For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మతిమరుపును రిస్క్ ను నివారించే 6 ఉత్తమ ఆహారాలు

|

మతిమరుపును నివారించడానికి కొన్నిప్రత్యేకమైన ఆహారలు ప్రోటీనులు మరియు మినిరల్స్ కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆల్జైమర్స్ లక్షణాలను తగ్గిస్తాయి. ఈ ఆహారాలను గురించి తెలుసుకొనే ముందు ఆల్జైమర్స్ యొక్క ప్రమాధం గురించి, క్లుప్తంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అల్జైమర్స్ అంటే ఏమిటి?

అల్జైమర్స్ అంటే అదేదో మతిమరపు వ్యాధి మాత్రమేనని చాలా మంది అనుకుంటారు. కానీ దీని తీవ్రత అంత కంటే ఎక్కువ. మనందరం ఏదో ఒక విషయాన్ని మరిచిపోతుంటాం. ఇలా మరిచిపోవడం వల్ల కలిగే నష్టం తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా దాని వల్ల మన రోజువారీ పనులకు ఏ మాత్రం ఆటంకం ఉండదు. కాస్త వయస్సు పైబడ్డ తర్వాత మతిమరుపు వచ్చిందనుకోండి. దానివల్ల కొన్ని నష్టాలున్నా జీవితం పెద్దగా అస్తవ్యస్తం కాదు. కానీ అల్జైమర్స్ అలా కాదు. మరుపు, మతిమరుపునకు తారాస్థాయిగా అల్జైమర్స్ ను పేర్కొనవచ్చును.

అల్జైమర్స్ అంటే అదేదో మతిమరపు వ్యాధి మాత్రమేనని చాలా మంది అనుకుంటారు. కానీ దీని తీవ్రత అంత కంటే ఎక్కువే. అల్జైమర్స్ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమే ఈ కథనం. మనందరం ఏదో ఒక విషయాన్ని మరిచిపోతుంటాం. ఇలా మరిచిపోవడం వల్ల కలిగే నష్టం తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా దాని వల్ల మన రోజువారీ పనులకు ఏ మాత్రం ఆటంకం ఉండదు. కాస్త వయస్సు పైబడ్డ తర్వాత మతిమరుపు వచ్చిందనుకోండి. దానివల్ల కొన్ని నష్టాలున్నా జీవితం పెద్దగా అస్తవ్యస్తం కాదు. కానీ అల్జైమర్స్ అలా కాదు. మరుపు, మతిమరుపునకు తారాస్థాయిగా అల్జైమర్స్ ను పేర్కొనవచ్చును.

అల్జైమర్స్ కు ఒక చిన్ ఉదాహరణ చూద్దాం.. ఐదు నిముషాల క్రితం అక్కడే ఉంచిన తాళాలు ఎక్కడుంటాయో తల బాదుకున్నా ఒక్కోసారి గుర్తురావు. ఫ్రిజ్‌దాకా వెళ్లి ఎందుకోసం వచ్చామో ఎంతకీ తట్టదు. మళ్లీ పొయ్యి దగ్గరకు వెళ్లగానే గుర్తొస్తుంది. ఫలానా స్నేహితురాలు ఫోన్‌చేసినపుడు ఫలానా విషయం చెబుదామని అనుకుంటాం. ఆ విషయం ఫోన్‌ పెట్టిన తరువాత గుర్తొస్తుంది. అలాగని అన్నీ మర్చిపోతామా అంటే లేదు. చిన్ననాటి సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పమంటే రెడీ! ఫలానా పండుగరోజు ఏం చేశామన్నది టీకా, తాత్పర్యాలతో సహా గుర్తే! మరి వయసుతో వచ్చే ఈ మతిమరుపును చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే అధిగమించొచ్చు.

ఎందుకిలా జరుగుతుంది? అల్జైమర్స్ రోగుల్లో మెదడు క్రమంగా కుచించుకుపోతుంది. దాంతో మెదడుకణాలు క్రమంగా నశించిపోతాయి. అయితే ఎందుకిలా జరుగుతుందన్న అంశంపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి కారణం పర్యావవరణ అంశాలతో పాటు, జన్యుపరమైన కారణాలు కూడా ఈ వ్యాధికి దోహదపడుతున్నాయంటున్నారు నిపుణులు.

