For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిపితో చిర్రుబుర్రులాడక ఈ ఆహారాలు తినండి..

|

ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటుతో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఎవరిని పలకరించినా హై బి.పి ఉందని అంటున్నారు. హై బి.పి. నే హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. విషయమేమిటంటే మనలో చాలా మంది హై బి.పి. ఉందన్న విషయం తెలియకుండానే గడిపేస్తుంటాం. హై బి.పి. లక్షణాలు అంత తేలిగ్గా తెలియవు. హై బి.పి వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు, దాని ప్రభావం శరీరానికి ముఖ్య అవయవాలైన గుండె, కిడ్నీల పైనే మొదట పడుతుంది, అంతే కాదు ఈ హై బి.పి. ఒక లెవెల్ దాటిందంటే హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

అధిక రక్త పోటు లేదా హైపర్టెన్షన్ అనేది ఒక అంటు వ్యాధిలా ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. మారుతున్న జీవన విధానం, ఫాస్ట్ ఫుడ్ పై ఆధారపడటం, సోడా మరియు ఒత్తిడి వంటివి భారత దేశం లో ని అధిక రక్తపోటు కి కారణాలు. ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు అధిక రక్త పోటు సమస్య తో బాధపడుతున్నారు. దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు మూత్ర పిండాల సమస్యలు వస్తాయి. ఇలా ఒక్క కారణం చేత వివిధ రకాల ప్రాణాంతక వ్యాధుల భారీన పడకుండా బిపిని కంట్రోల్ చేసుకోవడానికి లేదా పూర్తిగా హైబిపిని తగ్గించుకోవడానికి క్రింది ఆహారాలు అద్భుతంగా సహాయపడుతాయి

పుచ్చకాయ :

పుచ్చకాయ :

నియాసిన్‌, పాంటోథోనిక్‌ ఆమ్లం, విటమిన్‌ సి, మాంగనీస్‌లు దీనిలో అధికంగా ఉంటాయి. బి.పి.ని తగ్గిస్తుంది. : హై బిపి నివారణలో ఖర్బూజా చాలా ముఖ్యమైన ఆహారం, ఖర్బూజా గింజలను రోస్ట్ చేసి లేదా ఎండబెట్టి తినడం వల్ల రక్త నాళాల్లో ఉన్న ప్రెజర్ తగ్గి బి.పి. కంట్రోల్ లో ఉంటుంది.

అరటి పండ్లు:

అరటి పండ్లు:

అరటిపండ్లు ఆన్లైన్ బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం,అరటి వంటి పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తినడం మరియు ఉప్పు తీసుకోవడం తగ్గించడం ద్వారా భవిష్యత్తులో ప్రతి సంవత్సరంను సేవ్ చేయవచ్చు. పొటాషియం అనేది శరీరంలోని ద్రవాల సంతులనం చేసి తక్కువ రక్తపోటుకు సహాయపడే ఒక ముఖ్యమైన ఖనిజం. మీరు ఐదు అరటిపండ్లను తినే విధంగా చూసుకోవాలి.

పౌష్టికాహారం/మొలకలు :

పౌష్టికాహారం/మొలకలు :

మంచి ఆరోగ్య పోషకాలు ఉన్న ఆహారం అవసరం. పోషకాలు ఏ సమయంలోనైన లోపం జరిగితే తక్కువ రక్తపోటు కారణమయ్యే సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి, పూర్తి పోషకాలున్న మొలకలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

ఆరోగ్యకరమైన ఆహారం:

ఆరోగ్యకరమైన ఆహారం:

ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు మరియు సంతృప్త కొవ్వు వంటివి తీసుకోవడం వల్ల 14యంయం హెజిని తగ్గిస్తుంది. డైయట్ ప్లాన్ మార్చడం అంత సులభం కాదు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల హెల్తీ డైయట్ ను పాటించవచ్చు.

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు -

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు -

ఆరెంజ్, కివి, క్రాన్ బెర్రీ, జామ, ద్రాక్ష మరియు స్ట్రా బెర్రీలలో విటమిన్ సి ఉంటుంది. చాలా స్టడీలలో విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే, అధిక రక్తపోటు తగ్గుతుందని నిరూపించబడింది. ఈ పండ్లు పచ్చివిగా లేదా వాటిని రసాలుగా తీసి తాగవచ్చు. మీ బ్లడ్ ప్రెజర్ సహజ నియంత్రణలో ఉండాలంటే, ప్రతిరోజూ విటమిన్ సి తీసుకోవాలి.

పెరుగు:

పెరుగు:

పెరుగును ఆస్వాదించండి ఒక రోజులో కేవలం ఒక చిన్న కుండలో మూడో వంతు పెరుగు ద్వారా అధిక రక్తపోటు అవకాశాలను తగ్గించవచ్చు. US మిన్నెసోటా విశ్వవిద్యాలయం సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం సహజ కాల్షియం రక్త నాళాలను ఎక్కువ అనువుగా చేయవచ్చని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. కొద్దిగా విస్తరించేందుకు మరియు ఒత్తిడి ఉంచడానికి అనుమతిస్తుంది. ప్రతి రోజు 120g పెరుగును15 సంవత్సరాల కాలం తిన్న వారిలో అధిక రక్తపోటు అభివృద్ధి 31 శాతం తక్కువ అవకాశాలు ఉన్నాయని కనుగొన్నారు.

