For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరమైన జుట్టు, తలపై చర్మం కొరకు 20 ఆహారాలు

By Lakshmi Perumalla
|

నూనె మరియు కేలరీలతో నిండిన ఆహారం మోటిమల మంటను కలిగిస్తుంది. అంతేకాక అనారోగ్యకరమైన ఆహారం జుట్టు మరియు తలపై చర్మంనకు హాని కలిగిస్తుంది.

ప్రతి వ్యక్తికి ఆరోగ్యకరమైన మరియు బాగా కనిపించే జుట్టు కొరకు వయస్సుతో సంబంధం లేదని ఋజువైంది. మీ జుట్టు మరియు మీ జుట్టు ప్రతి స్ట్రాండ్ మూలాలు పటిష్టం అవటానికి పోషకాలు అవసరం అవుతాయి. అందువల్ల,మీరు ఏమి తినాలో జాగ్రత్తగా తెలుసుకొని తినాలి. పోషణ విజ్ఞానవేత్త అయిన ప్రియ కత్పాల్ మీ జుట్టుకు తిరిగి బౌన్స్ మరియు మెరుపు రావటానికి సూపర్ ఆహారాలు జాబితా గురించి చెప్పారు. మీరు నిస్తేజంగా,పొడిగా లేదా జిడ్డైన జుట్టును వదిలించుకోవటానికి ఈ ఆహారాలను తీసుకోని ఆ తేడాను మీరే చూడండి. ఆరోగ్యకరమైన జుట్టు మరియు తలపై చర్మం కొరకు 20 ఉత్తమ ఆహారాల గురించి తెలుసుకుందాము.

జుట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారం-ఇంటి వైద్యం:క్లిక్ చేయండి

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 1: సాల్మన్

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 1: సాల్మన్

ఒక ఆరోగ్యకరమైన జుట్టు మరియు తలపై చర్మం కొరకు కావాల్సిన ముఖ్య పదార్థాలు ప్రోటీన్ మరియు విటమిన్ డి అని చెప్పవచ్చు. సాల్మన్ లో ప్రోటీన్,విటమిన్ డి మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉన్నాయి. మీ జుట్టును బాగా ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచటానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లం చాలా ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన జుట్టు ఒక ఆరోగ్యకరమైన చర్మంతో మొదలవుతుంది. అందువల్ల మీ ఆహారంలో ఎక్కువగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోండి.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 2: గొడ్డు మాంసం

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 2: గొడ్డు మాంసం

డాక్టర్ సందీప్ సుత్తర్ - జుట్టు పునరుద్ధరణ మరియు చర్మం పునర్ యవ్వన సర్జన్-ముంబై, ఈ విధంగా అన్నారు:"మీకు కొలెస్ట్రాల్ సమస్యలు లేకపోతే,అప్పుడు మీరు కనీసం రెండు రోజులకు ఒకసారి ఈ మాంసంను తినవచ్చు. ఈ ఆహారంలో మీ జుట్టు కొరకు అవసరమైన అన్ని పోషకాలు ఉన్నాయి. దీనిలో ఉన్న ప్రోటీన్,విటమిన్ B,ఇనుము,జింక్ మరియు ఇతర కీలక ఖనిజాలు మీ జుట్టు మరియు తలపై చర్మ ఆరోగ్యాన్ని నిర్వహించేందుకు సహాయం చేస్తాయి." చివరగా,డాక్టర్ సందీప్ "పోషకాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ,ఇతర ఆరోగ్య సమస్యలను తప్పించుకొనుటకు గొడ్డు మాంసం వినియోగంను కొంత తగ్గించాలని చెప్పారు.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 3: ప్రూనే

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 3: ప్రూనే

మీ ఆహారంలో ప్రూనే ను చేర్చితే,మీ జుట్టు నిర్మాణం అలాగే సరైన బౌల్ కదలికలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు నష్టం,నిస్తేజమైన జుట్టు,సన్నని జుట్టు మరియు మీ జుట్టు రంగు పాలిపోవడాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 4: గ్రీన్ టీ

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 4: గ్రీన్ టీ

మీ తలపై చర్మంను ఆరోగ్యవంతముగా చేయటానికి పోలిఫెనోల్స్ సహాయపడుతుంది. మీ తలపై చర్మం ఆరోగ్యకరముగా ఉంటే,మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాక ప్రకాశవంతముగా మరియు చుండ్రు లేకుండా మీ జుట్టును ఉంచటానికి సహాయపడుతుంది. డాక్టర్ సందీప్ ఈ అద్భుతమైన టీ మీ చుండ్రు సమస్య చికిత్సకు ఒక సత్వర పరిష్కారమును చూపుతుందని చెప్పారు. గ్రీన్ టీతో మీ జుట్టును కడగడం లేదా మీ జుట్టు మీద రాయటం ద్వారా చుండ్రును నివారించవచ్చు.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 5: క్యారెట్లు

