For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటి దుర్వాసనకు 8 అనూహ్య కారణాలు

|

ఎవరైనా మీ దగ్గరగా వచ్చి, చిన్నగా మీ నోటి దుర్వాసన గురించి మాట్లాడినపుడు

దానిని మీరు అవమానంగా భావించవలసిన అవసరం లేదు. నోటి దుర్వాసన అనేది మొదటిసారి బైటికి వెళ్ళినపుడు లేదా ఏదైనా ఇంటర్వ్యూ కి వెళ్ళినపుడు ప్రత్యేకంగా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కి ప్రయత్నించినపుడు ఇది మీపై మొదటి అభిప్రాయాన్ని తగ్గిస్తుంది.

మీరు మీ భాగస్వామితో లేదా ప్రియమైన స్నేహితులతో బైటికి వెళ్ళినప్పుడు కూడా, మీ నోటి దుర్వాసన ఆ క్షణంలో మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తుంది. నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉన్నాయి. నేడు, నోటి దుర్వాసనను గుర్తించి సరిచేసుకోవడానికి బోల్డ్ స్కై వారు కొన్ని కారణాలను మనతో పంచుకున్నారు.

నోటి దుర్వాసనకు గల ఆశ్చర్యకరమైన కారణాలు..!

నోటి దుర్వాసన తరచుగా లేనప్పటికీ మీరు బైటికి వెళ్ళే ముందు కేవలం బ్రష్ చేయడం, పుక్కిలించడం మాత్రమే చేసినా ఉపయోగం ఉండదు. అయినా మీ నోరు దుర్వాసన ఎందుకు వస్తుంది? చిగుళ్ళవాపు, పళ్ళ సందులు లేదా పళ్ళ మధ్యలో ఆహార కణాలు నిల్వ ఉండడం వంటి కొన్ని సాధారణ కారణాల వల్ల నోటి దుర్వాసన వస్తుంది. దీని కోసం మీరు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అయినా దుర్వాసన వస్తుంటే, నోటి దుర్వాసనకు కొన్ని అనూహ్య కారణాలు తెలుసుకోవడం అవసరం.నోటి

దుర్వాసనను దూరం చేసే 7 అద్భుత చిట్కాలు: క్లిక్ చేయండి

నోటి దుర్వాసనకు అనూహ్య కారణాలను మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాం. నిజానికి, చాలామందికి దీని గురించి పెద్దగా తెలియదు. ఇక్కడ నోటి దుర్వాసనకు కొన్ని కారణాల జాబితా తయారుచేయబడింది, అందువల్ల, ఈసారి మీరు బైటికి వెళ్ళేటపుడు, మీరు తప్పక నోటి దుర్వసనపై పోరాడాలి.

నోరు ఎండిపోవడం:

నోరు ఎండిపోవడం:

నోరు ఎండిపోవడం: నోరు ఎండిపోవడం వల్ల తరచుగా నోటి దుర్వాసన వస్తుంది. ఇది మీరు నోటి నుండి శ్వాస తీసుకున్నపుడు, నోరు తెరిచి నిద్రపోయినపుడు, మీరు బాగా గురక పెట్టినపుడు సాధారణంగా జరుగుతుంది. మీరు మీ శ్వాసను ముక్కు రంధ్రాల గుండా తీసుకునేట్లు శ్రద్ధ పెట్టండి.

సరైన మౌత్ వాష్:

సరైన మౌత్ వాష్:

సరైన మౌత్ వాష్: నోటి దుర్వాసన ను పోగొట్టుకోవడానికి మౌత్ వాష్ ఉపయోగపడుతుందని సహజంగా అనుకుంటాం. కానీ, అది మీరు ఉపయోగించే మౌత్ వాష్ రకం మీద ఆధారపడి ఉంటుంది. అందులో ఆల్కహాల్ అధిక మొత్తంలో ఉంటె, దానివల్ల మీ నోరు పొడిబారి పోయి, నోటి దుర్వాసన వస్తుంది.

ముక్కు కారడం:

ముక్కు కారడం:

ముక్కు కారడం: మీరు జలుబు, ముక్కు కారడం తో బాధపడుతుంటే, మీరు నోటి గుండా శ్వాస తీసుకోవడం చేస్తారు. మీకు జ్వరంగా ఉంటె, అది నోటి దుర్వాసన సమస్యకు కారకంగా ఉంటుంది.

మీ అల్పాహారం:

మీ అల్పాహారం:

మీ అల్పాహారం: నేటి ఈ హడావిడి జీవితంలో ఉదయం అల్పాహారం తీసుకోవడం అనే ఆరోగ్యకర అలవాటును మర్చిపోతున్నాము. నోటి దుర్వాసనకు ఇది కూడా ఒక కారణం అని తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. సరైన, ఆరోగ్యకర అల్పాహారానికి కొద్దిగా సమయం కేటాయించండి.

తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహరం:

తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహరం:

తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహరం: నేటి జెనరేషన్ పిల్లలు బరువు తగ్గడానికి, ఆహారాన్ని తగ్గించుకు౦టున్నారు. దీనివల్ల, కార్బోహైడ్రేట్స్ ని తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. దానికి ప్రతికూలంగా అది మీ శ్వాసను ప్రభావితం చేస్తుంది, నోటి దుర్వాసనకు కారణాలలో ఇది కూడా ఒకటి.

ఆల్కాహాల్:

ఆల్కాహాల్:

ఆల్కాహాల్: మీకు ఆల్కాహాల్ తాగే అలవాటు ఉంటె, రాత్రిపూట కొద్దిగా అయినా, ఇది నోటి దుర్వాసనకు కారణమౌతుంది. ఆల్కాహాల్ వల్ల నోరు ఎండిపోయి, బాక్టీరియా చేరడానికి అనువైన ప్రదేశంగా మారుతుంది.

మీరు ఏమి తింటున్నారు:

మీరు ఏమి తింటున్నారు:

మీరు ఏమి తింటున్నారు: మీరు ఎలాంటి ఆహారాన్ని తింటున్నారు అనేది కూడా నోటి దుర్వాసనకు కారణాలలో ఒకటి. వేల్లిపాయ లేదా ఉల్లిపాయ ఎక్కువగా ఉన్న ఆహరం చాలా రుచికరంగా ఉంటుంది, కానీ అవి నోటి దుర్వాసనకు కారణాలు. నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి కొద్ది మింట్ చప్పరించడం లేదా సోంపు గింజలను తీసుకోవాలి.

తగినన్ని నీళ్ళు

తగినన్ని నీళ్ళు

నీటిని కొద్ది పరిమాణంలో తీసుకోకండి, ఇది మీ శరీరం రోజంతా ఆర్ద్రీకరణంగా ఉండేట్టు చేసి నోటి దుర్వసనపై పోరాడుతుంది. మీ నోటిలో చేరిన బాక్టీరియా వల్ల ఏర్పడిన దుర్వాసనను ఉమ్మి శుభ్రం చేస్తుంది. మీరు నోరు, ఉమ్మి ఎండిపోకుండా ఉంచడానికి నీళ్ళు బాగా సహాయపడతాయి.

Desktop Bottom Promotion