For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ టీ త్రాగడం వల్ల ఎదురయ్యే 7 సైడ్ ఎఫెక్ట్స్

|

ప్రస్తుత మోడ్రన్ లైఫ్, బిజీ షెడ్యుళ్ళత సతమతమవుతున్న చాలా మంది ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు మనందరికీ తెలిసిన విషయమే. బరువు తగ్గించడం నుండి క్యాన్సర్ నివారణ వకూ ఈ గ్రీన్ టీ వివిధ రకాల ప్రయోజనాలున్నాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే, అదే గ్రీన్ టీలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి, మీరు రెగ్యులర్ గ్రీన్ టీ త్రాగుతున్నట్లైతే గ్రీన్ టీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ను గురించి కూడా తెలుసుకోవాలి.

ఈ ఆర్టికల్లో, గ్రీన్ టీ తీసుకొనే వారికి దుష్ర్పభావాలు ఏవిధంగా ఉంటాయని తెలపడే ముఖ్య ఉద్దేశ్యం. గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకొనే వారు, మితంగా తీసుకోవాలి. మోతాదు మించకుండా తగినంత మాత్రం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే మితంగా తీసుకొన్ని, ఎక్కువ తీసుకొన్న గ్రీన్ టీ వల్ల కలిగే దుష్ర్పభావల గురించి కూడా తెలుసుకుని ఉండాలి. మరి గ్రీన్ టీ లోని 7 దుష్ప్రభావాలు ఈక్రింది విధంగా ఉన్నాయి...

‘డైట్ ఫ్రెండ్లీ ' ట్యాంగ్

‘డైట్ ఫ్రెండ్లీ ' ట్యాంగ్

గ్రీన్ టీలో ఎటువంటి క్యాలరీలుండవు. అయితే కొద్దిగా షుగర్ వేయడం వల్ల, ‘వెయిట్ లాస్ ఫ్రెండ్లీ'అనే ట్యాగ్ ఆటోమ్యాటిక్ గా కోల్పోయినట్లే. ముఖ్యంగా స్వీట్ గ్రీన్ టీ త్రాగడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా మరింత బరువు పెరిగే అవకాశం ఎక్కువ. కాబట్టి, నేచురల్ గా బరువు తగ్గాలనుకొనే వారు గ్రీన్ టీలో షుగర్ కు బదులుగా తేనె మిక్స్ చేసుకోవచ్చు.

మెడిసిన్ తీసుకొనేప్పుడు గ్రీన్ టీ త్రాగడం

మెడిసిన్ తీసుకొనేప్పుడు గ్రీన్ టీ త్రాగడం

మీరు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్సలో ఇతర మందులు వాడుతున్నట్లైతే గ్రీన్ టీ డిఫరెంట్ గా పనిచేస్తుంది. శరీరంలో హార్మోనుల్లో అసమతుల్యత వల్ల యాంటీబయోటిక్స్ సరిగా పనిచేయవు. ఇతర మందులు ఉపయోగించేప్పుడు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల లివర్ ప్రమాధకరంగా మారుతుంది.

ఎక్కువగా గ్రీన్ టీ

ఎక్కువగా గ్రీన్ టీ

గ్రీన్ టీని మితంగా తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. అదే మోతాదు మించితే , మనస్సు మీద దుష్ర్పభావం చూపుతుంది. గ్రీన్ టీలో ఉండు అధిక యాంటీయాక్సిడెంట్స్ హార్మోనులను విడగొట్టడం వల్ల గ్రంథుల్లో మార్పులు వస్తాయి. కాబట్టి, రోజుకు ఒకటి రెండు కప్పులకంటే ఎక్కువ తీసుకోకూడదు.

కెఫిన్ కంటెంట్

కెఫిన్ కంటెంట్

గ్రీన్ టీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. కెఫిన్ తక్కువగా తీసుకుంటే, శరీరానికి కొన్ని ప్రయోజనాలుంటాయి. కెఫిన్ ఎక్కువైత శరీరంలో నార్మల్ బాడీ ఫంక్షన్స్ పనిచేయడం కష్టం అవుతుంది. అందువల్ల ఇది మెంటల్ హెల్త్ , అదే విధంగా సాధరణ జబ్బులు , ఆందోళన మరియు తరచూ మనస్సు మారడం జరుగుతుంది.

జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది

జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది

గ్రీన్ టీలో టానిన్ అనే కంటెంట్ పొట్టలో ఎక్కువ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఎక్కువ హాని కలిగించకపోయినా, పొట్ట సమస్యలు మరియు యాసిడ్ రిఫ్లెక్షన్ సమస్యలున్నప్పుడు సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది.

రక్తంలో న్యూట్రిషియన్స్ షోషణ

రక్తంలో న్యూట్రిషియన్స్ షోషణ

గ్రీన్ టీ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ ఇది . ఇందులో ఉండే టానిన్ రక్తంలో షోషింపబడే కొన్ని న్యూట్రిషియన్స్ యొక్క సామర్థ్యంను తగ్గిస్తుంది. ఎవరైతే ఎక్కువగా గ్రీన్ టీ తీసుకుంటారో వారి ఐరన్ రక్తంలో షోషన చెందదు.

ప్రెగ్నెంట్ ఉమెన్ కు గ్రీన్ టీ

ప్రెగ్నెంట్ ఉమెన్ కు గ్రీన్ టీ

మరో ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ ఇది. గర్భం ప్రారంభం దశలో కెఫిన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సలహాలిస్తుంటారు. అటువంటి కెఫిన్ పానియాల్లో గ్రీన్ టీ కూడా ఒక్కటి . కెఫిన్ ఉన్న గ్రీన్ టీ త్రాగడం వల్ల పొట్టలో పెరిగే శిశువు యొక్క బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది.

English summary

7 Surprising Side Effects of Green Tea

7 Surprising Side Effects of Green Tea
Story first published: Saturday, August 9, 2014, 15:58 [IST]
Desktop Bottom Promotion