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 5: క్యారెట్లు

క్యారెట్లలో ఉండే విటమిన్ A మీ దృష్టి తీవ్రతరం చేసేందుకు మాత్రమే కాకుండా మీ జుట్టు ఆరోగ్యాన్ని నిర్వహించేందుకు కూడా సహాయం చేస్తుంది. విటమిన్ A తలపై చర్మంలో సిబం ఆయిల్ ఏర్పడటానికి సహాయపడుతుందని డాక్టర్ సందీప్ చెప్పారు.సిబం చర్మం మరియు జుట్టు బాగా తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. తలపై చర్మం మీద తేమ ఉంటే ఆరోగ్యకరమైన జుట్టు అని అర్థం.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 6: గుడ్లు

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 6: గుడ్లు

గుడ్లులో బోయోటిన్ మరియు విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండు పోషకాలు మీ జుట్టు ఆరోగ్యానికి మరియు నిర్వహణ కొరకు చాలా ముఖ్యమైనవి. బోయోటిన్ అనేది మీ జుట్టును మెరిసే మరియు నునుపుగా ఉంచటానికి సహాయపడే ఒక స్టార్ మూలకం అని చెప్పవచ్చు. అనేక షాంపూ మరియు కండీషనర్లలో బోయోటిన్ కూడా ఉంటుంది. అంతేకాక ఇది జుట్టు ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన మూలకాలలో ఒకటి.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 7: ముదురు ఆకుపచ్చ కూరలు

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 7: ముదురు ఆకుపచ్చ కూరలు

మీ ఆహారంలో బచ్చలికూర,బ్రోకలీ మరియు లేత్తుస్ వంటి ముదురు ఆకుపచ్చ కూరలను చేర్చండి. ఈ ముదురు ఆకుపచ్చ కూరలలో విటమిన్ ఎ మరియు విటమిన్ C సమృద్దిగా ఉంటుంది. అందుకే ఈ విటమిన్లు సహజ జుట్టుకు సిబం ఏర్పాటుకు సహాయం మరియు మీ చర్మం మరియు జుట్టును తేమగా ఉంచటానికి సహాయం చేస్తాయి.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 8: బ్రౌన్ రైస్

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 8: బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ లో ప్రోటీన్,విటమిన్లు మరియు ఫైబర్ ఉంటుంది. మీరు ఆరోగ్యకరమైన జుట్టు మరియు తలపై చర్మం ఇవ్వడమే కాకుండా,ఎక్కువ సమయం వరకు ఆకలి లేకుండా పూర్తిగా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. అందువల్ల,మీ జుట్టు అలాగే మీ శరీరంను నిర్వహించడానికి ఇప్పుడు మీరు బ్రౌన్ రైస్ లోకి మారవచ్చు.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 9: ఓస్టెర్స్(గుల్లలు)

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 9: ఓస్టెర్స్(గుల్లలు)

జుట్టు నష్టం లేదా చుండ్రు అనేవి హార్మోన్ ఆండ్రోజెన్ ఉత్పత్తి తక్కువ స్థాయి కారణంగా ఏర్పడతాయి. ఓస్టెర్స్ లో జింక్ సమృద్దిగా ఉంటుంది. అందువల్ల మీ ఆహారంలో ఓస్టెర్స్ చేర్చండి. ఇది మరింత ఆండ్రోజెన్ ఉత్పత్తి లో సహాయపడుతుంది. అందువల్ల ఇది జుట్టు ఫాల్ మరియు చుండ్రుకు వ్యతిరేకంగా పోరాడుతుంది. మీ జుట్టు ప్రకాశవంతముగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 10: వాల్నట్

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 10: వాల్నట్

వాల్నట్ మీ జుట్టు పోషణ మరియు నిర్వహణ కొరకు ఉత్తమ నట్స్ లలో ఒకటి. వాటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,బోయోటిన్,విటమిన్ E మరియు రాగి సమృద్ధిగా వున్నందున,అది ఒక కవచం ద్వారా సూర్యుని నుండి నష్టంనకు వ్యతిరేకంగా మీ జుట్టును రక్షిస్తుంది. అంతేకాకుండా జుట్టు నష్టాన్ని నిరోధించడానికి,నునుపుగా మరియు మంచి రంగు ఉంచేందుకు సహాయపడుతుంది.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 11: కాటేజ్ చీజ్

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 11: కాటేజ్ చీజ్

కాటేజ్ చీజ్ లో తక్కువ కొవ్వు,కాల్షియం మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. నిస్తేజమైన జుట్టును వదిలించుకోవటం సహాయం చేస్తుంది. అందువల్ల మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఆరోగ్యకరమైన చీజ్ ను చేర్చండి.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 12: గ్రీన్ బటానీలు

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 12: గ్రీన్ బటానీలు

గ్రీన్ బటానీలు ఆరోగ్యకరమైన జుట్టు కొరకు అందుబాటులో ఉన్న సమతుల్యమైన ఆహారంగా చెప్పవచ్చు. దీనిలో జింక్,ఇనుము మరియు విటమిన్ B వంటి ఖనిజాలు మరియు విటమిన్లు ఉన్నాయి. అవి మీ జుట్టు మరియు తలపై చర్మ ఆరోగ్యాన్ని నిలబెట్టడానికి సహాయపడతాయి.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 13: కాయధాన్యాలు