అల్జైమర్స్ తో నష్టాలు : ఈ రోజు ఏ వారం..అన్నది మరిచిపోవడం అందరి విషయంలోనూ సాధారణంగా జరిగే పరిణామమే. కానీ అసలు తేదీలు, వారాలు, నెలలు అన్న భావననే మరిచిపోతే..? అల్జైమర్స్ రోగుల్లో జరిగేదిదే. అయితే కొన్ని సార్లు అకస్మాత్తుగా మరచిన విషయాలు గుర్తుకు రావచ్చు కూడా. ఇలా మనం చూసే వృద్ధులే ఒక్కోసారి మామూలుగా మరికొన్నిసార్లు అన్ని విషయాలనూ మరిచిపోయినట్లుగా కనిపిస్తుంటారు. తమలో కలుగుతున్న మార్పులతో ఒక్కోసారి వారు చికాకు లోనవుతుంటారు. కొందరు భ్రాంతులకూ లోనవుతుంటారు.

ఈ అల్జైమర్స్ ను నివారించడానికి 6 ఉత్తమ ఆహారాలు సహాయపడుతాయి . ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈ పరిస్థితిని కంట్రోల్ చేయవచ్చు . ఈ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, వేగవంతంగా వచ్చే డెత్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ ను నిరోధిస్తుంది. మరి ఆ ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

ఆకుకూరలు మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

ఆకుకూరలు మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

ఇవి మెమరీ పవర్ ను పెంచడానికి ఎక్కువ జ్ఞాపకశక్తి, ఎక్కువ కాలం నిలిచి ఉండేందుకు సహాయపడుతాయి. కూరగాయలు, ఆకుకూరలు, ఆకుకూరలు, బ్రొకోలీ, కాలీఫ్లవర్ మరియు మొలకెత్తిన విత్తనాలు వంటివి మెదడుకు కావల్సిన శక్తి ఇవ్వడమే కాకుండా అందుకు ఉపయోగపడే విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండి మొత్తం శరీర వ్యవస్థకు సహాయపడుతాయి.

వాల్ నట్స్

వాల్ నట్స్

బాదం, వాల్ నట్స్ మరియు హాజల్ నట్స్ ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్యకరం మరియు బ్రెయిన్ హెల్త్ కు అవసరం అయ్యే ఫ్యాట్ ను కలిగి ఉంటాయి . కాలీఫోరియా రీసెర్చ్ సెంటర్ పరిశోధన ప్రకారం వాల్ నట్స్,బాదం ఎక్కువగా తీసుకొనే వారిలో మెమరీ సామర్థ్యం సమర్థవంతంగా ఉన్నట్టు గుర్తించారు.

బెర్రీస్

బెర్రీస్

క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్: ఇలా ముదురు రంగుల్లో ఉండే బెర్రీస్ అంటే అందరీకీ చాలా ఇష్టమే. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్ లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్ వ్యాది గ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది.

పసుపు

పసుపు

పసుపులో అద్భుతమైనటువంటి ఔషధగుణాలున్నాయి . అల్జైమర్స్ ను నివారించడంలో చాలా అద్భుతంగా సహాయపడుతుంది పసుపు మరియు కుర్కుమిన్. పసుపు వ్యాధినిరోధకతను పెంచుతుంది. మెదడులో చేరే ప్లాక్యు ఫార్మేషన్ ను అమినో యాసిడ్స్ ద్వారా ఎలిమేనేట్ చేస్తుంది.

కాఫీ

కాఫీ

కేఫినేటెడ్ ఆహారాలు, పానీయులు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు. అయితే కెఫిన్ ను తగు మోతాదులో మాత్రమే తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు. ఇది మైండ్ అలర్ట్ గా ఉంచుతుంది మరియు ఎనర్జీలెవల్స్ ను పెంచే బూస్టర్. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

సాల్మన్

సాల్మన్

ఫిష్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్సె పెరగడానికి బాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే ప్రోటీన్ మరియు క్యాల్షియం బ్రెయిన్ పవర్ పెంచడానికి సహాయపడుతుంది.

English summary

6 Foods That Reduce The Risk Of Alzheimer's

There are quite a few foods that are rich in proteins and minerals that can help reduce the risk of Alzheimer's. But before we look at the various foods that help in diminishing the risk of Alzheimer's, let us briefly address the question of what is Alzheimer's.
Story first published: Thursday, July 24, 2014, 18:23 [IST]
Desktop Bottom Promotion