For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అల్లం టీ యొక్క 8 ఆరోగ్య ప్రయోజనాలు

By Lakshmi Perumalla
|

శీతాకాలంలో ఒక కప్ అల్లం టీ త్రాగితే చాలా బాగుంటుంది. దీనిలో విటమిన్ సి,మెగ్నీషియం మరియు అనేక ఖనిజాలు అధిక స్థాయిలో ఉన్నాయి. అంతేకాక అల్లం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

అల్లం టీ శీతాకాలంనకు సంబంధిత అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం మరియు రక్షణకు సహాయపడుతుంది. కాబట్టి అల్లం టీ నయం చేయటానికి ఒక ఔషధంగా పనిచేస్తుంది.

మీరు తేనీరు(టీ) తయారుచేసినప్పుడు పిప్పరమింట్,తేనె లేదా అల్లం,నిమ్మరసం వంటి వాటిని జోడించవచ్చు. ఇది ఓదార్పు పానీయంగా పనిచేస్తుంది.

వికారం నుంచి ఉపశమనం

వికారం నుంచి ఉపశమనం

ప్రయాణం ముందు అల్లం టీ ఒక కప్పు త్రాగటం వలన మోషన్ అనారోగ్యంతో సంబంధం కలిగిన వికారం మరియు వాంతులను నిరోధిస్తుంది. ఈ రోగలక్షణం ఉపశమనానికి వికారం వచ్చేటప్పుడు ఉండే మొదటి సంకేత సమయంలో ఒక కప్పు టీ త్రాగాలి.

కడుపు పనితీరును మెరుగుపరచడానికి

కడుపు పనితీరును మెరుగుపరచడానికి

జీర్ణక్రియ అభివృద్ధి మరియు ఆహార శోషణ పెంచటానికి ఉపయోగకరంగా ఉంటుంది. అల్లం టీ తిన్న తర్వాత వచ్చే ఉబ్బరంను తగ్గిస్తుంది.

నొప్పి తగ్గిస్తుంది

నొప్పి తగ్గిస్తుంది

అల్లంలో శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉండుట వలన కండరాలు మరియు కీళ్ళ సమస్యలకు ఒక ఆదర్శవంతమైన గృహ వైద్యంగా పనిచేస్తుంది. అల్లం టీ త్రాగటానికి మాత్రమే కాకుండా కీళ్ళ నొప్పికి పుతగా వేయవచ్చు.

శ్వాసకోశ సమస్యలపై పోరాటం

శ్వాసకోశ సమస్యలపై పోరాటం

అల్లం టీ జలుబు రద్దీని తగ్గించటానికి సహాయపడుతుంది.పర్యావరణ అలెర్జీకి సంబంధం కలిగిన శ్వాస లక్షణాల కోసం ఒక కప్పు అల్లం టీ ని ప్రయత్నించండి.

రక్త ప్రసరణ మెరుగుపరచడానికి

రక్త ప్రసరణ మెరుగుపరచడానికి

అల్లం టీలో ఉన్న విటమిన్లు,ఖనిజాలు మరియు అమైనో ఆమ్లాలు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి మరియు పునరుద్ధరించడానికి సహాయం మరియు హృదయ సమస్యల అవకాశాన్ని తగ్గిస్తాయి. గుండెపోటు మరియు స్ట్రోక్ నివారించడానికి ధమనులలో ఉండే కొవ్వును నిరోధించటానికి అల్లం సహాయం చేస్తుంది.

ఋతు అసౌకర్యం నుంచి ఉపశమనం

ఋతు అసౌకర్యం నుంచి ఉపశమనం

బహిష్టు అసౌకర్యంతో బాధపడుతున్న మహిళలకు వెచ్చని అల్లం టీ లో ఒక టవల్ ముంచి మీ పొత్తి కడుపు మీద దానిని వర్తించండి. ఇది నొప్పి నుండి ఉపశమనం మరియు కండరాల విశ్రాంతికి సహాయపడుతుంది. అదే సమయంలో,మీరు ఒక కప్పు అల్లం టీలో తేనె కలుపుకొని త్రాగండి.

రోగనిరోధక శక్తి బలోపేతం

రోగనిరోధక శక్తి బలోపేతం

అల్లం టీ త్రాగటం వలన,అల్లంలో అధిక స్థాయిలో అనామ్లజనకాలు ఉండుట వలన మీ రోగనిరోధక శక్తి బలోపేతం చేయటానికి సహాయపడుతుంది.

ఒత్తిడి నుండి ఉపశమనం

ఒత్తిడి నుండి ఉపశమనం

అల్లం టీ మీ ఒత్తిడి మరియు ఉద్రిక్తతను తగ్గించే లక్షణాలను కలిగి ఉంది. దీనికి కారణం బలమైన వాసన మరియు వైద్య లక్షణాలు కలయిక అయ్యివుండవచ్చు.

English summary

8 health benefits of ginger tea

Nothing beats cold in the winter like a piping hot cup of ginger tea. With its high levels of Vitamin C, magnesium and other minerals, ginger root is extremely beneficial for health.
Story first published: Saturday, February 1, 2014, 17:43 [IST]
Desktop Bottom Promotion