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 13: కాయధాన్యాలు

"మీరు నిజంగా ఆరోగ్యకరమైన జుట్టును కోరుకుంటే,మీ ఆహారంలో కనీసం ఒక వారంలో 3-4 సార్లు కాయధాన్యాలు తీసుకోవాలి " అని ప్రియ చెప్పారు.కాయధాన్యాలలో ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఫోలిక్ ఆమ్లం మీ జుట్టు మరియు చర్మానికి అవసరమైన మొత్తంలో ఆక్సిజన్ ను అందించడంలో సహాయపడుతుంది. ఇది మరింత జుట్టు పెరుగుదలను మరియు సెల్ పునరుద్ధరణను ప్రోత్సహిస్తుంది.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 14: బెల్ మిరియాలు

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 14: బెల్ మిరియాలు

దీనిలో విటమిన్ C సమృద్దిగా ఉంటుంది. అందువల్ల మీ ఆహారంలో అన్ని రంగుల బెల్ పెప్పెర్ ను చేర్చండి. విటమిన్ సి జుట్టు గ్రీవమునకు ఆక్సిజన్ ను సమర్థవంతంగా పరివర్తనను కలిగిస్తుంది. అంతే కాకుండా,ఇది కొల్లాజెన్ యొక్క నిర్మాణంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే జుట్టు పగుళ్లను నిరోధిస్తుంది.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 15: తృణధాన్యాలు

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 15: తృణధాన్యాలు

తృణధాన్యాలలో పోషకాలు మరియు ఫైబర్స్ సమృద్దిగా ఉన్నాయి. ఈ జుట్టు పెరుగుదల మరియు ఆరోగ్యకరమైన జుట్టు కొరకు ఒక సూపర్ ఆహారంగా ఉంటుంది.అంతేకాక మంచి జీర్ణక్రియకు సహాయం మరియు మధుమేహం,ఊబకాయం మరియు మలబద్ధకం వంటి రోగాలను నిరోధిస్తుంది.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 16: చిలకడదుంప

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 16: చిలకడదుంప

చిలకడదుంప బీటా కెరోటిన్ తో నిండి ఉంటుంది. దీనిని వినియోగించే సమయంలో విటమిన్ ఎ గా మార్చబడుతుంది. విటమిన్ ఎ నిస్తేజమైన జుట్టును నిరోధిస్తుంది. అంతేకాక జుట్టు పుటము అభివృద్ధి మరియు సరైన ఆక్సిజన్ సర్క్యులేషన్ కొరకు ప్రోత్సహిస్తుంది.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 17: బ్లూ బెర్రీలు

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 17: బ్లూ బెర్రీలు

ఈ సూపర్ పండులో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఇది తలపై చర్మం మరియు జుట్టు గ్రీవమునకు ఆక్సిజన్ ప్రసరణలో సహాయపడుతుంది. అలాగే జుట్టు పగుళ్లను నిరోధిస్తుంది.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 18: బేకన్

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 18: బేకన్

మీరు కొన్ని కేలరీలను వదలివేయాలని అనుకుంటే ఇది ఒక శత్రువు. అయినప్పటికీ మీరు ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే మీరు 4 ఔన్సుల కంటే ఎక్కువ తినకూడదని ప్రియ చెప్పారు.దీనిలో ఆరోగ్యకరమైన జుట్టు ప్రోత్సహించే విటమిన్ B,జింక్ మరియు ప్రోటీన్ వంటి పోషకాలు ఉన్నాయి.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 19: చిన్నరొయ్యలు

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 19: చిన్నరొయ్యలు

చిన్నరొయ్యలు రుచికరమైనవి. కానీ మీ నిస్తేజమైన జుట్టు మరియు తలపై చర్మం కొరకు ఒక గొప్ప డాక్టర్ అని చెప్పవచ్చు. దీనిలో విటమిన్ బి 12,ఇనుము మరియు జింక్ ఉంటాయి. చిన్నరొయ్యలు జుట్టు నష్టాన్ని నిరోధించడానికి మరియు జుట్టు అభివృద్ధి మరియు నిర్వహణ ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 20: గుమ్మడికాయ గింజలు

ఆరోగ్యవంతమైన జుట్టు ఆహారం # 20: గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజలు ఒక ఖచ్చితమైన జుట్టు పునరుత్తేజంనకు ఒక అల్పాహారం. దీనిలో మాంసకృత్తులు, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు,జింక్ ఉన్నాయి. అవి మొత్తం ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి.

English summary

20 foods for healthy hair and scalp

Just as food filled with loads of oil and calories can cause acne flares and jeopardise your waistline, unhealthy food can also cause damage to your healthy hair and scalp. Every individual craves for healthy and better looking hair, luscious locks, that won't diminish with age. Hence, be careful of what you eat, as the nutrients you consume are essential to fortify follicles, each strand of your hair and your scalp.
Desktop Bottom Promotion