For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆటలమ్మగురించి తెలుసుకోవలసిన 6 ముఖ్య లక్షణాలు

By Super
|

చికెన్ పోక్స్ వరిసేల్ల జోస్టర్ అనే వైరస్ ద్వారా కలుగుతుంది. సాధారణంగా ఇది వ్యాధి సోకిన వ్యక్తితో ప్రత్యక్ష పరిచయం ద్వారా వచ్చే ఒక అంటువ్యాధి అని చెప్పవచ్చు. చికెన్ ఫోక్స్ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికీ దగ్గు మరియు తుమ్ముల ద్వారా వ్యాపిస్తుంది.

ఆటలమ్మ(చికెన్ ఫోక్స్) మొదటి సూచన వైరస్ ప్రవేశించిన 15-16 రోజుల తర్వాత కనిపిస్తుంది. సాధారణంగా ఆటలమ్మ ప్రారంభ లక్షణాలు ఫ్లూ వంటి లక్షణాలతో అయోమయంగా ఉంటాయి. దీని తప్పుడు నిర్ధారణ వలన ఆలస్యంగా రోగ నిర్ధారణకు దారితీస్తుంది. మీ పిల్లలకు క్రింది లక్షణాలు ఉంటే అప్పుడు వారికీ ఎక్కువగా ఆటలమ్మ వైరస్ లక్షణాలు ఉన్నాయని నిర్దారించాలి.

వేసవిలో చికెన్ పాక్స్(అమ్మవారు)తో తస్మాత్ జాగ్రత్త: టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అధిక జ్వరం

అధిక జ్వరం

శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ హెచ్చరిక మాదిరిగా వైరస్ ను త్వరగా గుర్తిస్తుంది. ఇది శరీరం నుండి వైరస్ తొలగించడానికి ఉష్ణోగ్రత పైకి క్రమబద్దీకరిస్తుంది. అప్పుడు ఉష్ణోగ్రత 100.4 F డిగ్రీలు చేరుకోవచ్చు లేదా దాటి వెళ్ళవచ్చు.సాధారణంగా ఇతర ఫ్లూ వంటి లక్షణాలతో పాటు జ్వరం ఉన్నప్పుడు పెద్దలతో పోల్చుకుంటే పిల్లల విషయంలో దారుణంగా ఉంటుంది.

 తలనొప్పి

తలనొప్పి

సాదారణంగా ఆటలమ్మ వచ్చినప్పుడు ప్రారంభంలో తేలికపాటి తలనొప్పి మరియు దద్దుర్లు మొదటి రెండు రోజులు కనిపిస్తాయి. ఇది సాధారణంగా దగ్గు,తుమ్ములు మరియు గొంతు నొప్పి వంటి లక్షణాలు ఇతర ఫ్లూ తో కలిసి ఉంటుంది. ఈ సమయంలో మొత్తం శరీరం మీద గాయాలు వ్యాప్తి చెంది నెమ్మదిగా తీవ్రంగా మారతాయి.

దురద,ఎరుపు దద్దుర్లు

దురద,ఎరుపు దద్దుర్లు

ఆటలమ్మ ప్రారంభ సంకేతాలు ముఖ్యంగా తలనొప్పి,దగ్గు,గొంతు నొప్పి వంటి లక్షణాలు సాధారణ ఫ్లూ అని తప్పుదోవ పట్టించి అయోమయంనకు గురిచేస్తుంది. కానీ మొత్తం శరీరం మీద దురద,ఎరుపు దద్దుర్లు కనిపించినప్పుడు ఆటలమ్మ వ్యాధి నిర్ధారణ కొరకు ఒక కీలకమైన లక్షణంగా చెప్పవచ్చు. దురద తీవ్రంగా మరియు అసౌకర్యంగా ఉంటుంది. పిల్లల్లో దురద మరియు ఇతర చర్మ సమస్యలు చాలా దారుణంగా ఉంటాయి.

చికెన్ పోక్స్(ఆటలమ్మ)మచ్చలు లేదా గాయాలు

చికెన్ పోక్స్(ఆటలమ్మ)మచ్చలు లేదా గాయాలు

ఎరుపు దద్దుర్లు స్థానంలో దురద పెరిగి 12-14 గంటల్లో గుండ్రని బొప్పులు లేదా మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు లేదా బొప్పులు ఒక పుండు ఆకారంగా మారి ఆ తర్వాత పైన ఒక పొక్కు వలె అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా ఈ పొక్కులు మొదట పొట్ట,ముఖం మీద,వెనుక భాగం మరియు ఛాతి మీద కనిపిస్తాయి. ఆ తర్వాత చేతులు,కాళ్ళు,నెత్తిమీద చర్మం,నాలుక మరియు నోటి పై ఏర్పడవచ్చు. పొక్కుల సంఖ్య ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారుతూ ఉండవచ్చు. కానీ సగటున 200-250 మచ్చలు శరీరం మీద అభివృద్ధి చెందవచ్చు.

ఆకలి లేకపోవడం

ఆకలి లేకపోవడం

చాలా మంది పిల్లలు చిరాకు,దద్దుర్లు మరియు జ్వరంతో పాటు పొట్ట నొప్పి అని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఈ కారణంగా బలహీనత మరియు వికారం కలుగుతుంది. తద్వారా రోగులలో ఆకలి మందగించటం జరుగుతుంది. ఇది బరువు కోల్పోవటానికి దారితీస్తుంది.

మొత్తంమీద అలసట కలుగుతుంది

మొత్తంమీద అలసట కలుగుతుంది

ఎందుకంటే ఒక బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ,సాధారణ వికారం మరియు ఆకలి కోల్పోవడం వంటి వాటి వల్ల అలసట అనేది అనుభవంలోకి రావచ్చు.


Desktop Bottom Promotion