For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తేనె -గ్రీన్ టీ కాంబినేషన్లో గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

|

ప్రస్తుత కాలంలో గ్రీన్ టీ నిధానంగా చాలా పాపులర్ చెందినది . కాఫీ మరియు టీ త్రాగే వారు గ్రీన్ టీ వైపు మల్లుతున్నారు. ప్రస్తుతం గ్రీన్ టీలో కూడా వివిధ రకాల బ్రాండ్స్ కూడా మార్కెట్లో మనకోసం అందుబాటులోకి వచ్చాయి. ఇతర గ్రీన్ టీలతో పోల్చితే ప్లెయిన్ గ్రీన్ టీలో ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. ప్లెయిన్ గ్రీన్ ట్రీకి నిమ్మరసం లేదా లెమన్ గ్రాస్ మిక్స్ చేసి కూడా తీసుకుంటే మంచి ఫ్లేవర్ తో పాటు ఆరోగ్యం కూడా .

గ్రీన్ టీ ని షుగర్ వేసి తీసుకోకూడదు. గ్రీన్ టీ మిమ్మల్ని ప్రకాశవంతంగా ఉత్సహాకంగా మార్చడానికి గ్రీన్ టీ బాగా సహాయపడుతుంది. కాబట్టి, పంచదార్ గ్రీన్ టీకి ఫర్ ఫెక్ట్ ఐడియల్ కాంబినేషన్ కాదు. గ్రీన్ టీకి ఒక మంచి కాంబినేషన్ కొద్దిగా నిమ్మరసం మరియు కొద్దిగా తేనె. గొప్ప ప్రయోజనాలను అంధిస్తుంది. ఈ కాంబినేషన్ లో గ్రీన్ టీని తీసుకుంటే ఖచ్చింతంగా స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు అలాగే, ఎక్కువ ప్రయోజనాలను కూడా పొందుతారు. గ్రీన్ టీతో పాటు తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్యప్రయోజనాలు మీరు తెలుసుకోవడం కోసం, ఈ క్రింది విధంగా...

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా గ్రీన్ టీ తాడమేలా?:క్లిక్ చేయండి

5 Benefits Of Green Tea With Honey

1. బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది: ఇది ఉత్సహం కలిగించే పానియం మాత్రమే కాదు, ఇది మిమ్మల్ని స్మార్ట్ గా మార్చుతుంది . గ్రీన్ టీని తేనె కలిపి త్రాగితే, మంచి రుచితో పాటు బ్రెయిన్ ను చురుకుగా ఉంచే కొన్ని విటమిన్స్ ను ఈ పానియం అందిస్తుంది. గ్రీన్ టీలోని ఈ రెండు పదార్థాలు మెదడు యొక్క ఏకాగ్రతను పెంచుతుంది. అంతే కాదు ఇది జ్ఝాపకశక్తితోపాటు బ్రెయిన్ రియాక్షన్ ను మెరుగుపరుస్తుంది. అందుకే తేనె కలిపిన గ్రీన్ టీ బ్రెయిన్ హెల్త్ కు చాలా గొప్పగా సహాయపడుతుంది. గ్రీన్ టీలోని కెఫిన్, ఇతర పానీయాలు కాఫీతో పోల్చితే కెఫిన్ గ్రీన్ టీలో చాలా తక్కువ. అందువల్ల ఇది మెదడును స్థిరంగా ఉంచుతుంది. మరియు ఏకాగ్రతను పెంచుతంది. గ్రీన్ టీ త్రాగడానికి ఇది ఒక మంచి కారణం.

గ్రీన్ టీ తప్పనిసరిగా తాగడానికి గల 10 ఖచ్ఛితమైన కారణాలు.:క్లిక్ చేయండి

2. ఫ్యాట్ కరిగిస్తుంది: ప్రస్తుత రోజుల్లో చాలా మంది వారి బరువు తగ్గించుకోవడానికి మరియు శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించుకోవడానికి, కాలరీలను తగ్గించుకోవడానికి తేనె కలిపిన గ్రీన్ టీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. తేనె మిక్స్ చేసిన గ్రీన్ టీను రెగ్యురల్ గా తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలను తగ్గిస్తుంది. గ్రీన్ టీ మెటబాలిజంకు కావల్సినంత శక్తిని అందిస్తుంది. తేనె క్యాలరీలను తగ్గిస్తుంది.

3. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది: గ్రీన్ టీ త్రాగడం వల్ల ఒక ముఖ్యమైనటువంటి ఆరోగ్యప్రయోజనం, గొప్ప యాంటీఆక్సిడెంట్స్ ను మన శరీరానికి అందిస్తుంది. శరీరంలోని కణాలకు బహువిధాలుగా ప్రయోజనం అందిస్తుంది. గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలను ఏర్పడకుండా నివారిస్తుంది. ఇది ఒక ముక్యమైన గ్రీన్ టీ.

4. డెంటల్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది: చాలా మంది దంతక్షయం మరియు ఇతర డెంటల్ సమస్యలతో బాధపడుతుంటారు. గ్రీన్ టీలోని కెటాచిన్స్ మరియు తేనె వంటివి దంతాల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి . దంత సమస్యలు స్టెప్టోకస్ మటాన్స్ అనే బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతాయి . గ్రీన్ టీకి తేనె మిక్స్ చేసి త్రాగడం వల్ల ఈ బ్యాక్టిరియాను తొలగిస్తుంది. ఇది బెటర్ డెంటల్ హెల్త్ ను అందిస్తుంది. గ్రీన్ టీ త్రాగడం వల్ల ఇది మరో హెల్త్ బెనిఫిట్.

5. ఆరోగ్యకరమైన బోన్ హెల్త్: ఓస్టిరియోపోసిస్ అనేది ఒక ప్రమాధకరమైన ఆరోగ్యసమస్య . ఈ వ్యాధితో చాలా మంది బాధపడుతంటారు. ముఖ్యంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. ఒక వయస్సు దాటిన తర్వాత ఇటువంటి సమస్యలు మరింత అధికం అవుతాయి. గ్రీన్ టీ ని త్రాగడం వల్ల మీ టేస్ట్ బడ్స్ కు రుచిని తెలపడం మాత్రమే కాదు, శరీరంలోని ఎముకలను స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా ఉంచుతాయి.

English summary

5 Benefits Of Green Tea With Honey

Green tea is slowly becoming the most popular beverage. The spot once occupied by coffee and tea is slowly being taken by green tea. More and more brands are coming up with their versions of green tea. Some have plain green tea as their major brewing flavour, while for others it’s a mixture of the green tea with some amazing flavours of lemon and lemon grass.
Desktop Bottom Promotion