For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైగ్రేన్ తలనొప్పి : నివారణ చిట్కాలు

By Mallikarjuna
|

పార్శతలనొప్పి(మైగ్రేన్ తలనొప్పి)ఉన్నప్పుడు అలసటకు గురి చేస్తుంది మరియు సోమరితనానికి గురిచేస్తుంది. ఈ మైగ్రేన్ తలనొప్పి 48గంటలు ఉంటుంది. ఒక్కోసందర్భంలో ఇంకా ఎక్కువ సమయం కూడా ఉండవచ్చు.

తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే తలనొప్పికి చాలా కారణాలున్నాయి. రక్తపోటు, మెదడులో కణతులు, రక్తనాళాలలో రక్తప్రసరణలో మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల, మగవారిలో రక్తపోటు, మానసిక ఒత్తిడి, మెదడులోని కణుతుల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి స్త్రీలలో అధికంగా చూస్తుంటాం. ఈ నొప్పి చాలావరకు తలకు ఒక పక్క వస్తుంది. వాంతులూ ఉండవచ్చు. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల ఈ నొప్పి వస్తుంది.

పార్శ్వపు తలనొప్పికి కారణాలు

పార్శ్వపునొప్పికి మానసిక ఆందోళన, ఒత్తిడి ముఖ్య కారణాలు. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది. డిప్రెషన్, నిద్రలేమి , కొందరిలో బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి వల్ల అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది. స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, ఋతుచక్రం ముందుగా గాని, తర్వాత గాని వచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు. ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడటం వల్ల వాడినప్పుడు కూడా రావచ్చు.

మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు, అందుకు గల కారణాన్ని తప్పనిసరిగా గుర్తించాలి . అలా గుర్తించగలిగినప్పుడు భవిష్యత్తులు ఎటువంటి ప్రమాధాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ఒత్తిడి

ఒత్తిడి

ఆఫీసుల్లో ఎక్కువ గంటలు పనిచేయడం, ఆహారంపు అలవాట్లలో మార్పులు , నిద్రసమస్యలు మైగ్రేన్ కు ప్రధాన కారణాలు . కాబట్టి, తగినంత విశ్రాంతి లేకుండా, ఆహార, నిద్ర అలవాట్లను పాటించకుండా ఎక్కువగా పనిగంటలు పనిచేసే వారికి మైగ్రేతలనొప్పికి దారితీస్తుంది . అలాటప్పడు వేడినీళ్ళ స్నానం లేదా లెమన్ టీ త్రాగడం వల్ల అలసట నుండి శరీరం విశ్రాంతి పొందుతుంది.

వాతావరణ

వాతావరణ

ఎండలో తిరగడం వల్ల కూడా మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది. అదే కాకుండా, భారోమెట్రిక్ ప్రెజర్, అధిక ఉష్ణోగ్రత మరియు అధిక తేమ మరియు ఇతర వాతావరణ మార్పులు సాధారణ లక్షణాలు. కాబట్టి, వీటికి తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి, బయట వెళ్ళేటప్పుడు , వెంట గొడుతీసుకెళ్ళాలి .

కాఫిన్ ఉపసంహరణ

కాఫిన్ ఉపసంహరణ

ఇటీవల అధ్యయనాలు కెఫిన్ కు బానిసలైనవారు కెఫిన్ ను పూర్తిగా తగ్గించాలి. మరియు రోజుకు రెండుకప్పుల కెఫిన్ కూడా మైగ్రేన్ కు కారణమవుతుంది . కెఫిన్ తీసుకొన్న తర్వాత కొన్ని గంటల తర్వాత మైగ్రేన్ తలనొప్పి సంభవిస్తుంది. ఉన్నపరంగా కెఫిన్ పెరిగినా లేదా హాఠాత్తుగా కెఫిన్ తగ్గించినా ఈ మైగ్రేన్ తలనొప్పికి గురికావల్సి ఉంటుంది. అందుకు తీసుకొనే కెఫిన్ మోతాదును తగ్గించాలి.

బిగ్గరగా సంగీతం

బిగ్గరగా సంగీతం

ఎక్కువ సౌండు పెట్టుకొని మ్యూజిక్ వినడం, ఖచ్చితంగా దీర్ఘకాలంలో ఇది మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది .

రియాక్టివ్ హైపోగ్లైసేమియా

రియాక్టివ్ హైపోగ్లైసేమియా

షుగర్ మరియు పాస్తా వంటవివి అధికంగా తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ తలనొప్పికి కారణం అవుతుంది. శరీరంలో అధనపు ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి షుగర్ ను విచ్ఛిన్నం చేస్తుంది . దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ చాలా తక్కువగా తగ్గిపోవడానికి కారణం అవుతుంది. రక్తంలో చక్కెర పెరుగుదల మరియు తగ్గుదల కారణంగా తీవ్రమైన తలనొప్పి దారితీస్తుంది .

అధిక నిద్ర

అధిక నిద్ర

రోజులో తొమ్మింది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఇది మైగ్రేన్ తలనొప్పిక దారితీస్తుంది. వారం మొత్తం తక్కువ నిద్రతో, వారాంతంలో అధిక నిద్రవల్ల అలసట, శరీరంలో నొప్పులు మరియు తలనొప్పికి కారణం అవుతుంది.

ఖాళీ కడుపుతో

ఖాళీ కడుపుతో

కొన్ని గంటల వరకూ ఏమి తినకుండా అలాగే గడపటం, లేదా పనిచేయడం వల్ల తలనొప్పికి దారితీస్తుంది. బ్రేక్ ఫాస్ట్ ను తప్పించడం ఒక చెడు అలవాటు. కాబట్టి, మీ దిన చర్యను పండ్లు, నీళ్ళు, తృణధాన్యాలు మీ రోజు ప్రారంభించడానికి నిర్ధారించుకోండి .

English summary

7 surprising triggers of migraine

Migraine is often preceded or accompanied by sensory warning signs such as flashes of light, blind spots, tingling in the arms and legs, nausea, vomiting and increased sensitivity to light and sound.
Story first published: Wednesday, January 29, 2014, 20:10 [IST]
Desktop Bottom Promotion