For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రయాణంలో మీరు ఖచ్చితంగా తినకూడని 6 ఆహారాలు

|

సాధారణంగా వీకెండ్స్ లేదా లాంగ్ లీవ్స్ వచ్చినప్పుడు ఎక్కడికైనా ట్రిప్ వెళ్తామని చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే కొందరికి ప్రయాణాలంటే అసలు పడవు. బస్సెక్కితే చాలు వాంతులు చేస్తూ ఉంటారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రయాణాలు కూడా మానుకుంటుంటారు. ఆ ఉత్సాహంలో ఆడ్రినల్ స్థాయి పెరిగి వివిధ రకాల ఆహారాలు తీసుకోవడానికి అత్యుచ్చాహం చూపిస్తారు. ఐతే ఏమైన జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు. మీరు తీసుకొనే ఆహారాన్ని బట్టే ఆరోగ్య మరియు మానసిక ప్రభావం ఆధారపడి ఉంటుంది.

కొందరికి ప్రయాణాలంటే అసలు పడవు. బస్సెక్కితే చాలు వాంతులు చేస్తూ ఉంటారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రయాణాలు కూడా మానుకుంటుంటారు. అయితే దీనికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. బస్సులో, కార్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందికి వాంతులు, వికారం, తలతిరగడం వంటి లక్షణాలు కలుగుతాయి. దీనిని మోషన్ సిక్‌నెస్ అంటారు. కొందరికి షిప్‌లలో ప్రయాణించేటప్పుడు కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి.

కాబట్టి, మీరు ఎక్కడైకనా ప్రయాణం చేయాలనుకొన్నప్పుడు ముందస్తు ప్లానింగ్ మరియు జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రయాణం హాపీగా జరగుతుంది. ఈ మోషన్ సిక్ నెస్ ఉన్నప్పుడు అస్సలు తినకూడాని కొన్ని ఆహారాలున్నాయి. వీటిని మీ రెగ్యులర్ డైట్ నుండి ఖచ్చింగా తొలగించుకోవల్సి ఉంటుంది. ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన ఆహారాలు మీరు ప్రయాణించడానికి ముందు మరియు మీ ప్రయాణ సమయంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.ఇలా ముందస్తు జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే మీరు మరింత హెల్తీగా మరియు పీస్ ఫుల్ గా ప్రయాణించగలరు.

ఫ్రైడ్ ఫుడ్స్

ఫ్రైడ్ ఫుడ్స్

ప్రయాణం చేసే సమయంలో ఈ ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రై చేసిన ఆహారాలు ఓకే అయితే, ప్రయాణానికి ముందు మరియు ప్రయాణంలో ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది కాదు. ఇటువంటి ఆహారాలు జీర్ణక్రియ సమస్యలకు ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి వీటిని మీ ప్రయాణంలో తీసుకోకండి.

ఆల్కహాల్

ఆల్కహాల్

చాలా మందికి ప్రయాణం చేసే ముందు ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇది శరీరం డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. అంతే కాదు, హ్యాంగోవర్ కు కూడా దారితీస్తుంది. ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా సాఫ్ట్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతారు. ఇలా తాగడం వల్ల వారు సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు. అయితే ఇది చాలా తప్పు , కార్బోహైడ్రేటెడ్ బెవరేజస్ సోడా మరియు కోల్డ్ డ్రిక్స్ గాస్ట్రిక్ సమస్యను ఏర్పరుస్తాయి. ఇంకా నోటి దుర్వాసనకు దారి తీస్తుంది. కాబట్టి ప్రయాణంలో సాఫ్ట్ డ్రింక్ కు చెక్ పెట్టండి.

ఛీజ్ అండ్ కోల్డ్ మీట్

ఛీజ్ అండ్ కోల్డ్ మీట్

స్నాక్స్ మీద చీజ్ ను తురుము అలంకరించిన ఫుడ్ చాలా ఆకర్షిస్తూ నోరూరిస్తుంటుంది. అయితే ప్రయాణానికి ముందు చీజ్ మరియు కోల్డ్ మీట్ తో తయారైన ఆహారాలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. ఇంకా జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది. చీజ్ తో తయారైన ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా సమయం వరకూ కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. కాబట్టి ప్రయాణానికి ముందు చీజ్ తో తయారు చేసి స్నాక్స్, వంటకాలకు దూరంగా ఉండాలి.

మాంసాహార ఆహారాలు

మాంసాహార ఆహారాలు

మాంసాహారల్లో చేపలు, మరియు చికెన్ మరియు రెడ్ మీట్ తో తయారుచేసే ఆహారలు తీసుకోవడం వల్ల అజీర్ణంకు గురిచేస్తుంది. అంతే కాదు ప్రయాణానికి ముందు మరియు ప్రయణాలు ఇటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ ను తప్పనిసరిగా తొలగించాలి. కారంతో తయారు చేసిన గ్రేవిలు తీసుకోవడం వల్ల కడుపులో మంట పుట్టిస్తుంది చాలా మంది ప్రయానికులు ప్రయాణంలో స్టొమక్ అప్ సెట్ట్ అవ్వడంతో చాలా బాధ పడుతుంటారు. కాబట్టి ప్రయాణానికి ముందు చాలా తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

మిల్క్ అండ్ డైరీప్రొడక్ట్స్

మిల్క్ అండ్ డైరీప్రొడక్ట్స్

ప్రయాణాలు చేసే ముందు మరియు ప్రయాణాల్లో మిల్క్ మరియు ఇతర డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి . ఇవి మార్నింగ్ మోషన్ సిక్ నెస్ కు గురిచేస్తాయి. కాబట్టి, ఈ ఆహారాలను ముఖ్యంగా ప్రయాణాల్లో నివారించాల్సి ఉంటుంది.

హెవీ మీల్స్

హెవీ మీల్స్

చాలా మంది కడుపు నిండా తిని ప్రయాణం చేయడం చాలా హాయిగా ఉంటుంది అనుకుంటారు , దాంతో ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుందని భావిస్తారు. అక్కడే మీరు తప్పు చేస్తున్నారు. మీరు ప్రయాణం చేసేసమయంలో ఆరోగ్యకరమైన ఆహారం మరియు లైట్ ఫుడ్ ను తీసుకోవాలి.

English summary

6 Must Avoid Foods When Travelling

Motion sickness is something most travellers dread of. There are certain foods that you must avoid when travelling. These foods are a strict no-no in your diet, whether you are flying or travelling on road. If you have these foods, chances are, motion sickness will be at its peak.
Story first published: Monday, October 27, 2014, 11:24 [IST]
Desktop Bottom Promotion