For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీలకు రక్షణ కల్పించే సప్త సూత్రాలు

|

ప్రస్తుత రోజుల్లో కిడ్నీ జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నమరియు పెద్ద అని తేడా లేకుండా, ఇంకా ముసలి వారిలో కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. మన శరీరంలో అవయవాలన్నీ క్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే కిడ్నీలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరంలో గుండె తర్వాత ప్రధాన అవయం కిడ్నీలు. కిడ్నీలు పాడైతే ఒక్కో ఆరోగ్య సమస్య మొదలవుతుంది. ప్రాణానికి ముప్పు తెచ్చి పెడుతుంది.

మూత్రపిండాల వ్యాధులు సైలెంట్‌ కిల్లర్స్‌ వంటివి. నిశబ్దంగా కబలిస్తాయి. జీవనప్రమాణంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మూత్రపిండాల వ్యాధులు రాకుండా నివారించే అవకాశాలున్నాయి. అవి...

చురుగ్గా ఉండడం

చురుగ్గా ఉండడం

శారీరకంగా ఫిట్‌గా ఉండడం.. అంటే క్రమం తప్పకుండా రోజూ 30 నుంచి 45 నిమిషాలు ఏదో ఒక వ్యాయామం చేయడం. దీని వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఫలితంగా మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించొచ్చు.

నియంత్రణలో బ్లడ్‌షుగర్‌ స్థాయి

నియంత్రణలో బ్లడ్‌షుగర్‌ స్థాయి

మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో సగం మంది మూత్రపిండాలు దెబ్బతినే అవకాశముంది. అందుకని వీరు క్రమం తప్పకుండా మూత్రపిండాల పనితీరు పరీక్షలు చేయించుకోవాలి. సమస్యను ముందుగానే గుర్తిస్తే మూత్రపిండాలు దెబ్బతినడాన్ని తగ్గించడం లేదా నివారించే అవకాశముంది. వైద్యుని సలహాతో మందులు వాడుతూ బ్లడ్‌ షుగర్‌ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలి.

రక్తపోటు నియంత్రణ

రక్తపోటు నియంత్రణ

అధిక రక్తపోటు వల్ల పక్షవాతం, గుండెపోటు వస్తుందని చాలా మందికి తెలుసు. కానీ దీని వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయన్నది అంతగా తెలియదు. సాధారణంగా రక్తపోటు 120/80 ఉండాలి. మీ రక్తపోటు ఈ స్థాయి నుండి 129/89 ఉంటే ‘ప్రీ హైపర్‌టెన్సివ్‌' ఉన్నట్లు. అంటే మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతోపాటు, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. రక్తపోటు 140/90, అంతకంటే ఎక్కువుంటే దీని వల్ల కలిగే ప్రమాదాలు గురించి వైద్యునితో చర్చించాలి. రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి.

ఆరోగ్యకరమైన ఆహారం - అదుపులో బరువు

ఆరోగ్యకరమైన ఆహారం - అదుపులో బరువు

తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే మధుమేహం,

గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధుల వల్ల వచ్చే ఇతర సమస్యలను నివారించొచ్చు. ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ఒక వ్యక్తి రోజూ 5 నుంచి 6 గ్రాముల ఉప్పు మాత్రమే వాడాలి. ఉప్పు తగ్గించేందుకు ప్రాసెస్‌ చేసిన ఆహారం, రెస్టారెంట్‌ ఫుడ్‌ తగ్గించాలి. ఆహారంలో అదనంగా ఉప్పువేసుకోవడం మానాలి.

నో స్మోకింగ్‌

నో స్మోకింగ్‌

ధూమపానం వల్ల కిడ్నీలకు వెళ్లే రక్తప్రసరణ మందగిస్తుంది. తక్కువ రక్తప్రసరణ వల్ల కిడ్నీలు పూర్తిగా పనిచేయలేవు. ధూమపానం వల్ల కిడ్నీ క్యాన్సర్‌ ప్రమాదం 50 శాతం పెరుగుతుంది.

అనవసర మందులొద్దు

అనవసర మందులొద్దు

ఇబ్రూఫిన్‌ వంటి మందులు క్రమంగా తీసుకుంటే మూత్రపిండాలు దెబ్బతిని, మూత్రపిండాల వ్యాధులొస్తాయి. ఈ మందులు కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించాలి. ఆర్థ్రయిటీస్‌ లేదా నడుం నొప్పి వంటి దీర్ఘకాలంగా నొప్పులతో బాధపడుతున్నవారు వైద్యుని సలహాతో కిడ్నీలు దెబ్బతినకుండా వైద్యం చేయించుకోవాలి.

కిడ్నీ పరీక్ష

కిడ్నీ పరీక్ష

మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం ఉంటే, కుటుంబంలో మీరు కానీ, ఇంకా ఎవరైనా మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు ఉంటే, మీరు ఆసియా వాసి అయితే కిడ్నీ పనితీరును తెలిపే పరీక్ష చేయించుకోవాలి.

English summary

7 Rules for Protecting Kidney Health

Having healthy kidneys is extremely important whether you are young or old, even more so when you get older. Kidneys are important for your body to function and you should strive to keep them healthy as you would any other organ in your body.
Desktop Bottom Promotion