.
Desktop Bottom Promotion