నిమ్మకాయ :

నిమ్మకాయ :

నిమ్మకాయ హై బి.పి. ఉన్నవారికి చాలా విలువైన ఔషధం , ఎందుకంటే ఉసిరికాయలో ఉండే విటమిన్ పి, బి. పి. ని కంట్రోల్ చేసి, రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది

వెల్లుల్లి:

వెల్లుల్లి:

హై బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో వెల్లుల్లి ఔషధంలా పని చేస్తుంది. అది బి.పి. ని తగ్గించి శరీరంలోని జీవక్రియలను సమతుల్యం చేస్తుంది . పల్స్ రేట్ , గుండె వేగాన్ని అదుపులో ఉంచుతుంది . అంతేకాదు రోజు ఉదయాన్నే పరగడుపున మూడు వెల్లుల్లి రేకులను మింగితే రోజంతా చలాకీగా ఉంచి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా దరి చేరకుండా చూస్తుంది.

బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్:

చాలామంది కాస్త బరువు పెరగానే అన్నం తినడమంటేనే భయపడుతుంటారు , కానీ బ్రౌన్ రైస్ లో ఉండే కాల్షియం, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందునా హై బి.పి ఉన్నవారికి ఇది పూర్తిగా సోడియం రహిత ఆహారం, కాబట్టి నిర్భయంగా తినవచ్చు. ఇది నరాలను రిలాక్స్ చేసి రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది.

కొత్తిమీర :

కొత్తిమీర :

కొత్తిమీర లో ఉన్న ఔషధ గుణాలు బి.పి. ని అదుపులో ఉంచుతాయి. కొత్తిమీర జ్యూస్ ను రోజుకు ఒకసారి తాగినా చాలు, బి పి కంట్రోల్ లో ఉంటుంది.

కూరగాయలు :

కూరగాయలు :

కూరగాయల జ్యూస్ ముఖ్యంగా క్యారట్ జ్యూస్ గానీ, పాలకూర జ్యూస్ గానీ కలిపి గానీ విడివిడి గా కానీ తీసుకోవడం వల్ల బి.పి. పేషెంట్స్ కి చాలా రిలీఫ్ గా ఉంటుంది. 300 మీ.లీ. ల క్యారట్ జ్యూస్ మరియు 200 మీ.లీ. పాలకూర జ్యూస్ 500 మి.లీ. లీటర్ నీటిలో కలిపి రోజూ తాగడం వల్ల బి పి లెవెల్ లో ఉంటుంది.

పచ్చని ఆకు కూరలు -

పచ్చని ఆకు కూరలు -

పచ్చని ఆకు కూరలలో పోషకాలు అధికం. వాటిలో ఐరన్ ఉంటుంది. ఇవి మీ అధిక రక్తపోటు తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి. చర్మం మెరుపు పొందుతుంది.

టమాటాలు -

టమాటాలు -

ఎర్రగా ఉండి మంచి రసాన్ని ఇచ్చే టమాటా పండులో ఎన్నో పోషకాలు, ప్రొటీన్లు ఉంటాయి. రక్తపోటు నియంత్రణకు ఈ పండు బాగా పని చేస్తుంది. వీటిలో వుండే లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సహజంగా రక్తపోటు నియంత్రిస్తుంది. దీనిలో విటమిన్ సి,ఎ,ఇ, పొటాషియం, కాల్షియం వంటివి కూడా రక్తపోటు నియంత్రిస్తాయి.

బంగాళాదుంప:

బంగాళాదుంప:

బంగాళా దుంపలు బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. బంగాళాదుంపల పొట్టు తీయకుండా ఉడికించడం వల్ల అందులో ఉండే పొటాషియం వల్ల ఉప్పు వేయకపోయినా ఉడికిన బంగాళాదుంపలు ఉప్పగా ఉండి రుచిగా ఉంటాయి. కాబట్టి బంగాళా దుంపలను రోజుకు ఒకసారైనా ఆహారంలో భాగమయ్యేలా జాగ్రత్తపడాలి.

ఉసిరికాయ:

ఉసిరికాయ:

ఉదయం పూట పరగడుపునే ఒక టేబుల్ స్పూన్ ఉసిరి రసంలో కాస్త తేనె కలుపుకుని తాగితే బి. పి. లెవెల్ అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

డైరీ ప్రొడక్ట్స్ :

డైరీ ప్రొడక్ట్స్ :

పైన చెప్పిన డైట్ తో పాటు మరొక సలహా ఏమిటంటే హై బి.పి ఉన్నవారు తినే రొటీన్ ఆహారంలో కాల్షియం , ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడంతో పాటు సోడియం ఉన్న ఆహారాన్ని పూర్తిగా వదిలేసినా మంచిదే.

సోయా మిల్క్ :

సోయా మిల్క్ :

అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సోయా లేదా మిల్క్ ప్రొటీన్ బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవ్తేల తాజా పరిశోధనల్లో వెల్లడయింది.

గుమ్మడి:

గుమ్మడి:

డయాబెటీస్ రాకుండా ఉండేందుకు , వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది. బి.పి.ని నియంత్రిస్తుంది. పీచు పదార్ధము ఎక్కువగా ఉన్నందున కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది. గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంభంద వ్యాదులు తగ్గుతాయి .

మరొక ముఖ్య గమనిక :

మరొక ముఖ్య గమనిక :

హై బి. పి కేవలం మనం తినే ఆహారం వల్లే కాదు, నిద్ర సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ ఎక్కువైనా తిరగబడే అవకాశముంది, కాబట్టి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి..

English summary

16 Foods That Help Lower Blood Pressure

High blood pressure, also known as "the silent killer," is an epidemic in our nation. It typically has no warning signs or symptoms, and many people don't realize they have it, which is why we must all get it checked regularly.
Desktop Bottom Promotion